రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ సతీమణి నీతా అంబానీ వ్యాపారవేత్తగా, ఫ్యాషన్ ఐకాన్‌గా తన ప్రత్యేకతను చాటుకుంటారు. భారతీయ వారసత్వ సంపదను, అద్భుతమైన కళారీతులను ప్రదర్శించేలా చేనేత చీరలను ధరించి ఆకట్టుకోవడంలో నీతా తర్వాతే ఎవరైనా. అంతేనా కోట్ల విలువ చేసే డైమండ్ నగలు, ఖరీదైన బ్యాగులు మొదలు లిప్‌స్టిక్‌లు, చెప్పుల దాకా ప్రతీదీ ప్రత్యేకమే. తాజాగా ముంబైలో జరిగిన ఒక వేడుకలో బనారసీ చీరలో మెరిసిపోయారు. అంతేకాదు ఈ సందర్బంగా ఆమె ధరించిన అరవంకి (బాజూబాంద్) స్పెషల్ ఎట్రాక్షన్‌గా నిలిచింది. దీంతో దీని ఖరీదు ఎంత అని వాకబు చేసిన నెటిజనులు ఔరా! అంటున్నారు.
మార్చి 9 ముంబైలో జరిగిన 71వ మిస్ వరల్డ్ ఈవెంట్‌లో రిలయన్స్ ఫౌండేషన్ ద్వారా నీతా చేసిన దాతృత్వ సేవలకు గాను 'బ్యూటీ విత్ పర్పస్ హ్యుమానిటేరియన్ అవార్డు' అందుకున్నారు. ఈ సందర్భంగా హ్యాండ్ మేడ్ జాంగ్లా డిజైన్ బనారసీ చీరలో అందరి చూపును తన వైపు తిప్పుకున్నారు నీతా.
చీర మాత్రమే కాదు, ఆమె ఆభరణాలు, మరీ ముఖ్యంగా ఆర్మ్ బ్యాండ్‌పై అందరి దృష్టి పడింది. మొఘల్ చక్రవర్తి అయిన షాజహాన్ చక్రవర్తి శిరస్సుపై(తలపాగాపై) ధరించే (సర్‌పేచ్ లేదా కల్గీ)ని మరింత అందంగా రీ-స్టైలింగ్ చేసి మరీ ధరించారట. ఈ ఆభరణం ధర తాజా సమాచారం ప్రకారం రూ. 200 కోట్లు అని తెలుస్తోంది.
టోపోఫిలియా ఇన్‌స్టా సమాచారం ప్రకారం, ఈ ఆభరణం 13.7 సెం.మీ ఎత్తు , 19.8 సెం.మీ వెడల్పుతో మేలిమి బంగారంతో తయారు చేశారు. వజ్రాలు, కెంపులు, ఇతర విలువైన రాళ్లను అందంగా పొదిగారు. మొఘల్ చక్రవర్తి షాజహాన్‌కి చెందిన కొన్ని ఆభరణాలను 2019లో వేలం వేసిన సందర్భంలో చివరిసారిగా దీన్ని చూసినట్టు ఇన్‌స్టా పోస్ట్ పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment