
హైదరాబాద్: దీపావళి సందర్భంగా జోయాలుక్కాస్ క్యాష్‌బ్యాక్ ఆఫర్లు ప్రకటించింది. రూ.50,000 విలువైన డైమండ్, అన్ కట్ డైమండ్స్–ప్రెషస్ జ్యువెలరీ కొనుగోలుపై రూ.2 వేల విలువైన క్యాష్‌బ్యాక్ గిఫ్ట్ వోచర్ పొందవచ్చు. అలాగే రూ.50 వేల విలువైన బంగారం ఆభరణాల కొనుగోలుపై రూ.1000 విలువైన క్యాష్‌బ్యాక్ గిఫ్ట్ వోచర్ అందిస్తుంది.
రూ.10వేల విలువైన వెండి ఆభరణాలపై రూ.500 విలువైన గిఫ్ట్ వోచర్లు లభిస్తాయి. అడ్వాన్స్ బుకింగ్ స్కీమ్‌తో షాపింగ్ చేసే కస్టమర్లు ప్రోత్సాహక బహుమతి పొందొచ్చు. ఇప్పటికే ప్రారంభమైన ఆఫర్లు నవంబర్ 12 వరకు అమలులో ఉంటాయి. క్యాష్‌బ్యాక్ రూపంలో కస్టమర్లకు మేమిచ్చే బహుమతులు వారి దీపావళిని మరింత శోభాయమానం చేస్తాయని సంస్థ ఎండీ జాయ్ అలుక్కాస్ తెలిపారు.