
శాంత (ఫైల్)
సాక్షి, రాయచూరు (కర్ణాటక): చేసిన తప్పును సరిదిద్దుకోలేక, కుటుంబ పరువు బజారున పడుతుందని ఓ యువతి విషం తాగి ఆత్మహత్యాయత్నం చేయగా రిమ్స్‌లో చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందింది. తాలూకాలోని జేగరకల్ మండలం తిమ్మాపూర్‌కు చెందిన శాంతమ్మ (30) ఆత్మహత్య చేసుకుంది. వివరాలు... తిమ్మాపూర్‌లో తల్లిదండ్రులతో కలిసి ఉంటున్న శాంతమ్మను రమేశ్ అనే వ్యక్తి ప్రేమపేరుతో మభ్యపెట్టాడు. గర్భవతిని చేశాడు.
పెళ్లి చేసుకోమని కోరితే గర్భం తొలగించుకోవాలని హెచ్చరించాడు. రూ. 50 వేల నగదు ఇస్తానని ఆశ పెట్టాడు. విషయం బయటకు చెబితే మీ తల్లిదండ్రులను హత్య చేస్తానని బెదిరించాడు. దీంతో గతనెల 27న రాత్రి శాంతమ్మ పరుగుల మందు తాగింది. కుటుంబ సభ్యులు హుటాహుటిన రిమ్స్‌కు తరలించగా అక్కడ చికిత్స పొందుతూ సోమవారం ఉదయం మరణించింది. కేసు దర్యాప్తు చేపట్టినట్లు ఎస్‌ఐ లక్ష్మీ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment