DRHP
-
ఐపీఓతో రూ.4,000 కోట్లు సమీకరణ
కమ్యునిషన్ పరికరాలు, బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ వంటి వ్యక్తిగత రక్షణ ఉత్పత్తులను తయారు చేస్తున్న ఎస్పీపీ లిమిటెడ్ సంస్థ ఐపీఓతో స్టాక్ మార్కెట్లో లిస్ట్ అవ్వనుంది. సంస్థ వ్యాపారంపై ఆసక్తి ఉన్న పెట్టుబడిదారుల నుంచి రూ.4,000 కోట్లు సమీకరించాలని కంపెనీ భావిస్తోంది. ఈమేరకు మార్కెట్ల నియంత్రణ సంస్థ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా(సెబీ)కు డీఆర్‌హెచ్‌పీ దాఖలు చేసింది.ఇదీ చదవండి: గూగుల్‌లో 15 జీబీ స్టోరేజ్ నిండిందా? ఇలా చేయండి..ఈ ఆఫర్లో భాగంగా రూ.580 కోట్ల విలువ చేసే షేర్లను తాజాగా జారీ చేయనుండగా, సెల్లింగ్ షేర్హోల్డర్లు రూ.3,420 కోట్ల వరకు విలువ చేసే షేర్లను ఆఫర్ ఫర్ సేల్ మార్గంలో విక్రయించనున్నారు. డీఆర్‌హెచ్‌పీ ప్రక్రియ పూర్తయిన తర్వాత ఎస్ఎంపీపీ లిమిటెడ్ షేర్లు బీఎస్ఈ, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఎన్ఎస్ఈ)లో లిస్ట్ అవుతాయి. అయితే ఐపీఓ కోసం ఎప్పుడు దరఖాస్తు చేసుకోవాలి.. చివరి తేదీ ఎప్పుడు.. లిస్టింగ్ ప్రైస్, లాట్ సైజ్.. వంటి పూర్తి వివరాలు ఇంకా వెలువడాల్సి ఉంది. -
కారణం చెప్పకుండా ఐపీవో ఉపసంహరణ
న్యూఢిల్లీ: ఆటో విడిభాగాల సంస్థ హీరో మోటార్స్ కంపెనీ(హెచ్ఎంసీ) పబ్లిక్ ఇష్యూ ప్రతిపాదన నుంచి వెనక్కు తగ్గింది. క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి దాఖలు చేసిన ముసాయిదా ప్రాస్పెక్టస్‌ను తాజాగా ఉపసంహరించుకుంది. ఐపీవో ద్వారా రూ.900 కోట్లు సమీకరించాలని తొలుత భావించింది. ఇందుకు అనుగుణంగా సెబీకి ఆగస్ట్‌లో ప్రాథమిక పత్రాలను దాఖలు చేసింది. దీనిలో భాగంగా రూ.500 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయడంతోపాటు.. మరో రూ.400 కోట్ల విలువైన షేర్లను ఆఫర్ చేసేందుకు ప్రమోటర్లు ఆసక్తి చూపారు. అయితే కారణం వెల్లడించకుండానే ప్రాస్పెక్టస్‌ను వెనక్కి తీసుకుంటున్నట్లు కంపెనీ తాజాగా తెలియజేసింది. ఐపీవోలో ఓపీ ముంజాల్ హోల్డింగ్స్ రూ.250 కోట్లు, హీరో సైకిల్స్, భాగ్యోదయ్ ఇన్వెస్ట్మెంట్స్ రూ.75 కోట్లు చొప్పున షేర్లను ఆఫర్ చేయాలని భావించాయి. కంపెనీ ప్రధానంగా ఆటోమోటివ్ దిగ్గజాలకు హైఇంజినీర్డ్ పవర్‌ట్రయిన్ సొల్యూషన్ల తయారీ, సరఫరాలో ఉంది.ఇదీ చదవండి: కస్టమర్ల నుంచి 10 వేల ఫిర్యాదులుసురక్షా డయాగ్నోస్టిక్ రెడీసమీకృత డయాగ్నోస్టిక్ సేవల కంపెనీ సురక్షా డయాగ్నోస్టిక్ పబ్లిక్ ఇష్యూకి రానుంది. ఇందుకు క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ తాజాగా గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. కంపెనీ స్టాక్ ఎక్స్ఛేంజీల్లో లిస్టింగ్‌కు వీలుగా జులైలోనే ప్రాథమిక పత్రాలను సెబీకి దాఖలు చేసింది. ఐపీవోలో భాగంగా 1.92 కోట్ల ఈక్విటీ షేర్లను కంపెనీ ప్రమోటర్లు, ప్రస్తుత వాటాదారులు విక్రయానికి ఉంచనున్నారు. కంపెనీ జులైలో చేపట్టేందుకు సన్నాహాలు ప్రారంభించింది. ముసాయిదా ప్రాస్పెక్టస్ ప్రకారం ఐపీవో నిధులు కంపెనీ ప్రమోటర్లు, వాటాదారులకు అందనున్నాయి. వెరసి కంపెనీకి ఐపీవో నిధులు లభించవు. కంపెనీ పాథాలజీ, రేడియాలజీ టెస్టింగ్, మెడికల్ కన్సల్టేషన్ సర్వీసులు అందిస్తోంది. -
ఐపీవోకి ఆస్క్ ఆటోమోటివ్
న్యూఢిల్లీ: బ్రేక్-షూ, అడ్వాన్స్డ్ బ్రేకింగ్ సిస్టమ్స్ తయారీ సంస్థ ఆస్క్ ఆటోమోటివ్ .. పబ్లిక్ ఇష్యూ (ఐపీవో) ద్వారా నిధులను సమీకరించనుంది. దీనికి సంబంధించి మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి ముసాయిదా పత్రాలను సమర్పించింది. వీటి ప్రకారం ఈ ఇష్యూ పూర్తిగా ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్ఎస్) విధానంలో ఉండనుంది. ప్రమోటర్లు కుల్దీప్ సింగ్ రాఠీ, విజయ్ రాఠీ 2,95,71,390 షేర్లను విక్రయించనున్నారు. ప్రస్తుతం కుల్దీప్‌నకు 41.33 శాతం, విజయ్‌కి 32.3 శాతం వాటాలు ఉన్నాయి. ఇష్యూ పూర్తిగా ఓఎఫ్ఎస్ విధానంలోనే ఉంటుంద కాబట్టి ఐపీవో నిధులన్నీ ప్రమోటర్లకే లభించ నున్నాయి. కంపెనీకి చెందవు. ఆస్క్ ఆటోమోటివ్కి టీవీఎస్ మోటర్ కంపెనీ, హీరో మోటోకార్ప్, గ్రీవ్స్ ఎలక్ట్రిక్ మొబిలిటీ, బజాజ్ ఆటో వంటివి క్లయింట్లుగా ఉన్నాయి. 2022 ఆర్థిక సంవత్సరంలో మార్కెట్ వాటా దాదాపు 50 శాతంగా నమోదైంది. (SaradhaChitFundScam: పెట్టుబడిదారుల సొమ్ము రికవరీకి శారదా ఆస్తుల వేలం) గురుగ్రామ్‌కు చెందిన ఆస్క్ ఆటోమోటివ్ 2022 ఆర్థిక సంవత్సరంలో సుమారు 50 శాతం మార్కెట్ వాటాతో భారతదేశంలో ద్విచక్ర వాహనాల కోసం బ్రేక్-షూ, అధునాతన బ్రేకింగ్ సిస్టమ్‌ల అతిపెద్ద తయారీదారులలో ఒకటిగా ఉంది. (MRF బెలూన్లు అమ్మి, కటిక నేలపై నిద్రించి: వేల కోట్ల ఎంఆర్ఎఫ్ సక్సెస్ జర్నీ) మరిన్ని ఇంట్రస్టింగ్ వార్తలు, బిజినెస్ వ న్యూస్ కోసం చదవండి: సాక్షిబిజినెస్ -
ఐపీవోకు నోవా అగ్రిటెక్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: సస్యరక్షణ ఉత్పత్తుల తయారీలో ఉన్న హైదరాబాద్ కంపెనీ నోవా అగ్రిటెక్ ఐపీవోకు రానుంది. ఐపీవోలో భాగంగా రూ.140 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. వీటికి జతగా కంపెనీ ప్రమోటర్ నూతలపాటి వెంకట సుబ్బారావు 77.58 లక్షల షేర్లను ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్ఎస్) ద్వారా విక్రయించనున్నారు. అయితే ఓఎఫ్ఎస్ ద్వారా ఒక్కో షేరును ఎంతకు ఆఫర్ చేస్తారనే విషయాన్ని వెల్లడించలేదు. కంపెనీలో ఆయనకున్న మొత్తం వాటా 11.9 శాతం విక్రయించనున్నారు. ఈక్విటీ జారీ నిధులను అనుబంధ కంపెనీ నోవా అగ్రి సైన్సెస్ ద్వారా కొత్త ఫార్ములేషన్ ప్లాంటు ఏర్పాటుకు వెచ్చిస్తారు. అలాగే ఇప్పటికే ఉన్న ప్లాంటు విస్తరణకు సైతం ఖర్చు చేస్తారు. కంపెనీ షేర్లను ఎన్ఎస్ఈ, బీఎస్ఈలో లిస్ట్ చేయనుంది. -
దేశంలో తగ్గని ఐపీవో జోరు.. ఐపీవోకి సిద్దంగా దిగ్గజ జ్యుయలరీ కంపెనీ!
న్యూఢిల్లీ: రిటైల్ జ్యుయలరీ సంస్థ జోయాలుక్కాస్ ఇండియా తాజాగా పబ్లిక్ ఇష్యూ ద్వారా రూ. 2,300 కోట్లు సమీకరించనుంది. ఇందుకు సంబంధించిన ముసాయిదా పత్రాలను మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి సమర్పించింది. ఐపీవోలో భాగంగా కొత్తగా షేర్లను జారీ చేయనున్నామని, ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్ఎస్) విధానంలో షేర్ల విక్రయం ఉండబోదని సంస్థ తెలిపింది. పబ్లిక్ ఇష్యూ ద్వారా సమీకరించిన నిధుల్లో రూ.1,400 కోట్ల మొత్తాన్ని.. ఇతరత్రా రుణాల తిరిగి చెల్లింపునకు, రూ.464 కోట్లు కొత్తగా ఎనిమిది షోరూమ్‌ల ఏర్పాటు కోసం, మిగతా మొత్తాన్ని ఇతరత్రా కార్పొరేట్ అవసరాల కోసం వినియోగించనున్నట్లు వివరించింది. జోయాలుక్కాస్ సంస్థ బంగారం, ప్లాటినం, వజ్రాభరణాలు మొదలైన వాటిని విక్రయిస్తోంది. గత ఆర్థిక సంవత్సరంలో కంపెనీ రూ. 8,066 కోట్ల ఆదాయంపై రూ. 472 కోట్ల మేర లాభం నమోదు చేసింది. 90 శాతం ఆదాయం దక్షిణాది ప్రాంతాల నుంచి లభిస్తోంది. వచ్చే రెండేళ్లలో తెలంగాణ, మహారాష్ట్ర తదితర రాష్ట్రాల్లో కొత్తగా 8 షోరూమ్‌లు ప్రారంభించాలని యోచిస్తోంది. (చదవండి: పెరిగిన కేంద్ర ప్రభుత్వ రుణ భారం.. అప్పు ఎన్ని లక్షల కోట్లు తెలుసా?) -
రూ. 480 కోట్ల సమీకరణలో హెచ్ఎంఏ ఆగ్రో
న్యూఢిల్లీ: ఫ్రోజెన్ మాంసం ఎగుమతిదారు హెచ్ఎంఏ ఆగ్రో ఇండస్ట్రీస్ .. ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్ (ఐపీవో) ద్వారా రూ. 480 కోట్లు సమీకరించనుంది. ఇందుకు సంబంధించిన ముసాయిదా పత్రాలను (డీఆర్‌హెచ్‌పీ) మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి సమర్పించింది. కొత్తగా షేర్ల జారీ ద్వారా రూ. 150 కోట్లు, ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్ఎస్) విధానంలో ప్రమోటర్ల షేర్ల విక్రయం ద్వారా దాదాపు రూ. 330 కోట్లు సమీకరించనున్నట్లు సంస్థ పేర్కొంది. డీఆర్‌హెచ్‌పీ ప్రకారం ఓఎఫ్ఎస్లో భాగంగా ప్రమోటర్లయిన వాజిద్ అహ్మద్ రూ. 120 కోట్లు విలువ చేసే షేర్లు, గుల్జార్ అహ్మద్, మెహ్మూద్ ఖురేషి తదితరులు తలో రూ. 49 కోట్లు విక్రయించనున్నారు. ఐపీవో ద్వారా సమీకరించిన నిధుల్లో రూ. 135 కోట్లను .. వర్కింగ్ క్యాపిటల్ తదితర అవసరాల కోసం కంపెనీ వినియోగించుకోనుంది. హెచ్ఎంఏ ఆగ్రో ఇండస్ట్రీస్ దాదాపు 40 దేశాలకు మాంసం ఎగుమతి చేస్తోంది. ఆదాయంలో 90 శాతం వాటా ఎగుమతులదే ఉంటోంది. గత ఆర్థిక సంవత్సరంలో ఆదాయం రూ. 1,720 కోట్లు కాగా రూ. 73 కోట్ల లాభం నమోదు చేసింది. -
ఎల్ఐసీ వద్ద క్లెయిమ్ చేయని నిధి రూ. 21,500 కోట్లు..!
న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ జీవిత బీమా సంస్థ ఎల్ఐసీ వద్ద క్లెయిమ్ చేయని పాలసీదారుల నిధులు 2021 సెప్టెంబర్ నాటికి రూ.21,500 కోట్ల మేర ఉన్నాయి. ఐపీవో కోసం సెబీ వద్ద దరఖాస్తు చేసిన పత్రాల్లో (డీఆర్‌హెచ్‌పీ) ఎల్ఐసీ ఈ వివరాలను పేర్కొంది. క్లెయిమ్ చేయని అసలుతోపాటు, దానిపై వడ్డీ కలిపి ఈ మొత్తం ఉన్నట్టు తెలిపింది. క్లెయిమ్ చేయని నిధి 2019 మార్చి నాటికి రూ.13,843 కోట్లు, 2020 మార్చి నాటికి రూ.16,052 కోట్లు, 2021 మార్చి నాటికి రూ.18,495 కోట్ల చొప్పున ఉన్నట్టు పేర్కొంది. రూ.1,000 అంతకుమించి క్లెయిమ్ చేయని ఫండ్స్ వివరాలను తన వెబ్సైట్లోనూ ఎల్ఐసీ ప్రకటించాల్సి ఉంటుంది. దానివల్ల పాలసీదారులు తమకు రావాల్సిన ప్రయోజనాల గురించి తెలుసుకునేందుకు వీలుంటుంది. పదేళ్లపాటు ఇలా క్లెయిమ్ రాకపోతే ఆ మొత్తాన్ని సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ ఫండ్ (ఎస్‌సీడబ్ల్యూఎఫ్)కు బదిలీ చేయాలని ఐఆర్డీఏఐ నిబంధనలు చెబుతున్నాయి. అన్ని బీమా సంస్థలకు ఇవే నిబంధనలు వర్తిస్తాయి. -
ఎల్ఐసీ ఐపీఓలో పాల్గొనే పాలసీదారులకు షాక్..!
ప్రభుత్వ రంగ సంస్థ ఎల్ఐసీ ఐపీఓ వెళ్లేందుకు సిద్ధమైన విషయం తెలిసిందే. ఈ ఐపీఓలో పాల్గొనే పాలసీదారులకు ఎల్ఐసీ బంఫర్ ఆఫర్ ప్రకటించింది. ఐపీఓ కింద అందించే మొత్తం షేర్లలో 10% వరకు ఎల్ఐసీ పాలసీదారులకు రిజర్వ్ చేయనున్నారు. అలాగే, ఈ ప్రభుత్వ-ఆధారిత లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్(LIC) రాబోయే ప్రారంభ పబ్లిక్ ఆఫర్(IPO)లో పాలసీదారులకు షేర్లను తక్కువ ధరకు విక్రయించే అవకాశం ఉంది అని గతంలో డిపార్ట్మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అండ్ పబ్లిక్ అసెట్ మేనేజ్మెంట్(దీపం) సెక్రటరీ తుహిన్ కాంత పాండే అన్నారు. అయితే, ఈ ఐపీఓలో అనేక మంది పాలసీదారులు పాల్గొనేందుకు అవకాశం ఉంది. ఇందులో పాల్గొన్న ప్రతి పాలసీదారుడికి రాయితీ లభించే అవకాశం లేదు. కొందరికి మాత్రమే షేర్ల మీద రాయితీ లభించే అవకాశం ఉంది. ఎల్ఐసీ ఐపీఓలో ఎవరు, రాయితీ గల షేర్లను పొందలేరు అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఒకవేళ మీ జీవిత భాగస్వామి & మీ పేరిట ఉమ్మడి డీమ్యాట్ అకౌంట్ ఉన్నట్లయితే(ఇద్దరూ పాలసీదారులైనప్పటికి) ఆ జాయింట్ డీమ్యాట్ అకౌంట్ ద్వారా మీరు ఆఫర్ పొందలేరు. సెబీ ఐసీడీఆర్ నిబంధనల ప్రకారం.. ఉమ్మడి డీమ్యాట్ ఖాతా గల లబ్ధిదారులలో ప్రాథమిక లబ్ధిదారుడు మాత్రమే రాయితీ పొందే అవకాశం ఉంటుంది. దరఖాస్తు చేసుకోవడానికి మొదటి/ప్రాథమిక లబ్ధిదారుని పేరును మాత్రమే ఉపయోగించవచ్చు. ప్రస్తుతం యాన్యుటీలను పొందుతున్న యాన్యుటీ పాలసీదారు(ఇప్పుడు మరణించిన) జీవిత భాగస్వామి ఎల్ఐసీ ఐపీఓలో ఈక్విటీ షేర్లకు దరఖాస్తు చేయడానికి అర్హత కలిగి లేరు. పాలసీదారుడు అతడి/ఆమె పేరిట డీమ్యాట్ అకౌంట్ కలిగి ఉండాలి. పాలసీదారుడు తన జీవిత భాగస్వామి లేదా కుమారుడు లేదా బంధువు డీమ్యాట్ ఖాతా నుంచి దరఖాస్తు చేసుకోలేరు. పాలసీదారు రిజర్వేషన్ పోర్షన్ ద్వారా ఎన్ఆర్ఐలు ఐపీఓ కోసం దరఖాస్తు చేయలేరు. బిడ్ లేదా ఆఫర్ కాలంలో భారతదేశంలో నివసిస్తున్న వ్యక్తి మాత్రమే ఆఫర్లో పాల్గొనే అవకాశం ఉంటుంది. ఏదైనా ఒక పాలసీకి నామినీ గల వ్యక్తులు తమ పేరుతో ఈక్విటీ షేర్లకు బిడ్ చేయడానికి అర్హత లేదు. అర్హత కలిగిన పాలసీదారుడు(లు) మాత్రమే పాలసీదారు రిజర్వేషన్ పోర్షన్ కింద బిడ్ చేయడానికి అర్హులు. గ్రూపు పాలసీలు కాకుండా ఇతర పాలసీలు పాలసీదారుడు రిజర్వేషన్ పోర్షన్లో బిడ్డింగ్ వేయడానికి అర్హత కలిగి ఉంటారు. పాలసీదారు రిజర్వేషన్ పోర్షన్ కింద వేలం వేయడానికి ఎల్ఐసీ పాలసీదారులు మాత్రమే అర్హులు. అయితే, రిబ్ లేదా నాన్ ఇన్ స్టిట్యూషనల్ బిడ్డర్'గా దరఖాస్తు చేసుకోవచ్చు. (చదవండి: బుల్లెట్ రైలు వేగంతో దూసుకెళ్తున్న బంగారం ధర..!) -
ఫ్యాబ్ ఇండియా బంపరాఫర్..వారికి 7 లక్షల షేర్లు ఉచితం..!
న్యూఢిల్లీ: లైఫ్‌స్టయిల్ రిటైల్ దుకాణాల సంస్థ ‘ఫ్యాబ్ ఇండియా’ కళాకారులకు సముచిత గౌరవం ఇవ్వనుంది. త్వరలో ఈ సంస్థ రూ.4,000 కోట్ల నిధుల సమీకరణకు ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్ (ఐపీవో)ను చేపట్టనుంది. దీంతో 7 లక్షల షేర్లను కళాకారులకు (చేతి వృత్తుల వారు), రైతులకు ఉచితంగా ఇవ్వాల ని నిర్ణయించింది. ఐపీవోకు సంబంధించి ముసాయిదా పత్రాలను (డీఆర్‌హెచ్‌పీ) ఈ సంస్థ సెబీ వద్ద శనివారం దాఖలు చేసింది. రూ.500 కోట్ల తాజా ఇష్యూతోపాటు.. ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్ఎస్/ప్రస్తుత వాటాదారులు) రూపంలో 2,50,50,543 షేర్లను విక్రయించనుంది. ‘‘కంపెనీ, కంపెనీ అనుబంధ సంస్థలతో అనుబంధం కలిగిన కళాకారులు, రైతులను గౌరవించడంతోపాటు, వారికి ప్రయోజనం కల్పించాలన్న ఉద్దేశ్యంతోనే ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఫ్యాబ్ ఇండియా ప్రమోటర్లు బిమ్లానంద బిస్సెల్ 4,00,000 షేర్లు, మధుకర్ ఖేరా 3,75,080 షేర్లను కళాకారులకు డీఆర్‌హెచ్‌పీ దాఖలు తర్వాత బదిలీ చేయనున్నారు’’ అంటూ కంపెనీ ప్రకటించింది. -
ఐపీవోల్లో ఇన్వెస్ట్ చేస్తున్నారా?.. వీటిపై కన్నేయండి
మీకు ఒక ఆసక్తికరమైన విషయం తెలుసా..? 2020లో 15 ప్రధాన ఐపీవోలకు గాను 14 కంపెనీల స్టాక్స్ ఇప్పుడు వాటి ఇష్యూ ధరకు పైనే ట్రేడవుతున్నాయి. వీటిల్లో చాలా కంపెనీల రాబడులు 200 శాతానికంటే ఎక్కువే ఉన్నాయి. కొన్ని అయితే ఇప్పటికే 400 శాతం రాబడులను కూడా ఇచ్చాయి. 11 స్టాక్స్ లిస్టింగ్ రోజు నుంచే లాభాలతో మొదలు పెట్టగా.. 6 స్టాక్స్ లిస్టింగ్ రోజే 70 శాతానికి పైగా లాభాన్నిచ్చాయి. ఈ గణాంకాలను చూసి ప్రతీ ఐపీవోను ఆకర్షణీయమైనదిగా భావించడానికి లేదు. ఐపీవోల్లో మీరు చేసే పెట్టుబడులు లాభాలు పంచి పెట్టాలంటే.. ఇన్వెస్టర్‌గా పరిగణనలోకి తీసుకోవాల్సిన అంశాలు కొన్ని ఉన్నాయి. ఒక కంపెనీ స్టాక్ మార్కెట్లో మొదటిసారి లిస్ట్ అయ్యేందుకు వీలు కల్పించేదే ఐపీవో. మార్కెట్లలో లిస్ట్ అయిన తర్వాత ప్రతీ త్రైమాసికానికి సంబంధించి ఆర్థిక గణాంకాలను వెల్లడించాల్సి ఉంటుంది. కానీ, అదే కంపెనీకి సంబంధించిన సమాచారం లిస్టింగ్‌కు ముందు సాధారణంగా బయటకు తెలిసే అవకాశం లేదు. అందుకే ఐపీవోలకు వచ్చే కంపెనీలు ఆర్థిక గణాంకాలను డ్రాఫ్ట్ రెడ్ హెర్రింగ్ ప్రాస్పెక్టస్‌లో (డీహెచ్‌ఆర్‌పీ)లో ఇవ్వడం తప్పనిసరి. కానీ, వీటిని గుడ్డిగా నమ్మడానికి లేదు. ఎందుకంటే కంపెనీలు మార్కెట్ల నుంచి అనుకున్న విధంగా నిధులు సమీకరించేందుకు అనుకూలమైన నివేదికలను రూపొందించే అవకాశం లేకపోలేదు. నిష్పాక్షికంగా వీటిని రూపొందించారని భావించలేము. కనుక ఐపీవోకు దరఖాస్తు చేసుకునే ముందు కంపెనీకి సంబంధించి విస్తృతమైన పరిశోధన చేసి, వీలైనంత సమాచారాన్ని రాబట్టుకోవాలి. ప్రమోటర్ల చరిత్ర, వారిపై ఏవైనా నేరపూరిత అభియోగాలు/ఆరోపణలు ఉన్నాయా?, ఆర్థిక పరిస్థితులు, కంపెనీకి పోటీదారులు, మీడియాలో వాటికి వచ్చిన కవరేజీ, కంపెనీ పనిచేస్తున్న రంగం విస్తరించడానికి అవకాశం ఉందా తదితర సమాచారాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయాలి. ఐపీవోలో మంచి రాబడులను సంపాదించుకోవాలని భావిస్తే ఆయా కంపెనీకి సంబంధించి వీలైనంత సమాచారాన్ని తెలుసుకుని నిర్ణయం తీసుకోవాలి. కంపెనీ వ్యాల్యూయేషన్స్.. ఐపీవోలో తమకు సెక్యూరిటీల కేటాయింపులపైనే ఇన్వెస్టర్ల దృష్టి ఉంటుంది. కానీ, చాలా మంది ఇన్వెస్టర్లు ఆయా కంపెనీల ఆర్థిక మూలాలు, ఐపీవోలో స్టాక్స్ వ్యాల్యూయేషన్ల పట్ల ఎక్కువగా శ్రద్ధ చూపించారు. అయితే, ఐపీవోకు వచ్చే కంపెనీ మూలాలపై లోతైన పరిశోధనకు.. డీఆర్‌హెచ్‌పీలో ఇచ్చిన వివరాలు మినహా అదనపు వివరాలు లభించడం కష్టమైన పనే. సాధారణంగా ఐపీవోకు వచ్చే కంపెనీలు అధిక ధరలకు స్టాక్స్‌ను ఆఫర్ చేస్తుంటాయి. కనుక ఆయా కంపెనీ పనిచేస్తున్న రంగంలోని పోటీ కంపెనీల వ్యాల్యూయేషన్ల్లతో పోల్చి చూడొచ్చు. పోటీ సంస్థల వ్యాల్యూయేషన్లు లేదా ఆయా రంగాల్లోని కంపెనీల వ్యాల్యూయేషన్ల ఆధారంగా నిర్ణయానికి రావడానికి అవకాశం ఉంటుంది. ఇన్స్టిట్యూషన్ల భాగస్వామ్యం.. ఐపీవోల్లో క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లు (క్యూఐబీ/అర్హత కలిగిన సంస్థాగత మదుపుదారులు) కూడా పాలుపంచుకుంటుంటారు. సెబీ వద్ద నమోదైన ఫైనాన్షియల్ ఇన్నిస్టిట్యూషన్స్, బ్యాంకులు, మ్యూచువల్ ఫండ్స్, విదేశీ ఇనిస్టిట్యూషనల్ ఇన్వెస్టర్లు (ఎఫ్ఐఐలు) క్యూఐబీ విభాగం కిందకు వస్తాయి. ఇవి సాధారణంగా ఇతర ఇన్వెస్టర్ల తరఫున ఇన్వెస్ట్ చేస్తుంటాయి. కనుక ఇన్వెస్ట్ చేసే ముందు తగినంత పరిశోధన, అధ్యయనం తప్పక చేస్తాయి. క్యూఐబీలు ఆసక్తిగా ఒక ఐపీవోలో పాల్గొంటున్నారంటే.. ఆ కంపెనీ భవిష్యత్తులో మంచి పనితీరు చూపిస్తుందని ఎక్కువ మంది బెంచ్‌మార్క్‌గా పరిగణిస్తుంటారు. అయితే, నేటి పరిస్థితుల్లో అన్ని సందర్భాల్లోనూ క్యూఐబీల భాగస్వామ్యాన్నే ప్రామాణికంగా తీసుకోవడానికి లేదు. ఒక్కోసారి క్యూఐబీలు సైతం ఏకపక్షంగా వ్యవహరించే అవకాశం లేకపోలేదు. డీఆర్‌హెచ్‌పీ చదవాలి ఐపీవోకు వచ్చే ప్రతీ కంపెనీ కూడా తమ వ్యాపార కార్యకలాపాలు, ఆదాయాలు, ఆస్తులు, అప్పులు, మార్కెట్ అవకాశాలపై సమగ్రమైన వివరాలను డీఆర్‌హెచ్‌పీలో అందుబాటులో ఉంచడం తప్పనిసరి. అంతేకాదు, ఐపీవో ద్వారా సమీకరించే నిధులను ఎందుకు వినియోగించేదీ తెలియజేయాలి. అందుకే ఇన్వెస్టర్లు తాము ఆసక్తిగా ఉన్న ఐపీవోలకు సంబంధించి డీఆర్‌హెచ్‌పీని సమగ్రంగా చదవాలి. కొన్ని కంపెనీలు డీఆర్‌హెచ్‌పీని తమకు అనుకూలంగా రూపొందించే అవకాశాల్లేకపోలేదు. కానీ, వివరాలను విశ్లేషణా దృష్టితో చూస్తే తప్పక ఒక అవగాహనకు రావచ్చు. అప్పటి వరకు కంపెనీ పనితీరు ఎలా ఉన్నదీ చూడాలి. అలాగే, ఐపీవో రూపంలో సమీకరించే నిధులను ఎందుకు వినియోగిస్తుందన్నది గమనించాలి. కంపెనీ వ్యాపార విస్తరణ, పరిశోధన, అభివృద్ధి కార్యకలాపాలపై వెచ్చించేట్టు అయితే భవిష్యత్తులో ఆ కంపెనీ మరింతగా వృద్ధి సాధిస్తుందన్న దానికి సంకేతాలుగా చూడొ చ్చు. ఒకవేళ ఐపీవో నిధులతో రుణబారం తీర్చుకోవాలని భావిస్తే.. నిజానికి ఆ కంపెనీకి ఉన్న లయబులిటీస్ (అప్పులు) ఏ మేరకు అన్నది చూడాల్సి ఉంటుంది. టెక్నాలజీ వినియోగం ఒక ఐపీవోపై నిర్ణయం తీసుకోవాలంటే చూడాల్సిన అంశాలు చాలానే ఉంటాయి. ఎటువంటి లోపాలకు అవకాశం లేకుండా ఈ పని చేయాలి. నేడు పెట్టుబడుల సిఫారసులు చేసే సంస్థలు కూడా ఉన్నాయి. అవి ఒక బిలియన్ కంటే ఎక్కువ సమాచారాన్ని విశ్లేషించి ఐపీవోపై సలహా సేవలు అందిస్తున్నాయి. కావాలంటే వాటి సాయాన్ని తీసుకోవచ్చు. జ్యోతిరాయ్, డీవీపీ–ఈక్విటీ స్ట్రాటజిస్ట్, ఏంజెల్ బ్రోకింగ్ లిమిటెడ్ -
ఐపీఓకు కల్యాణ్ జువెలర్స్
కేరళ ఆధారిత ఆభరాణాల రిటైల్ దిగ్గజం కల్యాణ్ జువెలర్స్ ఐపీఓకు వచ్చేందుకు రంగం సిద్ధం చేసుకుంటోంది. ఈ మేరకు ఐపీఓ ఇష్యూకు సంబంధించిన కార్యక్రమాలను ప్రారంభించింది. ఈ ఆగస్ట్ చివరిలో లేదా సెప్టెంబర్‌లో ఐపీఓ అనుమతుల కోసం సెబీకి ముసాయిదా ప్రణాళిక పత్రాలను సమర్పించనుంది. కోవిడ్-19 వ్యాధి తగ్గుముఖం పట్టిన తర్వాత దేశవ్యాప్తంగా క్రమంగా ఆభరణాలకు డిమాండ్ పెరగవచ్చనే అంచనాలతో ఐపీఓ నిర్ణయాన్ని తీసుకున్నట్లు తెలుస్తోంది. కల్యాణ్ జువెలరీస్ ప్రాథమిక, సెంకడరీ మార్కెట్లలో షేర్ల ఇష్యూ జారీ ద్వారా రూ.1,600-రూ.1,800కోట్ల నిధులను సమీకరించాలని చూస్తోంది. ఈ ఏడాది మార్చి నాటికి కంపెనీకి గణనీయమైన వినియోగదారులు ఉన్నాయి. వ్యవస్థీకృత ఆభరణాల రంగం నెమ్మదిగా పుంజుకోవడం కంపెనీకి విశ్వాసాన్ని ఇచ్చింది’’ అని ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న ఒక వ్యక్తి తెలిపారు. వాస్తవానికి కంపెనీ 2018లోనే ఐపీఓకు రావాల్సి ఉంది. అయితే అనుకోని కారణాల వల్ల ఐపీఓ వాయిదాపడింది. యాక్సిస్ క్యాపిటల్, సిటి, ఐసీఐసీఐ సెక్యూరిటీస్, సెబీ క్యాపిటల్ మొదలైన ఇన్వెస్ట్మెంట్ బ్యాంకులు ఐపీఓ కోసం పనిచేస్తున్నాయి. ఐపీఓ ద్వారా వార్బర్గ్ పిన్కస్ కొంతవాటాను తగ్గించుకోనుంది. కంపెనీకి కూడా రుణభారాన్ని తగ్గనుంది. కల్యాణ్ జువెలరీస్‌లో వార్బర్గ్ పిన్కస్కు 2019 సెప్టెంబర్ నాటికి 30శాతం వాటాను కలిగి ఉన్నట్లు రేటింగ్ ఏజెన్సీ ఇక్రా గణాంకాలు చెబుతున్నాయి.సెబీ, స్టాక్ ఎక్చ్సేంజ్‌ల క్లియరెన్స్ లాంటి అవసరమైన ఆమోదాలను పొందిన తర్వాత వచ్చే ఏడాది జనవరి-మార్చి ఐపీఐ ప్రారంభం కావచ్చు. కల్యాణ్ జువెలర్స్‌కు దేశవ్యాప్తంగా 19 రాష్ట్రాల్లో 135 షోరూమ్‌లు, 328 విక్రయశాలున్నాయి. అలాగే 5దేశాల్లో బ్రాంచులున్నాయి. -
జీఎంఆర్ ఎనర్జీ ఐపీవో ఉపసంహరణ
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: జీఎంఆర్ ఇన్‌ఫ్రాకి చెందిన అనుబంధ కంపెనీ జీఎంఆర్ ఎనర్జీ పబ్లిక్ ఇష్యూను ఉపసంహరించుకుంది. రూ.1,800 కోట్ల పబ్లిక్ ఇష్యూకి సంబంధించి సెబీకి దాఖలు చేసిన రెడ్ హెర్రింగ్ ప్రాస్పెక్టస్ (డీఆర్‌హెచ్‌పి)ను వివిధ వ్యాపార కారణాలతో ఉపసంహరించకున్నట్లు జీఎంఆర్ ఇన్ఫ్రా బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజ్కి తెలియచేసింది. ఈ పబ్లిక్ ఇష్యూ ద్వారా సేకరించిన మొత్తంలో రుణ భారం తగ్గించుకోవాలని జీఎంఆర్ ఇన్ఫ్రా భావించింది.