Diamond jewelery
-
నీతా అంబానీ ధరించిన ఈ నగ ధర, అసలు ఇది ఎక్కడిదో తెలుసా?!
రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ సతీమణి నీతా అంబానీ వ్యాపారవేత్తగా, ఫ్యాషన్ ఐకాన్‌గా తన ప్రత్యేకతను చాటుకుంటారు. భారతీయ వారసత్వ సంపదను, అద్భుతమైన కళారీతులను ప్రదర్శించేలా చేనేత చీరలను ధరించి ఆకట్టుకోవడంలో నీతా తర్వాతే ఎవరైనా. అంతేనా కోట్ల విలువ చేసే డైమండ్ నగలు, ఖరీదైన బ్యాగులు మొదలు లిప్‌స్టిక్‌లు, చెప్పుల దాకా ప్రతీదీ ప్రత్యేకమే. తాజాగా ముంబైలో జరిగిన ఒక వేడుకలో బనారసీ చీరలో మెరిసిపోయారు. అంతేకాదు ఈ సందర్బంగా ఆమె ధరించిన అరవంకి (బాజూబాంద్) స్పెషల్ ఎట్రాక్షన్‌గా నిలిచింది. దీంతో దీని ఖరీదు ఎంత అని వాకబు చేసిన నెటిజనులు ఔరా! అంటున్నారు. మార్చి 9 ముంబైలో జరిగిన 71వ మిస్ వరల్డ్ ఈవెంట్లో రిలయన్స్ ఫౌండేషన్ ద్వారా నీతా చేసిన దాతృత్వ సేవలకు గాను 'బ్యూటీ విత్ పర్పస్ హ్యుమానిటేరియన్ అవార్డు' అందుకున్నారు. ఈ సందర్భంగా హ్యాండ్ మేడ్ జాంగ్లా డిజైన్ బనారసీ చీరలో అందరి చూపును తన వైపు తిప్పుకున్నారు నీతా. చీర మాత్రమే కాదు, ఆమె ఆభరణాలు, మరీ ముఖ్యంగా ఆర్మ్ బ్యాండ్‌పై అందరి దృష్టి పడింది. మొఘల్ చక్రవర్తి అయిన షాజహాన్ చక్రవర్తి శిరస్సుపై(తలపాగాపై) ధరించే (సర్పేచ్ లేదా కల్గీ)ని మరింత అందంగా రీ-స్టైలింగ్ చేసి మరీ ధరించారట. ఈ ఆభరణం ధర తాజా సమాచారం ప్రకారం రూ. 200 కోట్లు అని తెలుస్తోంది. టోపోఫిలియా ఇన్‌స్టా సమాచారం ప్రకారం, ఈ ఆభరణం 13.7 సెం.మీ ఎత్తు , 19.8 సెం.మీ వెడల్పుతో మేలిమి బంగారంతో తయారు చేశారు. వజ్రాలు, కెంపులు, ఇతర విలువైన రాళ్లను అందంగా పొదిగారు. మొఘల్ చక్రవర్తి షాజహాన్కి చెందిన కొన్ని ఆభరణాలను 2019లో వేలం వేసిన సందర్భంలో చివరిసారిగా దీన్ని చూసినట్టు ఇన్‌స్టా పోస్ట్ పేర్కొంది. -
స్వచ్ఛత, ఫినిషింగ్... తనిష్క్‌కు కీలకం
ప్రత్యేక డిజైనర్ల బృందం ద్వారా కొత్త రూపకల్పనలు విజయవాడ : బంగారు, వజ్రాభరణాల స్వచ్ఛత, ఫినిషింగే తనిష్క్‌కు బ్రాండ్ ఇమేజ్ తెచ్చిపెట్టిందని, ఆ నమ్మికతోనే కస్టమర్ల ఆదరాభిమానాలను చూరగొంటున్నామని తనిష్క్ ఏరియా మేనేజర్ మహీధర్ చెప్పారు. ఆయన ‘సాక్షి’తో మాట్లాడుతూ ఎప్పటికప్పుడు మార్కెట్లోకి అత్యాధునిక డిజైన్లతో నాణ్యమైన ఆభరణాలను కస్టమర్లకు అందించేందుకు సొంత వర్క్‌షాపు, డిజైనర్ల బృందాన్ని కలిగి ఉన్నామని తెలిపారు. తమ డిజైనర్స్ బృందం ఎప్పటికప్పుడు అత్యాధునిక డిజైన్లను రూపొందించడం వల్ల మార్కెట్లో తనిష్క్ సరికొత్త ట్రెండ్ సృష్టిస్తోందని పేర్కొన్నారు. ఆభరణాల తయారీలో స్వర్ణకారులకు నైపుణ్యం పెంచేందుకు ప్రత్యేక శిక్షణ ఇప్పిస్తున్నామని వివరించారు. మార్కెట్లోకి వెడ్డింగ్ కలెక్షన్.. లేటెస్ట్ డిజైన్లు.. తనిష్క్ బ్రాండ్‌తో అత్యాధునిక డిజైన్ వెడ్డింగ్ కలెక్షన్స్, కోర్ 7 ఆభరణాలను మార్కెట్లోకి ప్రవేశపెట్టినట్లు తెలిపారు. తెలుగు వధువుల కోసం అధునాతన వెడ్డింగ్ కలెక్షన్‌ను అందుబాటులోకి తెచ్చినట్లు చెప్పారు. ఒకే ఆభరణాన్ని వడ్డాణం, నెక్లెస్.. ఇలా ఐదు రకాలుగా వినయోగించుకునేలా డిజైన్ చేసినట్లు తెలిపారు. ప్రత్యేకమైన రాళ్లు కలిగిన కోర్ 7 ఆభరణాలను మార్కెట్లోకి ప్రవేశపెట్టినట్లు చెప్పారు. గతంలో గంగా కలెక్షన్స్‌కు మంచి ఆదరణ వచ్చిందని పేర్కొన్నారు. ప్రతి ఆభరణం తనిష్క్ బ్రాండ్ ఇమేజ్ను ప్రత్యేకంగా తెలియజేస్తుందన్నారు. ఈ అక్షయ తృతీయకు అధిక స్పందన... గత రెండేళ్లలో అక్షయ తృతీయకు లభించిన స్పందన కంటే ఈ ఏడాది ఎక్కువ లభించే అవకాశాలు ఉన్నట్లు చెప్పారు. అమ్మకాలు పెరుగుతాయనే ఆకాంక్ష వెలిబుచ్చారు. ప్రస్తుతానికి బంగారం మార్కెట్ పాజిటివ్‌గానే కనిపిస్తోందన్నారు. బంగారం ధరలో పెద్దగా హెచ్చుతగ్గులుండకపోవొచ్చని ఆయన అంచనావేశారు. -
కిడ్స్..డైమండ్
పెద్దవాళ్లకేనా... ఈ రోజుల్లో పిల్లలూ ఎవరి టేస్టును వారే ప్రజంట్ చేసుకోగలుగుతున్నారు. రోజురోజుకూ పెరిగిపోతున్న సాంకేతిక పరిజ్ఞానం... ప్రపంచాన్ని క్లిక్‌లో ముందుంచే అంతర్జాలం... మొత్తానికి అదీఇదీ అని లేకుండా చిన్నారులూ అన్నింటా అప్డేట్ అయిపోతున్నారు. ప్రస్తుత జనరేషన్లో నాలుగేళ్ల పిల్లలు వారికేం కావాలో తెలుసుకోగలుగుతున్నారనేది ఓ స్టడీ సారాంశం. వేసుకొనే డ్రెస్ నుంచి తినే బర్గర్ వరకు అన్నీ వారిష్టమే! కేవలం వారి అభిరుచులను బేస్ చేసుకొనే ఎన్నో బిజినెస్‌లు మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగిపోతున్నాయి. నమ్మలేకపోయినా స్టాటిస్టిక్స్ సాక్షిగా ఇది నిరూపితం. పిల్లలతో కలసి షాపింగ్‌కు వెళ్లేది మనమే గానీ... చాలా సందర్భాల్లో ఏ మోడల్ కొనాలో డిసైడ్ చేసేది వారే! అలా చిన్నారుల కోసమే మార్కెట్‌ను ముంచెత్తుతున్న మరో నయా ఐటెమ్ డైమండ్ జ్యువెలరీ! జిగేల్మంటూ చూడగానే వారికి నచ్చేలా... ధగధగలకు మురిసి అదే కావాలని మారాం చేసేలా ఆకర్షణీయమైన బడా బ్రాండెడ్ వెరైటీలెన్నో ఇప్పుడు సిద్ధంగా ఉన్నాయి. చిన్నారులు ఎక్కువగా ఇష్టపడే బొమ్మలే ఈ డెమైండ్ ఆభరణాల్లో కనిపిస్తాయి. టెడ్డీబేర్, సీతాకోకచిలుక, తాబేలు, కుందేలు... ఇలాంటివెన్నో ఎక్స్‌క్లూజివ్ పెండెంట్ కలెక్షన్స్ షాపుల్లో కొలువుదీరాయి. బంగారంతో చేసిన రకరకాల పెండెంట్స్ వజ్రాల హంగులద్దుకుని అబ్బురపరుస్తున్నాయి. ఇవే కాదు... మల్టీ కలర్ స్టోన్స్, ఎనామిల్ కోటింగ్‌లతో మరిన్ని వన్నెలద్దుకున్న చైన్లు పిల్లల మనసు దోచేస్తున్నాయి. విశేషమేమంటే... పెద్దలనూ ఈ డిజైన్లు ఆకట్టుకుంటున్నాయి. బాబ్ డైమండ్ అండ్ ఎనామిల్, క్రష్ టర్టిల్ డైమండ్, డోరీ డాల్ఫిన్ డైమండ్, ఫ్రిల్లీ బటర్‌ఫ్లై డైమండ్, జుంబో ఎలిఫెంట్ డైమండ్, పాండా హార్ట్ డైమండ్... ఇలా ఒకటేమిటీ ఒక్కో పెండెంట్ ఒక్కో ప్రత్యేకమైన డిజైన్‌లో మెరిసిపోతున్నాయి. ఇవే కాదు... ఆడ పిల్లలకైతే ఇయర్ రింగ్స్, రింగ్స్, బ్రేస్లెట్స్ వంటివెన్నో ఆభరణాలు షాపుల్లో జిగేల్మంటున్నాయి. ఫ్యాషన్ ట్రెండ్స్‌ను స్ట్రిక్ట్‌గా ఫాలో అయ్యే పేరెంట్స్ తమ పిల్లల కోసం వినూత్నమైనవే కాకుండా... సౌకర్యంగా ఉండాలని కూడా ఆలోచిస్తున్నారు. బరువైన సంప్రదాయ ఆభరణాలకు బదులు పిల్లలకు సౌకర్యంగా ఉండేలా లైట్ వెయిట్ ఫ్యాషన్ ఫార్వర్డ్ వెరైటీలను కొనుగోలు చేస్తున్నారు. అందుకు తగ్గట్టుగానే స్లీక్గా, బరువు తక్కువగా ఉండేలా ఈ డైమండ్ సెట్స్ రూపొందిస్తున్నారు నగల వ్యాపారులు. బర్త్‌డేలు, బేబీషవర్స్ వంటి కార్యక్రమాల్లో వీటిని గిఫ్ట్‌లుగా ఇచ్చేందుకు చాలామంది ప్రిఫర్ చేస్తున్నారు. షాపుల్లోనే కాదు... జామోర్ డాట్ కామ్ వంటి ఆన్లైన్ స్టోర్స్‌లో కూడా కిడ్స్ జ్యువెలరీ అందుబాటులో ఉంది. ధర సుమారు పది వేల రూపాయల నుంచి మొదలు. -
లడ్డూ లాంటి ఆఫర్..
చెప్పుల నుంచి వజ్రాభరణాల దాకా అన్నీ ఆన్లైన్లో దొరుకుతున్నా.. ఈ లావాదేవీలపై సందేహాల కారణంగా ఈ-కామర్స్ ఇంకా పుంజుకోవాల్సి ఉంది. దీంతో కస్టమర్లను ఆకర్షించేందుకు ఆన్లైన్ షాపింగ్ కంపెనీలు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నాయి. దీంతో ఎయిర్లాయల్ అనే సంస్థ అటు షాపింగ్ కంపెనీలను ఇటు కొనుగోలుదారులను అనుసంధానించే పనిలో పడింది. ఇందుకోసం లడ్డూ పేరుతో ప్రత్యేక యాప్‌ను తెచ్చింది. దీని ద్వారా వివిధ సంస్థల యాప్స్‌ని డౌన్లోడ్ చేసుకుని, కొంత సేపు ఉచితంగా ట్రై చేసి చూడొచ్చు. ఇందుకు గాను కస్టమర్లకు కొంత మొత్తం రివార్డు లభిస్తుంది. ఇది సదరు కస్టమరు కోసం ప్రత్యేకంగా రూపొందించిన మొబైల్ వాలెట్లో జమవుతుంది. ఇతర మిత్రులను రిఫర్ చేసినా కూడా కొంత మొత్తాన్ని ఎయిర్లాయల్ కస్టమర్ ఖాతాలో జమ చేస్తుంది. ఫోన్ టాక్‌టైమ్ లేదా డీటీహెచ్ రీచార్జ్ కోసం దీన్ని వాడుకోవచ్చు.