స్వచ్ఛత, ఫినిషింగ్... తనిష్క్‌కు కీలకం
ప్రత్యేక డిజైనర్ల బృందం ద్వారా కొత్త రూపకల్పనలు
విజయవాడ : బంగారు, వజ్రాభరణాల స్వచ్ఛత, ఫినిషింగే తనిష్క్‌కు బ్రాండ్ ఇమేజ్ తెచ్చిపెట్టిందని, ఆ నమ్మికతోనే కస్టమర్ల ఆదరాభిమానాలను చూరగొంటున్నామని తనిష్క్ ఏరియా మేనేజర్ మహీధర్ చెప్పారు. ఆయన ‘సాక్షి’తో మాట్లాడుతూ ఎప్పటికప్పుడు మార్కెట్‌లోకి అత్యాధునిక డిజైన్‌లతో నాణ్యమైన ఆభరణాలను కస్టమర్‌లకు అందించేందుకు సొంత వర్క్‌షాపు, డిజైనర్ల బృందాన్ని కలిగి ఉన్నామని తెలిపారు.
తమ డిజైనర్స్ బృందం ఎప్పటికప్పుడు అత్యాధునిక డిజైన్‌లను రూపొందించడం వల్ల మార్కెట్‌లో తనిష్క్ సరికొత్త ట్రెండ్ సృష్టిస్తోందని పేర్కొన్నారు. ఆభరణాల తయారీలో స్వర్ణకారులకు నైపుణ్యం పెంచేందుకు ప్రత్యేక శిక్షణ ఇప్పిస్తున్నామని వివరించారు.
మార్కెట్‌లోకి వెడ్డింగ్ కలెక్షన్.. లేటెస్ట్ డిజైన్‌లు..
తనిష్క్ బ్రాండ్‌తో అత్యాధునిక డిజైన్ వెడ్డింగ్ కలెక్షన్స్, కోర్ 7 ఆభరణాలను మార్కెట్‌లోకి ప్రవేశపెట్టినట్లు తెలిపారు. తెలుగు వధువుల కోసం అధునాతన వెడ్డింగ్ కలెక్షన్‌ను అందుబాటులోకి తెచ్చినట్లు చెప్పారు. ఒకే ఆభరణాన్ని వడ్డాణం, నెక్లెస్.. ఇలా ఐదు రకాలుగా వినయోగించుకునేలా డిజైన్ చేసినట్లు తెలిపారు. ప్రత్యేకమైన రాళ్లు కలిగిన కోర్ 7 ఆభరణాలను మార్కెట్‌లోకి ప్రవేశపెట్టినట్లు చెప్పారు. గతంలో గంగా కలెక్షన్స్‌కు మంచి ఆదరణ వచ్చిందని పేర్కొన్నారు. ప్రతి ఆభరణం తనిష్క్ బ్రాండ్ ఇమేజ్‌ను ప్రత్యేకంగా తెలియజేస్తుందన్నారు.
ఈ అక్షయ తృతీయకు అధిక స్పందన...
గత రెండేళ్లలో అక్షయ తృతీయకు లభించిన స్పందన కంటే ఈ ఏడాది ఎక్కువ లభించే అవకాశాలు ఉన్నట్లు చెప్పారు. అమ్మకాలు పెరుగుతాయనే ఆకాంక్ష వెలిబుచ్చారు. ప్రస్తుతానికి బంగారం మార్కెట్ పాజిటివ్‌గానే కనిపిస్తోందన్నారు. బంగారం ధరలో పెద్దగా హెచ్చుతగ్గులుండకపోవొచ్చని ఆయన అంచనావేశారు.