అమెరికాలో నిరుద్యోగం తాండవిస్తోంది. ఆ దేశ ప్రభుత్వం అందించే నిరుద్యోగ భృతి కోసం దరఖాస్తు చేసినవారి సంఖ్య గత వారం 20 నెలల గరిష్ఠ స్థాయికి చేరింది. అది అలాగే స్థిరంగా కొనసాగుతోంది.
బ్యూరో ఆఫ్ లేబర్ స్టాటిస్టిక్స్ తాజాగా విడుదల చేసిన డేటా ప్రకారం.. జూన్ 17తో ముగిసిన వారంలో కాలానుగుణంగా సర్దుబాటు ప్రాతిపదికన నిరుద్యోగ ప్రయోజనాల కోసం 2,64,000 కొత్త క్లెయిమ్‌లు దాఖలయ్యాయి. అంతకు ముందు వారంతో పోలిస్తే దరఖాస్తుల సంఖ్యలో పెద్దగా మార్పు లేదు. 2021 అక్టోబర్ తర్వాత గతవారం నిరుద్యోగ భృతి దరఖాస్తులు మొదటి సారిగా అత్యధిక స్థాయికి చేరాయి.
కాగా నిరుద్యోగ భృతికి కొత్త దరఖాస్తులు సగటున 2,60,000 ఉండొచ్చని ఆర్థికవేత్తలు అంచనా వేసినట్లుగా ‘రాయిటర్స్’ పేర్కొంది. ఇదిలా ఉండగా మొదటి వారం దాటి ప్రయోజనాలను పొందుతున్న వారందరి ర్యాంక్‌లు జూన్ 10తో ముగిసిన వారంలో 17.6 లక్షలకు పడిపోయాయి. అంతకు ముందు వారం ఇది 17.72 మిలియన్లుగా ఉండేది.
యూఎస్ కరెంట్ ఖాతా లోటు ఈ ఏడాది మొదటి మూడు నెలలలో స్థిరంగా విస్తరించి మూడు త్రైమాసికాల దిగువకు తగ్గిందని ఆ దేశ ప్రభుత్వం నివేదించింది. మరోవైపు 2022 నాలుగో త్రైమాసికంలో సవరించిన 216.2 బిలియన్ డాలర్ల నుంచి మొదటి త్రైమాసికంలో కరెంట్ అకౌంట్ గ్యాప్ 219.3 బిలియన్ డాలర్లకు పెరిగిందని వాణిజ్య శాఖ తెలిపింది. కాగా అది 217.5 బిలియన్ డాలర్లకు పెరుగుతుందని ఆర్థికవేత్తలు రాయిటర్స్ పోల్‌లో అంచనా వేశారు.
Comments
Please login to add a commentAdd a comment