న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ జీవిత బీమా సంస్థ ఎల్‌ఐసీ వద్ద క్లెయిమ్ చేయని పాలసీదారుల నిధులు 2021 సెప్టెంబర్ నాటికి రూ.21,500 కోట్ల మేర ఉన్నాయి. ఐపీవో కోసం సెబీ వద్ద దరఖాస్తు చేసిన పత్రాల్లో (డీఆర్‌హెచ్‌పీ) ఎల్‌ఐసీ ఈ వివరాలను పేర్కొంది. క్లెయిమ్ చేయని అసలుతోపాటు, దానిపై వడ్డీ కలిపి ఈ మొత్తం ఉన్నట్టు తెలిపింది. క్లెయిమ్ చేయని నిధి 2019 మార్చి నాటికి రూ.13,843 కోట్లు, 2020 మార్చి నాటికి రూ.16,052 కోట్లు, 2021 మార్చి నాటికి రూ.18,495 కోట్ల చొప్పున ఉన్నట్టు పేర్కొంది. రూ.1,000 అంతకుమించి క్లెయిమ్ చేయని ఫండ్స్ వివరాలను తన వెబ్‌సైట్లోనూ ఎల్‌ఐసీ ప్రకటించాల్సి ఉంటుంది. దానివల్ల పాలసీదారులు తమకు రావాల్సిన ప్రయోజనాల గురించి తెలుసుకునేందుకు వీలుంటుంది. పదేళ్లపాటు ఇలా క్లెయిమ్ రాకపోతే ఆ మొత్తాన్ని సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ ఫండ్ (ఎస్‌సీడబ్ల్యూఎఫ్)కు బదిలీ చేయాలని ఐఆర్‌డీఏఐ నిబంధనలు చెబుతున్నాయి. అన్ని బీమా సంస్థలకు ఇవే నిబంధనలు వర్తిస్తాయి.
Comments
Please login to add a commentAdd a comment