musclemania
-
కండల కోసం కంగారు పడితే.. గుండెకు ముప్పు, ప్రాణాలే పోతాయ్!
మనసులో అనుకోగానే బరువు తగ్గిపోవాలి. చిటికె వేయగానే కండలు తిరిగిన బాడీ సొంతం కావాలి. ప్రతీదీ షార్ట్ కట్లో అయి పోవాలి. ప్రస్తుతం యువత మనుసుల్లోమెదులుతున్న ట్రెండ్ ఇదే. ఈ క్రేజ్‌నే కొంతమంది కేడీగాళ్లు సొంతం చేసుకుంటున్నారు. అక్రమాలకు పాల్పడుతూ యువత ఆరోగ్యంతో ఆడుకుంటున్నారు. వారి ప్రాణాలమీదికి తీసుకొస్తున్నారు. దీనికి సంబంధించి షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. తాజాగా అక్రమంగా మెఫాటర్మైన్ సల్ఫేట్ ఇంజక్షన్లు విక్రయిస్తున్న గ్యాంగ్‌ను టాస్క్ఫోర్క్ అదుపులోకి తీసుకుంది. ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేసి, నిందితుల నుండి 75 ఇంజక్షన్లను సీజ్ చేశామని టాస్క్ ఫోర్స్ డీసీపీ రేష్మి పెరుమాళ్ ప్రకటించారు. కండరాల పెరుగుదలకు ఇంజక్షన్లు దోహదపడతాయని నమ్మబలుకుతారు. వాటిని అక్రమంగా విక్రయిస్తున్నారు. దీన్ని నమ్మిన బాడీ బిల్డర్లు డాక్టర్ట సిఫారసు, ప్రికాషన్స్ లేకుండానే ఈ ఇంజక్షన్లను ఎడా పెడా వాడేస్తున్నారు. దీంతో కండలు పెరగడం సంగతి మాట అటుంచి గుండెకు తీరని ముప్పని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇలాంటి నకిలి ఇంజెక్షన్లను అమ్ముతున్నగ్యాంగ్కు సంబంధించి ప్రధాన నిందితుడు నితేష్ సింగ్ ఆసిఫ్ నగర్లో పల్స్ ఫిట్నెస్ పేరిట జిమ్ నడిపిస్తున్నాడు. ఇతనికి సయ్యద్ జాఫర్ అలీ, రాహుల్ సింగ్ రిసెప్షనిస్ట్ లుగా వర్క్ చేస్తున్నారు డాక్టర్ల ప్రిస్క్రిప్షన్ లేకుండానే ఇంజక్షన్లను అక్రమంగా విక్రయించడమే వీరి దందా. ఈ ఇంజక్షన్లు తీసుకుంటే షార్ట్ టైంలో కండరాలు పెరుగుతాయని జిమ్‌కు వచ్చేవారిని నమ్మిస్తారు. ముంబై నుండి ఈ ఇంజక్షన్లను కొరియర్ ద్వారా నగరానికి తెప్పిస్తారు. బహిరంగ మార్కెట్లో 500 పలికే ఇంజక్షన్లను అక్రమంగా 2000 వరకు విక్రయిస్తారు. ఇంజక్షన్స్ అతిగా తీసుకోవడం వల్ల గుండె సంబంధిత సమస్యలు, స్ట్రోకులు, సడన్ కార్డియాక్ అరెస్ట్ దారి తీయవచ్చుని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. -
బెంగళూరులో ‘మజిల్ మేనియా’
* ఆరోగ్యకరమైన జీవనశైలిపై అవగాహన కల్పించేందుకు రెండు రోజుల సెమినార్ * ఆగస్టు 29న ‘మజిల్ మేనియా’ ఇంటర్నేషనల్ బాడీబిల్డింగ్ పోటీలు అమెరికాకు చెందిన ప్రముఖ ఫిట్నెస్ ట్రైనింగ్ సంస్థ ‘మజిల్ మేనియా’ భారత్‌లో తన ప్రయాణాన్ని మొదలుపెట్టింది. ఇందులో భాగంగా మొదటగా బెంగళూరులో బాడీ బిల్డింగ్ పై ఆసక్తి కనబరిచే యువతీ యువకులకు ఆరోగ్యకరమైన జీవనశైలిపై అవగాహన కల్పించేందుకు రెండు రోజుల పాటు (10,11) సెమినార్‌ను నిర్వహిస్తోంది. సహజ విధానాలతోనే అద్భుత శరీరాకృతి ఈ సందర్భంగా బాడీ బిల్డర్ సీమెన్ పాండా మాట్లాడుతూ... సాధారణంగా బాడీ బిల్డింగ్ అనగానే అందరూ మత్తు పదార్థాలు, స్టెరాయిడ్స్ వాడకం ద్వారానే శరీరాకృతిని మార్చుకోవచ్చని భావిస్తుంటారని అన్నారు. అయితే ఇది ఎంత మాత్రం నిజం కాదని స్టెరాయిడ్స్, డ్రగ్స్ వాడకం వల్ల ప్రాణాలకే ప్రమాదం వాటిల్లుతుందని పేర్కొన్నారు. అందుకే తాము పూర్తిగా సహజ పద్ధతుల్లో, ఆరోగ్యకరమైన ఆహారం, సరైన వ్యాయామం ద్వారా శరీరాకృతిని మార్చుకునే పద్దతుల వైపే మొగ్గు చూపుతామని అన్నారు. అంతేకాక మత్తు పదార్థాలకు తమ ఫిట్నెస్ సెంటర్లో చోటు ఉండదని అన్నారు. ఇదే అంశంపై బెంగళూరు వాసుల్లో అవగాహనను కల్పించేందుకు రెండు రోజుల పాటు నగరంలో సెమినార్స్ నిర్వహించనున్నట్లు తెలిపారు. నగరంలోని దయానంద సాగర ఆడిటోరియంలో బాడీ బిల్డింగ్‌పై ఆసక్తి చూపే వారికి సలహాలు సూచనలు అందించనున్నట్లు వెల్లడించారు. ఇక ఆగస్టు 29న నగరంలో మొట్టమొదటి అంతర్జాతీయ స్థాయి ‘మజిల్ మేనియా’ బాడీ బిల్డింగ్ చాంపియన్‌షిప్ పోటీలను నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ పోటీల్లో ప్రతిభ కనబరిచిన బాడీ బిల్డర్లకు అంతర్జాతీయ వేదికలపై ప్రదర్శనలిచ్చే అవకాశాన్ని కల్పించనున్నట్లు పేర్కొన్నారు.