న్యూఢిల్లీ: పెట్టుబడిదారులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఎల్ఐసీ ఐపీఓకు మార్కెట్ రెగ్యులేటర్ సెబీ ఆమోదం తెలిపింది. సాధారణంగా ఏదైనా ఒక కంపెనీ ఐపీఓకు దరఖాస్తు చేసుకున్న 30-40 రోజుల తర్వాత సెబీ ఆమోదం తెలుపుతుంది. కానీ, ఎల్ఐసీ ఐపీఓ విషయంలో మార్కెట్ రెగ్యులేటర్ 22 రోజుల్లో ఆమోదం తెలపడం విశేషం. ఎల్ఐసీ ఫిబ్రవరిలో తన ముసాయిదా పత్రాలను మార్కెట్ రెగ్యులేటర్ సంస్థకు దాఖలు చేసింది.
బీమా కంపెనీలో 100 శాతం వాటాను కేంద్ర ప్రభుత్వ కలిగి ఉంది. ఎల్‌ఐసీలో 5 శాతం వాటాకు సమానమైన 31.6 కోట్లకు పైగా ఈక్విటీ షేర్లను రూ.10 ముఖ విలువతో ప్రభుత్వం విక్రయించనుంది. దీంతో, కేంద్ర ప్రభుత్వ ఖజానాకు రూ.63,000 కోట్ల వరకు వచ్చి చేరతాయని మర్చంట్ బ్యాంకర్ల అంచనా. తద్వారా ఇదే దేశీయంగా అతిపెద్ద ఇష్యూగా నిలవనుంది. ఈ ఇష్యూ పూర్తిగా ఆఫర్ ఫర్ సేల్(ఓఎఫ్‌ఎస్) రూపంలో జరగనుంది. సంస్థలో 100 శాతం వాటా (632.49 కోట్ల షేర్లను) కలిగిన ప్రభుత్వం 5 శాతం వాటాను ఇలా విక్రయించనుంది. కొత్తగా షేర్లు ఏమీ జారీ చేయడం లేదు. ఒకసారి సెబీ అనుమతి లభించిన తర్వాత ఐపీఓకి వెళ్లడమే ఇక తరువాయి. అది ఎప్పడన్నది కేంద్ర ప్రభుత్వం నిర్ణయించాల్సి ఉంది.
(చదవండి: డెట్ ఇష్యూల్లో రూ.5 లక్షల వరకు పెట్టుబడులకు యూపీఐ)
Comments
Please login to add a commentAdd a comment