joyalukkas
-
రిటైల్ జ్యువెలర్కు రెండు అవార్డులు
హైదరాబాద్: ప్రముఖ జ్యువెలరీ బ్రాండ్ జోయాలుక్కాస్ రెండు అవార్డులు దక్కించుకుంది. ప్రతిష్టాత్మక ‘రిటైల్ జ్యువెలర్ మ్యాగజైన్ ఎండీ–సీఈవో పురస్కారాలు 2025’లో భాగంగా బెస్ట్ స్ట్రాటజిక్–ఇంటిగ్రేటెడ్ మార్కెట్ 2025, నేషనల్ రిటైల్ చెయిన్ ఆఫ్ ద ఇయర్ 2025 అవార్డులు సొంతం చేసుకుంది. ముంబైలో జరిగిన అవార్డుల ప్రధానోత్సవంలో సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ థామస్ మాథ్యూ ఈ పురస్కారాలు అందుకున్నారు. జ్యువె లరీ పరిశ్రమలో సాధించిన విజయాలు, అందించిన తోడ్పాటుకు ఈ అవా ర్డులు ప్రతిరూపమని జోయాలుక్కాస్ చైర్మన్ జాయ్ అలుక్కాస్ తెలిపారు. -
బంగారంపై ఆఫర్లు
హైదరాబాద్: పెళ్లిళ్ల సీజన్ సమీపిస్తున్న తరుణంలో ప్రముఖ ఆభరణాల విక్రయ సంస్థ జోయాలుక్కాస్ ‘వివాహ ఉత్సవ్’ ఆఫర్లు ప్రకటించింది. ఇందులో భాగంగా లక్ష రూపాయల విలువైన బంగారు ఆభరణాల కొనుగోలుపై 10 గ్రాముల వెండి బార్‌ను ఉచితంగా ఇస్తుంది. డైమండ్లు, అన్ కట్ డైమండ్లు, ఫ్రెషస్ స్టోన్లపై ఫ్లాట్ 25% తగ్గింపు ఇస్తుంది. ఈ ప్రత్యేక ఆఫర్లు అన్ని జోయాలుక్కాస్ షోరూంల్లో డిసెంబర్ 1 వరకు అందుబాటులో ఉంటాయి. -
బ్రిటన్ పార్లమెంటేరియన్లకు ‘స్ప్రెడింగ్ జాయ్’
లండన్: జోయాలుక్కాస్ గ్రూప్ చైర్మన్, ఎండీ జోయ్ అలుక్కాస్ తన స్వీయ జీవిత చరిత్ర ‘స్ప్రెడింగ్ జాయ్’ను బ్రిటిష్ పార్లమెంట్ సభ్యులకు అందజేశారు. బ్రిటిష్ సౌత్ ఇండియా కౌన్సిల్ ఆఫ్ కామర్స్ (బీఎస్ఐసీసీ) లండన్‌లోని గ్రిమాండ్ హాల్లో నిర్వహించిన కార్యక్రమంలో బ్రిటిష్ పార్లమెంట్ సభ్యులు మారి్టన్ డే, వీరేంద్ర శర్మ, స్టీఫెన్ టిమ్స్ సహా బరోనెస్ ఉడ్డీన్లకు తన ఆత్మకథను బహూకరించారు. బ్రిటిష్ పార్లమెంటేరియన్స్కు నా కథను తెలియజేయటం ఎంతో సంతోషాన్ని ఇచి్చందని జోయాలుక్కాస్ గ్రూప్ చైర్మన్ జోయ్ అలుక్కాస్ ఈ సందర్భంగా అన్నారు. కాగా ఇటీవల తన ఆత్మ కథను భారత ప్రధాని నరేంద్ర మోదీకి కూడా జోయ్ అలుక్కాస్ అందజేశారు. -
జోయాలుక్కాస్‌కు అవార్డులు
‘ద రిటైల్ జ్యువెలర్ గ్రూప్’ ముంబైలో నిర్వహించిన అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమంలో సినీ నటులు సన్యా మల్హోత్రా, జోయా అఫ్రాజ్ల చేతుల మీద ‘బెస్ట్ డిజిటల్/సోషల్ మీడియా మార్కెటింగ్ ఆఫ్ ది ఇయర్, నేషనల్ రిటైల్ చైన్ ఆఫ్ ది ఇయర్’ అవార్డులు అందుకుంటున్న జోయాలుక్కాస్ సంస్థ సీఎండీ జాయ్ అలుక్కాస్. -
ఆభరణాల కొనుగోలుపై దీపావళి క్యాష్‌బ్యాక్ ఆఫర్లు
హైదరాబాద్: దీపావళి సందర్భంగా జోయాలుక్కాస్ క్యాష్‌బ్యాక్ ఆఫర్లు ప్రకటించింది. రూ.50,000 విలువైన డైమండ్, అన్ కట్ డైమండ్స్–ప్రెషస్ జ్యువెలరీ కొనుగోలుపై రూ.2 వేల విలువైన క్యాష్‌బ్యాక్ గిఫ్ట్ వోచర్ పొందవచ్చు. అలాగే రూ.50 వేల విలువైన బంగారం ఆభరణాల కొనుగోలుపై రూ.1000 విలువైన క్యాష్‌బ్యాక్ గిఫ్ట్ వోచర్ అందిస్తుంది. రూ.10వేల విలువైన వెండి ఆభరణాలపై రూ.500 విలువైన గిఫ్ట్ వోచర్లు లభిస్తాయి. అడ్వాన్స్ బుకింగ్ స్కీమ్‌తో షాపింగ్ చేసే కస్టమర్లు ప్రోత్సాహక బహుమతి పొందొచ్చు. ఇప్పటికే ప్రారంభమైన ఆఫర్లు నవంబర్ 12 వరకు అమలులో ఉంటాయి. క్యాష్‌బ్యాక్ రూపంలో కస్టమర్లకు మేమిచ్చే బహుమతులు వారి దీపావళిని మరింత శోభాయమానం చేస్తాయని సంస్థ ఎండీ జాయ్ అలుక్కాస్ తెలిపారు. -
ఫోర్బ్స్ ఇండియా సంపన్నుల జాబితాలో జాయ్ అలుక్కాస్
కొచ్చి: ఫోర్బ్స్ 100 మంది సంపన్న భారతీయుల జాబితాలో జోయాలుక్కాస్ కంపెనీ చైర్మన్ జాయ్ అలుక్కాస్ 50వ స్థానం దక్కించుకున్నారు. తద్వారా భారతదేశం నుంచి ఎంపికైన ఏకైక జ్యువెలర్‌గా ఖ్యాతి గడించారు. జ్యువెలరీ రంగంలో పెను మార్పులు తీసుకురావడంలో జాయ్ అలుక్కాస్ కీలక పాత్ర పోషించారు. ఆర్థిక సంక్షోభం(2008), కరోనా మహమ్మారి(2020) వంటి అంతర్జాతీయ ప్రతికూల పరిస్థితులను విజయవంతంగా అధిగమించి వ్యాపారాన్ని నిర్వహించారు. ప్రపంచంలోనే అతిపెద్ద అవుట్‌లెట్‌ను చెన్నైలో ప్రారంభించడం, ప్రోత్సాహంగా రోల్స్ రాయిస్ కార్లను బహుమతిగా ఇవ్వడం, రష్యా తూర్పు భాగం ప్రాంతాల కొత్త మార్కెట్లలో ప్రవేశించడం వంటి విన్నూత ఆలోచనలతో జోయాలుక్కాస్ను ‘వరల్డ్స్ పేవరెట్ జ్యువెలర్’ గా జోయాలుక్కాస్ సంస్థగా తీర్చిద్దిద్దారు. -
జోయాలుక్కాస్ చైర్మన్‌కు ప్రత్యేక పురస్కారం
హైదరాబాద్: జోయాలుక్కాస్ గ్రూప్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ జాయ్ అలుక్కాస్ ప్రపంచ జ్యువెలరీ సమాఖ్య నుంచి ప్రత్యేక పురస్కారం అందుకున్నారు. వర్డల్ జ్యువెలరీ కానె్ఫడరేషన్(సీఐబీజేఓ) జైపూర్‌లో నిర్వహించిన కాంగ్రెస్ 2023 కార్యక్రమంలో సంస్థ ఎండీ జాన్ పాల్ అలుక్కాస్.. చైర్మన్, ఎండీ జాయ్ అలుక్కాస్ తరఫున ఈ గౌరవాన్ని స్వీకరించారు. సప్లై చైన్‌లో నైతిక పద్ధతులు, సుస్థిరతలకు సాటిలేని కృషిని వరల్డ్ జ్యువెలరీ కాన్ఫెడరేషన్ గుర్తించింది. ‘‘ఈ గుర్తింపును మా సంస్థలో ప్రతి ఒక్క సభ్యునితో భాగస్వామ్యం చేస్తున్నాను’’ అని జాయ్‌అలుక్కాస్ తెలిపారు. -
జోయాలుక్కాస్‌లో అక్షయ తృతీయ ఆఫర్లు
హైదరాబాద్: ఆభరణాల సంస్థ జోయాలుక్కాస్ అక్షయ తృతీయ సందర్భంగా జ్యుయలరీ కొనుగోళ్లపై ప్రత్యేకమైన క్యాష్‌బ్యాక్ ఆఫర్లను ప్రకటించింది. రూ.50,000 అంతకుపైబడిన వజ్రాలు, అన్‌కట్ వజ్రాలను కొనుగోలు చేసిన కస్టమర్లకు రూ.2,000 విలువైన గిఫ్ట్ వోచర్‌ను ఇవ్వనుంది. అలాగే రూ.50,000, అంతకు పైబడిన బంగారు ఆభరణాలు కొనుగోలు చేసిన వారికి రూ.1,000 విలువ గల గిఫ్ట్ వోచర్, రూ.10,000 విలువైన వెండి ఆభరణాలు కొనుగోలు చేసిన కస్టమర్లకు రూ.500 విలువైన గిఫ్ట్ వోచర్‌ను అందించనున్నట్లు తెలిపింది. అలాగే ఎస్బీఐ క్రెడిట్ కార్డు ద్వారా చెల్లింపులు జరిపిన వారికి 5 శాతం రాయితీ కూడా ఇస్తుంది. నేటి నుంచి(14వ తేదీ) ప్రారంభమై ఈ నెల 23వ తేదీ వరకు అందుబాటులో ఉండే ఈ అద్భుతమైన ఆఫర్‌ను కస్టమర్లంతా వినియోగించుకోవాలని కంపెనీ ఎండీ జాయ్ అలుక్కాస్ కోరారు. -
జోయాలుక్కాస్ గుడ్‌న్యూస్: 50 శాతం మేకింగ్ చార్జెస్ తగ్గింపు
హైదరాబాద్: ప్రముఖ బంగారు ఆభరణాల సంస్థ జోయాలుక్కాస్ ‘సంవత్సరపు సాటిలేని జ్యువెలరీ సేల్’ నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా ఆభరణాల ముజూరీ చార్జీల (వీఏ)పై 50 శాతం తగ్గింపు ఇవ్వనున్నట్లు తెలిపింది. ‘‘ఈ మార్చి 26 వరకు అందుబాటులో ఉండే ఈ గొప్ప ఆఫర్‌తో ఇంతకు ముందు లేని విధంగా సాటిలేని జ్యువెలరీ అనుభవాన్ని ఆనందించవచ్చు’’ అని జోయాలుక్కాస్ గ్రూప్ చైర్మన్ జాయ్ అలూక్కాస్ పేర్కొన్నారు. కొనుగోలు చేసిన అన్ని ఆభరణాలపై ఒక సంవత్సరం ఉచిత బీమా, జీవిత కాల ఉచిత నిర్వహణ, బై బ్యాక్ ఆఫర్లను పొందొచ్చని జోయాలుక్కాస్ తెలిపింది. ఇది కూడా చదవండి: 250 కోట్ల బిగ్గెస్ట్ ప్రాపర్టీ డీల్: మాజీ ఛాంపియన్, బజాజ్ ఆటో చైర్మన్ రికార్డు రిలయన్స్ ‘మెట్రో’ డీల్ ఓకే, రూ.2,850 కోట్లతో కొనుగోలు -
జోయాలుక్కాస్ వాలెంటైన్స్‌డే ఆఫర్, వజ్రాలపై 25శాతం డిస్కౌంట్
హైదరాబాద్: వాలెంటైన్స్ డే సందర్భంగా ప్రముఖ వజ్రాభరణాల సంస్థ జోయాలుక్కాస్ జ్యూవెలరీ ప్రత్యేక ఆఫర్లు ప్రకటించింది. తన సుప్రసిద్ధ ‘‘బీ మెయిన్’’ కలెక్షన్ పరంపరలో కొత్త శ్రేణి డిజైన్లను మార్కెట్లోకి విడుదల చేసింది. రోజ్ గోల్డ్, ఎల్లో గోల్డ్, డైమండ్‌తో రూపొందించిన హార్ట్-థీమ్డ్ జ్యువెలరీ రింగులు, లాకెట్లు, పెండెంట్లు, బ్రాస్లెట్లను అందుబాటులో ఉంచింది. ఆఫర్లో భాగంగా వజ్రాలపై 25శాతం డిస్కౌంట్‌ను పొందవచ్చు. ఫిబ్రవరి మూడోతేదీన మొదలైన ఈ ప్రత్యేక ఆఫర్ 14వ తేదీ వరకు కొనసాగుతుంది. కస్టమర్లంతా ఈ అవకాశాన్ని సద్వినియోగపరుచుకోవాలని గ్రూప్ ఎండీ వెల్లడించారు. -
జోయాలుక్కాస్‌లో అక్షయ తృతీయ క్యాష్ బ్యాక్ ఆఫర్లు
హైదరాబాద్: ఆభరణాల సంస్థ జోయాలుక్కా స్ అక్షయ తృతీయ సందర్భంగా జ్యుయలరీ కొనుగోళ్లపై ప్రత్యేకమైన క్యాష్ బ్యాక్ ఆఫర్లను ప్రకటించింది. రూ.50,000 అంతకుపైబడిన వజ్రాలు, అన్‌కట్ వజ్రాలను కొనుగోలు చేసిన కస్టమర్లకు రూ.2,000 విలువైన గిఫ్ట్ వోచర్‌ను ఇవ్వనుంది. అలాగే రూ.50,000, అంతకు పైబడిన బంగారు ఆభరణాలు కొనుగోలు చేసిన వారికి రూ.1,000 విలువ గల గిఫ్ట్ వోచర్, రూ.10,000 విలువైన వెండి ఆభరణాలు కొనుగోలు చేసిన కస్టమర్లకు రూ.500 విలువైన గిఫ్ట్ వోచర్‌ను అందించనున్నట్లు తెలిపింది. అలాగే ఎస్బీఐ డెబిట్ లేదా క్రెడిట్ కార్డు ద్వారా చెల్లింపులు జరిపిన వారికి 5 శాతం రాయితీ కూడా ఇస్తుంది. ఈ నెల 22 నుంచి మే 3వ తేదీ వరకు ఈ ఆఫర్ దేశవ్యా ప్తంగా ఉన్న అన్ని షోరూమ్‌లలో అందుబాటులో ఉంటుందని జోయాలుక్కాస్ తెలిపింది. -
దేశంలో తగ్గని ఐపీవో జోరు.. ఐపీవోకి సిద్దంగా దిగ్గజ జ్యుయలరీ కంపెనీ!
న్యూఢిల్లీ: రిటైల్ జ్యుయలరీ సంస్థ జోయాలుక్కాస్ ఇండియా తాజాగా పబ్లిక్ ఇష్యూ ద్వారా రూ. 2,300 కోట్లు సమీకరించనుంది. ఇందుకు సంబంధించిన ముసాయిదా పత్రాలను మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి సమర్పించింది. ఐపీవోలో భాగంగా కొత్తగా షేర్లను జారీ చేయనున్నామని, ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్ఎస్) విధానంలో షేర్ల విక్రయం ఉండబోదని సంస్థ తెలిపింది. పబ్లిక్ ఇష్యూ ద్వారా సమీకరించిన నిధుల్లో రూ.1,400 కోట్ల మొత్తాన్ని.. ఇతరత్రా రుణాల తిరిగి చెల్లింపునకు, రూ.464 కోట్లు కొత్తగా ఎనిమిది షోరూమ్‌ల ఏర్పాటు కోసం, మిగతా మొత్తాన్ని ఇతరత్రా కార్పొరేట్ అవసరాల కోసం వినియోగించనున్నట్లు వివరించింది. జోయాలుక్కాస్ సంస్థ బంగారం, ప్లాటినం, వజ్రాభరణాలు మొదలైన వాటిని విక్రయిస్తోంది. గత ఆర్థిక సంవత్సరంలో కంపెనీ రూ. 8,066 కోట్ల ఆదాయంపై రూ. 472 కోట్ల మేర లాభం నమోదు చేసింది. 90 శాతం ఆదాయం దక్షిణాది ప్రాంతాల నుంచి లభిస్తోంది. వచ్చే రెండేళ్లలో తెలంగాణ, మహారాష్ట్ర తదితర రాష్ట్రాల్లో కొత్తగా 8 షోరూమ్‌లు ప్రారంభించాలని యోచిస్తోంది. (చదవండి: పెరిగిన కేంద్ర ప్రభుత్వ రుణ భారం.. అప్పు ఎన్ని లక్షల కోట్లు తెలుసా?) -
జోయాలుక్కాస్ ‘బ్రైడల్ ఫెస్ట్’
హైదారాబాద్: ప్రముఖ ఆభరణాల తయారీ సంస్థ జోయాలుక్కాస్ ‘బ్రైడల్ ఫెస్ట్’ పేరుతో ప్రత్యేక విక్రయాల కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా ఆభరణాల కొనుగోళ్లపై ఆకర్షణీయమైన ఆఫర్లను ప్రకటించింది. వివాహాల కోసం ప్రత్యేకమైన ఆభరణాల శ్రేణిని బ్రైడల్ ఫెస్ట్‌లో భాగంగా అందిస్తున్నట్టు తెలిపింది. ఈ కార్యక్రమంలో భాగంగా వివాహ ప్యాకేజీని ప్రత్యేకంగా తీసుకొచ్చినట్టు ప్రకటించింది. ఆభరణాల తయారీ చార్జీల్లో 30% తగ్గింపు సహా ఇతర ఆఫర్లు అందుబాటులో ఉన్నట్టు తెలిపింది. -
బంగారం గాజుల తయారీ చార్జీలపై 30 శాతం డిస్కౌంట్, ఎక్కడా
ముంబై: బంగారం గాజులకు సంబంధించి అతి పెద్ద విక్రయాల ఉత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు జాయలుక్కాస్ సంస్థ ప్రకటించింది. ఇందులో భాగంగా విస్తృత శ్రేణిలో ఎన్నో రకాల మోడళ్లను ఆకర్షణీయమైన ఆఫర్లతో అందిస్తున్నట్లు తెలిపింది. గాజుల తయారీ చార్జీలపై 30 శాతం వరకు డిస్కౌంట్ ఇస్తున్నట్లు వివరించింది. కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని షోరూంల్లో ఈ ఆఫర్‌ను ఆగస్ట్ 3వ తేదీ వరకు పొడిగించినట్లు కంపెనీ తెలిపింది. ఈ అవకాశాన్ని కస్టమర్లు సద్వినియోగం చేసుకోవాలని ఎండీ జాయ్ అలుక్కాస్ పేర్కొన్నారు. -
జోయాలుక్కాస్ ఉగాది ఆఫర్లు
సాక్షి, ముంబై: ప్రముఖ ఆభరణాల సంస్థ జోయాలుక్కాస్ ఉగాది పండుగ సందర్భంగా ఆఫర్లను ప్రకటించింది. ఇందులో భాగంగా రూ.50వేల విలువైన బంగారు, వెండి ఆభరణాల కొనుగోలుపై రూ.1,000 గిఫ్ట్ ఓచర్‌ను పొందవచ్చు. అలాగే రూ.50 వేల డైమండ్, అన్‌కట్ ఆభరణాలపై రూ.5వేల గిఫ్ట్ ఓచర్ లభించనుంది. ఈ ఆఫర్ ఈ ఏప్రిల్ 14న ముగిస్తుంది. తెలుగు రాష్ట్రాల్లోని అన్ని జోయాలుక్కాస్ షోరూంలలో ఆఫర్లు అందుబాటులో ఉంటాయి. తెలుగు వారి నూతన సంవత్సరాన్ని జోయాలుక్కాస్ ఆభరణాలు మరింత శుభప్రదం చేస్తాయని కంపెనీ చైర్మన్ జోయ్ అలుక్కాస్ తెలిపారు. గిఫ్ట్ ఓచర్‌తో పాటు కొనుగోలు చేసిన ఆభరణాలపై జీవితకాలం ఉచిత నిర్వహణ, ఏడాది ఉచిత బీమా సదుపాయం, తిరిగి కొనుగోలు హామీ సౌలభ్యతలను అందిస్తున్నామని ఆయన వివరించారు. -
బంగారు దుకాణాల బరి తెగింపు
అనంతపురం సెంట్రల్: నగరంలో జాయ్‌అలుకస్, మలబార్‌గోల్డ్ జ్యువెలరీ నిర్వాహకులు కోవిడ్–19 నిబంధనలను ఉల్లంఘిస్తున్నారు. ఇటీవల అనుమతులు లేకుండా తెరవడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. కోవిడ్–19 నిబంధనలు పూర్తిగా ఉల్లంఘిస్తున్నట్లు నగర పాలక సంస్థ ప్రజారోగ్యం అధికారి డాక్టర్ రాజేష్ తనిఖీలో తేలింది. దీంతో సదరు నిర్వాహకులపై కేసు నమోదు చేసి చర్యలు తీసుకుంటామని ఎంహెచ్ఓ తెలిపారు. భౌతికదూరం పాటించకుండా వ్యాపారాలు నిర్వహిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. -
ఆ ఇద్దరు... దయ చూపిన స్త్రీలు
ఒక స్త్రీ యజమాని. మరో స్త్రీ ఆమె వద్ద పని చేసే చిన్న ఉద్యోగి. ఉద్యోగి ఒక సాయంత్రం ఒక అంధునికి సాయం చేసింది. అది యజమాని దృష్టికి వచ్చింది. దయ గల స్త్రీ తన వద్ద ఉద్యోగం చేస్తున్నందుకు సంతోషపడి తనూ ఆమెపై దయ చూపింది. ఆ ఉద్యోగికి కొత్త ఇల్లు బహూకరించింది. కేరళలో జాలీ అలుకాస్, ఆమె ఉద్యోగి సుప్రియల కథ ఇప్పుడు దేశం మెచ్చుతున్న కథ. జూలై 7, 2020 సుప్రియ జీవితాన్ని మార్చేసిన రోజు. ఆ రోజు తన జీవితాన్ని మారుస్తుందని ఆమె కలలో కూడా అనుకోలేదు. చిన్న ఉద్యోగి ఆమె. అలెప్పి నుంచి 30 కిలోమీటర్ల దూరంలో ఉండే తిరువెల్లా పట్టణంలోని ‘జాలీ సిల్క్స్’లో ఆమె సేల్స్ ఉమన్. సాయంత్రం ఆరున్నరకు డ్యూటీ దిగి బస్స్టాప్వైపు నడుస్తోంది ఇల్లు చేరడానికి. అక్కడే ఒక అంధుడు రోడ్డు మీద నడవడానికి అవస్థ పడుతున్నాడు. ఆమె అతణ్ణి చూసింది. ‘ఎక్కడకు వెళ్లాలి’ అని అడిగింది. తాను టౌన్ బస్ ఎక్కాలని, మంజాది అనే ప్రాంతానికి వెళ్లాలని ఆ అంధుడు చెప్పాడు. అప్పుడే ఒక ఆర్టిసి టౌన్ బస్సు వారిని దాటుకుంటూ వెళుతోంది. అది అంధుడు వెళ్లాల్సిన ప్రాంతానికి చెందిన బస్సే. సుప్రియ అది గమనించింది. వెంటనే బస్సు వెనుక పరుగు తీసింది. ఆమెను గమనించిన బస్సు డ్రైవరు, కండెక్టరు బస్సును ఆపారు. ‘ఒక అంధుడు బస్సెక్కాలి. ఉండండి’ అని చెప్పి వెనక్కు పరిగెత్తి అంధుడి చేయి పట్టుకుని బస్సు దాకా తీసుకొని వచ్చింది. ఆ తర్వాత బస్సు ఎక్కించి వెళ్లిపోయింది. ఇది ఏ మనిషైనా చేసే కనీస పని అని అంతటితో ఆ సంగతి మర్చిపోయింది.మారిన కథ అయితే ఈ దయామయ ఘటనను ప్రకృతి రికార్డు చేయదలిచింది. అదే రోడ్డులో ఒక షాపింగ్ కాంప్లెక్స్‌లో పని చేస్తున్న జాషువా అనే సేల్స్‌మేన్ ఐదో ఫ్లోర్ నుంచి కాలక్షేపానికి రోడ్డు వైపు చూస్తూ ఈ సన్నివేశం కనపడటంతో సెల్ఫోన్లో రికార్డు చేశాడు. సుప్రియ చేసింది చాలా మంచి పని అని అతనికి అనిపించింది. ఫ్రెండ్‌కు పంపాడు. ఆ ఫ్రెండ్ నుంచి మెల్లగా అది సోషల్ మీడియాకు ఎక్కింది. సాయంత్రం ఆరున్నరకు ఘటన జరిగితే రాత్రి 10.30కు ఇది దేశమంతా వైరల్ అయ్యింది. ఇవన్నీ తెలియని సుప్రియ ఇంట్లో ఉంటే ఫ్రెండ్స్ ఫోన్ చేసి ‘నువ్వే కదా’ అనడం మొదలెట్టారు. రాత్రికి రాత్రి సుప్రియ ఆ ప్రాంతంలో స్టార్ అయిపోయింది. యజమాని స్పందించింది సుప్రియ పని చేస్తున్నది దేశంలో బంగారు వ్యాపారాల దిగ్గజమైన జాయ్ అలుకాస్ సతీమణి జాలీ అలూకాస్ ఆధ్వర్యంలో నడుస్తున్న ‘జాలీ సిల్క్స్’లో. సుప్రియ చేసిన మంచి పని ఆ నోటా ఈ నోటా ఈ భార్యాభర్తలకు చేరింది. తమ ఉద్యోగిలోని దయాగుణం వారికి నచ్చింది. జాలీ అలూకాస్ పూనికతో జాయ్ అలూకాస్ సుకన్యను అభినందించడానికి ఏకంగా ఆమె ఇంటికి వెళ్లాడు. సుకన్య భర్త అనూప్ చిన్న ఉద్యోగి. ఇద్దరూ అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నారు. వారిని అభినందించిన జాయ్ అలూకాస్ ‘త్రిసూర్‌లో ఉన్న హెడ్ ఆఫీస్‌కు వచ్చి కలవండి’ అని చెప్పి వెళ్లిపోయారు. ఊహించని బహుమతి జాయ్ అలూకాస్ చెప్పిన రోజున సుకన్య తన భర్తతో త్రిసూర్ వెళ్లింది. ఆమె హెడ్డాఫీసులో అడుగుపెట్టిన వెంటనే వందలాది మంది ఉద్యోగులు హర్షధ్వానాలతో ఆమెను అభినందించారు. జాలీ అలూకాస్ తన భర్త జాయ్ అలూకాస్తో వచ్చి సుప్రియను అభినందించారు. సుప్రియ తబ్బిబ్బయ్యింది. దంపతులిద్దరూ ఆమెకు కొత్త ఇంటి తాళాలు బహూకరించారు. సుప్రియ నివ్వెరపోయింది. ‘నేను చేసింది మామూలు పనే’ అందామె. అప్పుడు జాలీ అలూకాస్ ‘కాదు. నువ్వు చిన్నప్పటి నుంచి చాలా మంచి పనులు చేసి ఉంటావు. వాటన్నింటి ఫలితమే ఇది. ప్రపంచంలో మంచితనానికి కొదవ ఉండకూడదు. మంచితనం వ్యాపిస్తూనే ఉండాలి’ అని çసుప్రియను అభినందించింది. ఈ అందమైన ఘటన ఎందరికో నచ్చుతోంది. స్ఫూర్తినిస్తోంది. రొటీన్లో పడి తమను తాము మర్చిపోయినవారు తమలోని మంచితనాన్ని వెతుక్కునేలా చేస్తోంది. – సాక్షి ఫ్యామిలీ -
ఆ వార్తలు నిజం కాదు: జోయాలుక్కాస్
హైదరాబాద్: ప్రముఖ ఆభరణాల విక్రయ సంస్థ జోయాలుక్కాస్ సీఎండీ జాయ్ అలూక్కాస్ క్షేమంగా ఉన్నారని ఆ గ్రూప్ ప్రకటించింది. సామాజిక మాధ్యమాల్లో ఆయన ఆరోగ్యానికి సంబంధించి ప్రచారమవుతోన్న తప్పుడు వార్తలను ఖండించింది. దుబాయ్‌లో మరణించిన ఒక వ్యాపారి పేరు సంస్థ సీఎండీ పేరుకు దగ్గరగా ఉన్న నేపథ్యంలో పొరపాటున అసత్య కథనాలను పలు వార్తా సంస్థలు ప్రచారం చేశాయని వెల్లడించింది. మరణించిన వ్యాపారి పేరు జాయ్ అరక్కల్ అని, ఆయనకు జాయ్ అలూక్కాస్కు సంబంధం లేదని స్పష్టంచేసింది. -
జోయ్ అలుక్కాస్‌లో బంగారం కొంటే వెండి ఫ్రీ
ప్రముఖ జ్యూయలరీ సంస్థ జోయ్ అలుక్కాస్ ‘డబుల్ ద జాయ్’ పేరుతో సరికొత్త ఆఫర్ ను ప్రకటించింది. బంగారం కొనుగోలు చేసిన వారికి అదే బరువు ఉండే వెండిని ఉచితంగా ఇస్తోంది. పండుగల సీజన్లో తమ కస్టమర్లు విశేష స్పందన చూసిన నేపథ్యంలో ఆఫర్లను పొడిగించడంలో భాగంగా బంగారాన్ని కొంటే వెండిని ఫ్రీగా ఇస్తున్నట్లు సంస్థ ఎండీ జోయ్ అలుక్కాస్ అన్నారు. పాత బంగారాన్ని సున్నా శాతం తగ్గింపుతో మార్చుకోవచ్చని, ఏడాది ఉచిత బీమా అందిస్తున్నామని వివరించారు. -
నేటి అక్షయ తృతీయకు ఆభరణ సంస్థల ఆఫర్ల ఆహ్వానం
జోయాలుక్కాస్ ‘గోల్డ్ ఫార్ట్యూన్’! వరల్డ్ ఫేవరేట్ జ్యూయలర్ జోయాలుక్కాస్... పవిత్ర పసిడి కొనుగోళ్ల పర్వదినాన్ని పురస్కరించుకుని గోల్డ్‌ఫార్ట్యూన్ ఆఫర్‌ను ప్రకటించింది. ఈ ఆఫర్లో భాగంగా బంగారం, డైమెండ్ జ్యూయలరీ కొనుగోలు దారులకు ఉచితంగా బంగారు నాణేలు బహూకరిస్తారు. సరికొత్త అక్షయ తృతీయ 2019 కలక్షన్‌ను ఆరంభించామని, కస్టమర్లకు సంపదతో సేవ చేయడానికి ఈ పండుగ తమకు అవకాశం కల్పిస్తోందని సంస్థ ఎండీ, చైర్మన్ జాయ్ అలూక్కాస్ పేర్కొన్నారు. ఒర్రా భారీ రాయితీలు... దేశంతో వేగంగా విస్తరిస్తున్న రిటైల్‌చైన్స్‌లో ఒకటైన ఒర్రా, అక్షయ తృతీయ సందర్భంగా కస్టమర్లకు భారీ ఆఫర్లను ప్రకటించింది. డైమెండ్ జ్యూయలరీ కొనుగోలుపై 25 శాతం తగ్గింపు సదుపాయాన్ని కల్పిస్తోంది. పసిడి ఆభరణాల మేకింగ్ చార్జీలపై కూడా 25 శాతం రాయితీ ప్రకటించింది. గోల్డ్ నాణేలు, కడ్డీలపై అసలు మేకింగ్ చార్జీలు ఉండవు. డైమెండ్ జ్యూయలరీ కొనుగోలుకు సంబంధించి వడ్డీ రహిత ఇన్స్టాల్మెంట్ చెల్లింపు సౌలభ్యతను కల్పిస్తున్నట్లు ఒక ప్రకటన పేర్కొంది. మలబార్ గ్రూప్ ప్రత్యేక ఏర్పాట్లు... అక్షయ తృతీయను పురస్కరించుకుని ప్రముఖ ఆభరణాల సంస్థ– మలబార్ గ్రూప్ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. ఉదయం 7 గంటల నుంచే షోరూమ్‌లను ప్రారంభిస్తున్నట్లు మలబార్ గోల్డ్ అండ్ డైమండ్ ఒక ప్రకటనలో తెలిపింది. వివిధ ఆఫర్లు, డిస్కౌంట్లు ఈ పండుగ సందర్భంగా అందుబాటులో ఉండనున్నాయి. పండుగను పురస్కరించుకుని దేశ వ్యాప్తంగా దాదాపు 2000 కేజీల పసిడి విక్రయం అవుతుందని, భావిస్తున్నట్లు మలబార్ గ్రూప్ చైర్మన్ ఎంపీ అహ్మద్ పేర్కొన్నారు. -
జోయాలుక్కాస్ గోల్డ్ ఫార్చ్యూన్ ఆఫర్
అక్షయ తృతీయ సందర్భంగా జోయాలుక్కాస్ 'గోల్డ్ ఫార్చ్యూన్' పేరుతో ఆఫర్ ప్రకటించింది. ప్రముఖ నటి బాలీవుడ్ ఐకాన్ కాజోల్ దేవ్‌గణ్ ఆవిష్కరించారు. హైదరాబాద్, చెన్నై, బెంగళూరులోని షోరూమ్స్‌లో అక్షయ తృతీయ 2019 కలెక్షన్స్‌ను ఆరంభించారు. అక్షయ తృతీయ సందర్భంగా జోయాలుక్కాస్ 'గోల్డ్ ఫార్చ్యూన్' ఆఫర్‌ను ప్రకటించింది. ఈ ఆఫర్ద్వారా బంగారం, పోల్కీ, డైమండ్ నగలు కొన్నవారికి ఉచితంగా బంగారు నాణేలను ఆఫర్ చేస్తోంది. ఇందులో భారతదేశంలోని జాయ్ అలుక్కాస్ ఔట్‌లెట్స్‌లో సంప్రదాయ నగలతో పాటు సమకాలీన ట్రెండింగ్ జ్యుయలరీ లభిస్తాయి. ‘‘అక్షయ తృతీయ అందరికీ ప్రత్యేకమైన రోజు. మా కస్టమర్లకు అదృష్టాన్ని, సంపదను అందించేందుకు మాకు మంచి అవకాశం లభించింది. అసమానమైన హస్తకళలు, విభిన్నమైన డిజైన్లతో రూపొందించిన అక్షయ తృతీయ కలెక్షన్‌తో జోయాలుక్కాస్‌పై కస్టమర్లకు ఉన్న నమ్మకం కొనసాగుతుంది. గోల్డ్ ఫార్చ్యూన్ ఆఫర్లో భాగంగా నగలు కొని అదృష్టాన్ని ఇంటికి తీసుకెళ్లాలని కోరుతున్నాను’’ - శ్రీ జోయాలుక్కాస్, జోయాలుక్కాస్ సీఎండీ గోల్డ్ ఫార్చ్యూన్ ఆఫర్లో రూ.50,000 కన్నా ఎక్కువ విలువైన డైమండ్, అన్‌కట్ డైమంగ్ నగలు కొన్న కస్టమర్లకు 22 క్యారెట్ల 1 గ్రామ్ గోల్డ్ కాయిన్ ఉచితంగా లభిస్తుంది. రూ.50,000 కన్నా ఎక్కువ విలువైన బంగారు నగలు కొన్న కస్టమర్లు 22 క్యారెట్ల 200 మిల్లీ గ్రాముల గోల్డ్ కాయిన్ ఉచితంగా పొందొచ్చు. ఈ ఆఫర్ అక్షయ తృతీయ రోజుఅనగా 2019 మే 6, 7,8 వరకు మే 8వరకు చెల్లుతుంది. అలాగే ప్రీ బుకింగ్ సదుపాయం కూడా ఉంది. జాయ్ అలుక్కాస్ రూపొందించిన అక్షయ తృతీయ కలెక్షన్‌కు బాలీవుడ్ నటి, కంపెనీ బ్రాండ్ అంబాసిడర్ కాజోల్ దేవ్‌గణ్ ఆవిష్కరించడం విశేషం. ‘‘జాయ్ అలుక్కాస్‌లో శుభప్రదమైన అక్షయ తృతీయ కలెక్షన్ ఆవిష్కరించే అదృష్టం అభించినందుకు సంతోషంగా ఉంది. ఎక్స్‌క్లూజీవ్ డిజైన్స్ నగలు చూసి, వాటిని ధరించాలని అనిపించింది. అందరికీ అక్షయ తృతీయ శుభాకాంక్షలు. ప్రతీ ఒక్కరికీ ఆనందం సంపదలు కలగాలనికోరుకుంటున్నాను’’. - బాలీవుడ్ హీరోయిన్ కాజోల్ దేవ్‌గణ్, జోయాలుక్కాస్ బ్రాండ్ అంబాసిడర్ జాయ్ అలుక్కాస్ ఔట్‌లెట్స్‌లో గోల్డ్ ఫార్చ్యూన్ ఆఫర్ మే 8 వరకు కొనసాగుతుంది. ప్రీ బుకింగ్ అవకాశం కూడా ఉంది. జోయాలుక్కాస్ గ్రూప్ గురించి జోయాలుక్కాస్ గ్రూప్ వివిధ వ్యాపార ఆసక్తులు గల ఎన్నో బిలియన్ డాలర్ల అంతర్జాతీయ మిశ్రయం. గ్రూప్ తన వివిధ వ్యాదపార కార్యకలాపాల్ని యూఏఈ, సౌదీ అరేబియా, బహ్రైన్, ఓమన్, కువైట్, ఖతార్, సింగపూర్, మలేషియా, యూకే, భారత దేశాల్లో నిర్వహిస్తోంది. గ్రూప్ వ్యాపారాల్లో జ్యుయల్లరీ, మనీ ఎక్స్ఛేంజ్, ఫ్యాషన్ అండ్ శిల్క్, మాల్స్ భాగంగా ఉన్నాయి. జోయాలుక్కాస్‌కి ప్రపంచవ్యాప్తంగా 8 వేలమందికి పైగా ఉద్యోగులున్నారు. ప్రపపంచంలోనే మంచి గుర్తింపు పొందడంతో పాటు అనేక అవార్డులను కూడా దక్కించుకుంది జోయాలుక్కాస్. - అడ్వర్టోరియల్ -
నగలు జీవితంలో భాగమయ్యాయి
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ‘ఆభరణాలు ధరించడటమనేది భారతీయుల రక్తంలోనే ఉంది. అందుకే ఇవి జీవితంలో ఒక భాగమయ్యాయి. వివాహాలు, శుభకార్యాలు, పండుగలు, అక్షయ తృతీయ వంటివి వచ్చాయంటే చాలు!! ఎంతో కొంతైనా బంగారు నగలు కొనుగోలు చేస్తారు’ అని ప్రముఖ ఆభరణాల విక్రయ సంస్థ జోయాలుక్కాస్ గ్రూప్ చైర్మన్ జోయ్ ఆలుక్కాస్ చెప్పారు. దేశంలో ఇప్పటికే 82 షోరూమ్‌లున్న ఈ సంస్థ... 83వ షోరూంను హైదరాబాద్‌లోని ఏఎస్ రావు నగర్లో ఏర్పాటు చేసింది. బుధవారం దీన్ని ప్రారంభించనున్న నేపథ్యంలో జోయ్ అలుక్కాస్ ఇక్కడికొచ్చారు. ఈ సందర్భంగా ఆయన ‘సాక్షి’ బిజినెస్ బ్యూరో ప్రతినిధితో ప్రత్యేకంగా మాట్లాడారు. విశేషాలు ఆయన మాటల్లోనే.. నమ్మకం కొనసాగుతోంది.. మా నాన్నగారు 1956లో బంగారం వ్యాపారం మొదలుపెట్టారు. నాటి నుంచి మాపై కస్టమర్ల నమ్మకం కొనసాగుతోంది. మాకు కస్టమర్ల అభిరుచులు తెలుసు. జోయాలుక్కాస్‌లో అత్యుత్తమమైన ధర ఉంటుంది. అందుకే మా దగ్గర ఆభరణాలను సంతోషంగా కొంటారు. మంచి డిజైన్లు అందుబాటులో ఉండటం మరో కారణం. ట్రెండ్‌కు తగ్గట్టుగా డిజైన్లను ఎప్పటికప్పుడు మారుస్తున్నాం. ఎనిమిది ఎక్స్‌క్లూజివ్ బ్రాండ్స్‌లో ఆభరణాలను విక్రయిస్తున్నాం. కేరళతోపాటు షార్జాలో సంస్థకు రెండు తయారీ కేంద్రాలున్నాయి. జోయాలుక్కాస్‌లో మొత్తం 8,000 పైచిలుకు ఉద్యోగులు పనిచేస్తున్నారు. దక్షిణాది నుంచే అధికం.. దేశీయంగా కంపెనీ ఆదాయం 2014లో రూ.4,000 కోట్లుగా నమోదైంది. 2018–19లో టర్నోవరు రూ.8,100 కోట్లకు చేరింది. నాలుగేళ్లలోనే రెట్టింపు ఆదాయం నమోదు చేశామంటే బ్రాండ్‌కు ఉన్న ఇమేజ్ అర్థం చేసుకోవచ్చు. ఇక తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్నాటక, కేరళ రాష్ట్రాల నుంచే 80 శాతం ఆదాయం సమకూరుతోంది. కంపెనీకి చెందిన అత్యధిక షోరూంలు ఉన్నది కూడా దక్షిణాదిలోనే. అందుకే ఇక్కడి మార్కెట్‌పై ప్రత్యేకంగా ఫోకస్ చేశాం. రాష్ట్రాల వారీగా ప్రత్యేక డిజైన్లను పరిచయం చేస్తున్నాం. మార్కెట్ వజ్రాభరణాల వైపు.. భారత్‌లో క్రమంగా మార్కెట్ వజ్రాభరణాల వైపు మళ్లుతోంది. ఇప్పటికే లైట్ వెయిట్ జువెల్లరీకి డిమాండ్ ఊపందుకుంది. ఆభరణాల మార్కెట్ ఏటా 5 శాతం పెరుగుతోంది. 10 ఏళ్ల క్రితంతో పోలిస్తే ప్రజల వద్ద ఇప్పుడు ఆదాయాలు గణనీయంగా పెరిగాయి. ఎన్నారైల ద్వారా డబ్బు వస్తోంది. ఐటీ రంగం కూడా జువెల్లరీ అమ్మకాలు అధికమయ్యేందుకు దోహదం చేస్తోంది. జోయాలుక్కాస్ భారత్‌లో ఏటా 10–15 శాతం వృద్ధి నమోదు చేస్తోంది. ఆన్‌లైన్‌లోనూ ఆభరణాల విక్రయాలు సాగిస్తున్నాం. క్రమంగా ఈ విభాగం కూడా పెరుగుతోంది. న్యూయార్క్ కస్టమర్లకు త్వరలో ఆన్లైన్లో జువెల్లరీని అందుబాటులోకి తెస్తాం. ఈ ఏడాది మరో 14 కేంద్రాలు.. భారత్‌తోపాటు యూఎస్ఏ, యూఏఈ, యూకే, సింగపూర్, మలేషియా, కువైట్, ఒమన్, ఖతార్, బహ్రెయిన్, సౌదీ అరేబియాలో విక్రయాలు సాగిస్తున్నాం. భారత్‌లో ఇప్పటికే 82 ఔట్‌లెట్లున్నాయి. ఈ ఏడాది మరో 5 ప్రారంభించనున్నాం. అలాగే అంతర్జాతీయంగా 64 షోరూంలు నడుస్తున్నాయి. కొత్తగా 9 ఏర్పాటు చేయనున్నాం. ఇందులో యూఎస్ఏలో మూడు సెంటర్లు వస్తాయి. తదుపరి విస్తరణలో భాగంగా శ్రీలంక, కెనడాలో అడుగు పెట్టాలన్న ప్రణాళికతో ఉన్నాం. నిలకడైన వృద్ధితో ఔట్లెట్ల సంఖ్యను పెంచుకుంటూ పోతున్నాం. విస్తరణకు సొంత నిధులనే వెచ్చిస్తున్నాం. ఐపీవోకు వెళ్లే విషయమై 2021–22లో సమీక్షిస్తాం. అంతర్జాతీయ షోరూంల ద్వారా వార్షికంగా రూ.6,000 కోట్ల ఆదాయం సమకూరుతోంది. -
అందం.. అంబాసిడర్
-
జోయాలుక్కాస్ షోరూమ్స్‌లలో ఐటీ దాడులు
-
జోయాలుక్కాస్ క్యాష్‌బ్యాక్ ఆఫర్
త్రిసూర్: ప్రముఖ జువెలరీ సంస్థ ‘జోయాలుక్కాస్’ తాజాగా బంగారు ఆభరణాల కొనుగోలుపై 3 శాతం క్యాష్‌బ్యాక్ ఆఫర్‌ను ప్రకటించింది. జూలై 12 నుంచి 31 వరకు దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన జోయాలుక్కాస్ షోరూమ్‌లలో ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుందని సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. ‘యూఏఈలో ఒక్క షోరూమ్‌తో ప్రారంభమై ఇప్పుడు 11 దేశాల్లో 130 షోరూమ్‌లను ఏర్పాటు చేశాం. ఈ వృద్ధికి కారణమైన కస్టమర్లకు కూడా ఏదైనా తిరిగివ్వాలనుకున్నాం. అందుకే సర్ప్రైజ్ ఆఫర్‌ను ప్రకటించాం’ అని జోయాలుక్కాస్ గ్రూప్ చైర్మన్, ఎండీ జాయ్ అలుక్కాస్ తెలిపారు.