![18 Year Old Woman Committed Suicide in Karnataka - Sakshi](/styles/webp/s3/article_images/2018/05/13/Untitled-2_0.jpg.webp?itok=FQ7Q-p70)
ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, కర్ణాటక(మైసూరు) : ప్రేమించాలని యువకుడు వేధిస్తుండటంతో ఓ యువతి ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన ఆదివారం మైసూరు జిల్లాలోని నంజనగూడు తాలూకాలో ఉన్న చన్నపట్టణ గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన పవిత్ర (18) ఇటీవలె పీయూసీ పరీక్షల్లో తాలూకాలోనే మొదటి ర్యాంకు సాధించింది.
మైసూరులోని మహారాణి కళాశాలలో చదువుతున్న పవిత్రను అదే గ్రామానికి చెందిన సురేశ్ అనే యువకుడు తరచూ ప్రేమించాలని వేధించేవాడు. వేధింపులు ఎక్కువ కావడంతో ఆదివారం ఉదయం ఇంట్లో ఎవరూ లేని సమయంలో పవిత్ర ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంది. యువతి కేకలు విన్న స్థానికులు మంటలు ఆర్పేసి నగరంలోని కేఆర్ ఆస్పత్రికి తరలించారు. పివిత్ర చికిత్స పొందుతూ మృతి చెందింది. సురేశ్ వేధింపుల వల్లే తాను ఆత్మహత్య చేసుకున్నట్లు బాధితురాలు పోలీసులకు మరణ వాంగ్ములం ఇచ్చింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment