లడ్డూ లాంటి ఆఫర్..
చెప్పుల నుంచి వజ్రాభరణాల దాకా అన్నీ ఆన్‌లైన్లో దొరుకుతున్నా.. ఈ లావాదేవీలపై సందేహాల కారణంగా ఈ-కామర్స్ ఇంకా పుంజుకోవాల్సి ఉంది. దీంతో కస్టమర్లను ఆకర్షించేందుకు ఆన్‌లైన్ షాపింగ్ కంపెనీలు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నాయి. దీంతో ఎయిర్‌లాయల్ అనే సంస్థ అటు షాపింగ్ కంపెనీలను ఇటు కొనుగోలుదారులను అనుసంధానించే పనిలో పడింది.
ఇందుకోసం లడ్డూ పేరుతో ప్రత్యేక యాప్‌ను తెచ్చింది. దీని ద్వారా వివిధ సంస్థల యాప్స్‌ని డౌన్‌లోడ్ చేసుకుని, కొంత సేపు ఉచితంగా ట్రై చేసి చూడొచ్చు. ఇందుకు గాను కస్టమర్లకు కొంత మొత్తం రివార్డు లభిస్తుంది. ఇది సదరు కస్టమరు కోసం ప్రత్యేకంగా రూపొందించిన మొబైల్ వాలెట్‌లో జమవుతుంది. ఇతర మిత్రులను రిఫర్ చేసినా కూడా కొంత మొత్తాన్ని ఎయిర్‌లాయల్ కస్టమర్ ఖాతాలో జమ చేస్తుంది. ఫోన్ టాక్‌టైమ్ లేదా డీటీహెచ్ రీచార్జ్ కోసం దీన్ని వాడుకోవచ్చు.