గత రెండేళ్లలో అత్యున్నత సాంకేతికతను వినియోగించుకుని తమ సేవలను మరింత మెరుగుపర్చామని, వేగవంతం చేశామని ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్‌వో) ఓ ప్రకటనలో వెల్లడించింది.
హైదరాబాద్: గత రెండేళ్లలో అత్యున్నత సాంకేతికతను వినియోగించుకుని తమ సేవలను మరింత మెరుగుపర్చామని, వేగవంతం చేశామని ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్‌వో) ఓ ప్రకటనలో వెల్లడించింది. ఉద్యోగుల క్లెయిముల సెటిల్‌మెంట్ సమయాన్ని 30 నుంచి 20 రోజులకు తగ్గించామని, చందాదారులకు నెఫ్ట్ విధానంలో వెంటనే క్లెయిమ్ మొత్తాన్ని అందిస్తున్నామని తెలిపింది.
కోడ్ నంబర్ల కేటాయింపు, కొత్త సంస్థలు, ఉద్యోగుల ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ చేపట్టామని పేర్కొంది. పెన్షనర్లు తమ ‘జీవన్ ప్రమాణ పత్రా’లను ఆన్‌లైన్‌లోనే నమోదు చేసే అవకాశాన్ని కల్పించామని తెలిపింది. ఈపీఎఫ్‌వో సేవలు పొందేందుకు మొబైల్ అప్లికేషన్‌ను అందుబాటులోకి తెచ్చామని, ఫేస్‌బుక్, ట్వీటర్ ద్వారా చేరువయ్యామని పేర్కొంది.