LIC IPO
-
ఇన్వెస్టర్లకు బ్రోకింగ్ సంస్థల గాలం..
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ బీమా దిగ్గజం ఎల్ఐసీకి మెగా పబ్లిక్ ఇష్యూకి వస్తున్న నేపథ్యంలో పాలసీదారులు, ఇన్వెస్టర్లను మార్కెట్ వైపు మళ్లించడంపై బ్రోకింగ్ సంస్థలు, ఫిన్‌టెక్ కంపెనీలు మరింతగా దృష్టి పెడుతున్నాయి. ఇనాక్టివ్ ఖాతాలను మళ్లీ పునరుద్ధరించేలా మదుపుదారులను ప్రోత్సహించడం మొదలుకుని క్యూఆర్ కోడ్‌తో అప్పటికప్పుడు డీమ్యాట్ ఖాతాలను తెరవడం, వినూత్న ఆఫర్లు ఇవ్వడం వరకూ అన్ని ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇందులో భాగంగా ఎల్ఐసీ ఐపీవోకి దరఖాస్తు చేసుకోవడానికి .. సంక్లిష్టమైన బ్యాŠంకు లావాదేవీతో సంబంధం లేకుండా, అత్యంత సంపన్న ఇన్వెస్టర్లకు (హెచ్ఎన్ఐ) యూపీఐ ద్వారా చెల్లింపు పరిమితిని రూ. 5 లక్షలకు పెంచుతున్నాయి. దేశీయంగా అతి పెద్ద బ్రోకింగ్ సంస్థ జిరోధా, ఈ మధ్యే బ్రోకింగ్ వ్యాపారంలోకి అడుగుపెట్టిన పేటీఎం మనీ ఇప్పటికే దీన్ని అమల్లోకి తేగా, మిగతా సంస్థలు అదే బాట పట్టనున్నాయి. తమ దగ్గరే డీమ్యాట్ ఖాతాలు తెరిచేలా డిజిటల్, సంప్రదాయ బ్రోకింగ్ సంస్థలు పలు స్కీములు, గిఫ్ట్ వోచర్లతో పాలసీదారులను ఊరిస్తున్నాయి. కొత్త క్లయింట్లకు ఏంజెల్ వన్ బ్రోకింగ్ సంస్థ రూ. 15,000 విలువ చేసే వోచర్లు ఆఫర్ చేస్తోంది. చాలా మటుకు బ్రోకరేజీలు ఇప్పటికే రిటైల్ ఇన్వెస్టర్లు, పాలసీదారులు ఐపీవోకి దరఖాస్తు చేసుకునేందుకు ’ప్రీ–అప్లై’ అనే కొత్త ఫీచర్‌ను ప్రవేశపెట్టాయి. గ్రామీణ ప్రాంతాల వారు కూడా దరఖాస్తు చేసుకోవడంలో తోడ్పడేందుకు ఫిన్‌టెక్ సంస్థ స్పైస్ మనీ తాజాగా రెలిగేర్ బ్రోకింగ్‌తో జట్టు కట్టింది. మూణ్నెల్లలో 91 లక్షల ఖాతాలు.. నేషనల్ సెక్యూరిటీస్ డిపాజిటరీ (ఎన్ఎస్డీఎల్), సెంట్రల్ డిపాజిటరీ సర్వీస్ (సీడీఎస్ఎల్) గణాంకాల ప్రకారం జనవరి–మార్చి మధ్య కాలంలో కొత్తగా 91 లక్షల డీమ్యాట్ ఖాతాలు వచ్చాయి. దీంతో 2022 మార్చి 31 నాటికి మొత్తం డీమ్యాట్ ఖాతాల సంఖ్య 8.06 కోట్ల నుంచి (గతేడాది డిసెంబర్ ఆఖర్లో) 8.97 కోట్లకు పెరిగింది. ఎల్ఐసీ ఐపీవోపై రిటైల్ ఇన్వెస్టర్లలో భారీగా ఆసక్తి నెలకొందని యాక్సిస్ సెక్యూరిటీస్ వర్గాలు తెలిపాయి. ఈ ఐపీవో కోసమే గత నెలలో 45,000 పైచిలుకు ఖాతాలు తెరిచామని, వీరిలో 40 శాతం మంది కస్టమర్లు .. మార్కెట్‌కు కొత్త వారేనని వివరించాయి. మే 4న ప్రారంభమయ్యే ఐపీవోలో భాగంగా ఎల్ఐసీలో ప్రభుత్వం 3.5 శాతం వాటాలు (22.13 కోట్ల షేర్లు) విక్రయిస్తోంది. ఉద్యోగులకు షేరు ధరపై రూ. 45, పాలసీదారులకు రూ. 60 మేర డిస్కౌంట్ లభించనుంది. 2008లో రిలయన్స్ పవర్‌కి రికార్డు స్థాయిలో వచ్చిన 48 లక్షల పైచిలుకు దరఖాస్తులకు మించి ఎల్ఐసీ ఐపీవోకి బిడ్లు రావచ్చని అంచనా వేస్తున్నారు. ఈ ఇష్యూ ద్వారా ప్రభుత్వం దాదాపు రూ. 21,000 కోట్లు సమీకరించనుంది. తద్వారా దేశీయంగా ఇది అతి పెద్ద పబ్లిక్ ఇష్యూగా నిలవనుంది. ఎల్ఐసీ ఐపీవో బిడ్‌కు పేటీఎం రూటు క్యూఆర్ కోడ్ స్కానర్‌తో డీమ్యాట్ ఖాతా వన్ 97 కమ్యూనికేషన్స్ (పేటీఎం) అనుబంధ సంస్థ అయిన పేటీఎం మనీ ఎల్ఐసీ ఐపీవోకు దరఖాస్తు చేసుకునే వారి కోసం ఏర్పాట్లు చేసినట్టు ప్రకటించింది. దేశవ్యాప్తంగా కిరాణా స్టోర్లు, పేటీఎం మర్చంట్ భాగస్వాముల వద్ద క్యూఆర్ కోడ్స్‌ను ఏర్పాటు చేశామని.. జీవిత కాలం ఎటువంటి చార్జీల్లేని డీమ్యాట్ ఖాతాను ఆఫర్ చేస్తున్నామని తెలిపింది. ఎవరైనా తమ ఫోన్ నుంచి క్యూఆర్‌కోడ్‌ను స్కాన్ చేయడం ద్వారా సులభంగా డీమ్యాట్ ఖాతాను తమ వద్ద తెరవొచ్చని సూచించింది. ఖాతా తెరిచిన అనంతరం ఎల్ఐసీ ఐపీవోకు బిడ్ దాఖలు చేసుకోవచ్చని పేర్కొంది. ఈ నెల 4 నుంచి ఎల్ఐసీ ఐపీవో ప్రారంభం అవుతుండగా.. 9న ముగియనుంది.‘‘ గత కొన్ని ఏళ్లుగా క్యాపిటల్ మార్కెట్లలో రిటైల్ ఇన్వెస్టర్ల ప్రవేశం పెరుగుతుండడాన్ని చూస్తున్నాం. ఎల్ఐసీ ఐపీవోతో ఇది మరింత పెరగనుంది. దేశవ్యాప్తంగా పేటీఎం మర్చంట్ భాగస్వాముల వద్ద క్యూఆర్ కోడ్స్‌ను ఏర్పాటు చేస్తున్నాం. వాటి ద్వారా ఉచిత డీమ్యాట్ ఖాతాలు ప్రారంభించొచ్చు’’అని పేటీఎం మనీ అధికార ప్రతినిధి తెలిపారు. పేటీఎం మనీ హోమ్‌స్క్రీన్‌లో ఐపీవో సెక్షన్‌కు వెళ్లి అక్కడ అడిగిన వివరాలు ఇవ్వడం ద్వారా డీమ్యాట్ ఖాతా తెరవొచ్చు. -
ఎల్ఐసీ పబ్లిక్ ఇష్యూ షురూ..పాలసీదారులకు, రిటైల్ ఇన్వెస్టర్లకు బంపరాఫర్..!
ఎట్టకేలకు బీమా రంగ ప్రభుత్వ దిగ్గజం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్(ఎల్ఐసీ) పబ్లిక్ ఇష్యూకి వస్తోంది. వచ్చే నెల(మే) 4న ప్రారంభంకానున్న ఇష్యూ 9న ముగియనున్నట్లు తెలుస్తోంది. ఇందుకు ప్రభుత్వం షేరుకి రూ. 902–949 ధరల శ్రేణి నిర్ణయించినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఇష్యూలో భాగంగా ప్రభుత్వం 3.5 శాతం వాటాను విక్రయించనుంది. పాలసీదారులకు, రిటైల్ ఇన్వెస్టర్లకు షేరు ధరలో డిస్కౌంట్ ప్రకటించింది. న్యూఢిల్లీ: ప్రభుత్వం ఎల్ఐసీ లిస్టింగ్ సన్నాహాలు వేగవంతం చేసింది. ఇందుకు అనుగుణంగా క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి సవరించిన ప్రాస్పెక్టస్‌ను దాఖలు చేసింది. తద్వారా తొలుత అనుకున్న 5 శాతం వాటాస్థానే 3.5 శాతాన్నే విక్రయించేందుకు నిర్ణయించింది. వెరసి 22.13 కోట్ల షేర్లను ఆఫర్ చేయనుంది. ఇందుకు రూ. 902–949 ధరల శ్రేణిని ప్రకటించింది. తద్వారా రూ. 21,000 కోట్లు లభించగలవని ఆశిస్తోంది. కాగా.. ఎల్ఐసీ పాలసీదారులకు 2.21 కోట్ల షేర్లను రిజర్వ్ చేసింది. వీటిని రూ. 60 డిస్కౌంట్ ధరలో విక్రయించనుంది. 15 లక్షల షేర్లను ఉద్యోగులకు కేటాయించనుంది. వీటితోపాటు రిటైలర్లకు రూ. 40 డిస్కౌంట్ ధరలో షేర్లను జారీ చేయనుంది. రిటైల్ ఇన్వెస్టర్లు కనీసం 15 షేర్లకు(ఒక లాట్) దరఖాస్తు చేయవలసి ఉంటుంది. 2న షేర్ల జారీ ఎల్ఐసీ ఐపీవోలో భాగంగా యాంకర్ ఇన్వెస్టర్లకు ప్రభుత్వం మే 2న షేర్ల జారీని చేపట్టనుంది. పాలసీదారులు, వాటాదారులకు రిజర్వ్ చేయగా మిగిలిన వాటాలో 50 శాతాన్ని అర్హతగల సంస్థాగత కొనుగోలుదారుల(క్విబ్)కు, 35 శాతం రిటైల్ ఇన్వెస్టర్లకు, 15 శాతం సంస్థాగతేతర ఇన్వెస్టర్లకు ఆఫర్ చేయనుంది. క్విబ్‌లో 60 శాతం వరకూ యాంకర్ ఇన్వెస్టర్లకు కేటాయించనున్నట్లు తెలుస్తోంది. నిజానికి ప్రభుత్వం తొలుత 5 శాతం వాటాకు సమానమైన 31.6 కోట్ల షేర్లను విక్రయించాలని ప్రణాళికలు వేసింది. ఇందుకు అనుగుణంగానే సెబీ నుంచి ఆమోదముద్ర పొందింది. అయితే రష్యా–ఉక్రెయిన్ యుద్ధం, యూఎస్ ఫెడ్ వడ్డీ రేట్ల పెంపు ఆందోళనల నేపథ్యంలో స్టాక్ మార్కెట్లు తీవ్ర ఊగిసలాటకు లోనవుతున్నాయి. ఫలితంగా 3.5 శాతం వాటా విక్రయానికే ఆఫర్‌ను పరిమితం చేస్తూ తాజా ప్రాస్పెక్టస్‌ను దాఖలు చేసింది. కనీసం 5 శాతం ఎల్ఐసీ విలువను రూ. 6 లక్షల కోట్లుగా ప్రభుత్వం మదింపు చేసింది. సెబీ నిబంధనల ప్రకారం రూ. లక్ష కోట్ల విలువగల కంపెనీ ఐపీవోకు వస్తే కనీసం 5 శాతం వాటాను ఆఫర్ చేయవలసి ఉంటుంది. దీంతో ప్రభుత్వం 5 శాతం వాటా ఆఫర్ నిబంధనల నుంచి ఎల్ఐసీకి మినహాయింపులను కోరింది. చదవండి: ఎల్ఐసీ అమ్మకంతో ఆరు లక్షల కోట్లు! -
కేంద్రం కీలక నిర్ణయం, అప్పుడే ఎల్ఐసీ ఐపీవో!
న్యూఢిల్లీ: బీమా రంగ ప్రభుత్వ దిగ్గజం ఎల్ఐసీ పబ్లిక్ ఇష్యూ వచ్చే నెల(మే) 4న ప్రారంభమయ్యే అవకాశముంది. ముందుగా వేసిన ప్రణాళికలు సవరిస్తూ తాజాగా దాఖలు చేసిన 3.5 శాతం ప్రభుత్వ వాటా విక్రయ ప్రాస్పెక్టస్‌కు సెబీ ఆమోదముద్ర వేసింది. దీంతో యాంకర్ ఇన్వెస్టర్లకు 2న షేర్లను జారీ చేయవచ్చని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. తొలుత ప్రభుత్వం 5 శాతం వాటాను ఆఫర్ చేయాలని భావించిన సంగతి తెలిసిందే. వెరసి 3.5 శాతం వాటాకు సమానమైన 22 కోట్ల షేర్లను విక్రయించనుంది. తద్వారా రూ. 21,000 కోట్లు సమకూర్చుకునే వీలుంది. ప్రభుత్వం ఎల్ఐసీకి రూ. 6 లక్షల కోట్ల విలువను ఆశిస్తోంది. ఇష్యూ మే 9న ముగియనున్నట్లు అంచనా. -
మదుపరులకు శుభవార్త.. ఎల్ఐసీ ఐపీఓకు సెబీ ఆమోదం..!
న్యూఢిల్లీ: పెట్టుబడిదారులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఎల్ఐసీ ఐపీఓకు మార్కెట్ రెగ్యులేటర్ సెబీ ఆమోదం తెలిపింది. సాధారణంగా ఏదైనా ఒక కంపెనీ ఐపీఓకు దరఖాస్తు చేసుకున్న 30-40 రోజుల తర్వాత సెబీ ఆమోదం తెలుపుతుంది. కానీ, ఎల్ఐసీ ఐపీఓ విషయంలో మార్కెట్ రెగ్యులేటర్ 22 రోజుల్లో ఆమోదం తెలపడం విశేషం. ఎల్ఐసీ ఫిబ్రవరిలో తన ముసాయిదా పత్రాలను మార్కెట్ రెగ్యులేటర్ సంస్థకు దాఖలు చేసింది. బీమా కంపెనీలో 100 శాతం వాటాను కేంద్ర ప్రభుత్వ కలిగి ఉంది. ఎల్ఐసీలో 5 శాతం వాటాకు సమానమైన 31.6 కోట్లకు పైగా ఈక్విటీ షేర్లను రూ.10 ముఖ విలువతో ప్రభుత్వం విక్రయించనుంది. దీంతో, కేంద్ర ప్రభుత్వ ఖజానాకు రూ.63,000 కోట్ల వరకు వచ్చి చేరతాయని మర్చంట్ బ్యాంకర్ల అంచనా. తద్వారా ఇదే దేశీయంగా అతిపెద్ద ఇష్యూగా నిలవనుంది. ఈ ఇష్యూ పూర్తిగా ఆఫర్ ఫర్ సేల్(ఓఎఫ్ఎస్) రూపంలో జరగనుంది. సంస్థలో 100 శాతం వాటా (632.49 కోట్ల షేర్లను) కలిగిన ప్రభుత్వం 5 శాతం వాటాను ఇలా విక్రయించనుంది. కొత్తగా షేర్లు ఏమీ జారీ చేయడం లేదు. ఒకసారి సెబీ అనుమతి లభించిన తర్వాత ఐపీఓకి వెళ్లడమే ఇక తరువాయి. అది ఎప్పడన్నది కేంద్ర ప్రభుత్వం నిర్ణయించాల్సి ఉంది. (చదవండి: డెట్ ఇష్యూల్లో రూ.5 లక్షల వరకు పెట్టుబడులకు యూపీఐ) -
ఎల్ఐసీ పాలసీదారులకు అలర్ట్.. ఆ అవకాశం మరో 3 రోజులే!
దేశంలోని అతిపెద్ద భీమా రంగ సంస్థ లైఫ్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్(ఎల్ఐసీ) త్వరలో ఐపీఓకు రాబోతున్న సంగతి మన అందరికీ తెలిసిందే. ఇప్పటికే ఎల్ఐసీ డ్రాఫ్ట్ రెడ్ హెర్రింగ్ ప్రాస్పెక్టస్ ఫైల్ చేసింది. కేంద్ర ప్రభుత్వం. 31.6 కోట్ల షేర్లను ఐపీఓ ద్వారా మార్కెట్లోకి తీసుకురానుంది. అయితే, ఈ ఎల్ఐసీ ఐపీఓలో పాలసీదారులకు ఆఫర్ సైజ్‌లో 10 శాతం కోటా లభించనుంది. అంటే ఎల్ఐసీ పాలసీ ఉన్నవారు ఈ ఐపీఓకి పాలసీహోల్డర్ కోటాలో దరఖాస్తు చేసుకోవచ్చు. వారికి ఇష్యూ ప్రైస్‌లో డిస్కౌంట్ కూడా లభించనుంది. మరోవైపు ఉద్యోగుల కోటా 5 శాతం ఉండనుంది. అయితే, ఈ ఎల్ఐసీ పాలసీదారులు ఐపీఓకి పాలసీహోల్డర్ కోటాలో అప్లై చేయాలంటే తప్పనిసరిగా తమ పాన్ కార్డును పాలసీకి లింక్ చేయాల్సి ఉంటుందని ఎల్ఐసీ గతంలో సూచించింది. ఈ పక్రియను ఫిబ్రవరి 28న పూర్తి చేయాల్సి ఉంటుంది అని తెలిపింది. ప్రభుత్వ నిర్వహణలో ఉన్న ఈ బీమా కంపెనీ షేర్ల ధర ఒక్కొక్కటి రూ.2,000 నుంచి రూ.2,100 మధ్య ఉండవచ్చని బ్లూమ్ బెర్గ్ గతంలో నివేదించింది. దేశంలోని అతిపెద్ద బీమా సంస్థ ఎల్ఐసీ మార్కెట్ రెగ్యులేటర్ సెబీకి మూసాయదా పత్రాలను దాఖలు చేసింది. భారత ప్రభుత్వం తనకున్న 100 శాతం వాటాలో 5% వాటాను విక్రయించి దాదాపు 8 బిలియన్ డాలర్లను సేకరించాలని చూస్తుంది. (చదవండి: అదిరిపోయే బంపరాఫర్!! 60శాతం డిస్కౌంట్‌తో అమెజాన్ సేల్!) -
LIC IPO: ఎల్ఐసీ కొత్త రూల్.. వారికి మాత్రమే ఐపీఓలో రాయితీ..!
LIC IPO: లైఫ్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎల్ఐసీ) వచ్చే నెలలో ఐపీఓకు వచ్చేందుకు సిద్దం అవుతున్న సంగతి మనకు తెలిసిందే. అయితే, తన ఎల్ఐసీ ఐపీఓలో పాలసీదారులకు 10 శాతం రాయితీ ఇచ్చేందుకు ముందుకు వచ్చింది. ఈ రాయితీ ఇచ్చేందుకు ఇంతకముందు ఒక నిబంధన పెట్టింది. ఎవరైతే, ఫిబ్రవరి 28లోపు తమ పాలసీలకు పాన్-నెంబర్ లింకు చేస్తారో వారికి మాత్రమే 10 శాతం రాయితీ ఇవ్వనున్నట్లు తెలిపింది. ఈ ప్రకటనతో ఇప్పటివరకు 60-70 లక్షల మంది తమ పాన్(శాశ్వత ఖాతా నంబర్లు) కార్డు నెంబర్లను వెబ్సైట్లో అప్డేట్ చేసినట్లు చైర్మన్ ఎంఆర్.కుమార్ తెలిపారు. ఎల్ఐసీ ఐపీఓకు ముందు పాలసీదారుల నుంచి అద్భుతమైన స్పందన వస్తున్నట్లు చైర్మన్ పేర్కొన్నారు. మార్చిలో ప్రారంభ పబ్లిక్ ఆఫరింగ్(ఐపీఓ)కు వచ్చేందుకు సిద్ధంగా ఉన్న ప్రభుత్వ యాజమాన్యంలోని జీవిత బీమా ఎల్ఐసీ డీమ్యాట్ ఖాతాలు లేని పాలసీదారులకు కూడా సహాయం చేయనున్నట్లు అన్నారు. "మా పాలసీదారులు తమ పాన్ నెంబర్ లింక్ చేయడంలో సహాయపడటానికి మేము అన్ని కార్యాలయాలతో సమావేశాలు జరుపుతున్నాము. డీమ్యాట్ ఖాతాలు లేని పాలసీదారులకు సహాయం చేయడానికి ఎన్.ఎస్.డీ.ఎల్, సీడిఎస్ఎల్ సహకారం తీసుకుంటున్నాము" అని ఎల్ఐసీ చైర్మన్ ఎంఆర్.కుమార్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ తెలిపారు. తాజాగా, ఫిబ్రవరి 13కు ముందు ఎల్ఐసీ పాలసీలను కొనుగోలు చేసిన వారు మాత్రమే(డ్రాఫ్ట్ రెడ్ హెర్రింగ్ ప్రాస్పెక్టస్ దాఖలు చేసిన తేదీ) ఈ కోటాకు అర్హులు అని చైర్మన్ పేర్కొన్నారు. గత సంవత్సరం ఎల్ఐసీ చట్టం, 1956కు చేసిన సవరణ చేసి ఐపీఓలో పాల్గొనే పాలసీదారులు & వాటాదారులకు రాయితీ ఇచ్చేందుకు ఎల్ఐసీ మార్గం సుగమం చేసింది. (చదవండి: మూడు సహకార బ్యాంకులకు గట్టి షాకిచ్చిన ఆర్బీఐ..!) -
చేతుల్లో డబ్బులు లేవా..? అయితే మీ ఎల్ఐసీ పాలసీ ప్రీమియంను ఇలా చెల్లించండి...!
భవిష్యత్తు అవసరాల దృష్ట్యా విద్యా, ఆరోగ్య, ప్రమాద బీమా పాలసీలను మనలో చాలా మంది తీసుకుంటుంటాం. సమయానికి ఆయా పాలసీ ప్రీమియం చెల్లిస్తే ఫైన్ల నుంచీ తప్పించుకొనే అవకాశం ఉంది. ఒక వేళ సదరు పాలసీ ప్రీమియంను చేతిలో డబ్బులు లేక చెల్లించకపోతే ఆ పాలసీకి కాస్త బ్రేక్స్ పడే అకాశాలున్నాయి. ఐతే లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్ఐసి) పాలసీని కలిగి ఉన్న ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్ఓ) సభ్యులు తమ జీవిత బీమా పాలసీ ప్రీమియంను చెల్లించడానికి తమ ఈపీఎఫ్ డబ్బును ఉపయోగించుకోవడానికి అర్హులు. ఈ సౌకర్యాన్ని ఈపీఎఫ్ఓ కల్పిస్తోంది. టాక్స్, పెట్టుబడి నిపుణుల అభిప్రాయం ప్రకారం...ఈపీఎఫ్ఓ సభ్యుడు కనీసం రెండు సంవత్సరాల LIC పాలసీ ప్రీమియం వరకు ఈపీఎఫ్ బ్యాలెన్స్ కలిగి ఉంటే, LIC ప్రీమియం చెల్లింపు కోసం ఈపీఎఫ్ ఖాతాలోని తన డబ్బును ఉపయోగించవచ్చు. ఉద్యోగం కోల్పోవడం లేదా మరేదైనా కారణాల వల్ల ఆర్థిక ఒత్తిడిలో ఉన్న ఈపీఎఫ్ఓ చందాదారులు ఈపీఎఫ్ ఖాతా నుంచి పాలసీ పునరుద్ధరణ చెల్లింపుతో వారి LIC పాలసీని కొనసాగించవచ్చును. ఈపీఎఫ్ ఖాతా నుంచి LIC ప్రీమియం చెల్లించడానికి, సదరు ఉద్యోగి ఈపీఎఫ్ఓ వద్ద ఫారమ్ 14ను సమర్పించాలి. అయితే, దీన్ని సమర్పించేటప్పుడు ఈపీఎఫ్ఓ కార్యాలయంలో ఫారమ్ 14, సమర్పణ సమయంలో ఈపీఎఫ్ బ్యాలెన్స్ కనీసం రెండు సంవత్సరాల LIC ప్రీమియం మొత్తంలో ఉండేలా చూసుకోవాలి ఎల్ఐసీ ప్రీమియం పునరుద్ధరణ నిబంధనల ప్రకారం, ప్రీమియం ఆలస్యంగా చెల్లించిన కూడా ఆయా పాలసీని పునరుద్ధరించడానికి LIC అనుమతిస్తుంది. పాలసీ పునరుద్ధరణ తేదీ నుంచి 6 నెలల తర్వాత పాలసీ పునరుద్ధరణపై ఎటువంటి ఆలస్య రుసుము విధించబడదు. 6 నెలల నుంచి 3 సంవత్సరాల పాలసీ పునరుద్ధరణ తేదీ తర్వాత LIC పాలసీని పునరుద్ధరించినప్పుడు, పాలసీ ప్రీమియంతో పాటు కొంత ఆలస్య రుసుమును చెల్లించవలసి ఉంటుంది. కాగా ప్రీమియం చెల్లింపు కోసం ఈపీఎఫ్ డబ్బును కేవలం చివరి ప్రయత్నంగా మాత్రమే ఉపయోగించాలి. -
ఎల్ఐసీ ఐపీఓకు వచ్చేది అప్పుడేనా..?
మదుపర్లలో ఎంతో ఆసక్తి రేకిస్తున్న ప్రభుత్వ రంగ భీమా దిగ్గజం ఎల్ఐసీ ఐపీఓకు మార్చి 11న వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. 8 బిలియన్ డాలర్ల పబ్లిక్ ఇష్యూతో లైఫ్ ఇన్స్యూరెన్స్ కార్ప్(ఎల్ఐసీ) మార్చి 11న యాంకర్ పెట్టుబడిదారుల కోసం ఐపీఓకు రానున్నట్లు రాయిటర్స్ తెలిపింది. రెండు రోజుల తర్వాత ఇతర పెట్టుబడిదారులకు పబ్లిక్ ఇష్యూ అందుబాటులోకి వస్తుందని తెలుస్తుంది. ఎల్ఐసీ ఐపీఓ మార్చి మొదటి వారంలో సెబీ నుంచి అనుమతి పొందనున్నట్లు రాయిటర్స్ పేర్కొంది. అలాగే, సెబీ నుంచి అనుమతి పొందిన తర్వాత పబ్లిక్ ఇష్యూ ధరను నిర్ణయించే అవకాశం ఉంది. అయితే, ఈ విషయంపై ఎల్ఐసీ వ్యాఖ్యానించడానికి నిరాకరించింది. కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ కూడా దీనిపై ఎలాంటి ప్రకటన చేయలేదు. అయితే, ఐపీఓ లాంఛ్ షెడ్యూల్ మారవచ్చని అధికార వర్గాలు తెలిపాయి. ప్రభుత్వ నిర్వహణలో ఉన్న ఈ బీమా కంపెనీ షేర్ల ధర ఒక్కొక్కటి రూ.2,000 నుంచి రూ.2,100 మధ్య ఉండవచ్చని బ్లూమ్ బెర్గ్ బుధవారం నివేదించింది. దేశంలోని అతిపెద్ద బీమా సంస్థ ఎల్ఐసీ ఆదివారం మార్కెట్ రెగ్యులేటర్ సెబీకి మూసాయదా పత్రాలను దాఖలు చేసింది. భారత ప్రభుత్వం తనకున్న 100 శాతం వాటాలో 5% వాటాను విక్రయించి దాదాపు 8 బిలియన్ డాలర్లను సేకరించాలని చూస్తుంది. ఎల్ఐసీ మార్చి మధ్యనాటికి పబ్లిక్ షేర్లను జారీ చేసే అవకాశం ఉన్నట్లు అధికార వర్గాలు గత నెలలో రాయిటర్స్'కు తెలిపాయి. స్థూల దేశీయోత్పత్తి(జీడీపీ)లో 6.4% ద్రవ్యలోటు లక్ష్యాన్ని చేరుకోవడానికి ప్రభుత్వం మార్చి చివరినాటికి ఐపీఓను పూర్తి చేయాలని తొందరపడుతోంది. ఇది ఈ పబ్లిక్ ఇష్యూ ద్వారా సుమారు 60,000 కోట్ల రూపాయలు సేకరించాలని అనుకుంటుంది. ఎల్ఐసీ ఐపీఓలో జాబితా చేసిన తర్వాత రూ.8-10 లక్షల కోట్ల మార్కెట్ క్యాపిటలైజేషన్ విలువతో దేశంలో అతిపెద్ద సంస్థగా మారే అవకాశం ఉంది. (చదవండి: వేసవి కాలంలో కరెంటు కోతలు తప్పవా..?) -
ఎల్ఐసీ వద్ద క్లెయిమ్ చేయని నిధి రూ. 21,500 కోట్లు..!
న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ జీవిత బీమా సంస్థ ఎల్ఐసీ వద్ద క్లెయిమ్ చేయని పాలసీదారుల నిధులు 2021 సెప్టెంబర్ నాటికి రూ.21,500 కోట్ల మేర ఉన్నాయి. ఐపీవో కోసం సెబీ వద్ద దరఖాస్తు చేసిన పత్రాల్లో (డీఆర్‌హెచ్‌పీ) ఎల్ఐసీ ఈ వివరాలను పేర్కొంది. క్లెయిమ్ చేయని అసలుతోపాటు, దానిపై వడ్డీ కలిపి ఈ మొత్తం ఉన్నట్టు తెలిపింది. క్లెయిమ్ చేయని నిధి 2019 మార్చి నాటికి రూ.13,843 కోట్లు, 2020 మార్చి నాటికి రూ.16,052 కోట్లు, 2021 మార్చి నాటికి రూ.18,495 కోట్ల చొప్పున ఉన్నట్టు పేర్కొంది. రూ.1,000 అంతకుమించి క్లెయిమ్ చేయని ఫండ్స్ వివరాలను తన వెబ్సైట్లోనూ ఎల్ఐసీ ప్రకటించాల్సి ఉంటుంది. దానివల్ల పాలసీదారులు తమకు రావాల్సిన ప్రయోజనాల గురించి తెలుసుకునేందుకు వీలుంటుంది. పదేళ్లపాటు ఇలా క్లెయిమ్ రాకపోతే ఆ మొత్తాన్ని సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ ఫండ్ (ఎస్‌సీడబ్ల్యూఎఫ్)కు బదిలీ చేయాలని ఐఆర్డీఏఐ నిబంధనలు చెబుతున్నాయి. అన్ని బీమా సంస్థలకు ఇవే నిబంధనలు వర్తిస్తాయి. -
ఎల్ఐసీ ఐపీఓలో పాల్గొనాలని అనుకుంటున్నారా? మీ పాన్ ను ఇలా అప్డేట్ చేయండి!
రాబోయే పబ్లిక్ ఇష్యూలో (ఐపీఓ) షేర్లను కొనుగోలు చేసేందుకు ఎల్ఐసీ పాలసీదారులు ఫిబ్రవరి 28లోగా తమ పర్మనెంట్ అకౌంటు నంబరు (పాన్) వివరాలను.. పాలసీ రికార్డులో అప్డేట్ చేసుకోవాల్సి రానుంది. ఇదే విషయాన్ని మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి ఫిబ్రవరి 13న ఎల్ఐసీ దాఖలు చేసిన ముసాయిదా ప్రాస్పెక్టస్‌లో సంస్థ ఈ విషయం పేర్కొంది. అయితే ఇప్పుడు మనం ఎల్ఐసీ పాలసీ లో పాన్ నెంబర్‌ను ఎలా అప్ డేట్ చేయాలో తెలుసుకుందాం. ► కార్పొరేషన్ వెబ్సైట్ www.licindia.in లేదా https://licindia.in/Home/Online-PAN-Registrationని సందర్శించండి ►మీ పాలసీ నంబర్, పాన్, పుట్టిన తేదీ, ఇ-మెయిల్ ఐడిని సిద్ధంగా ఉంచుకోండి, మీ పాన్‌ను అప్డేట్ చేస్తున్నప్పుడు నింపాల్సిన అవసరం ఉంది. ►మీరు పై లింక్‌ని ఉపయోగించి మీ అన్ని LIC పాలసీల రికార్డులను అప్డేట్ చేయవచ్చు. ►మీరు కార్పొరేషన్ వెబ్సైట్ www.licindia.in లేదా https://linkpan.licindia.in/UIDSeedingWebApp/getPolicyPANStatusని సందర్శించడం ద్వారా మీ పాలసీలో మీ పాన్ అప్డేట్ అఅయ్యిందా లేదా అని తెలుసుకోవచ్చు. ► ప్రత్యామ్నాయంగా, మీరు మీ ఎల్ఐసీ ఏజెంట్‌ని కూడా సంప్రదించవచ్చు. -
ఎల్ఐసీ పాలసీదారులకు అలర్ట్..! కచ్చితంగా..
ముంబై: రాబోయే పబ్లిక్ ఇష్యూలో (ఐపీవో) షేర్లను కొనుగోలు చేసేందుకు ఎల్ఐసీ పాలసీదారులు ఫిబ్రవరి 28లోగా తమ పర్మనెంట్ అకౌంటు నంబరు (పాన్) వివరాలను.. పాలసీ రికార్డులో అప్డేట్ చేసుకోవాల్సి రానుంది. మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి ఫిబ్రవరి 13న ఎల్ఐసీ దాఖలు చేసిన ముసాయిదా ప్రాస్పెక్టస్‌లో సంస్థ ఈ విషయం పేర్కొంది. ప్రాస్పెక్టస్ దాఖలు చేసిన రెండు వారాలు ముగిసేలోగా పాన్ వివరాలను ఎల్ఐసీ వద్ద అప్డేట్ చేసుకోని పాలసీదార్లను..షేర్ల కొనుగోలుగా అర్హులుగా పరిగణించబోమని తెలిపింది. కంపెనీ వెబ్సైట్లో నేరుగా లేదా ఏజెంట్ల సహాయంతో అప్డేషన్ చేసుకోవచ్చని వివరించింది. డీఆర్‌హెచ్‌పీ దాఖలు చేసే నాటికి, బిడ్/ఆఫర్ ప్రారంభమయ్యే తేదీ నాటికి ఒకటి లేదా అంతకు మించి పాలసీలు ఉన్న వారు.. పాలసీహోల్డర్ రిజర్వేషన్ పోర్షన్ కింద షేర్ల కోసం దరఖాస్తు చేసుకునేందుకు అర్హులై ఉంటారని పేర్కొంది. వారికి డీమ్యాట్ ఖాతా కూడా ఉండాలి. ఇష్యూలో దాదాపు 10 శాతం వరకూ పాలసీదారుల కోసం కేటాయించవచ్చని, పాలసీహోల్డర్లకు ఐపీవో ఇష్యూ ధరలో దాదాపు 10 శాతం వరకూ డిస్కౌంటు లభించే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం.. ఐపీవో కింద ఎల్ఐసీలో 5% వాటా (31.6 కోట్ల షేర్లు) విక్రయించనుంది. దీని విలువ దాదాపు రూ. 63,000 కోట్లుగా ఉంటుందని, ఇష్యూ మార్చిలో ఉంటుందని అంచనా. చదవండి: ఎల్ఐసీ ఐపీఓలో పాల్గొనే పాలసీదారులకు షాక్..!