evaded
-
రూ. 4,389 కోట్ల దిగుమతి సుంకాల ఎగవేత
న్యూఢిల్లీ: దాదాపు రూ. 4,389 కోట్ల దిగుమతి సుంకాల ఎగవేత ఆరోపణలపై చైనాకు చెందిన హ్యాండ్సెట్స్ తయారీ సంస్థ ఒప్పో ఇండియాకు డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) షోకాజ్ నోటీసులు (ఎస్సీఎన్) జారీ చేసింది. జూలై 8న ఈ నోటీసులు జారీ చేసినట్లు కేంద్ర ఆర్థిక శాఖ బుధవారం ఒక ప్రకటనలో తెలిపింది. ‘ఒప్పో ఇండియా కార్యాలయాలు, సంస్థలోని కీలక ఉద్యోగుల నివాసాల్లో నిర్వహించిన సోదాల్లో.. మొబైల్ ఫోన్ల తయారీ కోసం దిగుమతి చేసుకున్న కొన్ని ఉత్పత్తుల వివరాలను తప్పుగా చూపినట్లు కచ్చితమైన ఆధారాలు లభించాయి. దీంతో రూ. 4,389 కోట్ల కస్టమ్స్ డ్యూటీ ఎగవేతపై ఒప్పో ఇండియాకు షోకాజ్ నోటీ జారీ అయ్యింది’ అని పేర్కొంది. ఆర్థిక శాఖ ప్రకటన ప్రకారం.. ఒప్పో ఇండియా కార్యాలయాల్లో నిర్వహించిన సోదాల్లో, కంపెనీ కొన్ని దిగుమతుల వివరాలను ఉద్దేశపూర్వకంగా తప్పుగా చూపించినట్లు, నిబంధనలకు విరుద్ధంగా పలు బహుళ జాతి సంస్థలకు రాయల్టీలు, లైసెన్సు ఫీజుల కింద నిధులు చెల్లించినట్లు పక్కా ఆధారాలు లభించాయి. దిగుమతి సుంకాలపరంగా కంపెనీ సుమారు రూ. 2,981 కోట్ల మేర మినహాయింపు ప్రయోజనాలు పొందింది. అంతే గాకుండా టెక్నాలజీ, బ్రాండ్, మేథోహక్కుల లైసెన్సులు వినియోగించుకున్నట్లు చూపడం ద్వారా పలు సంస్థలకు రాయల్టీ, లైసెన్సు ఫీజులు చెల్లించినట్లు/చెల్లించాల్సి ఉన్నట్లు ప్రొవిజనింగ్ చేసింది. వీటిని దిగుమతి చేసుకున్న ఉత్పత్తుల విలువకు జోడించకపోవడం ద్వారా రూ. 1,408 కోట్ల మేర సుంకాలు ఎగవేసినట్లు ఆర్థిక శాఖ పేర్కొంది. కా గా, ఎస్‌సీఎన్‌లో పేర్కొన్న ఆరోపణలపై తమ అభి ప్రాయం వేరుగా ఉందని ఒప్పో ఇండియా తెలిపింది. దీనిపై న్యాయ నిపుణులను సంప్రదించడంతో పాటు తగు చర్యలు తీసుకుంటామని పేర్కొంది. -
చేసిన తప్పు సరిదిద్దుకోలేక.. పరువు బజారున పడుతుందని..
సాక్షి, రాయచూరు (కర్ణాటక): చేసిన తప్పును సరిదిద్దుకోలేక, కుటుంబ పరువు బజారున పడుతుందని ఓ యువతి విషం తాగి ఆత్మహత్యాయత్నం చేయగా రిమ్స్‌లో చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందింది. తాలూకాలోని జేగరకల్ మండలం తిమ్మాపూర్‌కు చెందిన శాంతమ్మ (30) ఆత్మహత్య చేసుకుంది. వివరాలు... తిమ్మాపూర్‌లో తల్లిదండ్రులతో కలిసి ఉంటున్న శాంతమ్మను రమేశ్ అనే వ్యక్తి ప్రేమపేరుతో మభ్యపెట్టాడు. గర్భవతిని చేశాడు. పెళ్లి చేసుకోమని కోరితే గర్భం తొలగించుకోవాలని హెచ్చరించాడు. రూ. 50 వేల నగదు ఇస్తానని ఆశ పెట్టాడు. విషయం బయటకు చెబితే మీ తల్లిదండ్రులను హత్య చేస్తానని బెదిరించాడు. దీంతో గతనెల 27న రాత్రి శాంతమ్మ పరుగుల మందు తాగింది. కుటుంబ సభ్యులు హుటాహుటిన రిమ్స్‌కు తరలించగా అక్కడ చికిత్స పొందుతూ సోమవారం ఉదయం మరణించింది. కేసు దర్యాప్తు చేపట్టినట్లు ఎస్ఐ లక్ష్మీ తెలిపారు. -
దాదర్ ఎక్స్‌ప్రెస్‌కు తప్పిన ముప్పు
వైఎస్సార్ కడప: రైల్వే సిబ్బంది అప్రమత్తతో పెను ప్రమాదం తప్పింది. వైఎస్సార్ కడప జిల్లా ముద్దనూరు పాయింట్ బ్లాక్ వద్ద రైల్వే పట్టా బోల్ట్ ఊడి ఉండటాన్ని గుర్తించిన గేట్మెన్ వెంటనే ఉన్నతాధికారులకు సమాచారం అందిచారు. దీంతో ముంబాయి నుంచి చెన్నై వెళ్తున్న దాదర్ ఎక్స్‌ప్రెస్‌కు ప్రమాదం తప్పింది. -
అయిదేళ్లుగా పన్ను ఎగ్గొడుతున్న హీరో?
చెన్నై: తమిళ సూపర్ స్టార్ , కత్తి హీరో విజయ్ గత అయిదేళ్లుగా ఆదాయ పన్ను చెల్లించడం లేదని సమాచారం. ఆదాయ పన్ను అధికారులు అందించిన సమాచారం ప్రకారం గత అయిదేళ్లుగా ఆయన పన్ను ఎగ్గొట్టినట్టు తెలుస్తోంది. ఇటీవల తమిళ, తెలుగు, కన్నడ చిత్ర రంగ పరిశ్రమలకు చెందిన ప్రముఖ నటులపై ఐటి దాడులు జరిగిన నేపథ్యంలో ఈ వార్తలు మరింత ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. అయితే ఈ వార్తలను విజయ్ ఖండించారు. ఈ వార్తలు పూర్తిగా అవాస్తవాలని ఆయన కొట్టి పడేశారు. తాము చాలా శ్రద్ధగా టాక్స్‌లను చెల్లిస్తున్నట్టు తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంతో సహా అన్ని రకాల పన్నులను విధిగా చెల్లించానని విజయ్ స్పష్టం చేశారు. గతవారం ఐటి అధికారులు తమ ఇంటిపై దాడులు చేసినపుడు ఈ వివరాలను వారికి అందించామన్నారు. తాను, తన కుటుంబ సభ్యులు తమ ఐటి రిటర్న్స్‌కు సంబంధించిన , సాక్ష్యాలను, పూర్తి పత్రాలను సమర్పించామని పేర్కొన్నారు. కాగా ఇటీవల హీరో విజయ్, హీరోయిన్లు నయనతార, సమంతా, పులి డైరెక్టర్లు సహా కొంతమంది నటీనటుల ఇళ్లపై ఐటి అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ క్రమంలో వీరికి సంబంధించి సుమారు 25 కోట్ల రూపాయల బన్ను బకాయిలు ఉన్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే.