సెప్టెంబరుకల్లా కెనడా, ఆస్ట్రేలియా, శ్రీలంకల్లో షోరూమ్‌లు
హైదరాబాద్:
దేశంతో పాటు విదేశాల్లోనూ వేగంగా విస్తరిస్తున్న ఆభరణాల రిటైల్ చైన్ జోయాలుక్కాస్... ఈ ఏడాది సెప్టెంబరు నాటికి కెనడా, ఆస్ట్రేలియా, శ్రీలంకల్లో కూడా ఔట్‌లెట్లను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. ‘‘దీనికి సంబంధించిన పనులు వేగంగా జరుగుతున్నాయి. 2017 ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికానికల్లా ఇవి పూర్తవుతాయి’’ అని గ్రూప్ సీఎండీ జోయాలుక్కాస్ చెప్పారు.1987లో యూఏఈలో షోరూమ్‌తో తమ ప్రస్థానాన్ని ప్రారంభించామని, 30 ఏళ్లలో 130 షోరూమ్‌లు ఏర్పాటు చేయగలిగామని చెప్పారాయన.
ప్రస్తుతం సంస్థకు యూఏఈ, ఇండియా, యూకే, సింగపూర్, ఖతర్, అమెరికా, సౌదీ ఆరేబియా, బహ్రెయిన్ వంటి 14 దేశాల్లో కోటి మందికిపైగా కస్టమర్లున్నారు. ‘‘అత్యుత్తమ సేవలందించటమనే లక్ష్యమే మమ్మల్ని ఈ స్థాయికి చేర్చింది’’ అని ఆయన వివరించారు.