లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్‌లో కాలపరిమితి గడువు పూర్తయ్యాక (మెచ్యూర్టీ) ఎవరూ క్లెయిమ్ చేసుకోని (అన్‌క్లెయిమ్డ్) బీమా పరిహార నిధులు రూ.880.93 కోట్లుగా నమోదయ్యాయని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరీ తెలిపారు. 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఈ లెక్కల ప్రకారం గడువు తీరినా బీమా ప్రయోజనాలను క్లెయిమ్ చేసుకోని పాలసీదార్లు 3,72,282 మంది ఉన్నట్లు మంత్రి లోక్‌సభలో పేర్కొన్నారు. 2022-23లో 3,73,329 మంది పాలసీదార్లకు చెందిన రూ.815.04 కోట్ల నిధులు అన్‌క్లెయిమ్డ్‌గా ఉన్నాయి.
ఇదీ చదవండి: ఉచిత ఆధార్ అప్‌డేట్ గడువు పొడిగింపు
అన్‌క్లెయిమ్డ్, అవుట్‌స్టాండింగ్ క్లెయిమ్‌లను తగ్గించుకునేందుకు ఎల్‌ఐసీ ఎలాంటి ప్రయాత్నాలు చేస్తుందో మంత్రి తెలియజేశారు.
పత్రికల్లో ప్రకటనలు ఇవ్వడం
డిజిటల్ మాధ్యమాల్లో ప్రకటనలు ఇవ్వడం
రేడియో ద్వారా సమాచారం ఇవ్వడం
బీమా పరిహారాన్ని క్లెయిమ్ చేసుకోవాలని సాధారణ/ స్పీడ్ పోస్ట్ ద్వారా కూడా సమాచారాన్ని పంపిస్తున్నారు.
ఇ-మెయిల్ చిరునామా ద్వారా, మొబైల్ నెంబర్ ద్వారా సమాచారం అందిస్తున్నామని మంత్రి తెలిపారు.
బీమాను క్లెయిమ్ చేసుకోవాలని ఏజెంట్ల ద్వారా పాలసీదార్లకు సమాచారం ఇస్తున్నట్లు మంత్రి చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment