సాక్షి, విజయవాడ : కరోనా కష్టకాలంలో పేదల కోసం ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. పెండింగ్ లో ఉన్న వైఎస్సార్ బీమా కింద ఉన్న క్లెయిమ్‌లను చెల్లించి చెల్లింపులు కార్మికులను ఆదుకోవాలని సీఎం జగన్ ఆదేశించారని కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాములు పేర్కొన్నారు. ఆయన మాట్లాడుతూ.. తక్షణమే వైఎస్సార్ బీమా క్లెయిమ్‌లను చెల్లించనున్నట్లు తెలిపారు. ఈ మేరకు రూ. 348కోట్లతో వైఎస్సార్ బీమా చెల్లింపులకు విడుదల చేశామన్నారు. మార్చి 31 వరకు పెండింగ్ లో ఉన్నవన్నీ చెల్లిస్తామని పేర్కొన్నారు. ఈ మొత్తాన్ని సెర్ప్ ద్వారా 7726 క్లెయిమ్ లబ్ధిదారులకు అందజేస్తామని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment