నగధగలు
ప్రపంచంలో ఏ దేశంలోనైనా బంగారం(Gold) అత్యంత విలువైన లోహంగా గౌరవం అందుకుంటోంది. బంగారం స్వచ్ఛత గురించి ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క నిష్పత్తిని అనుసరిస్తుంటారు. స్వచ్ఛమైన బంగారం అంటే 24 క్యారట్ (Carot) ల బంగారం. ఆభరణం తయారు చేయాలంటే కొన్ని ఇతర లోహాల మిశ్రమాన్ని బంగారంలో కలుపుతారు. బంగారం మెత్తటి లోహం. కాబట్టి ఆభరణం ఆకారం గట్టిదనం కోసం ఇతర లోహాలను కలపాలి. అలా లోహపు మిశ్రమాల కలయిక తర్వాత ఆభరణం తయారు చేయడానికి ఉపయోగించే బంగారం స్వచ్ఛత 22 క్యారట్‌లు ఉంటుంది.
క్యారట్ అనే పదం అయోమయానికి గురి చేస్తుంది. బంగారం స్వచ్ఛత విషయంలో ఉపయోగించే క్యారట్ అనే పదం ఇంగ్లిష్ అక్షరం ‘కె’తో సూచిస్తారు. మరో క్యారట్ రాళ్ల (వజ్రంతో సహా అన్ని రకాల రాళ్లు) బరువును సూచించే పదం. ఈ క్యారట్‌ను ‘సి’తో అనే అక్షరంతో సూచిస్తారు. ఒక క్యారట్ అంటే 200 మిల్లీగ్రాములు.
బంగారం ధర పెరగడం వల్ల ఆభరణాల తయారీలో 22 క్యారట్‌లకు బదులు 18, 14, 9 క్యారట్ స్వచ్ఛతతో ఆభరణాలు చేస్తున్నారు. క్యారట్ స్వచ్ఛత తగ్గేకొద్దీ గట్టిదనం పెరుగుతుంది.
వజ్రాలు పొదిగే ఆభరణాలకు సాధారణంగా 18 క్యారట్ బంగారం ఉపయోగిస్తారు. ఇప్పుడు 9 క్యారట్ బంగారంతో కూడా వజ్రాల ఆభరణాలు చేస్తున్నారు.
తక్కువ క్యారట్ బంగారు ఆభరణాలను కొంటే తిరిగి అమ్మేటప్పుడు ఆ బంగారానికి విలువ రాదనే అ΄ోహ చాలామందిలో ఉంటుంది. నిజానికి మనం కొన్న ఆభరణంలో ఎంత నిష్పత్తి బంగారం ఉందో కరిగించినప్పుడు ఆ మేరకు బంగారమే తిరిగి వస్తుంది. బీఐఎస్ హాల్‌మార్క్ వేసిన 18 క్యారట్ బంగారాన్ని కరిగిస్తే 75 శాతం బంగారం వస్తుంది. అంతకంటే క్యారట్ తగ్గితే ఆ మేరకే బంగారం వస్తుంది. అంతే తప్ప తిరిగి ఏమీ రాదనేది అ΄ోహ మాత్రమే. సర్టిఫికేట్‌లో ఆభరణంలో ఉన్న బంగారం స్వచ్ఛతతో పాటు క్యారట్ వివరం తాలూకు పర్సెంటేజ్ కూడా ఉంటుంది.
– విశేషిణి రెడ్డి,
జీఐఏ జెమ్మాలజిస్ట్
ఇదీ చదవండి: Sankranti 2025 : పర్ఫెక్ట్ కొలతలతో, ఈజీగా అరిసెలు, కజ్జికాయలు
Comments
Please login to add a commentAdd a comment