వివాహేతర సంబంధం: పిల్లలకు నిప్పంటించి.. | Extra Marital Affair: Woman Ends Life With Children Karnataka | Sakshi
Sakshi News home page

వివాహేతర సంబంధం: పిల్లలకు నిప్పంటించి..

Published Wed, Oct 27 2021 8:36 AM | Last Updated on Wed, Oct 27 2021 3:07 PM

Extra Marital Affair: Woman Ends Life With Children Karnataka - Sakshi

దొడ్డబళ్లాపురం( బెంగళూరు): కన్నబిడ్డలకు నిప్పంటించిన తల్లి తానూ నిప్పంటించుకుని ఆత్మాహుతి చేసుకున్న దుర్ఘటన కలబుర్గి నగరంలోని పంచశీల నగర్లో జరిగింది. తల్లి దీక్ష (27), కూతురు సించన (2), కుమారుడు ధనంజయ్‌ (4)లకు నిప్పంటించి, తానూ అంటించుకుంది. తల్లీ కూతురు అక్కడికక్కడే మృతి చెందగా ధనంజయ్‌ ఆస్పత్రిలో మృత్యువుతో పోరాడుతున్నాడు. భర్త వసంతకుమార్‌ పరాయి స్త్రీతో అక్రమ సంబంధం పెట్టుకోవడం, కట్న వేధింపులను తట్టుకోలేక దీక్ష ఈ అఘాయిత్యానికి పాల్పడిందని ప్రాథమిక విచారణలో తేలింది. స్టేషన్‌ బజార్‌ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.

మరో ఘటనలో..

యువకుడు ఆత్మహత్య
మైసూరు: చామరాజనగర తాలూకాలోని హరదనహళ్ళి గ్రామానికి చెందిన బంగార (26) అనే యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. చామరాజనగర టీపీ ఆఫీసు వద్ద ఫాస్ట్‌ ఫుడ్‌ సెంటర్‌లో పనిచేసేవాడు. ఏమైందో కానీ ఇతను మంగళవారం కరినంజనపుర బైపాస్‌ మార్గంలో ఉన్న శ్మశానం వద్ద ఉన్న చెట్టుకు ఉరి వేసుకొని ప్రాణాలు తీసుకున్నాడు.

చదవండి: Delivery Boy: డెలివరీ బాయ్‌ నిర్వాకం.. ప్రేమించడం లేదని ఇంట్లో ఎవరూ లేని టైంలో

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement