Unclaimed
-
క్లెయిమ్ చేసుకోని నిధులు రూ.880 కోట్లు
లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్లో కాలపరిమితి గడువు పూర్తయ్యాక (మెచ్యూర్టీ) ఎవరూ క్లెయిమ్ చేసుకోని (అన్క్లెయిమ్డ్) బీమా పరిహార నిధులు రూ.880.93 కోట్లుగా నమోదయ్యాయని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరీ తెలిపారు. 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఈ లెక్కల ప్రకారం గడువు తీరినా బీమా ప్రయోజనాలను క్లెయిమ్ చేసుకోని పాలసీదార్లు 3,72,282 మంది ఉన్నట్లు మంత్రి లోక్‌సభలో పేర్కొన్నారు. 2022-23లో 3,73,329 మంది పాలసీదార్లకు చెందిన రూ.815.04 కోట్ల నిధులు అన్క్లెయిమ్డ్గా ఉన్నాయి.ఇదీ చదవండి: ఉచిత ఆధార్ అప్డేట్ గడువు పొడిగింపుఅన్క్లెయిమ్డ్, అవుట్‌స్టాండింగ్ క్లెయిమ్‌లను తగ్గించుకునేందుకు ఎల్ఐసీ ఎలాంటి ప్రయాత్నాలు చేస్తుందో మంత్రి తెలియజేశారు.పత్రికల్లో ప్రకటనలు ఇవ్వడండిజిటల్ మాధ్యమాల్లో ప్రకటనలు ఇవ్వడంరేడియో ద్వారా సమాచారం ఇవ్వడంబీమా పరిహారాన్ని క్లెయిమ్ చేసుకోవాలని సాధారణ/ స్పీడ్ పోస్ట్ ద్వారా కూడా సమాచారాన్ని పంపిస్తున్నారు.ఇ-మెయిల్ చిరునామా ద్వారా, మొబైల్ నెంబర్ ద్వారా సమాచారం అందిస్తున్నామని మంత్రి తెలిపారు.బీమాను క్లెయిమ్ చేసుకోవాలని ఏజెంట్ల ద్వారా పాలసీదార్లకు సమాచారం ఇస్తున్నట్లు మంత్రి చెప్పారు. -
అనాథ మృతదేహాలను రైల్వేశాఖ ఏం చేస్తుందంటే..
ఒడిశాలోని బాలాసోర్‌లో జరిగిన ఘోర రైలు ప్రమాదంలో 288 మంది మృతి చెందగా వెయ్యిమందికిపైగా ప్రయాణికులు గాయపడ్డారు. ఇప్పటివరకూ 202 మృతదేహాలకు శవ పంచనామా పూర్తికాగా, 86 మృతదేహాలకు శవపంచనామా ఇంతవరకూ పూర్తికాలేదు. ఆసుపత్రులలో మృతదేహాలను ఉంచేందుకు స్థలం లేకపోవడంతో వాటిని స్కూళ్లు, కోల్డ్ స్టోరేజీలలో ఉంచాల్సిన పరిస్థితి ఏర్పడింది. అనాథ మృతదేహాలను భువనేశ్వర్ ఎయిమ్స్‌కు తరలించారు. వైద్యులు తెలిపిన వివరాల ప్రకారం మృతదేహం ఏడు రోజులు దాటిపోతే అత్యంత వేగంగా కుళ్లిపోతుంది. అటువంటప్పుడు గుర్తింపునకు నోచుకోని మృతదేహాలను రైల్వేశాఖ ఏమి చేస్తుందనే ప్రశ్న అందిరి మదిలోనూ మెదులుతుంది. దీనిగురించి రైల్వేశాఖ అధికార ప్రతినిధి అమితాభ్ శర్మ మాట్లాడుతూ రైలు ప్రమాదాలు సంభవించినప్పుడు మృతదేహాలను సంరక్షించడం, అనాథ మృతదేహాలుగా ప్రకటించడం, అంతిమ సంస్కారాలు చేయడం రైల్వేశాఖ పరిధిలోకి రాదని, ఇది రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన వ్యవహారమని అన్నారు. అనాథ మృతదేహాలను ఏం చేయాలనే దానిపై ఆయా రాష్ట్రప్రభుత్వాలు నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందన్నారు. కాగా అనాథ మృతదేహాల విషయంలో రాష్ట్ర ప్రభుత్వాలకు కొన్ని నియమనిబంధనలు ఉన్నాయి. వాటి ప్రకారం ఆ రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన పోలీసులు ఎటువంటి అనాథ మృతదేహన్ని గుర్తించినా ముందుగా ఈ విషయమై జిల్లా ఎస్పీకి తెలియజేయాలి. తరువాత మృతదేహానికి సంబంధించిన రిపోర్టు తయారుచేసి, ఆ మృతదేహాన్ని గుర్తించేందుకు అన్ని ప్రయత్నాలు చేయాలి. ఇందుకోసం ఆ మృతదేహానికి సంబంధించిన ఫొటోను రాష్ట్రంలోని అన్ని పోలీసుస్టేషన్లు, ఆసుపత్రులకు పంపాల్సి ఉంటుంది. దీని తరువాతనే ఆ మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించాలా లేదా అనేది అధికారులు నిర్ణయిస్తారు. పోలీసులు అనాథ మృతదేహం ఎవరిదో గుర్తించేందుకు అనేక పద్ధతులను అనుసరిస్తారు. మృతదేహంపై పుట్టుమచ్చలు, టాటూలు మొదలైనవి ఏమైనా ఉన్నాయేమో గుర్తిస్తారు. అనాథ మృతదేహాలను అత్యధికంగా ఏడు రోజుల పాటు ఎవరైనా గుర్తించేందుకు ఉంచుతారు. ఆ తరువాత కూడా ఎవరూ మృతదేహం కోసం రాకపోయిన పక్షంలో అంతిమ సంస్కారాలు నిర్వహిస్తారు. అనాథ మృతదేహాల వద్ద ఏదైనా సామాను దొరికితే పోలీసులు వాటిని భద్రపరుస్తారు. చదవండి: 6 రోజులు దాటినా కానరాని అయినవారి మృతదేహాలు -
ఆర్బీఐ కీలక నిర్ణయం..బ్యాంకు ఖాతాదారులకు ముఖ్య గమనిక!
ఆర్బీఐ కీలక నిర్ణయం తీసుకుంది. బ్యాంకులు వద్ద తమ దగ్గర ఖాతాదారులు క్లెయిమ్ చేయకుండా ఉండిపోయిన డిపాజిట్లను తగ్గించుకునేందుకు 100 రోజుల ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించేలా బ్యాంకులకు ఆదేశాలు జారీ చేసింది. ఈ కార్యక్రమం జూన్ 1 నుంచి మొదలవుతుందని ఆర్బీఐ ప్రకటించింది. ఇటీవల అన్ క్లయిమ్ డిపాజిట్లపై కేంద్ర ఆర్థిక శాఖ సహాయమంత్రి భగవత్ కరాద్ పార్లమెంట్లో మాట్లాడుతూ.. ప్రభుత్వ బ్యాంకుల్లో క్లయిం చేయని డిపాజిట్లు వేల కోట్లలో పేరుకుపోయాయని వాటిని ఆర్బీఐ ఆధ్వర్యంలోని ‘డిపాజిటర్ ఎడ్యుకేషన్ అండ్ అవేర్నెస్ ఫండ్’కు బ్యాంకులు బదిలీ చేసినట్లు తెలిపారు. తాజాగా, ఆర్బీఐ బ్యాంకుల్లో మూలుగుతున్న వేలకోట్ల డిపాజిట్లపై దృష్టిసారించింది. ఇందులో భాగంగా బ్యాంక్‌లు తమ దగ్గర అన్క్లెయిమ్డ్గా ఉన్న టాప్–100 డిపాజిట్లను ఖాళీ చేయడంపై (తిరిగి చెల్లించడం/క్లియరెన్స్) దృష్టి పెడతాయని వెల్లడించింది. పదేళ్లుగా ఎలాంటి లావాదేవీలు లేని సేవింగ్స్/కరెంట్ ఖాతాల్లోని డిపాజిట్లు, గడువు ముగిసిపోయి పదేళ్లు అయినా తీసుకోకుండా ఉండిపోయిన టర్మ్ డిపాజిట్ల మొత్తాన్ని బ్యాంక్‌లు అన్క్లెయిమ్డ్ డిపాజిట్లుగా పరిగణిస్తుంటాయి. పదేళ్లు ముగిసిన అన్క్లెయిమ్డ్ డిపాజిట్లను బ్యాంక్‌లు ‘డిపాజిటర్ ఎడ్యుకేషన్ అండ్ అవేర్నెస్ ఫండ్’కు బదిలీ చేయాల్సి ఉంటుంది. ప్రత్యేక కార్యక్రమంలో భాగంగా దేశవ్యాప్తంగా బ్యాంక్‌లు ప్రతీ జిల్లా పరిధిలో టాప్–100 అన్క్లెయిమ్డ్ డిపాజిట్ల సంబంధీకులను గుర్తించి చెల్లింపులు చేసేందుకు చర్యలు చేపడతాయని ఆర్బీఐ తన ప్రకటనలో పేర్కొంది. రూ.35వేల కోట్లు.. ఏదైనా బ్యాంకు ఖాతాలోని నగదు పదేళ్లుగా లేదా అంతకు ముందు నుంచీ వాడుకలో లేకుండాపోతే, దాన్ని అన్క్లెయిమ్డ్ డిపాజిట్‌గా పరిగణిస్తారు. ఈ ఏడాది ఫిబ్రవరి నాటికి అటువంటి 10.24 కోట్ల ఖాతాలకు చెందిన రూ.35,012 కోట్లను ప్రభుత్వరంగ బ్యాంకులు ఆర్బీఐకు మరలించినట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. వీటిలో ఎస్బీఐవే అత్యధికంగా రూ.8,086 కోట్లు ఉండగా.. రూ.5,340 కోట్లతో పంజాబ్ నేషనల్ బ్యాంకు రెండో స్థానంలో నిలిచింది. చదవండి👉 కడుపు నిండా తిండి పెట్టి.. ఉదయాన్నే చావు కబురు చల్లగా చెప్పిన ఐటీ సంస్థ! -
ఎల్ఐసీ వద్ద క్లెయిమ్ చేయని నిధి రూ. 21,500 కోట్లు..!
న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ జీవిత బీమా సంస్థ ఎల్ఐసీ వద్ద క్లెయిమ్ చేయని పాలసీదారుల నిధులు 2021 సెప్టెంబర్ నాటికి రూ.21,500 కోట్ల మేర ఉన్నాయి. ఐపీవో కోసం సెబీ వద్ద దరఖాస్తు చేసిన పత్రాల్లో (డీఆర్‌హెచ్‌పీ) ఎల్ఐసీ ఈ వివరాలను పేర్కొంది. క్లెయిమ్ చేయని అసలుతోపాటు, దానిపై వడ్డీ కలిపి ఈ మొత్తం ఉన్నట్టు తెలిపింది. క్లెయిమ్ చేయని నిధి 2019 మార్చి నాటికి రూ.13,843 కోట్లు, 2020 మార్చి నాటికి రూ.16,052 కోట్లు, 2021 మార్చి నాటికి రూ.18,495 కోట్ల చొప్పున ఉన్నట్టు పేర్కొంది. రూ.1,000 అంతకుమించి క్లెయిమ్ చేయని ఫండ్స్ వివరాలను తన వెబ్సైట్లోనూ ఎల్ఐసీ ప్రకటించాల్సి ఉంటుంది. దానివల్ల పాలసీదారులు తమకు రావాల్సిన ప్రయోజనాల గురించి తెలుసుకునేందుకు వీలుంటుంది. పదేళ్లపాటు ఇలా క్లెయిమ్ రాకపోతే ఆ మొత్తాన్ని సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ ఫండ్ (ఎస్‌సీడబ్ల్యూఎఫ్)కు బదిలీ చేయాలని ఐఆర్డీఏఐ నిబంధనలు చెబుతున్నాయి. అన్ని బీమా సంస్థలకు ఇవే నిబంధనలు వర్తిస్తాయి. -
ఇన్సూరెన్స్, అమ్మో..క్లెయిమ్ చేయని మొత్తం ఇన్నివేల కోట్లు ఉందా
2020 డిసెంబర్ 31 వరకూ అందుతున్న సమాచారం ప్రకారం బ్యాంకులు, బీమా కంపెనీల వద్ద క్లెయిమ్ చేయని మొత్తం దాదాపు రూ.49,000 కోట్లని ఆర్థిక శాఖ సహాయమంత్రి భగవత్ కరాద్ రాజ్యసభకు తెలిపారు. బ్యాంకింగ్ రెగ్యులేటర్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) నుంచి అందుతున్న సమాచారం ప్రకారం బ్యాంకుల్లో క్లెయిమ్ చేయని సొమ్ము రూ.24,356 కోట్లని వివరించారు. ఇన్సూరెన్స్ రెగ్యులేటర్– ఐఆర్డీఏఐ నుంచి అందుతున్న సమాచారం ప్రకారం ప్రభుత్వ, ప్రైవేటు బీమా సంస్థల వద్ద ఉన్న ఈ మొత్తాలు రూ.24,586 కోట్లని (2020 డిసెంబర్ నాటికి) వెల్లడించారు. ఎవ్వరూ క్లెయిమ్ చేయని నిధుల వినియోగానికి 2014లో ఆర్బీఐ డిపాజిటర్ ఎడ్యుకేషన్ అండ్ అవేర్నెస్ ఫండ్‌ను ఏర్పాటు చేసిందని మంత్రి తెలిపారు. డిపాజిటర్ల ప్రయోజనాల పరిరక్షణకు వారిలో అవగాహన పెంచడం ఈ ఫండ్ లక్ష్యమన్నారు. ఇక బీమా కంపెనీలు తమ వద్ద గత పదేళ్లుగా క్లెయిమ్ చేయని నిధులను సీనియర్ సిటిజన్ సంక్షేమ నిధికి (ఎస్‌సీడబ్లూఎఫ్) ప్రతి యేడాదీ బదలాయిస్తాయని తెలిపారు. సీనియర్ సిటిజన్ల ప్రయోజనాల పరిరక్షణకు ఈ నిధులను ఉపయోగించడం జరుగుతుందని తెలిపారు. చదవండి : వేల కంపెనీలు మూతపడ్డాయ్, ఏ రాష్ట్రంలో ఎక్కువంటే -
యూజర్ల ’అన్క్లెయిమ్డ్’ మొత్తం విద్యానిధికే
న్యూఢిల్లీ: వివిధ కారణాలతో యూజర్లు క్లెయిమ్ చేసుకోని డబ్బును నిర్దిష్ట కాలావధి తర్వాత ’టెలికం వినియోగదారుల విద్యా, రక్షణ నిధి’కి బదలాయించాలంటూ టెల్కోలను టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్ ఆదేశించింది. సాధారణంగా .. అధికంగా వసూలు చేసిన చార్జీలను, సెక్యూరిటీ డిపాజిట్లు మొదలైనవి యూజర్లకు టెల్కోలు రిఫండ్ చేయాల్సి ఉంటుంది. అయితే ఏ కారణం వల్లనైనా రిఫండ్ చేయలేకపోయిన పక్షంలో ఆ మొత్తాన్ని టెలికం నిధికి జమ చేయాలి. కానీ, ఆపరేటర్లు డిపాజిట్ చేసే నగదు విషయంలో వ్యత్యాసాలు ఉంటున్నాయని ట్రాయ్ పరిశీలనలో తేలింది. దీనిపై టెల్కోలతో భేటీ అయింది. ఆడిటింగ్‌లో అధిక బిల్లింగ్ విషయం వెల్లడైనప్పుడు మాత్రమే కొన్ని టెల్కోలు ఆ మొత్తాన్ని డిపాజిట్ చేస్తున్నట్లు తేలింది. అలాగే మరికొన్ని సంస్థలు లావాదేవీ ఫెయిలైన సందర్భాల్లో సెక్యూరిటీ డిపాజిట్లు, ప్లాన్ చార్జీల వంటివి రీఫండ్ చేసేందుకు వినియోగదారుల వివరాలు సరిగ్గా దొరక్కపోయినప్పుడు, ఆ మొత్తాలను విద్యా నిధిలో జమ చేస్తున్నాయి. దీంతో ఈ అంశంపై స్పష్టతనిచ్చేందుకు ట్రాయ్ తాజాగా సంబంధిత నిబంధనలను సవరించింది. అన్క్లెయిమ్డ్ మొత్తం.. ఏ కేటగిరీకి చెందినదైనా, పన్నెండు నెలల వ్యవధి లేదా చట్టబద్ధంగా నిర్దేశించిన గడువు పూర్తయిపోయిన పక్షంలో విద్యా నిధికి జమ చేయాలంటూ స్పష్టతనిచ్చింది. -
పెన్షన్ స్కీం సొమ్ముపై గుడ్ న్యూస్
సాక్షి, న్యూఢిల్లీ: పెన్షన్ స్కీంలో మీ డబ్బు ఇరుక్కుపోయిందా. అయితే మీకో శుభవార్త. పెన్షన్ పాలసీ దారులకు ఊరట కల్పించేలా రెగ్యులేటరీ తాజా ఆదేశాలు జారీ చేసింది. పాలసీ తీసుకొని, కొంతవరకు చెల్లించి వదిలేసిన లేదా క్లైమ్ చేయని సొమ్ము వివిధ ఇన్సూరెన్స్ కంపెనీల దగ్గర వేలకోట్లరూపాయలు మూలుగుతున్నాయని ఇన్సూరెన్స్ అండ్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఐఆర్డీఏఐ) తాజాగా వెల్లడించింది. దీంతో సంబంధిత పాలసీదారులను గుర్తించి, ఆ ఫండ్‌ను వారికి చెల్లించాల్సిందిగా ఇన్సూరెన్స్ కంపెనీలను ఐఆర్డీఏఐ కోరింది. పాలసీదారులకు చెందిన 15వేల కోట్ల రూపాయలు జీవిత బీమా సంస్థల వద్ద క్లైమ్ చేయకుండా పడివున్నాయని రెగ్యులేటరీ వివరించింది. ఈ సొమ్మును ఆయా పాలసీ దారులు, లేదా లబ్దిదారులను శోధించి మరీ తిరిగి చెల్లించాల్సిందిగా బీమా సంస్థలకు ఆదేశించింది. అయితే ఇప్పటివరకు నిబంధనల ప్రకారం కనీస వాయిదాలు చెల్లించని జీవిత బీమా పాలసీ దారులు మెచ్యూరిటీ మొత్తాన్ని క్లెమ్ చేసే హక్కులేదు. అలాగే కొనుగోలు ధర కంటే మెచ్యూరిటీ వాల్యూ తక్కువగా ఉన్నా కూడా ఈ అవకాశం లేదు. తాజా ఆదేశాల ప్రకారం అలాంటి పాలసీదారులకు కూడా డబ్బును తిరిగి చెల్లించమని ఐఆర్డీఏఐ కోరింది. ఈ ఆదేశాలకు ప్రతికూలంగా ఇన్పూరెన్స్ కంపెనీలు వాదిస్తున్నాయి. ఇది చట్ట ఉల్లంఘన కిందికి వస్తుందని, పేరుకుపోయిన ఫండ్ విలువ ఈచెల్లింపులకు సరిపోదని ఆదిత్య బిర్లా సన్‌లైఫ్ ఇన్సూరెన్స్‌కు చెందిన అనిల్‌కుమార్ సింగ్ తెలిపారు. 2015నాటి ప్రభుత్వ గెజిట్ ప్రకారం పాలసీదారుడు, నిర్దేశియ సమయంలో ప్రీమియంలను చెల్లించనప్పుడు లేదా గణనీయమైన మొత్తంలో చెల్లించని సందర్భాల్లో మెచ్యూరిటీ విలువ తక్కువగా ఉంటుంది. అటువంటి సందర్భంలో ఆ సొమ్ము కంపెనీతోనే ఉంటుందని హెచ్డీఎఫ్సీ స్టాండర్డ్ లైఫ్ ఇన్సూరెన్స్ వైస్ ప్రెసిడెంట్, చిన్మయ్ బేడే పేర్కొన్నారు. -
అన్క్లెయిమ్డ్ డిపాజిట్లున్నాయా?
దేశవ్యాప్తంగా బ్యాంకుల్లో రూ.5,124 కోట్లు * ఇపుడు వివరాలన్నీ బ్యాంకు సైట్లలో లభ్యం * క్లెయిమ్‌కు కేవైసీ వివరాల సమర్పణ తప్పనిసరి ప్రసాద్‌కు ఐదు బ్యాంకుల్లో ఖాతాలున్నాయి. కనీస నిల్వ ఉంచాలి కనక ప్రతి ఖాతాలో రూ.10 వేలకు తగ్గకుండా ఉంచుతాడు. అన్ని ఖాతాలున్నా... అత్యధిక లావాదేవీలకు వాడేది మాత్రం రెండు ఖాతాలనే. ఒకటి ఆఫీసు జీతం జమచేసే ఖాతా. రెండోది తన పర్సనల్‌గా ఇంటి దగ్గరి బ్రాంచిలో తీసుకున్న ఖాతా. మిగిలిన ఖాతాల్లో ఎప్పుడోకానీ లావాదేవీలుండవు. కొన్నాళ్లకు వాటి ఊసే మరిచిపోయాడు ప్రసాద్. పదేళ్ల పాటు ఏ లావాదేవీ లేకపోవటంతో ఆ ఖాతాల్లోని సొమ్ము అన్క్లెయిమ్డ్ డిపాజిట్‌గా మారింది. ఇంతలో ప్రసాద్ మరణించటంతో అతని కుటుంబీకులకు కూడా విషయం తెలియకుండానే ఉండిపోయింది. శంకర్రావుది మరో కథ. ఆయనకు వెనకా ముందూ ఎవ్వరూ లేరు. ఉన్న డబ్బుల్లో కొంత బ్యాంకులో డిపాజిట్లుగా పెట్టాడు. నామినీ ఎవ్వరినీ పెట్టలేదు. విషయం తన దగ్గరి వాళ్లక్కూడా చెప్పలేదు. అతను మరణించటంతో ఆ డబ్బును తీసుకునేవారే లేకుండా పోయారు. కొన్నాళ్లకు అది అన్క్లెయిమ్డ్ డిపాజిట్‌గా మారింది. ప్రసాద్, శంకర్రావు లాంటి వ్యక్తులు దేశంలోని బ్యాంకుల్లో డిపాజిట్ చేసి క్లెయిమ్ చేయకుండా వదిలేసిన మొత్తమెంతో తెలుసా? 2013 సంవత్సరాంతానికి ఈ మొత్తం ఏకంగా రూ.5,124 కోట్లు. నిజానికి ఈ మొత్తం ఇంకా చాలా ఎక్కువ ఉంటుంది. కానీ బ్యాంకులు అనేక జాగ్రత్తలు తీసుకుని, పదేళ్లు నిండిన తరవాతే వీటిని అన్క్లెయిమ్డ్గా ప్రకటిస్తున్నాయి. ఇంకా పదేళ్లు నిండకపోయినా అన్క్లెయిమ్డ్గా ఉన్న మొత్తం చాలా ఎక్కువే ఉంటుందనేది బ్యాంకింగ్ వర్గాల మాట. అన్క్లెయిమ్డ్ వివరాలు తెలుసుకోవటమెలా? నిజానికి ప్రతి ఒక్కరూ వారి ఫైనాన్షియల్ డాక్యుమెంట్లను భద్రంగా ఉంచుకోవాలి. లేకపోతే బ్యాంక్ డిపాజిట్లు కోల్పోయే పరిస్థితి రావచ్చు. బ్యాంకులు కూడా ఆన్క్లైయిమ్డ్ డిపాజిట్ల తాలూకు డిపాజిటర్లు, ఇతర వివరాలను వాటి వెబ్సైట్లలో ఉంచాయి. ఇన్ని చేసినా మీ ఇంట్లో వాళ్ల డిపాజిట్ల వివరాలు వారి మరణానంతరం కూడా మీకు తెలియకపోతే... ఇంట్లో ఏవైనా బ్యాంక్ సంబంధిత డాక్యుమెంట్లు ఉన్నాయేమో వెదకండి. ప్రయోజనం లేకపోతే బ్యాంక్ వెబ్సైట్లలో ఉన్న అన్క్లెయిమ్డ్ డిపాజిట్లను జల్లెడ పట్టండి. బ్యాంకు ఖాతాదారుని పేరు మీద సెర్చ్ చేస్తే వివరాలను తెలసుకోవచ్చు. కొన్ని బ్యాంకులు ఖాతాదారు పేరు, పుట్టిన తేదీ, పాన్ నంబర్, పాస్‌పోర్ట్ సంఖ్య వంటి ఆప్షన్ల ద్వారా కూడా అన్క్లెయిమ్డ్ డిపాజిట్ల వివరాలను తెలియజేస్తున్నాయి. క్లెయిమ్ చేసుకోవాలంటే... ఆయా బ్యాంకుల వెబ్సైట్ల ద్వారా అన్క్లెయిమ్డ్ డిపాజిట్ల వివరాలను తెలుసుకున్నాక ఆ విషయాన్ని సదరు బ్యాంకుకు తెలియజేయాలి. కొన్ని బ్యాంకులు మీకు కాల్ చేస్తాయి. లేకపోతే స్వయంగా మీరే దగ్గర్లోని బ్యాంక్ బ్రాంచీకి వెళ్లి విషయాన్ని చెప్పాలి. ఆ డిపాజిట్లోని మొత్తాన్ని క్లెయిమ్ చేసుకోవాలని భావిస్తే.. క్లెయిమ్ ఫామ్‌ను సదరు బ్యాంకుకు సమర్పించాలి. మీరు బ్యాంక్ వెబ్సైట్ నుంచి/బ్రాంచ్ నుంచి ఈ ఫామ్‌ను పొందొచ్చు. దీంతోపాటు బ్యాంకు వారికి ఖాతాదారు బ్యాంక్ పాస్‌బుక్, ఐడీ, అడ్రస్ ప్రూఫ్ డాక్యుమెంట్లను సమర్పించాల్సి ఉంటుంది. చనిపోయిన మీ కుటుం బ సభ్యుల ఖాతాకు సంబంధించి క్లెయిమ్ చేసుకోవాలంటే అప్పుడు వారి మరణ ధ్రువీకరణ పత్రాన్నీ బ్యాంకుకు సమర్పించాలి. అన్క్లెయిమ్డ్ డిపాజిట్లను క్లెయిమ్ చేస్తే... అన్క్లెయిమ్డ్ డిపాజిట్లలో ఫిక్స్డ్ డిపాజిట్లు, సేవింగ్స్ అకౌంట్స్, కరెంట్ ఖాతాలు ఉండొచ్చు. ఫిక్స్డ్ డి పాజిట్ల వడ్డీ రేట్లు, ఇతర ఖాతాల వడ్డీ రేట్లు వేర్వేరుగా ఉంటాయి. ఒకవేళ మీరు అన్ క్లెయిమ్డ్ ఫిక్స్డ్ డిపాజిట్ నుంచి డబ్బును క్లెయిమ్ చేసుకోవాలంటే అప్పుడు బ్యాంకు మీకు సాధారణ సేవింగ్స్ అకౌంట్ వడ్డీ రేటునే చెల్లిస్తుంది. ఆర్బీఐ నిబంధనలు ఏం చెబుతున్నాయి.. రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గతేడాది ఫిబ్రవరిలో అన్క్లెయిమ్డ్ డిపాజిట్లపై ఒక ప్రకటన జారీ చేసింది.బ్యాంకులు అన్క్లెయిమ్డ్ డిపాజిటర్ల వివరాల సేకరణపై అధిక దృష్టి కేంద్రీకరించాలని బ్యాంకులకు సూచించింది. 2015, మార్చి 31 నాటికి అన్క్లెయిమ్డ్ డిపాజిట్ల వివరాలను ఆయా బ్యాంకులు వాటి వెబ్సైట్లలో తప్పక ఉంచాలని ఆదేశించింది. బ్యాంక్ వెబ్సైట్లలో మనకు ఖాతాదారు పేరు, అడ్రస్ మాత్రమే కనిసిస్తాయి. అకౌంట్ నంబర్, బ్రాంచ్ వివరాలు ఉండవు. అన్క్లెయిమ్డ్ డిపాజిట్ల వివరాలు తెలుసుకునేందుకు వీలుగా బ్యాంకులు సెర్చ్ ఆప్షన్‌ను ఉంచాలని, బ్యాంకులు ఆ సమాచారాన్ని ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉండాలని కూడా ఆర్బీఐ సూచించింది. క్లెయిమ్ ఫారాలను వెబ్సైట్లలో అందుబాటులో ఉంచాలని కూడా పేర్కొంది.