న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ జీవితబీమా సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్ఐసీ) భారీ మొత్తంలో పాలసీ వినియోగదారులకు చెల్లించింది. 2016-17 ఆర్థిక సంవత్సరానికిగాను మొత్తం పదికోట్ల రూపాయలకుపైగా నగదును తమ పాలసీ దారులకు చెల్లించినట్టు కంపెనీ ప్రకటించింది.
2016-17 ఆర్థిక సంవత్సరానికి రూ. 1,12,700.41 కోట్ల మేర 215.58 లక్షల క్లెయిములను పరిష్కరించినట్టు సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. సంస్థ 61 వార్షికోత్సవం సందర్భంగా శుక్రవారం ఈ వివరాలను వెల్లడించింది. 98.34 శాతం పాలసీ మెచ్యూరిటీ క్లయిములను, 99.63 శాతం డెత్ క్లయిములను పరిష్కరించినట్టు తెలిపింది.
సంవత్సరం ప్రాతిపదికన 27,2 శాతం వృద్ధిని నమోదు చేసింది. ఎల్ఐసికి రూ. 23,23,802. 59 కోట్ల లైఫ్ ఫండ్‌తో పాటు 25 ట్రిలియన్ డాలర్ల ఆస్తులున్నాయి. ఎల్ఐసీ మార్కెట్ వాటా 76.09 శాతంగా ఉంది. మార్చి చివరి నాటికి 20 మిలియన్ల కొత్త పాలసీలను సాధించింది.
2017 చివరి నాటికి, ఎల్ఐసికి వ్యక్తిగత వ్యాపారంలో 23 పధకాలు ఉన్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో, ఆధార్ స్తంభ్, ఆధర్ షీలా, జీవన్ ఉమంగ్ , ప్రధాన్ మంత్రి వాయ వందన యోజన లాంటి నాలుగు కొత్త ప్లాన్లను చేర్చినట్టు చెప్పింది. చేర్చబడ్డాయి. మార్చి చివరి నాటికి మొత్తం పెట్టుబడులు రూ. 24,72,389 కోట్లు. 14 దేశాలలో సేవలను అందిస్తున్న ఎల్‌ఐసీ సంస్థ పూర్తిగా సొంతమైన, అనుబంధ మరియు జాయింట్ వెంచర్ కంపెనీల ద్వారా కార్యకలాపాలు నిర్వహస్తోంది. కార్పొరేషన్ ప్రస్తుతం 1.15 లక్షల ఉద్యోగులు ఉన్నారు. 11.31 లక్షల మంది ఏజెంట్లు, 29 కోట్ల ప్లస్ పాలసీలు అమల్లో ఉన్నాయి.
ఎల్ఐసీ సెటిల్డ్ క్లయిమ్స్ ఎంతంటే...
Published Fri, Sep 1 2017 7:40 PM | Last Updated on Tue, Sep 12 2017 1:34 AM
Advertisement
Advertisement