
సౌదీ అరేబియాలో జోయాలుక్కాస్ విస్తరణ
ప్రముఖ జ్యువెలరీ సంస్థల్లో ఒకటైన జోయాలుక్కాస్ సౌదీ అరేబియాలో తన వ్యాపారాన్ని విస్తరిస్తోంది. పర్షియన్ గల్ఫ్ కోస్ట్ ఈస్ట్రన్ ప్రావెన్స్‌లో ఉన్న జుబెయిల్ నగరంలోని ప్రముఖ షాపింగ్ కాంప్లెక్స్- లూల్ హైపర్‌మార్కెట్‌లో జోయాలుక్కాస్ తన షోరూమ్‌ను ఏర్పాటు చేసింది. లూల్ గ్రూప్ ఇంటర్నేషనల్ మేనేజింగ్ డెరైక్టర్ యూసఫ్ అలీ షోరూమ్‌ను ప్రారంభించారు. భారత్‌సహా ప్రపంచ వ్యాప్తంగా 10 దేశాల్లో 95 షోరూమ్‌ల ద్వారా కస్టమర్లకు జోయాలుక్కాస్ తన సేవలను అందిస్తోంది.
దాదాపు 10 లక్షల డిజైన్ల ఆభరణాలను సంస్థ ప్రపంచ వ్యాప్తంగా కస్టమర్లకు ఆఫర్ చేస్తోంది. ఇది తమకు గర్వకారణ అంశమని గ్రూప్ ఈడీ జాన్ పాల్ జాయ్ అలుక్కాస్ పేర్కొన్నారు.