
ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, గంగావతి(కర్ణాటక): కోవిడ్ బారినుంచి కోలుకొని డిశ్చార్జ్ కావాల్సిన ఓ మహిళ ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. వివరాలు.. గదగ్‌కు చెందిన రోహిణి కాల్మేశ్వరయ్య (48) గత నెలలో గంగావతిలోని ఓ వైద్యురాలి ఇంటికి వచ్చింది. మే 23న ఆమెకు కరోనా సోకగా కోవిడ్ కేర్ సెంటర్లో చికిత్స చేయించగా నెగిటివ్ వచ్చింది.
అయితే, తిరిగి ఈనెల 2న మళ్లీ పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో అనెగుంది రస్తాలో ఉన్న కోవిడ్ కేర్ సెంటర్లో చేరింది. సోమవారం ఆమె డిశ్చార్జ్ కావాల్సిఉంది. అయితే, ఆదివారం తెల్లవారు జామున కోవిడ్‌కేర్ సెంటర్లో కిటికీకి చీరతో ఉరివేసుకోని ఆత్మహత్య చేసుకుంది. ఆస్పత్రి అధికారులు ఇచ్చిన సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహన్ని పరిశీలించారు.
చదవండి: Lockdown: భారీ సడలింపులతో పొడిగించిన మరో రాష్ట్రం
Comments
Please login to add a commentAdd a comment