claims
-
ఈపీఎఫ్‌వో రూ.2 లక్షల కోట్ల క్లెయిమ్‌లు
న్యూఢిల్లీ: ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ (ఈపీఎఫ్‌వో) సభ్యుల క్లెయిమ్‌ల పరిష్కారంలో కొత్త రికార్డులకు చేరుకుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో సభ్యులకు సంబంధించి రూ.2,05,932 కోట్ల విలువైన క్లెయిమ్‌లను ఈపీఎఫ్‌వో ఆమోదించినట్టు కేంద్ర కార్మిక శాఖ ప్రకటించింది. మొత్తం పరిష్కరించిన క్లెయిమ్‌ల సంఖ్య 5.08 కోట్లను చేరుకున్నట్టు తెలిపింది. ఆర్థిక సంవత్సరం ముగిసేందుకు మరో రెండు నెలలు మిగిలి ఉండగా, అప్పుడే గతేడాది క్లెయిమ్ గణాంకాలను ఈ ఏడాది అధిగమించడం గమనార్హం. 2023–24 ఆర్థిక సంవత్సరం మొత్తం మీద 4.45 కోట్ల క్లెయిమ్‌లకు గాను చేసిన చెల్లింపులు రూ.1,82,838 కోట్లుగా ఉన్నాయి. క్లెయిమ్ పరిష్కారాల ప్రక్రియ పురోగతికి, ఫిర్యాదుల పరిష్కారం దిశగా ఈపీఎఫ్‌వో చేపట్టిన సంస్కరణల వల్లే ఈ ఘనత సాధించినట్టు కేంద్ర కార్మిక, ఉపాధి కల్పన శాఖ మంత్రి మనుసుఖ్ మాండవీయ తెలిపారు. క్లెయిమ్‌లను ఆటోమేటిగ్గా పరిష్కరించడం, సభ్యుల ప్రొఫైల్ మార్పులను సులభతరం చేయడం, పీఎఫ్ సాఫీ బదిలీకి వీలు కల్పించడం వంటి చర్యలను మంత్రి ప్రస్తావించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఆటో క్లెయిమ్ పరిష్కారాలు రెట్టింపై 1.87 కోట్లుగా ఉన్నట్టు చెప్పారు. గత ఆర్థిక సంవత్సరంలో ఆటో క్లెయిమ్ పరిష్కారాలు 89.52 లక్షలుగా ఉన్నాయి. -
క్లెయిమ్ చేసుకోని నిధులు రూ.880 కోట్లు
లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్లో కాలపరిమితి గడువు పూర్తయ్యాక (మెచ్యూర్టీ) ఎవరూ క్లెయిమ్ చేసుకోని (అన్క్లెయిమ్డ్) బీమా పరిహార నిధులు రూ.880.93 కోట్లుగా నమోదయ్యాయని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరీ తెలిపారు. 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఈ లెక్కల ప్రకారం గడువు తీరినా బీమా ప్రయోజనాలను క్లెయిమ్ చేసుకోని పాలసీదార్లు 3,72,282 మంది ఉన్నట్లు మంత్రి లోక్‌సభలో పేర్కొన్నారు. 2022-23లో 3,73,329 మంది పాలసీదార్లకు చెందిన రూ.815.04 కోట్ల నిధులు అన్క్లెయిమ్డ్గా ఉన్నాయి.ఇదీ చదవండి: ఉచిత ఆధార్ అప్డేట్ గడువు పొడిగింపుఅన్క్లెయిమ్డ్, అవుట్‌స్టాండింగ్ క్లెయిమ్‌లను తగ్గించుకునేందుకు ఎల్ఐసీ ఎలాంటి ప్రయాత్నాలు చేస్తుందో మంత్రి తెలియజేశారు.పత్రికల్లో ప్రకటనలు ఇవ్వడండిజిటల్ మాధ్యమాల్లో ప్రకటనలు ఇవ్వడంరేడియో ద్వారా సమాచారం ఇవ్వడంబీమా పరిహారాన్ని క్లెయిమ్ చేసుకోవాలని సాధారణ/ స్పీడ్ పోస్ట్ ద్వారా కూడా సమాచారాన్ని పంపిస్తున్నారు.ఇ-మెయిల్ చిరునామా ద్వారా, మొబైల్ నెంబర్ ద్వారా సమాచారం అందిస్తున్నామని మంత్రి తెలిపారు.బీమాను క్లెయిమ్ చేసుకోవాలని ఏజెంట్ల ద్వారా పాలసీదార్లకు సమాచారం ఇస్తున్నట్లు మంత్రి చెప్పారు. -
గుండె జారిపోతోంది!
సాక్షి, అమరావతి: దేశంలో గుండె జబ్బులు పెరుగుతున్నాయి. గత ఐదేళ్లలో గుండె జబ్బుల సంబంధిత ఇన్సూ్యరెన్స్ క్లెయిమ్‌లు దాదాపు రెట్టింపవడమే ఇందుకు నిదర్శనం. కాలుష్యం, జీవనశైలి సంబంధిత ఆరోగ్య సమస్యలు గుండె జబ్బులకు ప్రధాన కారణం. పాలసీ బజార్ సంస్థ అధ్యయన నివేదిక ప్రకారం 2019–20లో దేశవ్యాప్తంగా నమోదైన ఆరోగ్య బీమా నమోదైన క్లెయిమ్‌లలో గుండె చికిత్సల క్లెయిమ్‌ల వాటా దాదాపు 12 శాతం. ఇవి 2023–24లో 20 శాతం వరకు పెరిగాయి. గుండె జబ్బుల చికిత్స ఖర్చులు సైతం 47 నుంచి 53 శాతం మేర పెరిగినట్టు ఆ సంస్థ వెల్లడించింది. ఒక్కో క్లెయిమ్ 2019–20లో రూ.4 లక్షల నుంచి రూ.5 లక్షల ఉంటే.. 2023–24లో రూ. 12 – 15 లక్షలకు పెరిగినట్లు తెలిపింది. యువతలో పెరుగుతున్న జబ్బులు కొద్ది సంవత్సరాలుగా యువతలో గుండె జబ్బులు పెరుగుతున్నాయి. ఒత్తిడి, అనారోగ్యకరమైన ఆహార అలవాట్లు, శారీరక శ్రమ లేని జీవన శైలి ఇందుకు కారణమని పలు అధ్యయనాలు వెల్లడించాయి. 2020లో 40 ఏళ్ల లోపు యువతకు సంబంధించిన గుండె వ్యాధుల క్లెయిమ్‌లు 10–12 శాతం నమోదు కాగా, 2022–23లో 15–18 శాతంగా నమోదైంది. గుండె జబ్బులకు సంబంధించిన మొత్తం క్లెయిమ్‌లలో 60–70 శాతం పురుషులు, 30–40 శాతం మహిళలు ఉన్నట్టు తేలింది.ప్రాంతాల వారీగా అత్యధికంగా గుండె చికిత్సల క్లెయిమ్లుఉత్తర భారతదేశం (ఢిల్లీ, పంజాబ్, హర్యానా) 20- 25%పశ్చిమ భారతదేశం (మహారాష్ట్ర, గుజరాత్) 15- 18%దక్షిణ భారతదేశం (తమిళనాడు, కర్ణాటక) 15-20%తూర్పు భారతదేశం (పశ్చిమ బెంగాల్) 10- 12%(కోల్‌కతా వంటి నగరాల్లో గుండె జబ్బుల రేట్లు గణనీయంగా ఉంటున్నాయి. అయినప్పటికీ బీమా పాలసీదారులు తక్కువగా ఉండటంతో తక్కువ నమోదైంది) -
ఈపీఎఫ్‌వో క్లెయిమ్ ప్రాసెసింగ్.. ఇప్పుడు మేలు!
ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) క్లెయిమ్‌ల ప్రాసెసింగ్‌లో ఇటీవల గణనీయమైన పెరుగుదలను సాధించింది. గతేడాదితో పోల్చితే ఈ ఏడాది ఆగస్టు, సెప్టెంబరులో ఇది సుమారు 30 శాతం పెరిగింది. దీనంతటికీ కారణం ఈపీఎఫ్‌వో ఇటీవల అమలు చేసిన భారీ సాఫ్ట్వేర్ అప్‌గ్రేడ్. ఇది దాని డిజిటల్ ప్లాట్‌ఫామ్ సామర్థ్యాన్ని మెరుగుపరిచింది.గతంలో క్లెయిమ్‌ల పరిష్కారం నెమ్మదిగా ఉండేది. దీంతో చందాదారులు, ప్రత్యేకించి అత్యవసర ఆర్థిక అవసరాల కోసం నిధులను ఉపసంహరించుకోవాల్సిన వారు ఇబ్బందులు పడేవారు. కొత్త సాఫ్ట్వేర్ అప్డేట్తో ఇప్పుడది బాగా మెరుగుపడింది. ఈ వేగాన్ని కొనసాగించడానికి మరిన్ని హార్డ్‌వేర్ అప్గ్రేడ్లు, అదనపు సాఫ్ట్వేర్ మెరుగుదలలను కూడా ఈపీఎఫ్‌వో ప్లాన్ చేస్తోంది.ఇదీ చదవండి EPFO: కొత్త ప్రతిపాదన.. రిటైరయ్యాక భారీగా సొమ్ముసెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్ (C-DAC) అభివృద్ధి చేసిన కొత్త వ్యవస్థ క్లెయిమ్ తిరస్కరణలను తగ్గించడంలో కీలకపాత్ర పోషించింది. ఇటీవలి సాఫ్ట్వేర్ అప్‌గ్రేడ్ తర్వాత, క్లెయిమ్ ప్రాసెసింగ్ వేగం, ఖచ్చితత్వం రెండింటిలోనూ మెరుగుదలను గుర్తించారు. దీంతోపాటు చందాదారులు ఉద్యోగాలు లేదా స్థానాలను మార్చినప్పటికీ, చెల్లింపు వ్యవస్థల క్రమబద్ధీకరణ, చందాదారుల రికార్డులను ఒకే చోట నిర్వహించే కేంద్రీకృత డేటాబేస్‌ను ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం కృషి చేస్తోంది. ఇది రెండు నెలల్లో కార్యరూపం దాల్చనుంది. -
తెలుగు రాష్ట్రాల్లో క్లెయిమ్స్ సరళతరం: ఐసీఐసీఐ ప్రు లైఫ్
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ తెలుగు రాష్ట్రాల్లో వరద బాధితులకు సంబంధించి క్లెయిమ్స్ ప్రక్రియను సరళతరం చేసినట్లు ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ వెల్లడించింది. క్లెయిమ్ సెటిల్మెంట్ కోసం మూడు ప్రాథమిక డాక్యుమెంట్లను సమరి్పస్తే సరిపోతుందని వివరించింది. ఐఎఫ్ఎస్సీ కోడ్ ఉన్న బ్యాంకు అకౌంటు నంబరు లేదా క్యాన్సిల్ చేసిన చెక్ కాపీ, డెత్ సరి్టఫికెట్ లేదా ఆస్పత్రులు, పోలీసులు, ప్రభుత్వాధికారులు జారీ చేసిన మృతుల జాబితా, ఆధార్ వంటి ధృవీకరణ పత్రాలను ఇవ్వొచ్చని పేర్కొంది. మొబైల్ యాప్ ద్వారా లేదా ఎస్ఎంఎస్ ద్వారా క్లెయిమ్‌ను రైజ్ చేయొచ్చని వివరించింది. ఇరవై నాలుగ్గంటలూ పనిచేసే టోల్ ఫ్రీ క్లెయిమ్కేర్ హెల్ప్‌లైన్ 1800–2660ని ప్రారంభించినట్లు సంస్థ పేర్కొంది. -
ఇలా చేయకుంటే... హెల్త్ క్లెయిమ్ తిరస్కరణ!
అనారోగ్యంతో ఆస్పత్రి పాలైతే.. ఆదుకుంటుందన్న భరోసాతోనే ఎవరైనా హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకుంటారు. తీరా అవసరం వచ్చినప్పుడు బీమా సంస్థ చెల్లింపులకు నిరాకరిస్తే..? పాలసీదారులు కంగుతినాల్సిందే. కరోనా ఆరోగ్య విషయంలో ఎంతో మందికి కళ్లు తెరిపించింది. ఆ ఫలితమే తర్వాత నుంచి హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకునే వారి సంఖ్య గణనీయంగా పెరుగుతూ వస్తోంది. ముఖ్యంగా పాలసీ నిబంధనలను కచి్చతంగా తెలుసుకున్న తర్వాతే కొనుగోలు చేయాలి. పాలసీ నిబంధనలను అర్థం చేసుకోవడంలో లోపం చోటుచేసుకుంటే, భవిష్యత్తులో క్లెయిమ్‌లు తిరస్కరణకు గురయ్యే రిస్క్ కచ్చితంగా ఉంటుంది. దీనివల్ల ఒక్కసారిగా కుటుంబంపై ఆరి్థక భారం పడిపోతుంది. బీమా సంస్థ చెల్లింపులు చేయకపోవడం వెనుక ఎన్నో కారణాలు ఉండొచ్చు. వీటి పట్ల అవగాహన కలిగి ఉంటే, అలాంటి పరిస్థితులను నివారించొచ్చు. ఈ వివరాలు అందించే కథనమే ఇది. పాలసీ దరఖాస్తు పత్రంలో అప్పటికే తమకు ఏవైనా ఆరోగ్య సమస్యలు ఉంటే వెల్లడించడం తప్పనిసరి. లేదంటే భవిష్యత్తులో క్లెయిమ్ పరంగా సమస్యలు ఎదురవుతాయి. పాలసీదారు ఆరోగ్య చరిత్ర ఆధారంగానే క్లెయిమ్ రిస్‌్కను బీమా సంస్థలు అంచనా వేస్తాయి. దానికి అనుగుణంగా ప్రీమియం నిర్ణయిస్తాయి. చెప్పకపోతే బీమా సంస్థకు తెలియదుగా అని చెప్పి కొందరు అనారోగ్య సమస్యలను వెల్లడించరు. ఇది బీమా ఒప్పందాన్ని ఉల్లంఘించినట్టు అవుతుంది. క్లెయిమ్ సమయంలో బీమా సంస్థలు వీటిని గుర్తించినట్టయితే.. చెల్లింపులకు నిరాకరించడంతోపాటు, కవరేజీని సైతం రద్దు చేయొచ్చు. ముందస్తు వ్యాధులనే కాదు, ఏదైనా అనారోగ్యానికి సంబంధించి లోగడ చికిత్స తీసుకున్నా వెల్లడించడమే మంచిది. ఫ్యామిలీ ఫ్లోటర్ పాలసీ అయితే, కుటుంబ సభ్యులందరి వైద్య చరిత్రను నమోదు చేయాలి. సరైన సమాచారం ఇవ్వాలిబీమా సంస్థకు సమరి్పంచే ఇన్సూరెన్స్ క్లెయిమ్ పత్రంలో పూర్తి వివరాలు ఉండాలి. తేదీలు, చికిత్సల ప్రక్రియలకు సంబంధించి చిన్న దోషాలు కూడా ఉండకూడదు. రోగి వయసు, పేరులోనూ వ్యత్యాసాలు ఉండకూడదు. బీమా సంస్థలు ప్రతి క్లెయిమ్ దరఖాస్తును లోతుగా పరిశీలిస్తాయి. ఏవైనా వ్యత్యాసాలు గుర్తిస్తే మరింత సమాచారం కోరడం లేదా తిరస్కరించడం చేయొచ్చు. క్లెయిమ్ వచి్చనప్పుడు, అందులోని వ్యాధి నిర్ధారణ వివరాలను, అప్పటికే పాలసీదారు వైద్య చరిత్రతో పోల్చి చూస్తాయి. హాస్పిటల్ రికార్డులు, డాక్టర్ నోట్లను పరిశీలిస్తాయి. ఈ సమయంలో వ్యత్యాసాలు కనిపిస్తే చెల్లింపులను నిరాకరిస్తాయి. పాలసీ పత్రంలో ఉద్దేశపూర్వకంగా తప్పుడు సమాచారం ఇచ్చి నట్టు గుర్తిస్తే దాన్ని మోసం కింద పరిగణిస్తాయి. దీంతో క్లెయిమ్ రాకపోవడం కాదు, పాలసీ కూడా రద్దు కావచ్చు. అదనపు సమాచారం, వివరణ, డాక్యుమెంట్లను బీమా కంపెనీ కోరొచ్చు. దీంతో నగదు రహిత క్లెయిమ్ కాకుండా రీయింబర్స్మెంట్ మార్గంలో రావాలని కోరే అధికారం సైతం బీమా సంస్థకు ఉంటుంది. ముఖ్యంగా రీయింబర్స్మెంట్ క్లెయిమ్‌కు సంబంధించి అన్ని రకాల డాక్యుమెంట్లను సమర్పించడం తప్పనిసరి.మినహాయింపులు హెల్త్ ఇన్సూరెన్స్ ఉన్న వారు తమ పాలసీ పరంగా ఉన్న మినహాయింపుల గురించి కచి్చతంగా తెలుసుకోవాలి. దీనివల్ల క్లెయిమ్ పరంగా సమస్యలు రాకుండా ముందే జాగ్రత్త పడొచ్చు. కొన్ని రకాల అనారోగ్యాలు, చికిత్సలు లేదా సేవలకు కొన్ని ప్లాన్లలో కవరేజీ ఉండదు. నిబంధనల్లో మార్పులు కొన్ని సందర్భాల్లో పాలసీ నిబంధనలు, ప్రయోజనాల్లో మార్పులు చోటు చేసుకోవచ్చు. అలాంటప్పుడు కూడా క్లెయిమ్‌లకు తిరస్కారం ఎదురవుతుంది. వాస్తవానికి ఇలాంటి వాటి గురించి పాలసీదారులకు బీమా సంస్థలు విధిగా తెలియజేస్తాయి.సకాలంలో తెలపాలి.. ముందస్తుగా నిర్ణయించుకుని తీసుకునే నగదు రహిత చికిత్సలకు కనీసం 48 గంటల ముందు బీమా సంస్థకు తెలియజేయాలి. అత్యవసర వైద్యం అవసరమై ఆస్పత్రిలో చేరినప్పుడు నగదు రహిత క్లెయిమ్‌కు సంబంధించి 24 గంటల్లోపు బీమా సంస్థకు సమాచారం ఇవ్వాలి. రీయింబర్స్మెంట్ క్లెయిమ్ పెట్టుకునే వారు సైతం.. ముందస్తు ప్రణాళిక మేరకు తీసుకునే చికిత్సలు అయితే 48 గంటల ముందుగా, అత్యవసరంగా ఆస్పత్రిలో చేరితే 24–48 గంటల్లోపు సమాచారం ఇవ్వాల్సిందే. ఇక రీయింబర్స్మెంట్ క్లెయిమ్ దరఖాస్తు, డాక్యుమెంట్లను ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన 30 రోజుల్లోపు సమరి్పంచాలి. బీమా సంస్థల మధ్య ఈ గడువులో వ్యత్యాసం ఉండొచ్చు. పాలసీ ల్యాప్స్ పాలసీ ప్రీమియం గడువు మించకుండా చెల్లించాలి. లేదంటే పాలసీ ల్యాప్స్ అవుతుంది. ఇలా ల్యాప్స్ అయిన పాలసీలకు సంబంధించి క్లెయిమ్‌లను బీమా సంస్థలు అనుమతించవు. పాలసీ గడువు ముగిసిన తర్వాత 15–30 రోజుల గ్రేస్ పీరియడ్ ఉంటుంది. కనీసం ఈ కాలంలో అయినా ప్రీమియం చెల్లించాలి. లేదంటే పాలసీ రద్దయిపోతుంది. దీంతో బీమా కవరేజీ కోల్పోయినట్టు అవుతుంది. ల్యాప్స్ అయిన పాలసీని పునరుద్ధరించుకునే వరకు కవరేజీ ఉండదు. వెయిటింగ్ పీరియడ్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ తీసుకున్న తర్వాత కొన్ని రకాల క్లెయిమ్‌లకు వెయిటింగ్ పీరియడ్ (వేచి ఉండాల్సిన కాలం) ఉంటుంది. ఆ కాలంలో వచ్చే క్లెయిమ్‌లను బీమా సంస్థలు తోసిపుచ్చుతాయి. హెరి్నయా, క్యాటరాక్ట్, చెవి, ముక్కు, గొంతు సమస్యలు (ఈఎన్టీ), మోకాలి చిప్ప మారి్పడి తదితర చికిత్సలకు రెండేళ్ల పాటు వెయిటింగ్ ఉంటుంది. అలాగే, పాలసీ తీసుకునే నాటికే ఉన్న వ్యాధులకు సైతం క్లెయిమ్ కోసం నిర్ధేశిత కాలం పాటు వేచి ఉండాల్సిందే. ఆ కాలంలో క్లెయిమ్‌లను అనుమతించరు. కవరేజీ ఖర్చయిపోతే.. ఒక పాలసీ సంవత్సరంలో నిర్దేశిత కవరేజీ మొత్తం వినియోగించుకున్న తర్వాత వచ్చే క్లెయిమ్‌లకు బీమా సంస్థలు చెల్లింపులు చేయవు. అందుకే అన్ లిమిటెడ్ రీస్టోరేషన్ సదుపాయం ఉన్న పాలసీని తీసుకోవాలి. అప్పుడు బీమా ఖర్చయిపోయినా, తిరిగి అంతే మొత్తాన్ని పునరుద్దరిస్తాయి. ముందస్తు అనుమతి.. కొన్ని రకాల చికిత్సలకు ముందస్తు ఆమోదం తప్పనిసరి అంటూ బీమా సంస్థ నిబంధనలు విధించొచ్చు. అలాంటి వాటిపై ముందే అవగాహన ఉంటే క్లెయిమ్ నిరాకరణకు నోచుకోదు.తిరస్కరిస్తే ఏంటీ మార్గం? బీమా సంస్థ సహేతుక కారణం లేకుండా చెల్లింపులకు నిరాకరిస్తే చూస్తూ ఉండిపోనక్కర్లేదు. పాలసీ నియమ, నిబంధనలను ఒక్కసారి పూర్తిగా అధ్యయనం చేయాలి. ‘పాలసీ వర్డింగ్స్’లో పూర్తి వివరాలు ఉంటాయి. క్లెయిమ్ తిరస్కరించడానికి కారణాలు తెలుసుకోవాలి. రిజెక్షన్ లెటర్లో ఈ వివరాలు ఉంటాయి. బీమా సంస్థ నిర్ణయం వాస్తవికంగా లేదని భావిస్తే అప్పుడు అప్పీల్‌కు దరఖాస్తు చేసుకోవాలి. ప్రతి బీమా సంస్థలోనూ గ్రీవెన్స్ రిడ్రెస్సల్ (ఫిర్యాదుల పరిష్కార) విభాగం ఉంటుంది. క్లెయిమ్ నిరాకరించడానికి తగిన కారణాలు లేవంటూ వారికి ఫిర్యాదు సమరి్పంచాలి. పరిష్కారం లభించకపోతే అప్పుడు బీమా అంబుడ్స్‌మెన్‌ను సంప్రదించాల్సి ఉంటుంది. అక్కడా న్యాయం జరగకపోతే అప్పుడు వినియోగదారుల కోర్టును ఆశ్రయించొచ్చు. క్లెయిమ్ పూర్తిగా కాకుండా, పాక్షికంగా చెల్లింపులు చేసిన సందర్భాల్లోనూ పాలసీదారులు న్యాయం కోరొచ్చు. ఐఆర్డీఏఐ... ఐఆర్డీఏఐ గ్రీవెన్స్ రిడ్రెస్సల్ సెల్‌ను సంప్రదించొచ్చు. టోల్‌ఫ్రీ నంబర్లు 155255 లేదా 1800 4254 732కు కాల్ చేసి చెప్పొచ్చు. లేదా complaints@irdai.gov.inకు మెయిల్ పంపొచ్చు. లేదా ఐఆర్‌డీఏకు చెందిన https://irdai. gov.in/ igms1 పోర్టల్ సాయంతో ఫిర్యాదు దాఖలు చేయవచ్చు. పరిష్కార వేదికలుఅంబుడ్స్మెన్ ద్వారా రూపాయి ఖర్చు లేకుండా పరిష్కరించుకోవచ్చు. వినియోగదారుల కోర్టుకు వెళ్లినా సరే పెద్దగా ఖర్చు కాదు. – సాక్షి, బిజినెస్ డెస్క్ -
జీ20 కేంద్రం వద్ద వర్షం నీరు.. విపక్షాల వ్యాఖ్యలపై కేంద్రం క్లారిటీ..
ఢిల్లీ: జీ20 వేదిక భారత మండపం వద్ద వర్షపు నీరు వరదలుగా పారుతోందని విపక్షాలు చేసిన వ్యాఖ్యలను కేంద్రం తప్పుబట్టింది. ప్రతిపక్షాల వ్యాఖ్యలు అవాస్తవాలని, తప్పుదోవ పట్టించేవిగా ఉన్నాయని స్పష్టం చేసింది. శనివారం అర్ధరాత్రి కురిసిన వర్షానికి తేలికపాటి వర్షం నీరు భారత మండపం బయట నిలిచిందని పేర్కొంది. వెంటనే ఆ నీటిని మోటర్లను ఉపయోగించి బయటకు పంపినట్లు వెల్లడించింది. ‘జీ20 ఏర్పాట్ల కోసం రూ.2,700 కోట్లు కేంద్రం ఖర్చు చేసింది. ఇప్పుడు ఒక్క వర్షానికే భారత మండపం నీటితో నిండిపోయింది. పంపులతో సిబ్బంది నీటిని బయటకు పంపుతున్నారు. అభివృద్ధిలో డొల్లతనం బయటపడింది..’ అంటూ కాంగ్రెస్ ‘ఎక్స్’లో వ్యంగ్యంగా పేర్కొంది. ఈ వీడియోను షేర్ చేస్తూ ‘దేశ వ్యతిరేక అంతర్జాతీయ కుట్రలో వానలు కూడా భాగమే’అంటూ ఆ పార్టీ ప్రతినిధి సుప్రియ వ్యాఖ్యానించారు. ‘జీ20 సదస్సు సాగుతుండగానే భారత్ మండపంలోని వరదనీరు చేరిందన్న విషయాన్ని మీడియా ప్రస్తావించనేలేదు. మోదీజీ, దేశాన్ని ఎలా పాలించాలో మా నుంచి మీరు నేర్చుకోలేదు. కానీ, మీడియాను ఎలా మేనేజ్ చేయాలో మిమ్మల్ని చూసి మేం నేర్చుకోవాలి’అంటూ ఆ కాంగ్రెస్ పార్టీ నేత పవన్ ఖేరా పేర్కొన్నారు. అటు టీఎంసీ నేత సాకేత్ గోఖలే కూడా కేంద్రాన్ని విమర్శించారు. రూ.4000 కోట్లు ఖర్చు చేసినప్పటికీ వర్షం నీరు వరదలుగా పారుతోందని విమర్శించారు. నిధులను మోదీ ప్రభుత్వం ఏ విధంగా దుర్వినియోగం చేసిందో తెలుస్తోందని అన్నారు. ఈ పరిణామాల అనంతరం కేంద్రం స్పందించింది. ప్రతిపక్షాలు తప్పుదోవ పట్టిస్తున్నాయని మండిపడింది. అవాస్తవాలను ప్రచారం చేస్తున్నారని తెలిపింది. ఇదీ చదవండి: జీ20 తదుపరి అధ్యక్ష బాధ్యతలను బ్రెజిల్‌కు అప్పగింత -
అమెరికాలో నిరుద్యోగ భృతికి లక్షలాది దరఖాస్తులు
అమెరికాలో నిరుద్యోగం తాండవిస్తోంది. ఆ దేశ ప్రభుత్వం అందించే నిరుద్యోగ భృతి కోసం దరఖాస్తు చేసినవారి సంఖ్య గత వారం 20 నెలల గరిష్ఠ స్థాయికి చేరింది. అది అలాగే స్థిరంగా కొనసాగుతోంది. బ్యూరో ఆఫ్ లేబర్ స్టాటిస్టిక్స్ తాజాగా విడుదల చేసిన డేటా ప్రకారం.. జూన్ 17తో ముగిసిన వారంలో కాలానుగుణంగా సర్దుబాటు ప్రాతిపదికన నిరుద్యోగ ప్రయోజనాల కోసం 2,64,000 కొత్త క్లెయిమ్‌లు దాఖలయ్యాయి. అంతకు ముందు వారంతో పోలిస్తే దరఖాస్తుల సంఖ్యలో పెద్దగా మార్పు లేదు. 2021 అక్టోబర్ తర్వాత గతవారం నిరుద్యోగ భృతి దరఖాస్తులు మొదటి సారిగా అత్యధిక స్థాయికి చేరాయి. కాగా నిరుద్యోగ భృతికి కొత్త దరఖాస్తులు సగటున 2,60,000 ఉండొచ్చని ఆర్థికవేత్తలు అంచనా వేసినట్లుగా ‘రాయిటర్స్’ పేర్కొంది. ఇదిలా ఉండగా మొదటి వారం దాటి ప్రయోజనాలను పొందుతున్న వారందరి ర్యాంక్‌లు జూన్ 10తో ముగిసిన వారంలో 17.6 లక్షలకు పడిపోయాయి. అంతకు ముందు వారం ఇది 17.72 మిలియన్లుగా ఉండేది. యూఎస్ కరెంట్ ఖాతా లోటు ఈ ఏడాది మొదటి మూడు నెలలలో స్థిరంగా విస్తరించి మూడు త్రైమాసికాల దిగువకు తగ్గిందని ఆ దేశ ప్రభుత్వం నివేదించింది. మరోవైపు 2022 నాలుగో త్రైమాసికంలో సవరించిన 216.2 బిలియన్ డాలర్ల నుంచి మొదటి త్రైమాసికంలో కరెంట్ అకౌంట్ గ్యాప్ 219.3 బిలియన్ డాలర్లకు పెరిగిందని వాణిజ్య శాఖ తెలిపింది. కాగా అది 217.5 బిలియన్ డాలర్లకు పెరుగుతుందని ఆర్థికవేత్తలు రాయిటర్స్ పోల్‌లో అంచనా వేశారు. -
ఆ ఫీజు తిరిగి ఇవ్వాల్సిందే..
సాక్షి, హైదరాబాద్: వైద్య కళాశాలలు 2017–20 విద్యా సంవత్సరంలో తమనుంచి ఎక్కువ మొత్తంలో వసూలు చేసిన ఫీజులు తిరిగి చెల్లించాల్సిందేనని ఎంబీబీఎస్ విద్యార్థులు హైకోర్టులో వాదించారు. 2022లో ఇదే హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను పాటించేలా ఉత్తర్వులు జారీ చేయాలని వారి తరపున న్యాయవాది సామ సందీప్‌రెడ్డి న్యాయస్థానానికి విజ్ఞప్తి చేశారు. అయితే తమ వాదనలు వినకుండానే హైకోర్టు తీర్పునిచ్చిందని, వాదనలు వినాలని వైద్య కళాశాలల యాజమాన్యాలు వాదించాయి. 2017–20 విద్యా సంవత్సరాలకు సంబంధించి ప్రభుత్వం ఫీజులు నిర్ణయిస్తూ జారీ చేసిన జీవోలను గతంలో హైకోర్టు రద్దు చేసింది. తెలంగాణ అడ్మిషన్ అండ్ ఫీ రెగ్యులేటరీ కమిటీ (టీఏఎస్ఆర్) సిఫార్సుల మేరకు ఫీజులు ఉండాలంది. ఈ ఉత్తర్వులు అమలు కాలేదంటూ కోర్టు ధిక్కార పిటిషన్లతో పాటు కళాశాలలు దాఖలు చేసిన రివ్యూ పిటిషన్లపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్, జస్టిస్ తుకారాంజీ ధర్మాసనం బుధవారం విచారణ చేపట్టింది. నిబంధనల మేరకు ఫీజులు వసూలు చేయాలని, ఎక్కువ వసూలు చేసిన మొత్తాలను విద్యార్థులకు తిరిగి చెల్లించాలన్న ఉత్తర్వుల్ని కళాశాలలు అమలు చేయలేదని సందీప్‌రెడ్డి పేర్కొన్నారు. టీఏఎఫ్ఆర్సీ సిఫార్సుల మేరకు ఫీజులు ఉండాలన్న హైకోర్టు ఉత్తర్వులు అమలు కాలేదన్నారు. హైకోర్టు ఉత్తర్వుల్ని సుప్రీంకోర్టు కూడా ఆమోదించిందని చెప్పారు. ప్రైవేటు కళాశాలల తరపున సీనియర్ న్యాయవాదులు దేశాయ్ ప్రకాశ్‌రెడ్డి, శ్రీరఘురాం, దామా శేషాద్రినాయుడు వాదించారు. టీఏఎస్ఆర్సీ 2016 నుంచి ఫీజులు పెంచలేదని, ఆ కమిటీ ఫీజులను నిర్ణయిస్తే అభ్యంతరం లేదని చెప్పారు. 2017–20 విద్యా సంవత్సరాలకు సర్కార్ పెంచిన ఫీజుల పెంపు నామమాత్రమేనని వివరించారు. దీన్ని సవాల్ చేసిన పిటిషన్లపై విచారణ పెండింగ్‌లో ఉందని చెప్పారు. విద్యార్థులు దాఖలు చేసిన రిట్ పిటిషన్ల విచారణ సమయంలో కాలేజీల వాదనలు వినలేదని, మరోసారి వినాలని విజ్ఞప్తి చేశారు. వాదనలు విన్న ధర్మాసనం.. తదుపరి విచారణను ఈనెల 28వ తేదీకి వాయిదా వేసింది. -
WHO: కరోనా మహమ్మారి మూలాల గురించి మీకు తెలిసిందే చెప్పండి!
చైనా ల్యాబ్ లీక్ కారణంగా కరోనా వచ్చిదంటూ యూఎస్ వాదిస్తుండగా.. అవాస్తవం అని చైనా పదే పదే తిరస్కరిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కోవిడ్-19 మూలాలు గురించి మీకు తెలిసిందే చెప్పండని శుక్రవారం ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) అన్ని దేశాలను కోరింది. 2019లో చైనాలో వచ్చిన ఈ కరోనా ప్రపంచ దేశాలను ఓ కుదుపు కుదిపేసింది. లక్షల్లో మరణాలు సంభవించగా, దేశాలన్ని ఆర్థిక సంక్షోభంలో కొట్టుకునే పరిస్థితకి దారితీసింది కూడా. ఈ కారణాల రీత్యా ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ మహమ్మారి పుట్టుక గురించి బహిర్గతం చేయాల్సిందిగా ఆదేశించింది. అంతేగాదు దీని గురించి అంతర్జాతీయ దేశాలతో పంచుకోవడం చాలా ముఖ్యమని నొక్కి చెప్పారు. ఇప్పడు నిందలు వేసుకోవడం ముఖ్యం కాదని, ఈ మహమ్మారి ఎల ప్రారంభమైంది అనేదానిపై అవగాహన పెంచుకుని తద్వారా భవిష్యత్తులో ఇలాంటి అంటువ్యాధులను నిరోధించవచ్చని డబ్ల్యూహెచ్ఓ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనామ్ ఘెబ్రేయేసస్ అన్నారు. ఈ కోవిడ్-19 మూలాన్ని గుర్తించడానికి సంబంధించిన ఏ చిన్న ప్రణాళికను డబ్ల్యూహెచ్ఓ వదిలిపెట్టలేదని నొక్కి చెప్పారు. ఈ విషయంలో వాస్తవాలు కావాలి 2021లో యూఎన్ ఈ మహమ్మారి మూలం తెలుసుకోవడానికి సైంటిఫిక్ అడ్వైజరీ గ్రూప్(ఎస్‌ఏజీఓ) గ్రూప్‌ను కూడా ఏర్పాటు చేసింది. దీనికి సంబంధించిన డేటాను చైనా పంచుకోవాలని, ఈ విషయంలో పారదర్శకంగా వ్యవహరించమని ఆరోగ్య సంస్థ పిలుపునిచ్చింది. అలాగే డబ్ల్యూహెచ్ఓ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ ఈ విషయమై చైనా అగ్రనాయకులతో పలుమార్లు చర్చించినట్లు కూడా తెలిపారు. ఇలాంటి విషయాలను రాజకీయాలు చేయొద్దని అది పరిశోధనలను కష్టతరం చేస్తుంది, ఫలితంగా ప్రపంచ సురక్షితంగా ఉండదని చెప్పారు. ఇటీవలే యూఎస్‌లోని ప్రముఖ ఎనర్జీ డిపార్ట్‌మెట్ కరోనా మూలానికి వ్యూహాన్ ల్యాబ్ లీకే ఎక్కువగా కారణమని నివేదిక కూడా ఇచ్చింది. అదీగాక ఈ ఎనర్జీ డిపార్ట్మెంట్లోనే అత్యున్నత అధికారులు ఉండటంతో ఈ నివేదిక ప్రస్తుతం అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. ఈమేరకు డబ్ల్యూహెచ్ఓలోని అంటువ్యాధుల ఎపిడెమియాలజిస్ట్ వాన్ కెర్ఖోవ్ మాట్లాడుతూ..ఈ మహమ్మారి కారణంగా ప్రాణాలు కోల్పోయిన వారు, దీర్ఘకాల కోవిడ్‌తో జీవిస్తున్న వారి కోసం ఇదేలా ప్రారంభమైందనేది తెలుసుకోవడం నైతికంగా అత్యంత ముఖ్యం. శాస్త్రీయ అధ్యయనంలో ముందుకు తీసుకువెళ్లడంలో సహాయపడటానికి ఈ సమాచారం పంచుకోవడం అత్యంత కీలకం అని అన్నారు. -
అగ్రరాజ్యంపై చైనా సీరియస్..వేలు పెట్టొద్దంటూ చురకలు
నిఘా బెలూన్ల వ్యవహారంతో అమెరికా-చైనా దేశాల మధ్య వివాదం నానాటికీ తీవ్రతరమవుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అమెరికా విదేశాంగ కార్యదర్శి ఆంటోని బ్లింకెన్.. చైనాపై తీవ్ర స్థాయిలో ఆరోపణలు గుప్పించారు. ఉక్రెయిన్‌పై యుద్ధంలో రష్యాకు ఆయుధాలు ఇచ్చే యోచన చేస్తోందంటూ.. చైనాపై ఆరోపణలు చేశారు బ్లింకెన్. దీంతో చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి వాంగ్ వెన్బిన్ శాంతి నామం జపిస్తూ.. యుద్ధ భూమికి ఆయుధాలను పంపిస్తోంది అమెరికానే గానీ చైనా కాదంటూ విరుచుకుపడ్డారు. తన చర్యలను కప్పిపుచ్చుకుంటూ ఇతరులపై నిందలు మోపేందుకు తెగబడటమే గాక తప్పుడూ సమాచారాన్ని వ్యాప్తి చేస్తోందని విమర్శించారు. ఇలాంటి చర్యలను మానుకోవాలంటూ గట్టి కౌంటరిచ్చారు వాంగ్. ఉక్రెయిన్ యుద్ధం విషయంలో చైనా నిర్మాణాత్మక పాత్రే పోషిస్తోందని, చర్చలతో సామరస్యం పూర్వకంగా పరిష్కిరించుకునే వైపే మొగ్గుచూపిందని వాంగ్ చెప్పుకొచ్చారు. అలాగే రష్యా చైనా సంబంధాల విషయంలో అమెరికా వేలు పెట్టేందుకు యత్నించవద్దని, దీన్ని తాము అంగీకరించమని వార్నింగ్ ఇచ్చారు. ఉక్రెయిన్ సమస్యపై చైనా సదా శాంతినే కోరింది, చర్చలనే ప్రోత్సహించిందని వాంగ్ వెన్బిన్ స్పష్టం చేశారు. (చదవండి: మూలిగే నక్కపై తాటికాయ పడినట్టు.. మరింత దిగజారుతున్న పాక్ పరిస్థితి..) -
కొత్త ఏడాదిలో అటవీ ఆక్రమణలకు చెక్
సాక్షి, హైదరాబాద్: వచ్చేనెల చివర్లోగా పోడుభూములపై క్లెయిమ్స్ పరిష్కరించే ప్రక్రియ పూర్తవుతుందని అటవీశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి తెలిపారు. ఇది ముగిశాక కొత్త ఏడాది నుంచి అక్రమంగా అడవుల్లోకి ప్రవేశించకుండా, ఆక్రమణలు చేయకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపడతామన్నారు. పోడుభూముల సమస్యను శాశ్వతంగా పరిష్కరించే నిమిత్తం అసెంబ్లీలో సీఎం కేసీఆర్ ప్రకటన చేశారని మంత్రి తెలిపారు. ఈ భూములపై అందిన క్లెయిమ్స్‌పై ఈ నెలాఖరులోగా సర్వే పూర్తవుతాయని చెప్పారు. ఆ తర్వాత వివిధ కమిటీల ద్వారా సమావేశాలు నిర్వహించి భూమి అప్పగించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటారని తెలిపారు. ఆ తర్వాత అటవీభూముల జోలికి ఎవరూ వెళ్లకుండా, అక్రమణలు చోటుచేసుకోకుండా ఉక్కుపాదం మోపుతామని హెచ్చరించారు. పోడుభూముల వివాదాల పరిష్కారం, పులుల దాడుల ఘటనలు, టైగర్ రిజర్వ్‌ల పరిధిలోని గ్రామాల తరలింపు తదితర అంశాలపై శుక్రవారం ‘సాక్షి’తో మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి మాట్లాడారు. అటవీ ప్రాంతాల్లో గుంపులుగా శబ్దాలు చేస్తూ... అటవీ ప్రాంతాల్లోని పత్తిచేన్లకు గుంపులుగా వెళ్తూ శబ్దాలు చేయాలని మంత్రి ఇంద్రకరణ్ సూచించారు. పులుల కదలికలున్న చెన్నూరు, ఆసిఫాబాద్, సిర్పూర్ కాగజ్‌నగర్ తదితర ప్రాంతాల్లో ప్రజలను అటవీశాఖ అప్రమత్తం చేసిందని తెలిపారు. ఇటీవల పెద్దపులి దాడిలో ఒక వ్యక్తి మృతి చెందిన నేపథ్యంలో ఇలాంటి ప్రమాదాలపై అప్రమత్తంగా ఉండాలని పీసీసీఎఫ్ ఆర్ఎం డోబ్రియాల్ ఆదేశాలు జారీచేశారని చెప్పారు. అటవీ ప్రాంతాల్లో జనసంచారం లేనిచోట్ల తమకు అనువైన ప్రాంతాల్లో పులులు ఆవాసాలను ఏర్పాటు చేసుకుంటాయని చెప్పారు. ఇటీవల కాలంలో ప్రజలపై పులులు దాడులు చేసిన ఘటనలు తగ్గిపోగా తాజాగా ఈ ఉదంతం చోటుచేసుకుందన్నారు. మహారాష్ట్ర లోని తిప్పేశ్వర్, తడోబాలలో పులుల సంతతి పెరిగిపోవ డంతో రాష్ట్రంలో టైగర్ కారిడార్, కవ్వాల్ టైగర్ రిజర్వ్‌లోకి అడుగు పెడుతున్నాయని పేర్కొన్నారు. రాష్ట్రంలోని కవ్వాల్ టైగర్ రిజర్వ్ పరిధిలోని రాంపూర్, మైసంపేట గ్రామాలను మంచి పునరావాస ప్యాకేజీ అందించి బయటకు తీసుకొచ్చి నట్టు మంత్రి తెలిపారు. ఉమ్మడి ఏపీ, తెలంగాణ చరిత్రలోనే తొలిసారిగా ఇది జరిగిందని చెప్పారు. ఒక్కో కుటుంబానికి రూ.15 లక్షల చొప్పున పరిహారం, ఇళ్లు, ఇతర సౌకర్యాలు కల్పిస్తున్నామని చెప్పారు. టైగర్ రిజర్వ్ కోర్ ఏరియాల్లోనే ఈ గ్రామాలు కొనసాగితే విద్యుత్, మంచినీళ్లు, రోడ్డు వంటివి, స్కూల్, ఆసుపత్రి వంటి సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయన్నారు. వచ్చే జూన్ నెల కల్లా ఈ రిజర్వ్ కోర్ ఏరియాలో ఉండిపోయిన కొన్ని గ్రామాలు పూర్తిగా బయటకు తీసుకువస్తామనే ఆశాభావం వ్యక్తం చేశారు. -
చనిపోయి నాలుగు నెలలు దాటింది.. ఇంకెన్నాళ్లు ఈ కథలు!
ఆస్ట్రేలియా దిగ్గజం.. స్పిన్ మాంత్రికుడు షేన్ వార్న్ మనల్ని భౌతికంగా విడిచివెళ్లి నాలుగు నెలలు దాటిపోయింది. గత మార్చిలో వార్న్ థాయిలాండ్‌లోని తన విల్లాలో గుండెపోటుతో మరణించాడు. అతని మరణం యావత్ క్రీడా ప్రపంచాన్ని శోక సంద్రంలోకి నెట్టింది. బతికినంతకాలం క్రికెట్లో రారాజుగా వెలుగొందినప్పటికి బయటి వివాదాల్లోనూ అంతే పేరు సంపాదించాడు. ఇక వార్న్‌కు ప్లేబాయ్ అనే ముద్ర కూడా ఉంది. ఎంతో మంది అమ్మాయిలతో ఎఫైర్లు నడిపాడన్న వార్తలు వచ్చాయి. వీటిలో నిజమెంత అనేది తెలియకపోయినప్పటికి.. అతను భౌతికంగా దూరమైన తర్వాత కూడా యువతులతో ఎఫైర్ వార్తలు రావడం ఆశ్చర్యం కలిగిస్తోంది. తాజాగా ఆస్ట్రేలియా బ్యూటీ గినా స్టివార్ట్.. వార్న్ చనిపోవడానికి కొద్దిరోజుల ముందు నాతో ఎఫైర్ నడపాడంటూ తెలిపింది. అయితే ఇదంతా బయటి ప్రపంచానికి తెలియని సీక్రెట్ ఎఫైర్ అని పేర్కొంది. ''వార్న్ థాయిలాండ్‌లోని విల్లాలో మరణించడానికి ముందు నాతో రెగ్యులర్ కాంటాక్ట్ ఉండేది. అయితే ఆ ఎఫైర్ స్నేహపూరిత వాతావరణం మాత్రమే. ఒక స్నేహితుడిగా.. గైడ్‌గా నాకు సలహాలిచ్చేవాడు. ఈ క్రమంలోనే మా మధ్య సన్నిహిత్యం పెరిగింది. అలా అతనితో డేటింగ్ చేశాను. ఇక దగ్గరయ్యాడనుకునే లోపే వార్న్ ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్లిపోయాడు. అతని మరణం కొన్ని నెలల పాటు నన్ను మాములు మనిషిని చేయలేకపోయింది.'' అంటూ 51 ఏళ్ల గినా స్టివార్ట్ తెలిపింది. కాగా గినా స్టివార్ట్ ఆస్ట్రేలియాలో ఒక సెలబ్రిటీ. 51 ఏళ్ల వయసులోనూ హాట్ ఫోటోలకు ఫోజిస్తూ కుర్రకారు గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తుంది. ఇటీవలే గివార్ట్ తనను తాను ''వరల్డ్ హాటెస్ట్ గ్రాండ్ మా'' అని బిరుదు ఇచ్చుకోవడం ఆసక్తి కలిగించింది. ఇక 2018లో గోల్డ్‌కోస్ట్ కామన్వెల్త్ గేమ్స్‌లో భాగంగా వార్న్‌ను తొలిసారి కలిసినట్లు గినా పేర్కొంది. ''ఒకరినొకరు పరిచయం పెంచుకోవడంతో పాటు ఆ రాత్రంతా ఎన్నో విషయాలు మాట్లాడుకున్నాం. అలా మా మధ్య స్నేహం చిగురించింది. ఆ తర్వాత ఇద్దరం మరింత దగ్గరయ్యాము. అయితే ఇదంతా బయటి ప్రపంచానికి తెలియకూడదని వార్న్ నా దగ్గర ప్రామిస్ తీసుకున్నాడు. అందుకే అతను మరణించిన తర్వాతే ఈ విషయాలు వెల్లడిస్తున్నా'' అంటూ తెలిపింది. ఇక క్రికెట్లో స్పిన్ మాంత్రికుడిగా పేరు పొందిన షేన్ వార్న్ తన లెగ్‌స్పిన్‌తో ప్రత్యర్థి బ్యాటర్లను ముప్పతిప్పలు పెట్టాడు. ఈ స్పిన్ దిగ్గజం 145 టెస్టుల్లో 708 వికెట్లు.. 193 వన్డేల్లో 293 వికెట్లు తీశాడు. OnlyFans star Gina Stewart has made a startling revelation about the late great Shane Warne, five months after his tragic death > https://t.co/qc6mpq2Wty pic.twitter.com/Wzbg06oiw2 — Herald Sun (@theheraldsun) August 16, 2022 చదవండి: 'జెండా కొనడానికి డబ్బులు లేవా'.. పరువు తీసుకున్న హిట్‌మ్యాన్ Sanju Samson: నేను, నా భార్య ఖాళీగా ఉన్నపుడు చేసే పని అదే! నా ముద్దు పేరు.. -
బీమా పథకాలు: ఏపీ సర్కార్ కీలక నిర్ణయం
సాక్షి, అమరావతి: ఆపదలో విలవిల్లాడే పేద కుటుంబాలకు అండగా ఉంటున్న రాష్ట్ర ప్రభుత్వం బీమా పథకాల క్లెయిమ్‌లకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. 4 రకాల బీమా పథకాల క్లెయిమ్స్‌ను 30 రోజుల్లో పరిష్కరించాలని స్పష్టం చేసింది. దీన్ని అమలుచేసే బాధ్యతను జిల్లా జాయింట్ కలెక్టర్లకు (గ్రామ, వార్డు సచివాలయాలు–అభివృద్ధి) అప్పగిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. వైఎస్సార్ బీమా, రైతులు ఆత్మహత్య చేసుకుంటే పరిహారం చెల్లింపు, వైఎస్సార్ మత్స్యకార భరోసా పరిహారం, వైఎస్సార్ పశునష్ట పరిహారం పథకాల అమలు, వివిధ శాఖల మధ్య సమన్వయం, పర్యవేక్షణ బాధ్యతలను గ్రామ, వార్డు సచివాలయాలకు అప్పగించడమే కాకుండా క్లెయిమ్ సొమ్మును సంబంధిత కుటుంబాలకు వారి ఇంటివద్దే వలంటీర్ల ద్వారా అందించాలని నిర్ణయించింది. బీమా క్లెయిమ్స్ పరిష్కారంలో తీవ్రజాప్యం జరుగుతుండటాన్ని గమనించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వైఎస్సార్ బీమా పథకం అమల్లో సమూల మార్పులు తీసుకొచ్చారు. బీమా పరిహార ఆర్థిక సహాయాన్ని సకాలంలో అందించడం ద్వారా మరణించిన లేదా బాధిత కుటుంబాలకు ఉపశమనం కలిగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. గ్రామ, వార్డు సచివాలయాలతో పరిపాలన వికేంద్రీకరణ ద్వారా ఇప్పటికే అనేక ప్రభుత్వ సేవలను వలంటీర్ల ద్వారా ప్రజల ఇంటి వద్దకే అందిస్తున్న తరహాలోనే ఈ బీమా పథకాల పరిహారం కూడా అందించనుంది. ఈ క్లెయిమ్‌ల పరిష్కారం విషయమై జాయింట్ కలెక్టర్ 15 రోజులకోసారి జిల్లా, మండల, పట్టణ స్థానికసంస్థల అధికారులు, గ్రామ, వార్డు సచివాలయ సిబ్బందితో సమీక్ష నిర్వహించి కలెక్టర్‌కు నివేదికను ఇవ్వాలని, కలెక్టర్ నెలకోసారి సమీక్షించి గ్రామ, వార్డు సచివాలయాలశాఖ డైరెక్టర్‌కు నివేదిక సమర్పించాలని ప్రభుత్వం నిర్దేశించింది. గ్రామ, వార్డు సచివాలయాలశాఖ డైరెక్టర్ నెలవారీ నివేదికలను ప్రభుత్వానికి సమర్పించాలని సూచించింది. బీమా పథకాలు సజావుగా సకాలంలో అమలవుతున్నాయా లేదా అనేదానిపై రాష్ట్ర ప్రభుత్వం 3 నెలలకు ఒకసారి సమీక్షించనుంది. 4 బీమా పథకాలు.. ►పేద కుటుంబాల్లో సంపాదించే వ్యక్తి.. 18 నుంచి 50 ఏళ్ల వయసులోపు సహజంగా మరణిస్తే ఆ కుటుంబానికి లక్ష రూపాయలను పరిహారంగా ప్రభుత్వమే నేరుగా చెల్లిస్తుంది. 18 నుంచి 70 ఏళ్ల వయసులోపు ప్రమాదవశాత్తు మరణించినా లేదా శాశ్వత వైకల్యం పొందినా 5 లక్షల రూపాయలను బీమా ద్వారా పరిహారం చెల్లిస్తుంది. ►వ్యవసాయ కారణాలతో రైతులు, కౌలు రైతులు ఎవరైనా ఆత్మహత్య చేసుకుంటే ఆ బాధిత కుటుంబానికి పునరావాస ప్యాకేజీ కింద రూ.7 లక్షల పరిహారం చెల్లించాలి. ►చేపలవేట సమయంలో 18 నుంచి 60 ఏళ్ల వయసులోపు మత్స్యకారులు ప్రమాదవశాత్తు మరణిస్తే ఆ కుటుంబానికి వైఎస్సార్ మత్స్యకార భరోసా కింద రూ.10 లక్షల పరిహారం చెల్లించాలి. ►వైఎస్సార్ పశునష్ట పరిహార పథకం కింద గేదెలు, ఆవులు, మేకలు, గొర్రెలు మరణిస్తే ప్రభుత్వం నిర్ధారించిన పరిహారాన్ని చెల్లించాలి. -
ఎల్ఐసీ క్లెయిమ్స్ విషయంలో వారికి కాస్త ఊరట...!
ముంబై: కరోనా సెకండ్ వేవ్ విజృంభణ నేపథ్యంలో వినియోగదారుల భద్రతను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వ రంగ దిగ్గజం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్(ఎల్ఐసీ) తాజాగా వినియోగదారుల క్లెయిమ్స్ ప్రక్రియను సులభతరం చేసింది. సెటిల్మెంట్ నిబంధనలను సడలించింది. డెత్క్లెయిమ్స్కి సంబంధించి పాలసీదారు ఆస్పత్రిలో మరణించిన పక్షంలో మున్సిపల్ డెత్ సర్టిఫికెట్ కాకుండా ప్రత్యామ్నాయంగా ఇతరత్రా రుజువులైపా సమర్పించవచ్చని ఎల్ఐసీ తెలిపింది. డెత్ సర్టిఫికెట్, కార్పొరేట్ ఆస్పత్రులు, సాయుధ బలగాలు , ఈఎస్ఐ, ప్రభుత్వం జారీ చేసే డిశ్చార్జ్ సమ్మరీ ఎల్ఐసీ క్లాస్ 1 అధికారులు లేదా 10 ఏళ్ల సర్వీసు పూర్తి చేసిన డెవలప్మెంట్ ఆఫీసర్ల సంతకంతో సమర్పించినా పరిగణనలోకి తీసుకోనున్నట్లు వివరించింది. వీటిపై మరణించిన తేదీ, సమయం స్పష్టంగా ఉండాలి. ఖనన, దహనాలకు సంబంధించిన సర్టిఫికెట్ వీటితో పాటు జతపర్చాలని ఒక ప్రకటనలో ఎల్ఐసీ తెలిపింది. ఇతరత్రా కేసుల విషయంలో యథాప్రకారంగా మున్సిపల్ డెత్ సర్టిఫికెట్టే వర్తిస్తుంది. అంతేకాకుండా ఎల్ఐసి తన వినియోగదారుల కోసం ఆన్లైన్ నెఫ్ట్ ట్రాన్స్ఫర్లను కూడా చేయనుంది. కోవిడ్ నేపథ్యంలో ఆన్లైన్ పోర్టల్ విధానంతో వినియోగదారుల సమస్యలను పరిష్కరించనుంది కాగా మే 10 ఎల్ఐసి కార్యాలయాలు సోమవారం నుంచి శుక్రవారం వరకు ఉదయం 10 నుంచి సాయంత్రం 5:30 గంటల మధ్య పనిచేయనున్నాయి. ప్రతి శనివారం ఎల్ఐసికి ప్రభుత్వ సెలవు దినంగా ప్రకటించాయి చదవండి: వాట్సాప్ ప్రైవసీ పాలసీ ఇప్పుడే కాదు -
కరోనా దెబ్బకు పీఎఫ్ ఉఫ్!
ఓ కార్పొరేట్ కంపెనీలో సీనియర్ ట్రైనర్‌గా పదేళ్ల పాటు పనిచేసిన అమర్నాథ్ రెడ్డి గతేడాది ఆగస్టులో ఉద్యోగం కోల్పోయాడు. కోవిడ్ అనంతర పరిస్థితుల నేపథ్యంలో ఉద్యోగుల సర్దుబాటు క్రమంలో అమర్ పింక్‌స్లిప్ తీసుకోవాల్సి వచ్చింది. ఆర్నెల్లుగా అమర్ ఉద్యోగవేట సాగిస్తూనే ఉన్నాడు. ఉద్యోగం లేకపోవడంతో నెలవారీ ఖర్చుల నిమిత్తం అప్పుల జోలికి పోకుండా తన భవిష్యనిధి ఖాతాలో డబ్బును కోవిడ్–19 పరిస్థితి కింద గతేడాది సెప్టెంబర్ నెలాఖరులో రూ.30 వేలు విత్‌డ్రా చేశాడు. అనంతరం ఉద్యోగం దొరక్కపోవడంతో ఆర్థిక ఇబ్బందులను అధిగమించేందుకు డిసెంబర్లో మరో రూ. 30 వేలు ఉపసంహరించుకున్నాడు. భవిష్యత్తు అవసరాల కోసం పదేళ్లుగా కూడబెట్టుకున్న నిధిలో 35 శాతం నగదు ఆర్నెల్లలోనే కుటుంబ పోషణకు ఖర్చయింది. సాక్షి, హైదరాబాద్: పైసాపైసా కూడబెట్టి భావి అవసరాలకు ఉపయోగించాలనుకునే ‘భవిష్యనిధి’కరిగిపోతోంది. ఉద్యోగి తన జీవితంలో కన్న కలలను సాకారం చేసుకునేందుకు ధీమా ఇచ్చే భవిష్యనిధిని నెలవారీ ఖర్చులకు వాడాల్సిన పరిస్థితి వస్తోంది. కోవిడ్–19 మహమ్మారి సృష్టించిన విలయంతో సగటు ఉద్యోగి విలవిలలాడుతున్నాడు. కరోనా వైరస్ కారణంగా నెలకొన్న ఆర్థిక సంక్షోభంతో దిద్దుబాటు చర్యలు చేపట్టిన వాణిజ్య, వ్యాపార సంస్థలు ఉద్యోగుల వేతనంలో కోతలు, కొన్నిచోట్ల తొలగింపు కార్యక్రమాన్ని చేపట్టాయి. దీంతో వేలాది మంది ఉపాధి కోల్పోతుండగా.. కొత్త కొలువుల సంగతి ప్రశ్నార్థకమవుతోంది. ఈ సమయంలో ఆర్థిక ఇబ్బందులను తట్టుకునేందుకు పీఎఫ్ ఉపసంహరణ వైపు మళ్లాల్సిన పరిస్థితి వస్తోంది. అత్యవసర పరిస్థితిలో ఈ నిధిని వినియోగించుకునే వెసులుబాటు ఉండగా... కోవిడ్–19తో ఏర్పడిన ఎమర్జెన్సీ ధాటికి భవిష్య‘నిధి’లో ఉపసంహరణల పర్వం కొనసాగుతోంది. ప్రతి ఇద్దరిలో ఒకరు... ఉద్యోగి భవిష్యనిధి నుంచి ఉపసంహరణ చేస్తున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు పరిస్థితిని పరిశీలిస్తే దాదాపు ప్రతి ఇద్దరిలో ఒకరు పీఎఫ్ విత్‌డ్రా కోసం దరఖాస్తు సమర్పిస్తున్నారు. దేశంలో గతేడాది మార్చిలో మొదలైన లాక్‌డౌన్‌తో వాణిజ్య, వ్యాపార సంస్థలు, పరిశ్రమల ఆర్థిక స్థితి కుప్పకూలింది. ఈ ప్రభావం వాటిల్లో పనిచేస్తున్న ఉద్యోగులపై పడింది. కొన్ని కంపెనీలు నెలల తరబడి ఉద్యోగులకు వేతనాలు ఇవ్వలేదు. ఇంకొన్ని ఉద్యోగులను పనిలో నుంచి తొలగించాయి. ఫలితంగా ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వీరికి తక్షణ సాయం కోసం కేంద్ర ప్రభుత్వం కోవిడ్–19 నేపథ్యంలో పీఎఫ్ ఉపసంహరణకు అవకాశం కల్పించింది. ఉద్యోగి భవిష్య నిధి నుంచి గరిష్టంగా మూడు నెలల వేతనం మేర విత్‌డ్రా చేసుకోవచ్చని సూచిస్తూ... దరఖాస్తు చేసుకున్న మూడు రోజుల్లో పరిష్కరించాలని ఆదేశించింది. ఈ క్రమంలో కొందరు కోవిడ్–19 కారణంతో, మరికొందరు అత్యవసర స్థితిని, ఇంకొందరు ఇతరత్రా అవసరాలను చూపి విత్‌డ్రాలకు దిగారు. దేశంలో మొత్తంగా 6.44 కోట్ల ఈపీఎఫ్ ఖాతాలు యాక్టివ్‌గా ఉండగా... ఇందులో 2020–21 సంవత్సరంలో ఇప్పటివరకు 2.85 కోట్ల మంది క్లెయిమ్స్ సమర్పించారు. మొత్తం ఖాతాదారుల్లో 44.35 శాతం మంది విత్‌డ్రాలకు మొగ్గు చూపారు. కోవిడ్ కేటగిరీలో 15 వేల కోట్లు గత నెల 30వ తేదీ నాటి గణాంకాల ప్రకారం... దేశంలోని ఈపీఎఫ్ ఖాతా దారుల్లో 60.88 లక్షల మంది కోవిడ్–19 కారణంతో నగదు ఉపసంహరణ దరఖాస్తులు సమర్పించారు. గతేడాది ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి ఈ ఏడాది జనవరి 30వ తేదీ నాటికి కోవిడ్–19 కేటగిరీలోనే ఏకంగా రూ.15,256.05 కోట్లు ఖాతాదారులు ఉపసంహరించుకున్నట్లు అధికారవర్గాలు చెబుతున్నాయి. ఈ లెక్కన దరఖాస్తుదారుల్లో సగటున ఒక్కో చందాదారుడు రూ.25 వేల చొప్పున ఉపసంహరించుకున్నట్లే. 2020–21 ఆర్థిక సంవత్సరంలో జనవరి ఆఖరుకు వచ్చిన 2.85 కోట్ల క్లెయిమ్స్‌కు సంబంధించి దాదాపు రూ.70 వేల కోట్లకు పైగా విత్‌డ్రా చేసుకున్నట్లు అంచనా. కోవిడ్–19 కేటగిరీలో సగటున రూ.25 వేల చొప్పున ఉపసంహరించుకోగా.. ఇతర కేటగిరీల్లో 3 నెలల వేతన సీలింగ్ నిబంధన ఉండదు. పర్సనల్ లోన్‌కు బదులుగా గతేడాది నవంబర్‌లో మా కంపెనీలో చాలామంది ఉద్యోగులు జాబ్ కోల్పోయారు. అందులో నేను ఒకదాన్ని. లాక్డౌన్ మొదలైనప్పటి నుంచి నాకు నెలకు సగం వేతనం మాత్రమే వస్తుండడంతో ఇంటి అద్దె, ఇతర ఖర్చులకు అప్పు చేయాల్సి వచ్చింది. పీఎఫ్ ఖాతాలో 1.2 లక్షలు ఉండటంతో పర్సనల్ లోన్‌కు బదులుగా ఈ నిధిని విత్‌డ్రా చేసుకున్నా. నెలనెలా తిరిగి చెల్లించడం, వడ్డీభారం ఉండదనే ఉద్దేశంతో పీఎఫ్ నిధిని వాడుకోవడం మేలని నిర్ణయించుకున్నా. భవిష్యత్ అవసరాల సంగతి అటుంచితే.. ఇప్పుడున్న ఇబ్బందుల అధిగమించడానికి ప్రాధాన్యమిచ్చా. – వి.వైదేహి, ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో హెచ్ఆర్ విభాగం ఉద్యోగి నాన్న కరోనా చికిత్సకు రూ. 1.8 లక్షలు ఖర్చయింది కరోనా వైరస్ మా కుటుంబంపై తీవ్ర ప్రభావాన్ని చూపింది. గతేడాది జూన్‌లో నాకు కరోనా సోకింది. వారంలో కోలుకున్నాను. కానీ అంతలోనే నాన్నకు వైరస్ సోకడం, ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ రావడంతో పరిస్థితి చేయిదాటింది. ఆసుపత్రిలో చేర్పిస్తే రూ. 1.8 లక్షలు ఖర్చయింది. కానీ నాన్న చనిపోయారు. ఆసుపత్రి బిల్లు కోసం స్నేహితుడి వద్ద అప్పు చేసి చెల్లించాను. పద్నాలుగు సంవత్సరాలుగా పీఎఫ్ నిధిలో పోగుచేసిన రూ.1.6 లక్షలు విత్‌డ్రా చేసి స్నేహితుడి అప్పు చెల్లించాను. – నదీమ్, అటోమొబైల్ కంపెనీలో ఎగ్జిక్యూటివ్ -
'వైఎస్సార్ బీమా క్లెయిమ్స్‌ను చెల్లించనున్నాం'
సాక్షి, విజయవాడ : కరోనా కష్టకాలంలో పేదల కోసం ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. పెండింగ్ లో ఉన్న వైఎస్సార్ బీమా కింద ఉన్న క్లెయిమ్‌లను చెల్లించి చెల్లింపులు కార్మికులను ఆదుకోవాలని సీఎం జగన్ ఆదేశించారని కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాములు పేర్కొన్నారు. ఆయన మాట్లాడుతూ.. తక్షణమే వైఎస్సార్ బీమా క్లెయిమ్‌లను చెల్లించనున్నట్లు తెలిపారు. ఈ మేరకు రూ. 348కోట్లతో వైఎస్సార్ బీమా చెల్లింపులకు విడుదల చేశామన్నారు. మార్చి 31 వరకు పెండింగ్ లో ఉన్నవన్నీ చెల్లిస్తామని పేర్కొన్నారు. ఈ మొత్తాన్ని సెర్ప్ ద్వారా 7726 క్లెయిమ్ లబ్ధిదారులకు అందజేస్తామని తెలిపారు. -
అనుమానాస్పద క్లెయిమ్స్‌పై ఐటీ కన్ను
న్యూఢిల్లీ: గడిచిన మూడేళ్లలో అనుమానాస్పద ఆదాయ పన్ను రీఫండ్ క్లెయిమ్స్ సంఖ్య గణనీయంగా పెరిగిందని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి శివ్ ప్రతాప్ శుక్లా రాజ్యసభకు తెలిపారు. 2016–17లో 9,856గా ఉన్న ఈ సంఖ్య 2018–19 నాటికి 20,874కి చేరిందన్నారు. ఆదాయం, పెట్టుబడులకు పొంతన లేకుండా భారీ రీఫండ్స్ కోసం క్లెయిమ్ చేస్తున్న పన్ను చెల్లింపుదారుల రిటరŠన్స్‌పై ఆదాయ పన్ను శాఖ స్క్రూటినీ జరుపుతోందని మంత్రి వివరించారు. స్క్రూటినీ అనంతరం క్లెయిమ్ తప్పని తేలిన పక్షంలో కేసును బట్టి రీఫండ్‌ను నిరాకరించడంతో పాటు జరిమానా, ప్రాసిక్యూషన్ చర్యలు కూడా తీసుకోవడం జరుగుతోందని తెలిపారు. 2015–16లో రూ. 1.22 లక్షల కోట్లుగా ఉన్న ఐటీ రీఫండ్స్ 2018–19 నాటికి రూ. 1.43 లక్షల కోట్లకు పెరిగాయని ఆయన వివరించారు. అనుమానాస్పద క్లెయిమ్స్‌కు ఆటోమేటిక్‌గా చెల్లింపులు జరగకుండా పక్కకు తీసి పెట్టేలా ఐటీ శాఖ ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటోందన్నారు. మరోవైపు, 2017–18లో 4.63 కోట్ల ఐటీ రిటర్న్‌లు దాఖలు కాగా 2018–19 జనవరి నాటికి ఇది 37% పెరిగి 6.36 కోట్లకు చేరిందని చెప్పారు. 2018–19లో ఐటీఆర్‌లు గడువులోగా ఫైల్ చేయాలంటూ పన్ను చెల్లింపుదారులకు 25 కోట్ల పైచిలుకు ఎస్ఎంఎస్లు, ఈమెయిల్స్ పంపినట్లు శుక్లా తెలిపారు. -
ఆ మూడింటికే ఎక్కువ క్లెయిమ్‌లు
న్యూఢిల్లీ: ‘ఆయుష్మాన్ భారత్– ప్రధాన్‌మంత్రి జన్ ఆరోగ్య యోజన (ఏబీ–పీఎంజేఏవై) కింద కేన్సర్, కీళ్లు, గుండె సంబంధ వ్యాధులకే ఎక్కువ క్లెయిమ్‌లు అందినట్లు జాతీయ ఆరోగ్య సంస్థ(ఎన్హెచ్ఏ) తెలిపింది. గుండె వ్యాధుల ప్యాకేజీలో ఉన్న యాంజియో ప్లాస్టీ, స్టెంట్ల అమరిక వంటి ఖరీదైన వైద్య సౌకర్యాన్ని అత్యధికులు వినియోగించుకున్నారని వివరించింది. గత ఏడాది సెప్టెంబర్‌లో కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ పథకంతో ఇప్పటి వరకు 10.8 లక్షల మంది లబ్ధి పొందారని పేర్కొంది. ఈ పథకం కింద గుర్తించిన 14,756 ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రుల్లో రూ.1,041 కోట్ల విలువైన 8 లక్షల క్లెయిమ్‌లు అందగా రూ.808 కోట్ల విలువైన ఆరు లక్షల క్లెయిమ్‌లకు ఆమోదం తెలిపినట్లు ఎన్హెచ్ఏ వివరించింది. లబ్ధిదారులకు ఉండాల్సిన అర్హతలు, దగ్గర్లోని ఆస్పత్రుల వివరాలు, సహాయం పొందే విధానం వంటి వివరాలతో రూపొందించిన యాప్‌ను ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నద్దా మంగళవారం ప్రారంభించారు. ఇప్పటికే ఈ యాప్‌ను 10,460 మంది డౌన్లోడ్ చేసుకున్నారని ఎన్హెచ్ఏ తెలిపింది. -
ఎల్ఐసీ సెటిల్డ్ క్లయిమ్స్ ఎంతంటే...
న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ జీవితబీమా సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్ఐసీ) భారీ మొత్తంలో పాలసీ వినియోగదారులకు చెల్లించింది. 2016-17 ఆర్థిక సంవత్సరానికిగాను మొత్తం పదికోట్ల రూపాయలకుపైగా నగదును తమ పాలసీ దారులకు చెల్లించినట్టు కంపెనీ ప్రకటించింది. 2016-17 ఆర్థిక సంవత్సరానికి రూ. 1,12,700.41 కోట్ల మేర 215.58 లక్షల క్లెయిములను పరిష్కరించినట్టు సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. సంస్థ 61 వార్షికోత్సవం సందర్భంగా శుక్రవారం ఈ వివరాలను వెల్లడించింది. 98.34 శాతం పాలసీ మెచ్యూరిటీ క్లయిములను, 99.63 శాతం డెత్ క్లయిములను పరిష్కరించినట్టు తెలిపింది. సంవత్సరం ప్రాతిపదికన 27,2 శాతం వృద్ధిని నమోదు చేసింది. ఎల్ఐసికి రూ. 23,23,802. 59 కోట్ల లైఫ్ ఫండ్‌తో పాటు 25 ట్రిలియన్ డాలర్ల ఆస్తులున్నాయి. ఎల్ఐసీ మార్కెట్ వాటా 76.09 శాతంగా ఉంది. మార్చి చివరి నాటికి 20 మిలియన్ల కొత్త పాలసీలను సాధించింది. 2017 చివరి నాటికి, ఎల్ఐసికి వ్యక్తిగత వ్యాపారంలో 23 పధకాలు ఉన్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో, ఆధార్ స్తంభ్, ఆధర్ షీలా, జీవన్ ఉమంగ్ , ప్రధాన్ మంత్రి వాయ వందన యోజన లాంటి నాలుగు కొత్త ప్లాన్లను చేర్చినట్టు చెప్పింది. చేర్చబడ్డాయి. మార్చి చివరి నాటికి మొత్తం పెట్టుబడులు రూ. 24,72,389 కోట్లు. 14 దేశాలలో సేవలను అందిస్తున్న ఎల్ఐసీ సంస్థ పూర్తిగా సొంతమైన, అనుబంధ మరియు జాయింట్ వెంచర్ కంపెనీల ద్వారా కార్యకలాపాలు నిర్వహస్తోంది. కార్పొరేషన్ ప్రస్తుతం 1.15 లక్షల ఉద్యోగులు ఉన్నారు. 11.31 లక్షల మంది ఏజెంట్లు, 29 కోట్ల ప్లస్ పాలసీలు అమల్లో ఉన్నాయి. -
చైనా ఉత్పత్తులకు సోషల్ మీడియా దెబ్బ
న్యూఢిల్లీ: చైనా ఉత్పత్తులను దేశంలో నిషేధించాలన్న ప్రచారం భారీగానే ప్రభావాన్ని చూపిస్తోందట. చైనీస్ వస్తువుల బహిష్కరించాలన్న సామాజిక మీడియా ప్రచారం రిటైల్ వ్యాపారులు సెంటిమెంట్ ను దెబ్బతీసిందని ట్రేడర్స్ బాడీ ఆరోపిస్తోంది. ముఖ్యంగా సోషల్ మీడియాలో జరుగుతున్న వాడి వేడి చర్చల కారణంగా తమ లైటింగ్ అండ్ డెకొరేటివ్ ఉత్పత్తుల అమ్మకాలపై భారీగా పడిందని కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ (సీఏఐటి) వెల్లడించింది. ముఖ్యంగా దీపావళిసందర్భంగా గృహాలను అలంకరించుకునే తమ ప్రొడక్ట్స్ అమ్మకాలు దాదాపు 20 శాతం తగ్గిపోయాయని ఈ సంస్థ సెక్రటరీ జనరల్ ప్రవీణ్ ఖండేల్వాల్ చెప్పారు. చైనీస్ లైటింగ్, దీపావళి అలంకరణ, ఇతర సామగ్రి పండుగ సీజన్ మూడు నెలల ముందే భారత మార్కెట్లో వెల్లువెత్తుతుందని ప్రవీణ్ చెప్పారు. కానీ చైనా వస్తువుల నిషేధంపై సామాజిక మీడియా లో తీవ్రస్థాయిలో నడుస్తున్న చర్చ తమ ఉత్పత్తులపై పడిందని తెలిపారు. రానున్న దీపావళి పండుగ సందర్భంగా ఇప్పటికే భారీ సంఖ్యలో తో రిటైల్ వ్యాపారులు వద్దకు చేరిన ఈ ఉత్పత్తుల విక్రయాలకు డిమాండ్ 20 శాతం క్షీణించడంతో ఇబ్బందుల్లో పడ్డారని చెప్పారు. దీంతోపాటు అసలు అమ్ముడు పోతాయా? లేదా? అనే భయాందోళనలు వారిలో నెలకొన్నాయని పేర్కొన్నారు. ఇప్పటికే టోకు వ్యాపారుల నిల్వ చేసి వున్న ఈ వస్తువులు కాలక్రమంలో అమ్ముడు పోవాలని ఆశిస్తున్నామని....లేదంటే వ్యాపారులకు తీవ్ర నష్టాలు తప్పవనే ఆందోళనను ఆయన వ్యక్తంచేశారు. కాగా న్యూక్లియర్ సప్లయర్స్ గ్రూప్ (ఎన్ఎస్జీ) లోదేశం యొక్క సభ్యత్వాన్ని చైనా అడ్డుకోవడం, జెమ్ చీఫ్ మసూద్ అజహర్ పై అమెరికాలోనిషేధం నేపథ్యంలో భారతదేశం లో చైనీస్ వస్తువుల బహిష్కరించాలని సోషల్ మీడియా దుమారం రేగుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం దీపావళి అలంకరణ విక్రయాలపైనే వ్యాపారులు బావురుమంటోంటే.. మరి చైనా దీపావళి టపాసులు, ఇతర బాణాసంచా విక్రయాలపై ఇంకెంత భారం పడనుందో .... -
ట్రంప్‌పై బ్రాడ్ పిట్‌కు చిర్రెత్తుకొచ్చింది..
లాస్ ఏంజిల్స్: హాలీవుడ్ హీరో బ్రాడ్ పిట్‌కు అమెరికా అధ్యక్ష రేసులో ఉన్న డొనాల్డ్ ట్రంప్‌పై చిర్రెత్తుకొచ్చింది. ముఖ్యంగా ట్రంప్ వేర్పాటువాద ఆలోచనలపై ఈ ఆస్కార్ విన్నింగ్ యాక్టర్ మండిపడ్డారు. ఓ మీడియా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. 'అసలు ట్రంప్ ఏమనుకుంటున్నారు. మన దేశాన్ని వెనక్కి తీసుకెళ్లాలనుకుంటున్నారా? ఇది ఎక్కడికి వెళుతోంది? అంటూ ట్రంప్ వేర్పాటువాద ప్రకటనలపై బ్రాడ్ పిట్ ఒకింత అసహనం వ్యక్తం చేశారు. ఇప్పుడు ప్రపంచమంతా ఇరుగుపొరుగుగా మారిపోయిందని, ఈ సమయంలో ఒకరినొకరు బాగా అర్థం చేసుకోవాలన్నారు. ట్రంప్ విధానాలు ఒంటరి, వేర్పాటువాద ఆలోచనల వైపు ఉన్నాయన్నారు. ట్రంప్ మద్దతుదారులు అన్నింటికీ వ్యతిరేకంగా పోరాడుతున్నారని బ్రాడ్ పిట్ విమర్శించారు. యూరప్ నుంచి బ్రిటన్ విడిపోతుందని(బ్రెగ్జిట్) తాను అనుకోలేదని బ్రాడ్ పిట్ తెలిపారు. అందరినీ కలిపేది మంచిదని.. విడగొట్టేది చెడ్డదని ఆయన అభిప్రాయపడ్డారు. ట్రంప్ అమెరికా అధ్యక్షుడు అవుతాడని తాను భావించడం లేదన్నారు. ట్రంప్ తన ఎన్నికల ప్రచారంలో మెక్సికో సరిహద్దులో గోడ కడతానని, వలసదారులను వెనక్కి పంపుతానని, ముస్లింలను అమెరికాలోకి రానివ్వొద్దంటూ పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. -
కాబూల్‌లో ట్రక్కు బాంబు పేలుడు
-
కాబూల్‌లో ట్రక్కు బాంబు పేలుడు
కాబూల్: ఆప్ఘనిస్తాన్ రాజధాని కాబూల్‌లో భారీ ట్రక్కు బాంబు పేలుడు కలకలం సృష్టించింది. విదేశీయులను లక్ష్యంగా చేసుకొని పూల్-ఏ-చర్కి ప్రాంతంలోని హోటల్ వద్ద ఈ పేలుడు జరిగింది. ఆదివారం అర్థరాత్రి తరువాత జరిగిన ఈ శక్తివంతమైన బాంబు పేలుడు.. కాబూల్ మొత్తం వినిపించిందని స్థానికులు మీడియాతో వెల్లడించారు. ఈ దాడికి పాల్పడింది తామే నంటూ తాలిబాన్ ఉగ్రవాద సంస్థ ప్రకటించింది. పేలుడు పదార్ధాలతో నిండిన ట్రక్కును పేల్చేసిన అనంతరం ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. దాడిలో పాల్గొన్న ముగ్గురు ఉగ్రవాదులను భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. ఈ ఆపరేషన్ లో ఓ పోలీసు సైతం మృతి చెందాడు. కాబూల్‌లో గత వారం ఇద్దరు ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు జరిపిన ఆత్మాహుతి దాడుల్లో 80 మంది మృతి చెందగా.. 230 మంది గాయపడిన విషయం తెలిసిందే. -
డ్యూటీ డ్రాబ్యాక్ అవకతవకలపై కొరడా!
కంపెనీలపై చర్యలకు ఈడీ, డీఆర్ఐలకు సిట్ ఆదేశం న్యూఢిల్లీ: ఎగుమతులు జరపకుండా డ్యూటీ డ్రాబ్యాక్ (చెల్లించిన సుంకాలు తిరిగి పొందడం) క్లెయిమ్స్‌కు పాల్పడిన కంపెనీలపై చర్యలకు రంగం సిద్ధమైంది. ఆయా కంపెనీలపై చర్యలు తీసుకోవాలని ఎన్ఫోర్స్మెంట్ డెరైక్టరేట్, డెరైక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటిలిజెన్స్‌లను స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (సిట్) ఆదేశించింది. 2016 మార్చి 1వ తేదీకి ముందు ఈ తరహా అవకతవకలకు పాల్పడిన 216 కంపెనీలు, అలాగే అటు తర్వాత ఇందుకు సంబంధించి 572 కంపెనీలపై ఫారిన్ ఎక్స్ఛేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్ (ఫెమా) నిబంధనల కింద చర్యలు తీసుకోవాలని ఈడీని సిట్ ఆదేశించింది. దాదాపు రూ.100 కోట్ల మేర సరకు ఎగుమతి జరక్కుండానే డ్యూటీ డ్రాబ్యాక్ క్లెయిమ్ చేసినట్లు ఆరోపణలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. బ్లాక్ మనీ సవాళ్ల పరిష్కారానికి ప్రభుత్వం సిట్‌ను ఏర్పాటు చేసింది. ఆర్బీఐకి సూచనలు...: ఇలాంటి అవకతవకలకు చోటు లేకుండా తగిన వ్యవస్థాగత యంత్రాంగాన్ని, ఐటీ వ్యవస్థను తక్షణం ఏర్పాటు చేయాలని ఆర్బీఐకి సిట్ సూచించింది. ఎగుమతుల డేటాను నెలవారీగా ఈడీ, డీఆర్ఐలతో పంచుకునే వ్యవస్థను ఏర్పాటు చేయాలని కూడా ఆదేశించింది. నిబంధనల ప్రకారం ఎగుమతి తేదీ నుంచి ఏడాదిలోపు తమ ఎగుమతుల ద్వారా లభించిన విదేశీ మారకద్రవ్యం మొత్తాన్ని దేశానికి తీసుకురావాల్సి ఉంటుంది. ఆ తర్వాతే సంబంధిత ఎగుమతిదారుకు డ్యూటీ డ్రాబ్యాక్ వర్తిస్తుంది. ఈ ప్రక్రియ జరక్కుండానే డ్యూటీ డ్రాబ్యాక్ క్లెయిమ్ చేసినట్లు ఆరోపణలొచ్చాయి. -
చిక్కుల్లో ఆపిల్
ఫ్లోరిడా: అసలే అమ్మకాలు పడిపోయి.. కోల్పోయిన వైభవాన్ని తిరిగి తెచ్చుకునేందుకు తంటాలు పడుతున్న ఆపిల్ సంస్థను వరుస కష్టాలు వెంటాడుతున్నాయి. తాజాగా తన కాపీరేట్ ను ఉల్లంఘించారని ఆరోపిస్తూ అమెరికాకు చెందిన ఓ వ్యక్తి వేల కోట్ల దా వావేశాడు. ఐఫోన్ ఆలోచన తనదేనని.. టెక్నాలజీ దిగ్గజం ఆపిల్ తన ఐడియాను కొట్టేసిందని పోరాటానికి దిగాడు. ఫ్లోరిడాకు చెందిన థామస్ రాస్ ఫ్లోరిడా ఫెడరల్ కోర్టులో ఈ వారం వ్యాజ్యం దాఖలు చేశాడు. ఆపిల్ సంస్థ తన ఐడియాను హైజాగ్ చేసిందని తద్వారా వేల కోట్లు ఆర్జిస్తోందని ఆరోపించాడు. ఇందుకు గాను తనకు సుమారు రూ. 74,177 కోట్లు (11బిలియన్ డాలర్లు) నష్టపరిహారం చెల్లించాలని కోరుతూ కోర్టు కెక్కాడు. అలాగే ఆపిల్ ప్రపంచ వ్యాప్త అమ్మకాల్లో కనీసం 1.5 శాతం ఒక సహేతుకమైన రాయల్టీ గా చెల్లించాలని కోరుతున్నాడు. 1992 లోనే ఐ ఫోన్ డిజైన్ ను రూపొందించానని వాదించాడు. అమెరికా పేటెంట్ అండ్ ట్రేడ్ ఆఫీసు అవసరం ఫీజు చెల్లించడంలో విఫలమైన కారణంగా 1995 లో ఈ పేటెంట్ అప్లికేషన్ రద్దయిందని పేర్కొన్నాడు. ఈ డిజైన్ నమూనా కాపీని కూడా జత చేశాడు. గత ఏడాది తన డిజైన్ ను కాపీ రైట్ చేయించానని లా సూట్ లో పేర్కొన్నాడు. తన మేధో సంపత్తిని చట్ట విరుద్ధంగా యాపిల్ ఉత్పత్తుల్లో, ప్యాకేజింగ్ లో వాడుకుంటోందని ఆరోపించాడు. తన సొంత ఆవిష్కరణలు కాకుండా డంప్ స్టర్ డైవింగ్ (ఒక కంప్యూటర్ నెట్ వర్క పై దాడి చేసేందుకు వాడబడే సమాచారాన్ని పొందడానికి ఉపయోగించే ఒక టెక్నిక్) కు పాల్పడుతోందన్నాడు. తనకు యాపిల్ నుంచి ఎలాంటి వివరణ కానీ, ఖండనగానీ రాలేదని తెలిపాడు. కాగా 2001 ఎంపీ3 మ్యూజిక్ ప్లేయర్ తో ఐపాడ్ లాంచయింది. అనంతరం ఆరేళ్ల తరువాత 2007 లో ఐ ఫోన్ ను ప్రవేశపెట్టారు. అయితే రాస్ పిటిషన్ పై దీనిపై స్పందించేందుకు ఆపిల్ నిరాకరించింది. -
"నేను శివుడికి జన్మనిచ్చా.."
తన అందచందాలు గ్లామర్ తో యువతను వెర్రెత్తించిన మోడల్ సోఫియా హయత్ నటిగా కూడ ఎంతో పేరు సంపాదించుకుంది.. అంతేకాదు ఆమె.. తన మార్గాన్ని ఆథ్యాత్మికత వైపు మళ్ళించుకున్నట్లు, ఓ నన్ గా మారుతున్నట్లు ఇటీవల ఏకంగా ఓ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి మరీ వెల్లడించింది. అయితే అక్కడితో ఆగని ఆమె.. ఇప్పుడు ఏకంగా శివుడికే జన్మనిచ్చానంటోంది. బిగ్ బాస్ రియాలిటీ షోలో పాల్గొని అభిమానులను తనవైపు తిప్పుకున్న నటి, మోడల్ సోఫియా హయత్... నన్ మారి, అందరికీ ఝలక్ ఇచ్చిన విషయం మరచిపోక ముందే.. మరో సంచలనం రేపింది. తాజాగా తన కెరీర్ కు గుడ్ బై చెప్పి, క్రిస్టియన్ నన్ గా అవతారమెత్తిన విషయం ఇటీవల సంచలనం రేపింది. ఈ నెల మొదట్లో ఓ మీడియా సమావేశం పెట్టిమరీ ఆ విషయాన్ని ఆవిడగారు అందరి ముందుకూ తెచ్చింది. ఇకపై తాను సన్యాసినిగా జీవించనున్నట్లు తెలిపిన ఆమె... తన జీవితాన్ని దేవుడి దగ్గరే ఎక్కువగా గడిపే ప్రయత్నం చేస్తానని, సమాజ సేవాకార్యక్రమాల్లోనూ పాల్గొంటానని చెప్పింది. ఇదంతా బాగానే ఉంది.. అక్కడే మరో ట్విస్ట్ ఇస్తూ ఇకపై తనను గయా మదర్ సోఫియా గా పిలవాలని విన్నవించింది. దీనికి తోడు జనానికి షాక్ ఇచ్చేలాంటి మరోవార్త వారి చెవిన పడేసింది. తాను ఇప్పటిదాకా అందంగా ఉండటంకోసం వక్షోజాలకు సిలికాన్ ఇంప్లాంట్ప్ పెట్టుకున్నాని, ఇప్పుడు సన్యాసినిగా మారుతుండటంతో వాటిని తీసివేస్తున్నానంటూ అందరికీ ప్రదర్శనకూడ ఇచ్చింది. అయితే ఇప్పటిదాకా చెప్పినదంతా సోఫియా హయత్ గతం... హాట్ మోడల్ నుంచి నన్ అవతారం నుంచి ఇప్పుడు ఏకంగా హిందూమతానికి చెందిన ఓ దేవుడికే జన్మనిచ్చానని చెప్తోంది. నన్ అవతారంలో కొన్నాళ్ళు కనిపించిన హయత్.. ఇటీవల కైలాష్ యాత్రకు వెళ్ళింది. యాత్రలో భాగంగా ఎల్లోరా, ఔరంగాబాద్ లలో తాను శివలింగంతో కలసి తీయించుకున్న ఫోటోలను ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసి, మరో సంచలనానికి తెర తీసింది. శివలింగంనుంచీ ఓ భారీ అయస్కాంత శక్తి వచ్చి తనలో ప్రవేశించిందని, అప్పుడు కనీసం తల పైకెత్తలేకపోయానని, ఇప్పుడు ఆ శక్తి ఏమిటో తనకు అర్థమైందని చెప్పిన ఆమె... చివరిగా తాను శివుడికి జన్మనిచ్చానంటోంది. -
ఈపీఎఫ్‌వోలో వేగవంతమైన సేవలు
హైదరాబాద్: గత రెండేళ్లలో అత్యున్నత సాంకేతికతను వినియోగించుకుని తమ సేవలను మరింత మెరుగుపర్చామని, వేగవంతం చేశామని ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్‌వో) ఓ ప్రకటనలో వెల్లడించింది. ఉద్యోగుల క్లెయిముల సెటిల్మెంట్ సమయాన్ని 30 నుంచి 20 రోజులకు తగ్గించామని, చందాదారులకు నెఫ్ట్ విధానంలో వెంటనే క్లెయిమ్ మొత్తాన్ని అందిస్తున్నామని తెలిపింది. కోడ్ నంబర్ల కేటాయింపు, కొత్త సంస్థలు, ఉద్యోగుల ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేపట్టామని పేర్కొంది. పెన్షనర్లు తమ ‘జీవన్ ప్రమాణ పత్రా’లను ఆన్లైన్లోనే నమోదు చేసే అవకాశాన్ని కల్పించామని తెలిపింది. ఈపీఎఫ్‌వో సేవలు పొందేందుకు మొబైల్ అప్లికేషన్‌ను అందుబాటులోకి తెచ్చామని, ఫేస్బుక్, ట్వీటర్ ద్వారా చేరువయ్యామని పేర్కొంది. -
వాళ్లు దేవుణ్ణి నమ్మడం లేదు..!
విత్తు ముందా? చెట్టు ముందా అన్నట్లుగానే ఆస్తిక వాదం, నాస్తిక వాదం మధ్య శతాబ్దాల తర్కం నడుస్తూనే ఉంది. విశ్వం పుట్టుకకు దేవుడు కారణమా? బిగ్ బ్యాంగ్ థియరీ నిజమా? అన్నదానిపై ఎవరికి తోచిన వివరణ వారిస్తూనే ఉన్నారు. అయితే ఇదే విషయంపై యూరప్ ఐస్లాండ్ లో తాజాగా ఓ పోల్ నిర్వహించారు. నిజంగా ప్రపంచం పుట్టుక ఎలా జరిగిందో తెలుసుకునే ప్రయత్నం మరోసారి చేశారు. ఐస్లాండ్ లోని ఎథికల్ హ్యూమనిస్ట్ అసోసియేషన్ విశ్వం పుట్టుకపై సర్వే నిర్వహించింది. ప్రపంచం ఎక్కడ ప్రారంభమైందో, ఎలా ప్రారంభమైందో తెలుసుకునేందుకు ప్రశ్నల ద్వారా పలువురి అభిప్రాయాలను సేకరించింది. ఇందులో 25 సంవత్సరాల వయసులోపు 93.9 శాతం మంది విశ్వం పుట్టుకకు బిగ్ బ్యాంగే కారణమని చెప్పగా... మిగిలిన ఆరు శాతం మంది తమకు తెలియదన్నారు. కాగా విశ్వం దేవుడి వల్లే పుట్టిందని మాత్రం ఏ ఒక్కరూ చెప్పలేదు. దీని ఆధారంగా స్థానిక రెక్జావిక్ వాసులు, యువత ఏ మతాన్నీ, దేవుణ్ణీ నమ్మడం లేదని తెలుస్తోందని ఐస్లాండ్ పత్రిక నివేదికలు చెప్తున్నాయి. ఇక్కడి వారిలో 80.6 శాతం మందిలో అదీ 55 ఏళ్ళకు పైబడిన వారు అంతా క్రైస్తవులే ఉన్నారు. 11.8 శాతం మాత్రం నాస్తికులుగా చెప్పాలి. కాగా 25 సంవత్సరాలు... అంతకంటే చిన్న వ్యక్తుల్లో 40.5 శాతం మంది నాస్తికులు కాగా మిగిలిన 42 శాతంమంది క్రైస్తవులని తేలింది. అయితే ఇదే పోల్ పై పలు విమర్శలు కూడ వెల్లువెత్తాయి. ఓ రెడ్డిట్ యూజర్ (ఇంటర్నెట్ మొదటి పేజీ) ఈ పోల్ తప్పుదారి పట్టించే విధంగా ఉందని ఆరోపించారు. అసోసియేషన్ నిర్వహించిన సర్వే గందరగోళంగా ఉందని, అడిగిన ప్రశ్నల్లో క్లారిటీ లేదని అన్నారు. విశ్వం పుట్టుక గురించి మీరేమనుకుంటున్నారు? అన్న ప్రశ్నకు... బిగ్ బ్యాంగ్ నుంచి వచ్చింది, దేవుడు సృష్టించాడు, తెలియదు, ఇతరాలు అన్న ఆప్షన్లు ఇవ్వడంలో అర్థం లేదన్నారు. చాలామంది దేవుడే బిగ్ బ్యాంగ్ కూ కారణమని నమ్ముతారని, ఇతరములు అన్న సమాధానంలో వీటిలో ఏదీ కాక దేవుడే బిగ్ బ్యాంగ్ ద్వారా ప్రపంచాన్ని సృష్టించాడన్న అర్థం కూడా వస్తుందని అన్నారు. మరికొంతమంది యూజర్లు.. బిగ్ బ్యాంగ్ సిద్ధాంతం మొదట కాథలిక్ ప్రీస్ట్, భౌతిక శాస్త్రవేత్త జార్జిస్ లెమైట్రే నుంచి పుట్టిందన్నది వాస్తవమన్నారు. ఇలా ఎవరికి తోచిన వాదం వారు చేయగా.. అసలు విశ్వ పుట్టుక విషయం పక్కన పెడితే శాస్త్రీయ సిద్ధాంతాలకూ, దేవుడికీ పోలిక కుదరదని ముందు అది తెలుసుకోవాల్సిన అవసరం ఉందని పోప్ ఫ్రాన్సిస్ అన్నారు. -
ఐసిస్ చేతిలోని నగరాన్ని స్వాధీనం చేసుకున్న ఇరాక్
-
అయిదేళ్లుగా పన్ను ఎగ్గొడుతున్న హీరో?
చెన్నై: తమిళ సూపర్ స్టార్ , కత్తి హీరో విజయ్ గత అయిదేళ్లుగా ఆదాయ పన్ను చెల్లించడం లేదని సమాచారం. ఆదాయ పన్ను అధికారులు అందించిన సమాచారం ప్రకారం గత అయిదేళ్లుగా ఆయన పన్ను ఎగ్గొట్టినట్టు తెలుస్తోంది. ఇటీవల తమిళ, తెలుగు, కన్నడ చిత్ర రంగ పరిశ్రమలకు చెందిన ప్రముఖ నటులపై ఐటి దాడులు జరిగిన నేపథ్యంలో ఈ వార్తలు మరింత ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. అయితే ఈ వార్తలను విజయ్ ఖండించారు. ఈ వార్తలు పూర్తిగా అవాస్తవాలని ఆయన కొట్టి పడేశారు. తాము చాలా శ్రద్ధగా టాక్స్‌లను చెల్లిస్తున్నట్టు తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంతో సహా అన్ని రకాల పన్నులను విధిగా చెల్లించానని విజయ్ స్పష్టం చేశారు. గతవారం ఐటి అధికారులు తమ ఇంటిపై దాడులు చేసినపుడు ఈ వివరాలను వారికి అందించామన్నారు. తాను, తన కుటుంబ సభ్యులు తమ ఐటి రిటర్న్స్‌కు సంబంధించిన , సాక్ష్యాలను, పూర్తి పత్రాలను సమర్పించామని పేర్కొన్నారు. కాగా ఇటీవల హీరో విజయ్, హీరోయిన్లు నయనతార, సమంతా, పులి డైరెక్టర్లు సహా కొంతమంది నటీనటుల ఇళ్లపై ఐటి అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ క్రమంలో వీరికి సంబంధించి సుమారు 25 కోట్ల రూపాయల బన్ను బకాయిలు ఉన్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. -
కీలక ఫైళ్లు బుగ్గిపాలు!
బ్రిజేశ్ ట్రిబ్యునల్ కార్యాలయ ప్రమాదంలో ఫైళ్లు దగ్ధం వాటి వివరాలు కోరిన ఏపీ, తెలంగాణ ట్రిబ్యునల్ సమావేశాల్లో జాప్యం జరిగే అవకాశం సాక్షి, హైదరాబాద్: కృష్ణా నదీ జల వివాదాలపై వాదనలు వింటున్న బ్రజేష్ కుమార్ ట్రిబ్యునల్ కార్యాలయంలో ఇటీవల జరిగిన అగ్నిప్రమాదంలో కీలక డాక్యుమెంట్లు, ఫైళ్లు దగ్ధమైనట్లుగా తెలుస్తోంది. ఇందులో గత నాలుగేళ్ల వాదనల సందర్భంగా కర్ణాటక, మహారాష్ట్ర, ఏపీ రాష్ట్రా లు వినిపించిన వాదనల తాలూకు రికార్డులు, ట్రిబ్యునల్ సభ్యులు పొందుపరుచుకునే పరిశీల నాంశాల రికార్డులు కొన్ని ఈ ప్రమాదంలో కాలి పోయినట్లుగా సమాచారం. బ్రజేష్ ట్రిబ్యునల్ సమావేశాలు గత నెల 30న మొదలై మూడు రోజులపాటు జరగాల్సి ఉంది. గత వాదనల సందర్భంగా కర్ణాటక, మహారాష్ట్రలు వాదనలు వినిపించగా తర్వాతగా ఏపీ, తెలంగాణ రాష్ట్రా లు వాదనలు వినిపించాల్సి ఉంది. వాదనలకు అంతా సిద్ధమైన వేళ సమావేశాలు ముందు రోజు కార్యాలయంలో అగ్నిప్రమాదం జరిగిం ది. దీంతో సమావేశాలు వాయిదా పడ్డాయి. కీలక రికార్డులు దహనమైనట్లు సమాచారం అందుకున్న ఏపీ, తెలంగాణ అధికారులు రికార్డుల వివరాలు తెలియజేయాలని ట్రిబ్యునల్ కా ర్యాలయ సిబ్బందిని కోరారు. దీంతో ట్రిబ్యున ల్ కార్యాలయ సిబ్బంది వాటి వివరాలను సేకరించే పనిలో ఉన్నారు. దహనమైన రికార్డుల వి వరాలు బయటకు వచ్చేందుకు మరి కొంత సమయం పట్టే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ట్రిబ్యునల్ సమావేశాలు ఇప్పట్లో జరగడం సా ద్యం కాదని అధికార వర్గాలు చెబుతున్నాయి. -
క్లెయిమ్‌ల పరిష్కారంలో ఎల్ఐసీ భేష్: ఐఆర్డీఏ
న్యూఢిల్లీ: ప్రైవేటు బీమా కంపెనీలతో పోల్చితే ‘డెత్ క్లెయిమ్’ల విషయంలో జీవిత బీమా సంస్థ (ఎల్ఐసీ) పనితీరు అత్యుత్తమంగా ఉందని ఈ రంగ నియంత్రణ సంస్థ- ఐఆర్డీఏ తన వార్షిక నివేదికలో పేర్కొంది. గణాంకాల ప్రకారం ముఖ్యాంశాలు... గతేడాది (2012-13)లో ఎల్ఐసీ క్లెయిమ్‌ల పరిష్కార నిష్పత్తి 97.73%. 2011-12లో ఈ నిష్పత్తి 97.42%. అయితే ప్రైవేటు బీమా సంస్థల విషయంలో ఈ రేట్లు వరుసగా 88.65%, 89.34%గా ఉన్నాయి. ఏడాది ముగింపునాటికి ప్రైవేటు బీమా కంపెనీల వద్ద పెండింగులో ఉన్న (పరిష్కరించాల్సిన) క్లెయిమ్‌లు 3.47శాతం. ఎల్ఐసీ విషయంలో ఈ రేటు 1.04 శాతం. 2012-13లో జీవిత బీమా పరిశ్రమల ప్రీమియం ఆదాయం రూ.2.87 లక్షల కోట్లు. అంతక్రితం ఏడాదితో పోల్చితే ఇది 0.05% అధికం. ప్రీమియం వసూళ్ల విషయంలో ప్రైవేటు రంగంలో 2012-13లో (2011-12తో పోల్చి) అసలు వృద్ధిలేకపోగా 6.87% క్షీణత నమోదయ్యింది. అయితే ఈ విషయంలో ఎల్ఐసీ 2.92% వృద్ధిని సాధించింది. -
'బీమా జాబితాలో జబ్బు లేదని.. రీయింబర్స్మెంట్ నిరాకరించొద్దు'
వైద్య బీమా విషయంలో బీమా కంపెనీలు అనుసురిస్తున్న విధానంపై మద్రాస్ హైకోర్టు తలంటేసింది. బీమా జాబితాలో జబ్బు లేనంత మాత్రాన.. బీమా చేయించుకున్నవారికి చికిత్స ఖర్చులు నిరాకరించడానికి వీల్లేదని రూలింగ్ ఇచ్చింది. ఎవరైనా వ్యక్తికి తగిన వైద్య బీమా పాలసీ ఉండి.. వాళ్లు గుర్తింపు ఉన్న ఆస్పత్రిలోనే చికిత్స పొందినప్పుడు, వాళ్లకు ఖర్చులు తిరిగి ఇవ్వడానికి నిరాకరించకూడదని జస్టిస్ టి.రాజా స్పష్టం చేశారు. చెన్నై అన్నామంగళం ప్రాంతానికి చెందిన లిటిల్ ఫ్లవర్ హయ్యర్ సెకండరీ పాఠశాలలో అసిస్టెంటుగా పనిచేస్తున్న జి.సైమన్ క్రిస్టూడస్ అనే వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్‌పై కోర్టు ఈ రూలింగ్ ఇచ్చింది. బీమా జాబితాలో ఆయనకున్న వ్యాధి కవర్ కాదన్న కారణంతో జిల్లా విద్యా శాఖాధికారి ఖర్చులు తిరిగి ఇచ్చేందుకు నిరాకరించినట్లు బాధితుడి తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. కంటి నరాలపై ఒత్తిడి పెరగడం వల్ల చూపు తగ్గడంతో శస్త్రచికిత్స చేయించుకోగా దానికి 1.17 లక్షల రూపాయల ఖర్చయింది. కానీ ఆ వ్యాధి లేదన్న కారణంతో సైమన్ బిల్లులను చెల్లించేందుకు డీఈవో నిరాకరించారు. దీన్ని న్యాయమూర్తి తప్పుబట్టారు. 8 శాతం వడ్డీతో సహా బిల్లు మొత్తాన్ని సైమన్‌కు చెల్లించాలని ఆదేశించారు.