నీతా అంబానీ వ్యక్తిగత అభిరుచులపై అందరికీ ఆసక్తి
నీతా తాగే నీళ్లపై సోషల్ మీడియాలో ఎన్నో వార్తలు
ఏది నిజం? ఏది అబద్ధం?
నిజంగా నీతా తాగే నీళ్లు లీటర్‌కు రూ.27వేలు ఉంటుందా?
రిలయన్స్ ఫౌండేషన్ ఛైర్మన్, ముఖేష్ అంబానీ భార్య నీతా అంబానీ అత్యంత స్టైలిష్ ఫ్యాషన్ ఐకాన్‌లలో ఒకరు. అందానికితోడు, వ్యాపార దక్షతకూడా ఆమె సొంతం. వివిధ దాతృత్వ , సాంస్కృతిక కార్యక్రమాలలో చురుకుగా ఉంటారు. అయితే నీతా బ్యూటీ సీక్రెట్ ఏంటి అనేది ఎపుడూ హాట్ టాపికే. ఇటీవల బ్యూటీ విత్ పర్పస్ హ్యుమానిటేరియన్ అవార్డు'కూడా దక్కించుకున్నారు. తాజాగా నీతా అంబానీ ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన నీటిని తాగుతారని సోషల్ మీడియాలో ఓ వార్త చక్కర్లు కొడుతోంది.. అదేంటి అవి నీళ్లా? లేక బంగారమా? ఇదేంటీ విడ్డూరం అనుకుంటున్నారా? అయితే మీరీ స్టోరీ చదవాల్సిందే.
నీతా అంబానీ ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన నీటిని వాడతారని చాలా చోట్ల ప్రచారంలో ఉంది. ఎంతయినా రిలయన్స్ ఫౌండేషన్ ఛైర్మన్ ముఖేష్ భార్య కదా. తనకు తక్కువేంటీ? అనుకునే వాళ్లున్నారు. తన సౌందర్యాన్ని కాపాడుకోవడానికి ప్రత్యేకంగా తయారు చేసిన నీళ్లను వాడతారని చెబుతారు. ఒక ప్రచారంలో ఆమె తాగే 750 మిల్లీలీటర్ల వాటర్ బాటిల్ ధర 27 వేల రూపాయలకు పైమాటే అని కూడా ప్రచారం చేఉశారు. ప్రపంచంలోనే ఖరీదైన నీళ్లు ఇవేనని, ఈ నీటిని తాగితే ఆరోగ్యం మెరుగుపడటంతో పాటు బరువు నియంత్రణలోఉండి, చర్మం నిగారింపును సంతరించుకుంటుందని ఒత్తిడి దూరం అవుతుందని ప్రచారం చేశారు. ఈ నీరు ఎక్కడ పడితే అక్కడ దొరకదని, వసంతకాలంలో ఫిజి, ఫ్రాన్స్, ఫిన్లాండ్ దేశంలో ఏర్పడే గ్లాసియర్‌ల నుంచి సేకరిస్తారని, దాంతోపాటు ఖనిజ లవణాలు కూడా ఎక్కువ మోతాదులో ఉంటాయని, అందుకే ఈ వాటర్‌కు అంత క్రేజ్ ఉందని ప్రచారం చేశారు. దీనిపై ఓ సందర్భంలో నీతా అంబానీనే తెలిసిన వాళ్లు ఒకరు అడిగారు. మీ సౌందర్య రహస్యానికి, మీ ఉత్సాహానికి మీరు తాగే నీళ్లే కారణమా అని అడిగారు. ఆ ప్రశ్నవిని ఆశ్చర్యపోయిన నీతా అంబానీ.. ఖరీదైన నీళ్లంటూ జరుగుతున్న ప్రచారమంతా వట్టిదేనని తేల్చేశారట.
రూ. 49 లక్షల వాటర్ బాటిల్ కథ
కాగా 2015లో జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో ఆమె ఓ వాటర్ బాటిల్‌లోతో కనిపించారు. ఈ బాటిల్ ధర సుమారు రూ.49 లక్షలు అంటూ మార్ఫింగ్ ఫోటో ఇంటర్నెట్‌లో వైరల్ అయింది. అసలు కథ ఏంటంటే ప్రముఖ మెక్సికన్ డిజైనర్, ఫెర్నాండో అల్టామిరానో ఈ బాటిల్‌ను నిజంగానే బంగారంతో చేశారు. దాని పేరే అక్వాడి క్రిస్టల్లో ట్రిబ్యూటో ఎ మొడిగ్లియాని. ఇది ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన వాటర్ బాటిల్‌గా గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సాధించింది. అయితే ఖరీదైన నీళ్లలాగే.. ఖరీదైన బాటిల్ గురించి కూడా నీతా ఏదో ఒక స్పష్టత ఇస్తారేమో.
Comments
Please login to add a commentAdd a comment