అయిదేళ్లుగా పన్ను ఎగ్గొడుతున్న హీరో? | Reports say Vijay evaded tax for 5 years, actor denies allegations | Sakshi
Sakshi News home page

అయిదేళ్లుగా పన్ను ఎగ్గొడుతున్న హీరో?

Published Wed, Oct 7 2015 2:59 PM | Last Updated on Sun, Sep 3 2017 10:35 AM

అయిదేళ్లుగా పన్ను ఎగ్గొడుతున్న హీరో?

అయిదేళ్లుగా పన్ను ఎగ్గొడుతున్న హీరో?

చెన్నై:  తమిళ సూపర్ స్టార్ , కత్తి హీరో విజయ్ గత అయిదేళ్లుగా ఆదాయ పన్ను చెల్లించడం లేదని సమాచారం. ఆదాయ పన్ను అధికారులు అందించిన సమాచారం  ప్రకారం గత అయిదేళ్లుగా   ఆయన పన్ను ఎగ్గొట్టినట్టు తెలుస్తోంది.  ఇటీవల తమిళ, తెలుగు, కన్నడ చిత్ర రంగ పరిశ్రమలకు చెందిన ప్రముఖ నటులపై   ఐటి దాడులు జరిగిన నేపథ్యంలో ఈ వార్తలు మరింత ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.


అయితే ఈ వార్తలను విజయ్ ఖండించారు. ఈ వార్తలు పూర్తిగా అవాస్తవాలని ఆయన కొట్టి పడేశారు. తాము చాలా శ్రద్ధగా టాక్స్లను చెల్లిస్తున్నట్టు తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంతో సహా అన్ని రకాల పన్నులను విధిగా చెల్లించానని విజయ్ స్పష్టం చేశారు.  గతవారం ఐటి అధికారులు తమ ఇంటిపై దాడులు చేసినపుడు ఈ వివరాలను వారికి అందించామన్నారు. తాను, తన కుటుంబ సభ్యులు తమ ఐటి రిటర్న్స్కు సంబంధించిన ,  సాక్ష్యాలను, పూర్తి పత్రాలను సమర్పించామని  పేర్కొన్నారు.


కాగా ఇటీవల  హీరో విజయ్, హీరోయిన్లు నయనతార, సమంతా,  పులి డైరెక్టర్లు సహా కొంతమంది  నటీనటుల ఇళ్లపై  ఐటి అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ క్రమంలో వీరికి సంబంధించి సుమారు 25 కోట్ల రూపాయల బన్ను  బకాయిలు ఉన్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement