జాయ్ అలుక్కాస్ 60 కేజీల పసిడి ఆఫర్
హైదరాబాద్: జాయ్ అలుక్కాస్ తాజాగా 60 కేజీల పసిడి ఆఫర్‌ను ప్రకటించింది. అమెరికా, బ్రిటన్, ఆ సియా, గల్ఫ్ దేశాల్లో 60 రోజుల పాటు ఆగస్టు 6 దాకా ఈ ఆఫర్ అమల్లో ఉంటుందని సంస్థ చైర్మన్ జాయ్ అలుక్కాస్ తెలిపారు.
భారత్, మలేషియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఒమన్, అమెరికా దేశాల్లోని తమ స్టోర్స్‌లో షాపింగ్ చేసిన లక్కీ షాపర్స్ 1 కేజీ బంగారం దాకా గెలుచుకునే అవకాశం ఉందని వివరించారు. రూ. 10,000 విలువ చేసే బంగారు ఆభరణాలు కొనుగోలు చేసేవారు డ్రాలో పాల్గొనేందుకు 1 రాఫిల్ కూపన్, రూ. 10,000 విలువ చేసే వజ్రాభరణాలు కొన్నవారికి 2 కూపన్‌లు లభిస్తాయని తెలిపారు.