న్యూఢిల్లీ: రిటైల్ జ్యుయలరీ సంస్థ జోయాలుక్కాస్ ఇండియా తాజాగా పబ్లిక్ ఇష్యూ ద్వారా రూ. 2,300 కోట్లు సమీకరించనుంది. ఇందుకు సంబంధించిన ముసాయిదా పత్రాలను మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి సమర్పించింది. ఐపీవోలో భాగంగా కొత్తగా షేర్లను జారీ చేయనున్నామని, ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్‌ఎస్) విధానంలో షేర్ల విక్రయం ఉండబోదని సంస్థ తెలిపింది.
పబ్లిక్ ఇష్యూ ద్వారా సమీకరించిన నిధుల్లో రూ.1,400 కోట్ల మొత్తాన్ని.. ఇతరత్రా రుణాల తిరిగి చెల్లింపునకు, రూ.464 కోట్లు కొత్తగా ఎనిమిది షోరూమ్‌ల ఏర్పాటు కోసం, మిగతా మొత్తాన్ని ఇతరత్రా కార్పొరేట్ అవసరాల కోసం వినియోగించనున్నట్లు వివరించింది. జోయాలుక్కాస్ సంస్థ బంగారం, ప్లాటినం, వజ్రాభరణాలు మొదలైన వాటిని విక్రయిస్తోంది. గత ఆర్థిక సంవత్సరంలో కంపెనీ రూ. 8,066 కోట్ల ఆదాయంపై రూ. 472 కోట్ల మేర లాభం నమోదు చేసింది. 90 శాతం ఆదాయం దక్షిణాది ప్రాంతాల నుంచి లభిస్తోంది. వచ్చే రెండేళ్లలో తెలంగాణ, మహారాష్ట్ర తదితర రాష్ట్రాల్లో కొత్తగా 8 షోరూమ్‌లు ప్రారంభించాలని యోచిస్తోంది.
(చదవండి: పెరిగిన కేంద్ర ప్రభుత్వ రుణ భారం.. అప్పు ఎన్ని లక్షల కోట్లు తెలుసా?)
Comments
Please login to add a commentAdd a comment