online shopping
-
క్విక్ కామర్స్‌పై విమర్శలు ఎందుకు..
కిరాణా సరుకులు, నిత్యావసర వస్తువులను నిమిషాల్లో డెలివరీ చేస్తామని హామీ ఇస్తున్న క్విక్ కామర్స్ బిజినెస్ పట్టణ ప్రాంతాల్లో వేగంగా ప్రజాదరణ పొందుతోంది. ఇప్పటికే బ్లింకిట్, ఇన్‌స్టామార్ట్, బిగ్‌బాస్కెట్, జెప్టో.. వంటి సంస్థలు ఈ సర్వీసులు అందిస్తున్నాయి. అయితే ఈ బిజినెస్‌పై ప్రజాదరణతోపాటు విమర్శలు సైతం పెరుగుతున్నాయి. ఇందుకు కొన్ని కారణాలను నిపుణులు విశ్లేషిస్తున్నారు.వ్యతిరేక పోటీ విధానాలుక్విక్ కామర్స్ సంస్థలు వ్యతిరేక పోటీ విధానాలను అనుసరిస్తున్నాయనే వాదనలున్నాయి. సాంప్రదాయ రిటైలర్లు, ముఖ్యంగా కిరాణా దుకాణాదారులపై క్విక్ కామర్స్ ప్రభావం భారీగా ఉంది. ఈ సంస్థలు అందించే డిస్కౌంట్లు, నేరుగా ఇంటికే డెలివరీ చేసే సేవలతో కిరాణాదారుల వ్యాపారం తీవ్రంగా దెబ్బతింది. వినియోగదారులకు వేగంగా సర్వీసులు అందించేందుకు స్థానికంగా డార్క్ స్టోర్లను, చిన్న, ఆటోమేటెడ్ గోదాములను ఉపయోగిస్తున్నాయి.ఆకర్షణీయ ధరలుసాంప్రదాయ రిటైల్ విధానంలో వివిధ దశల్లో ఉండే మధ్యవర్తుల కమీషన్ల బాదరబందీ లేకపోవడంతో క్విక్ కామర్స్ సంస్థలు ఆకర్షణీయమైన ధరకే ఉత్పత్తులను అందిస్తుండటం సైతం కస్టమర్లు వాటివైపు మొగ్గు చూపేందుకు దోహదపడుతోంది. ఈ నేపథ్యంలో నిత్యావసరాల మార్కెట్లో ఆధిపత్యం ఉన్న కిరాణా స్టోర్స్ మనుగడ కోసం పోరాడే పరిస్థితులు నెలకొంటున్నాయి. క్విక్ కామర్స్ వినియోగం 2024-25లో 74% వృద్ధి నమోదు చేయనుంది. 2023–28 మధ్యలో 48% వార్షిక వృద్ధితో అత్యంత వేగంగా ఎదిగిన మాధ్యమంగా నిలవనుందని కొన్ని నివేదికలు చెబుతున్నాయి.విదేశీ పెట్టుబడుల దుర్వినియోగంక్విక్ కామర్స్ వాణిజ్యం పెరగడం స్థానిక రిటైలర్లకు గొడ్డలిపెట్టుగా మారింది. సౌలభ్యం, తక్కువ ధరలకు ఆకర్షితులైన చాలా మంది వినియోగదారులు తమ షాపింగ్ అలవాట్లను మార్చుకుంటున్నారు. ఆన్లైన్ ప్లాట్‌ఫామ్‌లకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు. ఈ మార్పు ఫలితంగా సాంప్రదాయ దుకాణాల్లో అమ్మకాలు తగ్గిపోయాయి. రిటైల్ మార్కెట్‌ను పూర్తి తమ వైపు తిప్పుకోవాలనే ఉద్దేశంతో క్విక్ కామర్స్ ప్లాట్‌ఫామ్‌లు విదేశీ పెట్టుబడులను దుర్వినియోగం చేస్తున్నాయని కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ (సీఏఐటీ) ఆరోపించింది.ప్రభుత్వ సంస్థల దర్యాప్తుక్వాక్ కామర్స్ కంపెనీలు అనుసరిస్తున్న విధానాలపై ఆందోళనలు ఉన్నాయి. ఈ సంస్థలు పోటీ వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నాయన్న ఆరోపణలపై కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) దర్యాప్తు చేస్తోంది. ఈ ప్లాట్‌ఫామ్‌లు ధరలను కట్టడి చేస్తూ పోటీ చట్టాలను ఉల్లంఘించేలా ఇన్వెంటరీని నియంత్రిస్తున్నాయని సాంప్రదాయ రిటైలర్లు పేర్కొన్నారు. ఈ మేరకు వస్తున్న ఆరోపణలపై సీసీఐ తన దర్యాప్తును కొనసాగించడానికి మరింత వివరణాత్మక సాక్ష్యాలను కోరుతోంది.ఇదీ చదవండి: ఖో-ఖోకు పెరుగుతున్న స్పాన్సర్షిప్ఏం చేయాలంటే..ఈ ఆందోళనలపై స్పందించిన ప్రభుత్వం వాటికి అనుగుణంగా చర్యలు చేపట్టేందుకు సిద్ధమైంది. రిటైలర్లకు నష్టం కలగకుండా, క్విక్ కామర్స్ సంస్థలు అంగీకరించేలా సమన్వయం చేస్తూ మార్గదర్శకాలు తయారు చేయాల్సి ఉంది. రిటైల్ వ్యవస్థలో భాగస్వాములందరి ప్రయోజనాలను పరిరక్షిస్తూనే సృజనాత్మకతకు మద్దతు ఇచ్చేలా పరిష్కారాలు కనుగొనాలి. -
కిరాణా దుకాణాలకు టెక్నాలజీ ప్లాట్‌ఫామ్
క్విక్ కామర్స్(quick commerce) సంస్థల మాదిరిగానే కిరాణా దుకాణాలకు ప్రత్యేకంగా ఆన్లైన్ టెక్నాలజీ ప్లాట్‌ఫామ్ అందుబాటులోకి తీసుకురావాలని ది ఫెడరేషన్ ఆఫ్ రిటెయిలర్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (FRAI) ప్రభుత్వాన్ని కోరింది. ఇప్పటికే క్విక్ కామర్స్ సంస్థల ద్వారా వస్తున్న పోటీని తట్టుకోలేక కిరాణా దుకాణాలు కుదేలవుతున్నాయని చెప్పింది. వీటికితోడు రిటైల్(Retail) అవుట్లెట్లు పెరుగుతున్నాయని పేర్కొంది. కొత్త కంపెనీలు రిటైల్ స్టోర్ వ్యాపారంలోకి అడుగుపెడుతున్నాయని, ఇప్పటికే ఆన్లైన్ షాపింగ్ సర్వీసులు అందిస్తున్న కంపెనీలు క్విక్‌కామర్స్ సేవలు ప్రారంభిస్తున్నాయని వివరించింది.ఈ నేపథ్యంలో కిరాణాదారులకు భారీగా నష్టం వాటిల్లుతుందని ఎఫ్ఆర్ఏఐ తెలిపింది. క్విక్ కామర్స్ నుంచి ఎదురవుతున్న పోటీని తట్టుకునేందుకు సంప్రదాయ కిరాణా దుకాణాలకు ప్రత్యేక ఆన్లైన్ ప్లాట్‌ఫామ్‌ను ప్రభుత్వం కల్పించాలని చెప్పింది. ఇప్పటికే మార్కెట్లో స్విగ్గీ ఇన్‌స్టామార్ట్, బ్లింకిట్, జెప్టో(Zepto) వంటి క్విక్ కామర్స్ సంస్థల నుంచి పోటీ పెరుగుతున్న కారణంగా ప్రభుత్వం కిరాణా దుకాణాలకు తోడ్పాటు అందించాలని తెలిపింది.ఇదీ చదవండి: ఎకానమీపై ఆర్బీఐ బులెటిన్ఈ సందర్భంగా ఎఫ్ఆర్ఏఐ గౌరవ అధికార ప్రతినిధి అభయ్ రాజ్ మిశ్రా మాట్లాడుతూ ప్రభుత్వం ఆధ్వర్యంలోని ఓపెన్ నెట్వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్ (ONDC) వంటి కొత్త టెక్నాలజీలు, కిరాణా దుకాణాలకు క్విక్ కామర్స్ పోటీను తట్టుకునేలా పరిష్కారం అందిస్తాయని చెప్పారు. దేశవ్యాప్తంగా ఎఫ్ఆర్ఏఐలో 42 రిటైల్ సంఘాలు ఉన్నాయి. 80 లక్షల సూక్ష్మ, చిన్న, మధ్య స్థాయి రిటైలర్లకు ఈ అసోసియేషన్ ప్రాతినిధ్యం వహిస్తోంది. -
నకిలీ షాపింగ్ వెబ్సైట్లు.. తస్మాత్ జాగ్రత్త!
సునీల్ ఇన్‌స్టాగ్రామ్‌లో ‘ఫార్మల్షాప్’ పేరుతో ఓ యాడ్ చూశాడు. ‘బ్రాండెడ్ దుస్తులు తక్కువ ధరకే అందిస్తున్నాం. ఈ ఆఫర్ లిమిడెట్ పీరియడ్ మాత్రమే. స్టాక్ అయిపోయిందంటే మాత్రం మీరు నష్టపోతారు. త్వరపడండి’ అంటూ ప్రకటన సారాంశం. వెంటనే సునీల్ లింక్‌పై క్లిక్ చేశాడు. తనుకు కావాల్సిన దుస్తులు సెలక్ట్ చేసుకున్నాడు. 10 రోజుల రిటర్న్ పాలసీ, క్యాష్ ఆన్ డెలివరీ సదుపాయం ఉండడంతో ఎలాంటి అనుమానం చెందకుండా ఆర్డర్ బుక్ చేశాడు. ఇంటికి డెలివరీ అయిన తన ఆర్డర్‌ను తీసుకుని డబ్బు చెల్లించాడు. తీరా ప్యాక్ ఓపెన్ చేసి చిరిగిన, క్వాలిటీ లేని దుస్తులు ఉన్నాయని గ్రహించాడు. వెంటనే లింక్‌పై క్లిక్ చేసి రిటర్న్ పెట్టేందుకు ప్రయత్నించాడు. కానీ అసలు ఆ ఆప్షన్ కనిపించలేదు. మెయిల్ చేసినా స్పందన కరవైంది. హెల్ప్‌లైన్ నంబర్ పనిచేయకపోవడంతో మోసపోయానని గ్రహించాడు.ఆన్లైన్ షాపింగ్ పెరుగుతుండడంతో ఇలాంటి మోసాలు ఎక్కువవుతున్నాయి. సైబర్ కేటుగాళ్లు నకిలీ వెబ్సైట్లు రూపొందించి ఆకర్షణీయ ఆఫర్లంటూ సామాజిక మాధ్యమాల్లో ప్రకటనలు ఇస్తూ వాట్సప్‌కు లింక్‌లు పంపుతున్నారు. కస్టమర్లకు ఏమాత్రం అనుమానం రాకుండా వ్యవహరిస్తున్నారు. తీరా బుక్ చేస్తే నకిలీ ఉత్పత్తులను పంపి మోసిగిస్తున్నారు. ఇలాంటి సందర్భాల్లో కింది జాగ్రత్తలు పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు.పాటించాల్సిన జాగ్రత్తలుఆన్లైన్ షాపింగ్ కోసం ప్రముఖ వెబ్సైట్లనే వినియోగించాలి.అధికారిక పోర్టల్స్, యాప్‌లను మాత్రమే వినియోగించాలి. ఎలాంటి లింక్‌లపై క్లిక్ చేయకూడదు.ప్రతి వెబ్సైట్లో ‘కాంటాక్ట్ అజ్’ అనే విభాగంలో సంస్థకు చెందిన చిరునామా, అధికారిక మెయిల్ చిరునామా వివరాలు ఉంటాయి. అవిలేని సంస్థ సేవలు వినియోగించకూడదు.కొన్ని సంస్థలు తప్పుడు చిరునామాను కూడా వెబ్సైట్లో ఉంచే ప్రమాదం ఉంది. ఆ అడ్రస్‌ను నెట్లో సెర్చ్ చేస్తే కార్పొరేట్ కార్యాలయం వివరాలు వస్తాయి. అలా ఒకసారి సరిచూసుకోవాలి.‘క్యాష్ ఆన్ డెలివరీ’ విధానంలోనే ఆర్డర్ బుక్ చేసుకోవడం మేలు. డెలివరీ బాయ్ ఆర్డర్ డెలివరీ అందించి దాన్ని ఓపెన్ చేసేలా చూసుకోవాలి.పార్శిల్ తెరిచేటప్పుడు కచ్చితంగా వీడియో రికార్డు చేయండి. ఇది మనకు ఆధారంగా ఉంటుంది.మోసం జరిగితే consumerhelpline.gov.in కు వెళ్లి ఫిర్యాదు చేయవచ్చు. నేషనల్ కన్జూమర్ హెల్ప్‌లైన్ నంబర్ 1800-11-4000 (ఉదయం 9:30 గంటల నుంచి సాయంత్రం 5:30 మధ్య) ఫోన్ చేయవచ్చు. -
మూడు నగరాలు.. ఆరు గ్రామాలు
సాక్షి, హైదరాబాద్: దేశంలోని ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాలు, గ్రామీణ ప్రాంతాలపై ఈ–కామర్స్ దిగ్గజ సంస్థలు దృష్టి సారించాయి. ప్రస్తుత పండుగల సీజన్లో ఆయా ప్రాంతాల్లో ఆన్లైన్ షాపింగ్‌కు డిమాండ్ పెరగడంతో.. అటువైపు ఈ సంస్థలు దృష్టికేంద్రీకరిస్తున్నాయి. ప్రధాన నగరాలు, పట్టణాలకు దూరంగా ఉండే ప్రదేశాల్లో వాణిజ్య, వ్యాపార కార్యకలాపాల విస్తరణ సవాళ్లతో కూడుకున్నది.అందుకు అనుగుణంగా తమ వ్యూహాల్లో మార్పులు, చేర్పులకు ఈ సంస్థలు మొగ్గుచూపుతున్నాయి. ఆయా ప్రాంతాలకు రవాణా సౌకర్యాలు అంతబాగా లేకపోవడం, వాతావరణంలో మార్పులు, విస్తీర్ణం ఎక్కువగా ఉండడం తదితర సమస్యలు ఎదురవుతున్నాయి. కానీ ఈ ప్రాంతాల్లో పెరుగుతున్న డిమాండ్‌కు తగ్గట్టుగా మౌలిక సదుపాయాలు, టెక్నాలజీ, ఇతర సౌకర్యాల పెంపునకు ఈ సంస్థలు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాయి.ఫ్లిప్‌కార్ట్, అమెజాన్, మీషో తదితర ఈ –కామర్స్ దిగ్గజ సంస్థలు తమ కార్యకలాపాలను విస్తరిస్తున్నాయి. ఫ్లిప్‌కార్ట్ ఇటీవల ‘ద బిగ్ బిలియన్ డేస్’ సేల్ నిర్వహించింది. ఈ సందర్భంగా 2,800 చిన్న పట్టణాలు, కమలాపురం, వాడర్, సిహోర్, బన్సాతర్ ఖేడా, వెరంగ్టే, భోటా (టయర్–4 సిటీస్ తో సహా) వంటి ప్రాంతాల్లో వాల్యూ–కామర్స్ ప్లాట్‌ఫామ్ షాప్ అమ్మకాల్లో మంచి పురోగతి కనబరిచింది. ద్వితీయ శ్రేణి నగరాల్లోనూ డిమాండ్ అంతకంతకు పెరుగుతున్నట్టుగా ఈ –కామర్స్ విక్రయాల పెరుగుదలను బట్టి అవగతమౌతోంది.గ్రామీణ ప్రాంతాల నుంచే ఎలక్ట్రాన్రిక్స్, ఫ్యాషన్, మొబైల్, హోం, సౌందర్య సాధనాలకు అధిక డిమాండ్ పెరుగుతున్నట్లుగా ఆయా సంస్థలు గుర్తించాయి. మొత్తం సెల్‌ఫోన్ అమ్మకాల్లో 75 శాతానికి పైగా చిన్న పట్టణాల నుంచి ఉండడంతో.. అక్కడే ఈ సంస్థలు అధికంగా దృష్టి పెడుతున్నాయి. ఇదే సమయంలో.. చిన్నపట్టణాలు, నగరాల్లో ఈ–కామర్స్ సర్వీసులు అంతకంతకు పెరుగుతున్న క్రమంలో.. స్థానికంగా ఉన్న వివిధ రంగాలకు చెందిన వారికి ఉపాధి అవకాశాలు కూడా పెరగడం కలిసొచ్చే అంశంగా పరిగణిస్తున్నారు.ప్రస్తుతం పండుగల సీజన్లో.. ఫ్లిప్‌కార్ట్ సంస్థ తొమ్మిది నగరాల్లో 11 నూతన ఫుల్ఫిల్మెంట్ సెంటర్లు ఏర్పాటు చేయడం ద్వారా.. 40 ప్రాంతాల్లో లక్ష మందికి పైగా ఉపాధి అవకాశాల కల్పన జరిగినట్టుగా అంచనా వేస్తున్నారు. ఈ ఫుల్ఫిల్మెంట్ సెంటర్లు స్థానికంగా ఉంటున్న వివిధ వర్గాల ఆర్థిక పురోగతికి దోహదపడుతున్నాయి. ఇవి ప్రధానంగా రవాణా, ప్యాకేజింగ్, రిటైల్ రంగాల్లో వృద్ధికి ఇతోధిక సహాయాన్ని అందిస్తున్నాయి. అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్–2024లో భాగంగా (సెపె్టంబర్ 27న మొదలై నెలపాటు సాగింది) ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల నుంచి డిమాండ్ గణనీయంగా పెరిగినట్టుగా వెల్లడైంది. అమెజాన్ ద్వారా ‘నో–కాస్ట్ ఈఎంఐ’ లావాదేవీలు 40 శాతానికి పైగా పెరిగినట్టు స్పష్టమైంది.మొబైల్స్, వాషింగ్ మెషీన్లు, టీవీలు, రిఫ్రిజిరేటర్లు, ఏసీలు, వీడియో గేమ్‌ల వంటి వాటికి మంచి డిమాండ్ ఏర్పడినట్టుగా తేలింది. ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాల నుంచే 75వ శాతానికి పైగా స్మార్ట్ఫోన్ల అమ్మకాలు జరిగినట్టు వెల్లడైంది. అందులోనూ అన్ని ప్రీమియం స్మార్ట్ఫోన్ల విక్రయాలు 70 శాతం (రూ.30 వేలకు పైగా) జరిగాయి. చిన్ననగరాలు, పట్టణాల నుంచి 80 శాతం టీవీ కొనుగోలు ఆర్డర్లు వచి్చనట్టు తెలుస్తోంది.అమెజాన్ తన రెండువేల డెలివరీ స్టేషన్ల ద్వారా మారుమూల ప్రాంతాలను చేరుకునేందుకు ఏర్పాట్లు చేసింది. సముద్రమట్టానికి 1,372 మీటర్ల ఎగువనున్న ఉత్తరాఖండ్ గజోలిలోని మహరిషీ ఆశ్రమానికి నిత్యావసర వస్తువులు సరఫరా చేసిన మొట్టమొదటి ఈ–కామర్స్ ప్లాట్‌ఫామ్‌గా అమెజాన్ రికార్డ్‌ను నెలకొల్పడం విశేషం. ఈ సంస్థ తన వస్తు సరఫరాను అండమాన్ నికోబార్ దీవులకు కూడా విస్తరించింది. భారత రైల్వేలు, ఇండియా పోస్ట్‌ల భాగస్వామ్యంతో అమెజాన్ ఎయిర్ సరీ్వస్‌ను కూడా నిర్వహిస్తోంది. మరోవైపు మీషో సంస్థ కూడా తన మెగా బ్లాక్‌బస్టర్ సేల్‌తో గ్రామీణ ప్రాంతాల్లోకి చొచ్చుకెళ్లింది. -
క్విక్ కామర్స్‌లోకి టాటా గ్రూప్?
టాటా గ్రూప్ క్విక్ కామర్స్ రంగంలో వేగంగా విస్తరిస్తోంది. ఫ్లిప్‌కార్ట్, రిలయన్స్ ఇండస్ట్రీస్ వంటి కంపెనీలకు ధీటుగా టాటా గ్రూప్ ‘న్యూఫ్లాష్’ పేరుతో ఈ సేవలు ప్రారంభించనుంది. ఈ సర్వీసును ముందుగా మెట్రో నగరాల్లో అందించనున్నట్లు ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న వ్యక్తులు తెలిపారు. ఇప్పటికే టాటా గ్రూప్ ఆధ్వర్యంలోని బిగ్‌బాస్కెట్ ద్వారా వినియోగదారులకు ఈ-కామర్స్ సేవలు అందిస్తోంది.క్విక్ కామర్స్ బిజినెస్‌కు వినియోగదారుల నుంచి ఆదరణ పెరుగుతోంది. దాంతో ప్రముఖ కంపెనీలు ఈ రంగంలో సేవలందించేందుకు పూనుకుంటున్నాయి. ఇప్పటికే జొమాటో యాజమాన్యంలోని బ్లింకిట్, స్విగ్గీ ఇన్‌స్టామార్ట్, జెప్టో ఈ క్విక్ కామర్స్ సేవలందిస్తున్నాయి. మొత్తంగా ఈ కంపెనీలు 85% మార్కెట్ వాటా కలిగి ఉన్నాయి. ఫ్లిప్‌కార్ట్ మినిట్స్ పేరుతో ఈ సేవలందిస్తోంది. రిలయన్స్ జియోమార్ట్ ఎక్స్‌ప్రెస్ పేరుతో ముంబయిలో ఈ సర్వీసు అందుబాటులో ఉంచింది. ఇటీవల జరిగిన ఓ సర్వే ప్రకారం రిలయన్స్ రిటైల్, డీమార్ట్, స్పెన్సర్స్ వంటి రిటైల్ బిజినెస్ కంటే క్విక్ కామర్స్ కంపెనీలు వేగంగా వృద్ధి చెందుతున్నాయి. దాంతో ఇప్పటికే కొన్ని రిటైల్ సర్వీసులు అందించే కంపెనీలు ఈ బిజినెస్‌లోకి ప్రవేశిస్తున్నాయి. టాటా గ్రూప్ కూడా వినియోగదారులను పెంచుకుని ఈ విభాగంలో సేవలందించాలని భావిస్తోంది.ఇదీ చదవండి: పన్ను ఎగవేతను పట్టించే చట్టాలివే..టాటా గ్రూప్ బిగ్‌బాస్కెట్ ద్వారా ఈ-కామర్స్, క్రోమా ద్వారా ఎలక్ట్రానిక్స్, టాటా క్లిక్ ద్వారా ఆన్లైన్ షాపింగ్ సేవలు, టాటా 1ఎంజీ ద్వారా ఫార్మసీ సేవలు అందిస్తోంది. ఇప్పటికే ఈ వ్యాపారాల్లో సంస్థకు వినియోగదారులు ఉండడంతో కొత్తగా రాబోయే టాటా న్యూ ఫ్లాష్ బిజినెస్‌కు కూడా వీరి సహకారం ఉంటుందని కంపెనీ భావిస్తోంది. -
డిజిటల్ లావాదేవీల వైపు రుణగ్రహీతల మొగ్గు
సాక్షి, హైదరాబాద్: దేశంలో నెలవారీ కిస్తీల చెల్లింపు (ఈఎంఐ), వెబ్సైట్, యాప్ ఆధారిత రుణాల పట్ల దిగువ, మధ్యతరగతి వర్గాలకు చెందిన రుణ గ్రహీతల్లో ఆసక్తి పెరుగుతోంది. స్మార్ట్ఫోన్లు, గృహోపకరణాల కొనుగోలు కోసం రుణాలు తీసుకునే ధోరణి వేగిరమైంది. పారిశ్రామిక రుణాలు తీసుకోవడంలోనూ రుణ గ్రహీతలు పోటీ పడుతున్నారు. గృహాల కొనుగోలు, మరమ్మతుల కోసం తీసుకునే రుణాల్లో కూడా వృద్ధి నమోదవుతోంది. పైచదువుల కోసం తీసుకునే రుణాల్లో గడిచిన నాలుగేళ్లలో పెద్దగా వ్యత్యాసం కనిపించడం లేదు. పెళ్లిళ్ల కోసం రుణాలు తీసుకునే వారి సంఖ్య కూడా క్రమంగా పెరుగుతోంది. హోమ్ క్రెడిట్ ఇండియా సంస్థ ‘భారత్‌లో రుణగ్రహీతల తీరుతెన్నులు –2024’అధ్యయన ఫలితాలను ఈ నెల 17న విడుదల చేసింది. ఢిల్లీ, ఎన్సీఆర్, ముంబై, కోల్‌కతా, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, పుణే, అహ్మదాబాద్, లక్నో, జైపూర్, భోపాల్, పాట్నా, రాంచీ, చండీగఢ్, లూథి యానా, కొచ్చి, డెహ్రాడూన్ సహా 17 నగరాల్లో హోమ్ క్రెడిట్ ఇండియా సంస్థ అధ్యయనం చేసింది. నెలకు సగటున రూ.31 వేల ఆదాయంతో 18 నుంచి 55 ఏళ్ల మధ్య వయసు కలిగిన రుణగ్రహీతల నుంచి వివరాలు సేకరించింది. డిజిటల్ ఆర్థిక లావాదేవీల్లో పెరుగుదల నిరంతరాయంగా లావాదేవీలు నిర్వహించే సౌకర్యం, డిజిటల్ సాంకేతికతపై వినియోగదారుల్లో అవగాహన పెరగడంతో బ్రౌజర్ ఆధారిత బ్యాంకింగ్ కంటే యాప్ ఆధారిత బ్యాంకింగ్‌పై వినియోగదారులు ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. యువత, మెట్రో నగరాల్లో యాప్ ఆధారిత బ్యాంకింగ్ వినియోగం ధోరణి ఎక్కువగా ఉంది. ఆన్లైన్ షాపింగ్ వినియోగం 2023లో 48 శాతం ఉండగా 2024లో 53 శాతానికి పెరిగింది. ఆన్లైన్ షాపింగ్ ధోరణిని ఎక్కువగా మహిళలు (60 శాతం), మిల్లేనియల్స్ (59 శాతం), జెన్ జెడ్ (58శాతం)లో కనిపించింది. మెట్రో, ద్వితీయ శ్రేణి నగరాలు (56 శాతం) ఆన్లైన్ షాపింగ్‌లో సమస్థాయిలో పోటీ పడుతున్నాయి. ఆన్లైన్ షాపింగ్ చేసే వారిలో కోల్‌కతా, కొచ్చి, హైదరాబాద్, చెన్నై, రాంచీ నగరాలు అగ్రస్థానంలో ఉన్నాయి. పెరుగుతున్న ఈఎంఐ కార్డుల వినియోగం ఒకేచోట ఇన్సూరెన్స్, లోన్లు, బిల్లుల చెల్లింపు వంటి ఆర్థిక సేవలు అందించే (ఎంబెడ్డెడ్ ఫైనాన్స్) యాప్‌లు లేదా వెబ్‌సైట్లపైనా వినియోగదారులు ఆసక్తి చూపుతున్నారు. ఉదాహరణకు 64 శాతం మంది ప్రధాన ఈ–కామర్స్ ప్లాట్‌ఫామ్‌లు (అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, మీషో)కు ప్రాధాన్యం ఇస్తున్నారు. 21 శాతం మంది ప్రయాణ యాప్స్ (మేక్ మై ట్రిప్, క్లియర్ ట్రిప్)ను ఎంచుకుంటున్నారు. 23 శాతం మంది ఆహార డెలివరీ యాప్స్ (జొమాటో, స్విగ్గీ) ఉపయోగిస్తున్నారు. లక్నో, పాటా్న, అహ్మదాబాద్, భోపాల్, రాంచీ వంటి నగరాల్లో ఎంబెడ్డెడ్ ఫైనాన్స్ పట్ల ఆసక్తి ఎక్కువగా ఉంది.ఇదిలా ఉంటే ఈఎంఐ కార్డులు భారతదేశంలోని దిగువ, మధ్యతరగతి రుణ గ్రహీతలు అత్యంత ప్రాచుర్యం పొందిన క్రెడిట్ సాధనంగా భావిస్తున్నారు. వేగంగా, నమ్మకంగా రుణం లభించే వేదికలుగా వీటిని పేర్కొంటున్నారు. వీటితోపాటు క్రెడిట్ కార్డులు, డిజిటల్ లెండింగ్ యాప్‌ల ద్వారా కూడా రుణం తేలిగ్గా లభిస్తుందనే అభిప్రాయం గ్రహీతల్లో కనిపించింది. ఇదిలా ఉంటే రుణగ్రహీతల్లో ఎక్కువ శాతం మంది బ్యాంకు శాఖలకు భౌతికంగా వెళ్లడం, కొందరు ఆన్లైన్లో దరఖాస్తు విధానాన్ని ఎంచుకుంటున్నారు. డేటా గోప్యత కోసం డిమాండ్ రుణ గ్రహీతల్లో డేటా ప్రైవసీ మార్గదర్శకాలకు సంబంధించి పెరుగుతున్న అవగాహన అంతరాన్ని కూడా అ« ద్యయనం ఎత్తిచూపింది. రుణ సంస్థలు అమలు చేయాల్సిన డేటా గోప్యత ఆవశ్యకతపై రుణ గ్రహీతల్లో క్రమంగా అవగాహన పెరుగుతోంది. దిగువ మధ్యతరగతి రుణదాతల్లో సుమారు 50 శాతం మందికి డేటా రక్షణ మార్గదర్శకాల గురించి అవగాహన లేదు. రుణ గ్రహీత ల్లో సుమారు పావుశాతం మందికి మాత్రమే రుణ యాప్స్, వెబ్‌సైట్స్ ద్వారా తమ వ్యక్తిగత డేటా వాడకం తీరును అర్థం చేసుకుంటున్నారు. సుమారు ముప్పావు శాతం మంది తమ వ్యక్తిగత డేటా వినియోగంపై స్పష్టత కోరుతూ, డేటా వినియోగంలో పారదర్శకత కావాలని డిమాండ్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఆర్థిక అక్షరాస్యత పెరగాల్సిన అవసరం ఉందని అధ్యయనం వెల్లడించింది. రుణ గ్రహీతలు ఇంటర్నెట్ బ్యాంకింగ్, రుణ వెబ్సైట్లు, యాప్‌లు, చెల్లింపు వాలెట్లు, ఇతర క్లిష్టమైన ఆన్లైన్ ఆర్థిక లావాదేవీల్లో సహాయం అవసరమని నివేదించారు, మహిళలు, జెన్ ఎక్స్‌తోపాటు, ద్వితీయ శ్రేణి నగరాల్లోని రుణగ్రహీతలు డిజిటల్ ఆర్థిక లావాదేవీల నిర్వహణలో ఇప్పటికీ సవాళ్లు ఎదుర్కొంటున్నారు. పెరిగిన చాట్‌బాట్స్, వాట్సాప్ వాడకం వినియోగదారుల సేవలో చాట్బాట్లకు (ఏఐ ఆధారిత మెసేజింగ్ యాప్‌లు) ఆదరణ వేగంగా పెరుగుతోంది. వీటి సేవలపై జెన్ జెడ్‌కు ఎక్కువ అవగాహన కలిగి ఉండగా, చాట్‌బాట్ వినియోగించడం సులభంగా ఉంటుందని రుణదాతలు భావిస్తున్నారు. వాట్సాప్ కూడా రుణ మార్కెట్లో కీలక మార్గంగా మారింది. 59 శాతం మంది రుణదాతలు వాట్సాప్ ద్వారా రుణ ఆఫర్లు పొందుతున్నారు. 2023 లో 24 శాతంగా ఉన్న రుణ ఆఫర్లు 2024 లో 26 శాతానికి పెరగడం వాట్సాప్ డిజిటల్ వేదికపై పెరుగుతున్న నమ్మకాన్ని ప్రతిబింబిస్తోందని అధ్యయనంలో తేలింది. -
‘జెన్-జీ’తో రూ.1,500 లక్షల కోట్ల వ్యాపార అవకాశం!
భారత్‌లో జెన్-జీ((1997 నుంచి 2012 మధ్య పుట్టినవారు) తరం 2035 నాటికి సుమారు 1.8 ట్రిలియన్ డాలర్ల(రూ.1,500 లక్షల కోట్లు) కొనుగోలు శక్తిని కలిగి ఉంటుంది. ప్రస్తుతం దేశంలో దాదాపు 37.7 కోట్ల వరకు జెన్-జీ యువత ఉంది. భవిష్యత్తులో భారత ఎకానమీకి వీరు ఎంతో సహకారం అందిస్తారు. ఈ తరం ఆసక్తులు, ప్రస్తుతం అనుసరిస్తున్న విధానాలు, విక్రయ సరళి..వంటి అంశాలను విశ్లేషిస్తూ బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్(బీసీజీ), స్నాప్ ఇంక్ సంస్థలు సంయుక్తంగా నివేదిక విడుదల చేశాయి.నివేదికలో వివరాల ప్రకారం..జెన్-జీ తరం మార్కెట్‌ను ప్రభావితం చేయడమే కాదు, కొత్త ట్రెండ్‌ను నిర్మిస్తుంది. ప్రస్తుతం దేశంలోని మొత్తం వినియోగంలో దాదాపు 43 శాతం జెన్-జీదే కావడం విశేషం. ఇది దాదాపు 860 బిలియన్ డాలర్ల(రూ.72 లక్షల కోట్లు)కు చేరుకుంది.విభిన్న రంగాల్లో జెన్‌జీ కొనుగోళ్లు పెరుగుతున్నాయి. పాదరక్షల పరిశ్రమలో 50 శాతం, డైనింగ్-48 శాతం, ఎంటర్టైన్మెంట్ 48 శాతం, ఫ్యాషన్ అండ్ లైఫ్‌స్టైల్‌పై 47 శాతం కొనుగోళ్లను ఈ తరం ప్రభావితం చేస్తోంది.2035 నాటికి వీరి వినిమయశక్తి సుమారు రెండు ట్రిలియన్ డాలర్ల(రూ.1,500 లక్షల కోట్లు)కు చేరుతుందని అంచనా.ఇప్పటికే ఈ తరం దాదాపు 860 బిలియన్ డాలర్ల(రూ.72 లక్షల కోట్లు)ను ఖర్చు చేస్తోంది. అందులో తాము నేరుగా ఎంచుకున్న వస్తువుల కోసం 200 బిలియన్ డాలర్లు(రూ.17 లక్షల కోట్లు) ఖర్చు చేస్తున్నారు. వివిధ మాధ్యమాలు, ఇతర వ్యక్తుల ప్రభావం వల్ల మరో 600 బిలియన్ డాలర్ల(రూ.50 లక్షల కోట్లు) వెచ్చిస్తున్నారు.దాదాపు 70 శాతం జెన్-జీ యువత తమ సన్నిహితులు, కుటుంబ సభ్యులు, స్నేహితులు..వంటి వారితో ఆర్థిక పరమైన వివరాలు పంచుకుంటూ తమ సలహాలు, సూచనలు తీసుకుంటున్నారు. ఉదాహరణకు ఏం కొనాలి, ఎక్కడ తీసుకోవాలి, ఏ కంటెంట్‌ని చూడాలి, ఎలాంటి వస్తువులు ఎంపిక చేసుకోవాలి వంటి వివరాల కోసం ఇతరుల సలహా కోరుతున్నారు.దాదాపు 80 శాతం మంది తమ భావాలు ఇతరులతో పంచుకోవడానికి ఎక్కువగా సామాజిక మధ్యమాల్లో చిత్రాలు, జిఫ్‌లను, ఇమోజీలు వినియోగిస్తున్నారు.77 శాతం మంది తమ ముందు తరం కంటే మరింత సమర్థంగా షాపింగ్ చేసేందుకు వీలుగా ‘షాప్షియలైజింగ్(సామాజిక మధ్యమాల ప్రభావంతో షాపింగ్ చేయడం)’ ట్రెండ్ వైపు మొగ్గు చూపుతున్నారు. ఇందుకోసం ఆగ్మెంటెడ్ రియాలిటీ(వస్తువులు కొనడానికి ముందే వర్చువల్‌గా దాని గురించి తెలుసుకోవడం), వీడియో ఇంటరాక్షన్స్‌ను ఉపయోగిస్తున్నారు.బ్రాండ్ల విషయానికి వస్తే ఈ యువ తరం ట్రెండ్స్‌కు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తోంది. షాపింగ్ చేసేటప్పుడు వారు ట్రెండింగ్ స్టైల్‌లను ఎంచుకునే అవకాశం 1.7 రెట్లు ఎక్కువగా ఉంది. 72 శాతం మంది షాపింగ్ ప్రమోషన్లు చేస్తున్న క్రియేటర్ల సోషల్ ఛానెల్‌ల వైపు మొగ్గు చూపుతున్నారు.ఇప్పటికే 45 శాతం విభిన్న రంగాల్లోని వ్యాపార సంస్థలు జెన్-జీ అవసరాలు గుర్తించాయి. కానీ అందులో 15 శాతం మాత్రమే వారికి సేవలందిస్తున్నాయి. రానున్న రోజుల్లో కచ్చితంగా ఈ అంతరం భారీగా తగ్గనుంది.ఇదీ చదవండి: రూ.20 వేలతో రూ.17 లక్షలు సంపాదన!ఈ నివేదిక విడుదల సందర్భంగా స్నాప్ ఇంక్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ పుల్కిత్ త్రివేది మాట్లాడుతూ..2035 నాటికి 1.8 ట్రిలియన్ల విలువైన ప్రత్యక్ష వ్యయంతో భారతదేశ ఎకానమీకి జెన్‌జీ పెద్ద ఆర్థిక వనరుగా మారుతుందన్నారు. బీసీజీ ఇండియా ఎండీ నిమిషా జైన్ మాట్లాడుతూ..ఈ తరం ఫ్యాషన్, డైనింగ్, ఆటోమొబైల్స్, ఎంటర్టైన్మెంట్, కన్జూమర్ డ్యూరబుల్స్ వంటి విభిన్న విభాగాల్లో ఖర్చు చేసేందుకు ఆసక్తిగా ఉందన్నారు. -
కిక్కెక్కిస్తోన్న ‘క్విక్ కామర్స్’!
క్విక్ కామర్స్ ప్రముఖ ఎఫ్ఎంసీజీలకు కిక్కెక్కిస్తోంది. ఎఫ్ఎంసీజీ కంపెనీల మొత్తం ఆన్లైన్ అమ్మకాల్లో క్విక్‌కామర్స్ విక్రయాలు రెండు రెట్లు పెరిగినట్టు డెలాయిట్, ఫిక్కీ సంయుక్త నివేదిక వెల్లడించింది. పట్టణ వినియోగదారులకు క్విక్‌కామర్స్ ప్రాధాన్య ఛానల్‌గా మారుతున్నట్టు ఈ నివేదిక తెలిపింది. దీంతో ఎఫ్ఎంసీజీ ఆన్లైన్ విక్రయాల్లో క్విక్ కామర్స్ విభాగం వాటా 35 శాతానికి చేరుకున్నట్టు పేర్కొంది.నివేదికలోని వివరాల ప్రకారం..18 శాతానికి పైగా వినియోగదారులు ఆహారం, పానీయాలను క్విక్ కామర్స్ ప్లాట్‌ఫామ్‌ల ద్వారా కొనుగోలు చేసేందుకు మొగ్గు చూపిస్తున్నారు. 2021 నుంచి 2023 నాటికి క్విక్ కామర్స్ మార్కెట్ 230% పెరిగింది. మరుసటి రోజు డెలివరీ చేసే సంప్రదాయ ఆన్లైన్ గ్రోసరీ సంస్థల మార్కెట్ వాటాను క్విక్ కామర్స్ సంస్థలు కొల్లగొడుతున్నాయి. రానున్న రోజుల్లో క్విక్ కామర్స్ మార్కెట్ మరింత వృద్ధి చెందే అవకాశం ఉంది. ఎఫ్ఎంసీజీ ఉత్పత్తుల కొనుగోళ్లకు ఈ–కామర్స్‌ను ప్రధాన ఛానల్‌గా మారుస్తున్నారు. ఇంటర్నెట్ వినియోగం వేగంగా విస్తరిస్తోంది. ఎఫ్ఎంసీజీ మొత్తం అమ్మకాల్లో ఆన్లైన్ ప్లాట్‌ఫామ్‌ల వాటా 17 శాతానికి చేరింది. సంపన్న వినియోగదారులు ఈ దిశగా ఆసక్తి చూపిస్తున్నారు. గొప్ప సౌకర్యం, విస్తృత ఉత్పత్తుల శ్రేణి, పోటీతో కూడిన ధరలు ఆకర్షిస్తున్నాయిఇదీ చదవండి: రుణ మార్గదర్శకాలు కఠినతరంఫుడ్, బెవరేజెస్..ఫుడ్, బెవరేజెస్ కోసం సంప్రదాయ ఈ–కామర్స్ ఛానళ్ల కంటే క్విక్ కామర్స్ సంస్థల్లో ఆర్డర్ చేసేందుకే కస్టమర్లు ఆసక్తి చూపిస్తున్నారు. ఇవి తక్షణ అవసరాల కోసం ఉద్దేశించినవిగా డెలాయిట్, ఫిక్కీ నివేదిక పేర్కొంది. అదే సౌందర్య, గృహ ఉత్పత్తులు తక్షణ అవసరమైనవి కావకపోవడంతో, వీటిని ఈ–కామర్స్ వేదికలపై ఆర్డర్ చేసేందుకు వినియోగదారులు మొగ్గు చూపిస్తున్నట్టు వెల్లడించింది. చిన్న కుటుంబాలు, భార్యా భర్తలు ఇద్దరూ ఉద్యోగాలు చేసే వారు కావడం క్విక్ కామర్స్‌కు డిమాండ్‌ను పెంచుతున్నట్టు వివరించింది. -
Flipkart Big End of Season Sale 2024: రేపటి నుంచే ఫ్లిప్‌కార్ట్ సీజన్సేల్.. ఆఫర్లు ఇవే..
ఆన్లైన్ ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ ఫ్లిప్‌కార్ట్ జూన్ 1 నుంచి ‘బిగ్ ఎండ్ ఆఫ్ సీజన్ సేల్’ను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది. ఈ సీజన్ సేల్‌లో ఫ్యాషన్ కేటగిరీలోని వస్తువులపై ఆకర్షణీయలమైన ఆఫర్లు ఉంటాయని చెప్పింది.బిగ్ ఎండ్ ఆఫ్ సీజన్ సేల్ 2024లో భాగంగా ఫ్లిప్‌కార్ట్ 12,000 బ్రాండ్లను కస్టమర్లకు అందుబాటులో ఉంచినట్లు తెలిపింది. 2 లక్షలకు పైగా అమ్మకందారుల నుంచి వీటిని ఎంపిక చేశామని చెప్పింది. స్పోర్ట్స్ షూ, గడియారాలు, జీన్స్ వంటి వాటిని ఓపెన్-బాక్స్ డెలివరీ అందిస్తామని పేర్కొంది. ఒక లక్షకు పైగా ఉత్పత్తులను బుక్ చేసుకున్న రోజే డెలివరీ ఇస్తామని హామీ ఇచ్చింది. ఈ సేల్‌లో అన్ని ప్రముఖ బ్రాండ్లు అందుబాటులో ఉంటాయని, కంపెనీ ఆఫర్లను అందరూ వినియోగించుకోవాలని కోరింది.ఫ్లిప్‌కార్ట్ ఈ సేల్‌లో భాగంగా తమ కస్టమర్లకు బ్యాంక్ ఆఫర్‌ను అందిస్తుంది. ఆర్బీఎల్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, హెచ్ఎస్బీసీ బ్యాంక్ (కనీస ఆర్డర్ విలువ రూ.2,500) క్రెడిట్ కార్డ్‌లపై ఉత్పత్తి ధరలో 10% ఇన్స్టాంట్ తగ్గింపు ఇస్తున్నారు. కనీసం రూ.200 విలువ చేసే ఉత్పత్తులను యూపీఐ పేమెంట్ ద్వారా ఆర్డర్ చేస్తే ఆకర్షణీయమైన ఆఫర్లను పొందవచ్చని కంపెనీ చెప్పింది.ఇదీ చదవండి: అంబానీ మనవరాలా..మజాకా..క్రూయిజ్‌లో ఫస్ట్ బర్త్డేఈ సందర్భంగా ఫ్లిప్‌కార్ట్ ఫ్యాషన్ వైస్ ప్రెసిడెంట్ అండ్ హెడ్ అరీఫ్ మొహమ్మద్ మాట్లాడుతూ..‘మార్కెట్లో పేరున్న బ్రాండ్లను వినియోగదారులకు తక్కువ ధరకే ఇస్తున్నాం. దుస్తులు, పాదరక్షలు, యాక్సెసరీ వంటి విభాగాల్లో మరింత ట్రెండింగ్ వస్తువులను అందిస్తున్నాం. కస్టమర్లకు 75 లక్షలకు పైగా విభిన్న ఉత్పత్తులను అందుబాటులో ఉంచుతున్నాం. ఈ సేల్‌ను ఒక వేడుకగా జరుపుతున్నాం. ఇందులో 10 మిలియన్లకు పైగా కొత్త కస్టమర్లు పాల్గొనే అవకాశం ఉంది. వీరు ఎక్కువగా స్పోర్ట్స్ షూస్, లగేజ్, వాచీలు, ఎత్నిక్ సూట్లు, పార్టీ డ్రెస్‌లు వంటి వాటిపై ఆసక్తి చూపుతున్నారు’ అని చెప్పారు. -
మీషో కూపన్ల పేరిట సైబర్‌మోసం
సాక్షి, హైదరాబాద్: ఆన్లైన్ షాపింగ్ వెబ్సైట్ అయిన మీషో పేరిట సైబర్ నేరగాళ్లు సరికొత్త మోసానికి తెర తీస్తున్నారని సైబర్ భద్రత నిపుణులు హెచ్చరిస్తున్నారు. మీషో కంపెనీ నుంచి వచి్చందని భ్రమపడేలా ఓ ఫామ్‌ను, స్క్రాచ్ కార్డును డిజైన్ చేసి సైబర్ నేరగాళ్లు పోస్ట్ చేస్తున్నారు. వీటిని అందుకున్న వారిని అందులోని కార్డును స్క్రాచ్ చేయాలని సూచనల్లో పేర్కొంటున్నారు. అలా స్క్రాచ్ చేసిన తర్వాత అందులో మీరు లక్కీ కస్టమర్ కింద లక్కీ కూపన్లో కారు, బంగారం వంటి ఖరీదైన బహుమతులు గెలుచుకున్నారని ఉంటుంది. ఇలా లక్కీ డ్రా తగిలిన వారు వెంటనే మీ స్క్రాచ్ కార్డుపై ఉన్న క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేసి, మేం అడిగే వివరాలు నమోదు చేయాలని చెబుతారు. ఏదైనా సందేహాలుంటే మీకు ఇచ్చిన దరఖాస్తులోని నంబర్లకు ఫోన్ చేయాలని సూచిస్తున్నారు. వివరాలిస్తే అసలుకే మోసం...ఎవరైనా అమాయకులు ఈ ఉచ్చులో చిక్కితే ఇక సైబర్ నేరగాళ్లు తమ విశ్వరూపం చూపిస్తున్నారు. ఇలా స్క్రాచ్ కార్డుపై ఉన్న క్యూర్ కోడ్ స్కాన్ చేసి అందులో సూచించిన విధంగా వివరాలు నమోదు చేస్తే ఇక అసలు మోసం మొదలవుతుంది. క్యూఆర్ కోడ్ స్కాన్ చేయగానే అనుమానాస్పద యాప్‌లు మనకు తెలియకుండానే మన ఫోన్లోకి ఇన్స్టాల్ అవుతాయి. అదేవిధంగా మనం నమోదు చేసే బ్యాంకుఖాతా, వ్యక్తిగత వివరాలన్నీ తీసుకుంటున్న సైబర్ నేరగాళ్లు బ్యాంకుఖాతాల్లోని డబ్బులు కొల్లగొడుతున్నారు.ఇలాంటి కూపన్లు వస్తే నమ్మవద్దని, ఎలాంటి వివరాలు వారితో పంచుకోవద్దని సైబర్ భద్రత నిపుణులు హెచ్చరిస్తున్నారు. గతంలో పట్టణప్రాంతాలకే పరిమితమైన ఈ తరహా మోసాలు ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో కూడా జరుగుతున్నాయని సైబర్ భద్రత నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇలాంటి మోసాల విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వారు సూచించారు. -
ఐఫోన్‌పై రూ.26వేలు డిస్కౌంట్.. ఎక్కడంటే..
యాపిల్ కంపెనీ చైనాలోని తన ఉత్పత్తులపై భారీ తగ్గింపును అందిస్తుంది. చైనాలోని ఆన్లైన్ రిటైల్ ప్లాట్‌ఫామ్ ‘ట్మాల్’ వెబ్సైట్లో యాపిల్ ఐఫోన్ ధరలు తగ్గిస్తున్నట్లు ప్రచారాన్ని ప్రారంభించింది.ఎంపిక చేసిన ఐఫోన్ మోడళ్లపై 2,300 యువాన్ల (సుమారు రూ.26వేలు) వరకు డిస్కౌంట్ ఇస్తున్నట్లు వెబ్సైట్లో ప్రకటనలు వెలిశాయి. ఈ ఆఫర్ మే 20 నుంచి 28 వరకు మాత్రమే ఉంటుందని ప్రచారం సాగుతోంది. హువాయ్ వంటి స్థానిక బ్రాండ్ల నుంచి యాపిల్‌కు గట్టిపోటీ ఉండడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు కొన్ని వార్తా సంస్థలు కథనాల వెలువరించాయి. దాంతోపాటు యాపిల్ కొత్త మోడల్ లాంచ్ చేస్తుందనే వార్తలు వస్తున్న నేపథ్యంలో ఉన్నవాటికి ధర తగ్గిస్తుందనే వాదనలున్నాయి. ప్రస్తుతం యాపిల్ ఇస్తున్న డిస్కౌంట్ ఫిబ్రవరిలో ప్రకటించిన తగ్గింపు కంటే ఎక్కువగా ఉంది. అప్పుడు అత్యధికంగా 1,150 యువాన్లు మాత్రమే డిస్కౌంట్ ఇచ్చారు.చైనాలో ప్రముఖ హైఎండ్ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ హువాయ్ గత నెలలో ‘పురా 70’ అనే మోడల్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. ఇటీవల యాపిల్ ఐఫోన్ అమ్మకాలు తగ్గుతున్నాయి. చైనా అకాడమీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్స్ టెక్నాలజీ (సీఏఐసీటీ) డేటా ఆధారంగా మార్చిలో యాపిల్ ఎగుమతులు 12% పెరిగాయి. అయితే అమ్మకాలు మాత్రం 37% తగ్గాయి. దాంతో కంపెనీ భారీ రాయితీలు ఇస్తున్నట్లు మార్కెట్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. -
‘టాటా కంపెనీ ..ఇలా చేస్తుందనుకోలేదు’.. తస్మాత్ జాగ్రత్త!
ఇటీవల కాలంలో ఆన్లైన్ షాపింగ్‌తో కొనుగోలు దారులు పడుతున్న ఇబ్బందులు అన్నీ ఇన్ని కావు. ల్యాప్ ట్యాప్ ఆర్డర్ పెడితే ఇటు రాయి పంపండం. ఖరీదైన షూ కొనుగోలు చేస్తే చెప్పులు డెలివరీ చేయడం లాంటి ఘటనలు నిత్యం ఎక్కడో ఒక చోట జరుగుతూనే ఉన్నాయి. దీంతో చేసేది లేక కస్టమర్లు సదరు ఈకామర్స్ కంపెనీని డబ్బుల్ని రిఫండ్ చేయమని కోరడం, లేదంటే ప్రొడక్ట్ ఎచ్ఛేంజ్ చేయమని కోరుతుంటుంటాం. ఓ యూజర్ టాటా క్లిక్ లగ్జరీ కంపెనీ నుంచి స్నీకర్లను ఆర్డర్ పెడితే.. చెప్పుల్ని అందుకున్నాడు. దీంతో తాను ఖరీదైన షూ ఆర్డర్ పెడితే చెప్పులు ఎలా పంపిస్తారు? అని ప్రశ్నించాడు. తాను చెల్లించిన డబ్బుల్ని రిఫండ్ చేయమని కోరాడు. అందుకు టాటాక్లిక్ లగ్జరీ ప్రతినిధులు చేసిన తప్పుకు చింతిస్తున్నాం. కానీ డబ్బుల్ని రిఫండ్ చేయమని స్పష్టం చేసింది. దీంతో చేసేది లేక బాధితుడు ఎక్స్. కామ్‌లో తనకు ఎదురైన చేదు అనుభవాన్ని షేర్ చేశారు. పైగా కంపెనీ గురించి సోషల్ మీడియాలో బహిరంగ వ్యాఖ్యలు చేయకూడదంటూ చేసిన ట్వీట్లు ఇప్పుడు వైరల్‌గా మారాయి. Tata Cliq Luxury is out here defrauding customers of their hard-earned money. I've lost my money, but pls save yourselves from being scammed. I ordered New Balance sneakers, they sent a pair of slippers, now refusing to refund money saying quality check failed @TATACLiQLuxury pic.twitter.com/6ktajmB8r7 — Ripper (@Ace_Of_Pace) March 7, 2024 ఖరీదైన షూ బదులు చెప్పులు వినియోగదారుడు టాటా క్లిక్ లగ్జరీ నుంచి రూ.22,999 ఖరీదైన ‘న్యూ బ్యాలెన్స్ 9060 గ్రే & బ్లూ స్నీకర్స్’ను కొనుగోలు చేసినట్లు తెలిపారు. అయితే అతను మాత్రం ఊహించని విధంగా స్టైలిష్ షూస్ బదులు సాధారణ స్లిప్పర్లను అందుకున్నాడు.ఎక్ఛేంజ్ చేయమని ఫిర్యాదు చేసినప్పటికీ టాటా క్లిక్ లగ్జరీ రిఫండ్ చేసేందుకు ఒప్పుకోలేదని, టాటా కంపెనీ ఇలా చేస్తుందను కోలేదని వాపోయాడు. తస్మాత్ జాగ్రత్త ‘టాటా క్లిక్ లగ్జరీ కస్టమర్లను మోసం చేస్తోంది. నేను నా డబ్బును పోగొట్టుకున్నాను. దయచేసి మీరు ఇలాంటి స్కామ్‌ల బారిన పడకుండా మిమ్మల్ని మీరు రక్షించుకోండి. నేను కొత్త బ్యాలెన్స్ స్నీకర్లను ఆర్డర్ చేసాను. వారు ఒక జత చెప్పులు పంపారు. నాణ్యతలో రాజీపడమని, కావాలంటే తనిఖీ చేయమని చెప్పింది. డబ్బు రిఫండ్ చేసేందుకు నిరాకరించారు.’ అని వినియోగదారు మైక్రోబ్లాగింగ్ సైట్ ఎక్స్.కామ్‌లో పోస్ట్ చేశారు. Your disappointment with our products and services hurts us the most, and we deeply apologize for the hassle it has caused you. We request you to share the order details via the below DM link, so we can check and provide further assistance. ^AB (1/2) — TATA CLiQ Luxury (@TATACLiQLuxury) March 7, 2024 దీంతో ‘మా ఉత్పత్తులు, సేవల పట్ల అసంతృప్తిగా ఉండడం మమ్మల్ని బాధిస్తుంది. మా వల్ల మీకు కలిగిన అసౌకర్యానికి క్షమాపణలు కోరుతున్నాం. ఆర్డర్ వివరాల్ని పంపినట్లైతే త్వరలోనే మీకు న్యాయం చేస్తామనంటూ టాటా క్లిక్ లగర్జీ అధికారికంగా తెలిపింది. -
యూపీఐ సేవల్లోకి ఈ-కామర్స్ దిగ్గజ సంస్థ
చేతిలో నగదుతో ఇప్పుడు పెద్దగా అవసరం ఉండటం లేదు. మొబైల్ ఫోనులో యూపీఐ యాప్ ఉంటే చాలు. క్షణాల్లో చెల్లింపులు పూర్తయిపోతాయి. కిరాణాకొట్టులోని చిన్న వస్తువుల నుంచి పెద్ద వస్తువుల వరకు అన్నింటికీ యూపీఐ వాడుతున్నారు. ప్రస్తుతం అన్ని బ్యాంకులు యూపీఐని అందుబాటులోకి తీసుకొచ్చాయి. వీటితోపాటు తమ వినియోగదారులకు మరింత సేవలందించేలా ఈ కామర్స్ సంస్థలు మరోఅడుగు ముందుకేసి ఇతర బ్యాంకులతో కలిసి యూపీఐను పరిచయం చేస్తున్నాయి. తాజాగా ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యూపీఐ) సేవల్లోకి అడుగుపెట్టింది. యాక్సిస్ బ్యాంక్‌తో భాగస్వామ్యం కుదుర్చుకుని ఈ సేవలను ప్రారంభించినట్లు సంస్థ ప్రకటించింది. తొలుత ఆండ్రాయిడ్ మొబైల్ వినియోగదార్లకు మాత్రమే ఈ సేవలు అందుబాటులో ఉంటాయని తెలిపింది. ఇదీ చదవండి: రొమాంటిక్ సాంగ్.. ముఖేశ్-నీతాల డ్యాన్స్ చూశారా? వినియోగదార్లు ఫ్లిప్‌కార్ట్ యాప్‌లో, యూపీఐ ఐడీ క్రియేట్ చేసుకోవడం ద్వారా వ్యాపారులు, ఇతరులకు చెల్లింపులు చేసుకోవచ్చు. థర్డ్‌పార్టీ యూపీఐ యాప్‌లైన పేటీఎం, ఫోన్‌పే, గూగుల్ పే, అమెజాన్ పే వంటి వాటిపై ఆధారపడటాన్ని తగ్గించుకునేందుకే ఈ సేవలు తీసుకొచ్చినట్లు సంస్థ తెలిపింది. -
ఆన్లైన్లో ఆవులు.. ఊరించిన ఆఫర్.. తీరా చూస్తే..
ఆన్లైన్ షాపింగ్ చేసేటప్పుడు డిస్కౌంట్లు ఊరిస్తుంటాయి.. ముందూ వెనక ఆలోచించకుండా నచ్చిన ఐటమ్ బుక్ చేసేస్తుంటారు. ఓ లాటరీ తగిలిందంటే లేదా ఓ ఆఫర్ ఇస్తున్నారంటే ఎందుకు, ఏంటి, ఎలా అన్న కనీస ఆలోచన లేకుండా సంబంధిత లింక్‌పై క్లిక్ చేస్తుంటారు. సరైన అవగాహన లేకుండా తీర ఏదైనా లింక్‌పై క్లిక్ చేసి సైబర్ సేరస్థుల ఉచ్చులో చిక్కుకుంటారు. టెక్నాలజీ పెరుగుతున్నకొద్ది భారత్ డిజిటల్ రంగంలో పురోగమిస్తోంది. గాడ్జెట్ల నుంచి కిరాణా సామగ్రి వరకు అన్నీ ఆన్లైన్లో కొనుగోలు చేస్తున్నారు. దాంతో విక్రయదారులు కస్టమర్లను ఆఫర్ల పేరుతో ఆకర్షిస్తున్నారు. స్మార్ట్పోన్లు వచ్చినప్పటి నుంచి చదువు ఉన్నవారు, లేనివారనే తేడా లేకుండా వాటిని ఉపయోగించి ఆన్లైన్లో వస్తువులు కొనుగోలు చేస్తున్నారు. అయితే చాలామందికి సైబర్‌నేరాలకు సంబంధించిన అవగాహనలేక కొందరు నేరస్థుల చేతుల్లో బలవుతున్నారు. తాజాగా గుర్గావ్కు చెందిన ఒక పాడి రైతు ఆన్లైన్లో ఆవులను కొనుగోలు చేయాలనుకుని సైబర్ నేరస్థులకు చిక్కి మోసపోయిన ఘటన వెలుగుచూసింది. వివరాల్లోకి వెళితే.. గుర్గావ్లోని పాండాలాలో నివసిస్తున్న సుఖ్బీర్(50) అనే పాడి రైతు ఆవులను కొనుగోలు చేయాలనుకున్నాడు. ఆఫ్‌లైన్ రేట్లతో పోలిస్తే ఆన్లైన్లో భారీ రాయితీ ఉండడం గమనించాడు. దాంతో ఆన్లైన్లో ఆవులను కొనుగోలు చేసేందుకు ప్రయత్నించి మోసపోయాడు. ఈ మేరకు తన తండ్రి డబ్బు పోగొట్టుకున్న సంఘటనను తన కుమారుడు ప్రవీణ్ (30) వివరించాడు. ప్రవీణ్ తెలిపిన వివరాల ప్రకారం.. సుఖ్బీర్ నిత్యం పర్వీన్ ఫోన్‌ను ఉపయోగించేవాడు. యూట్యూబ్ వీడియోలను చూసేవాడు. గూగుల్‌లోని ఓ వెబ్సైట్లో ఆవులను చాలా తక్కువ ధరకు రూ.95,000కు అందజేస్తుందని గ్రహించాడు. ఇది సాధారణ ఆఫ్‌లైన్ ధరతో పోలిస్తే చాలా తక్కువని తెలుసుకున్నాడు. ఆన్లైన్లో ఆవులకు సంబంధించిన ఇతర వివరాలు తెలుసుకునేందుకు ప్రయత్నించాడు. దాంతో ఆవుల కోసం ఆరాతీస్తున్న విషయాన్ని తెలుసుకున్న సైబర్ సేరస్థులు ఫోన్ నంబర్ ద్వారా వాట్సప్‌లో ఆవుల ఫోటోలను పంపడం ప్రారంభించారు. మొదట ఒక్కో ఆవు ధర రూ.35,000 అని పేర్కొన్నారు. నాలుగు ఆవులను కొనుగోలు చేసేందుకు సుఖ్బీర్ ఆసక్తి చూపగా, గోశాల కింద ఆవులను రిజిస్టర్ చేస్తామని అబద్ధపు హామీ ఇచ్చారు. పైగా ధరను రూ.95,000కు తగ్గించారు. దాంతో అది నమ్మి ప్రవీణ్ తండ్రి జనవరి 19, 20 రోజుల్లో మొత్తం రూ.22,999 నగదు వారికి పంపించాడు. స్కామర్లు ముందుగా నిర్ణయించిన దానికంటే మరింత అధిక మొత్తంలో డబ్బు డిమాండ్ చేశారు. రోజులు గడుస్తున్నా ఆవులను పంపించలేదు. దాంతో మోసపోయానని గ్రహించిన సుఖ్బీర్ ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్ 419, 420 కింద ఫిర్యాదు చేశాడు. ఇదీ చదవండి: ప్రైవేట్ వైద్యం.. ఛార్జీలపై తీవ్రంగా స్పందించిన సుప్రీంకోర్టు ఈ జాగ్రత్తలు పాటించాల్సిందే.. ఆన్లైన్ మోసాలకు బలవకుండా ఉండాలంటే కింది జాగ్రత్తలు పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు. ఏవైనా లింకులపై క్లిక్ చేసే ముందు ఒకటికి రెండుసార్లు సరిచూసుకోండి. మీకు తెలియని వాటిని గురించి పూర్తిగా తెలుసుకున్నాకే షాపింగ్ చేయడం ఉత్తమం. అడ్రస్ బార్లో https (http కాదు) ఉందో లేదో నిర్ధారణ చేసుకోండి. ఆఫర్లు ఉన్నాయంటూ కనిపించే నకిలీ వెబ్సైట్ల జోలికివెళ్లొద్దు. ఈ కామర్స్ వెబ్‌సైట్‌కు సంబంధించిన లాగిన్ వివరాలు ఎవరితోనూ షేర్ చేసుకోవద్దు. ధర, డెలివరీ డేట్ లాంటి కొన్ని వివరాలు చూసి.. పేమెంట్ చేసేయకూడదు. ఆ ప్రోడెక్ట్ ఎప్పుడొస్తుంది, దాని ఎక్స్ఛేంజ్ పాలసీ, రిటర్న్ పాలసీ లాంటివి కూడా చెక్ చేసుకోవాలి. పాస్వర్డ్ ఎంత కఠినంగా ఉంటే.. అంత మంచిది అని చెబుతుంటారు. -
ఈ–కామర్స్, ఉద్యోగాల పేరిట అత్యధిక సైబర్ మోసాలు
సాక్షి, అమరావతి: ఈ–కామర్స్‌లో విక్రయాలు, ఉద్యోగాలు.. దేశంలో సైబర్ నేరగాళ్లకు ప్రధాన ఆయుధాలు. సైబర్ నేరాల్లో ఈ రెండే మొదటి రెండు స్థానాల్లో ఉన్నాయి. విపరీతంగా పెరుగుతున్న ఆన్లైన్ షాపింగ్ అభిరుచి, ఉద్యోగాల కోసం యువత ప్రయత్నాలను ఆసరా చేసుకుని సైబర్ ముఠాలు భారీగా మోసాలకు పాల్పడుతున్నాయి. ప్రధానంగా నగర, పట్టణవాసులను లక్ష్యంగా చేసుకునే ఈ ముఠాలు చెలరేగుతున్నాయని ప్రముఖ మార్కెటింగ్ రిసెర్చ్ సంస్థ ‘యు గవ్’ సర్వేలో వెల్లడైంది. ఆన్లైన్ మోసాలపై ఈ ఏడాది నవంబరులో దేశంలో 180 నగరాలు, పట్టణాల్లో ఆ సంస్థ సర్వే చేసింది. సర్వేలోని ప్రధానాంశాలు.. ♦ దేశంలో సైబర్ ఆర్థి క నేరాలు భారీగా పెరుగుతున్నాయి. 2022లో మోసాలకంటే ఈ ఏడాది (2023లో) ఇప్పటికే ఈ మోసాలు రెట్టింపయ్యాయి. కేంద్ర హోం శాఖ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సమరి్పంచిన నివేదిక ప్రకారం 2023 నవంబర్‌నాటికే దేశంలో రూ.5,574 కోట్లు కొల్లగొట్టారు. 2022లో రూ.2,296కోట్లు కొల్లగొట్టారు. ♦ దేశంలో జరిగిన సైబర్ నేరాల్లో ఈ–కామర్స్ పేరిట జరిగినవి 35 శాతం, ఉద్యోగావకాశాల పేరిట జరిగినవి 28శాతం. ♦ ఫోన్ కాల్స్, ఎస్ఎంఎస్లు, ఈమెయిల్స్ రూపంలో సైబర్ ముఠాలు వారానికి ఓసారి అయినా ప్రయత్నిస్తున్నాయని 54 శాతం మంది చెప్పారు. రోజూ అటువంటి మోసపూరిత ఎస్ఎంఎస్లు, ఈమెయిల్స్ వస్తున్నట్లు 30 శాతం మంది తెలిపారు. ♦ సైబర్ నేరాల బారిన పడి మోసపోయామని 20 శాతం మంది చెప్పారు. స్నేహితులు, పరిచయస్తులు ఆన్లైన్ మోసాలతో నష్టపోయారని 47 శాతం మంది తెలిపారు. ♦ సైబర్ మోసగాళ్ల బాధితుల్లో మహిళలకంటే పురుషులే ఎక్కువగా ఉన్నారు. ప్రతి వంద మంది పురుషుల్లో 35 శాతం, అలాగే ప్రతి వంద మంది మహిళల్లో 24 శాతం వారు ఆన్లైన్ మోసానికి గురైనట్లు వెల్లడించారు. ♦ దేశంలో సైబర్ నేరాల బాధితుల్లో అత్యధికంగా 23 శాతం మంది ద్వితీయ శ్రేణి నగరాల ప్రజలు ఉన్నారు. ♦ సైబర్ మోసాల బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయడానికి మాత్రం సుముఖత చూపడం లేదు. 59 శాతం మంది వారు మోసపోయినప్పటికీ ఫిర్యాదు చేయలేదని చెప్పారు. ♦ పోలీసులకు ఫిర్యాదు చేసిన వారిలో 48 శాతం మంది వారు కోల్పోయిన డబ్బును తిరిగి పొందారు. ♦ సైబర్ మోసాల బారిన పడకుండా అప్రమత్తంగా ఉంటున్న వారిలో 69 శాతం మంది వారి వ్యక్తిగత సమాచారాన్ని ఎవరికీ వెల్లడించడంలేదు. 59 శాతం మంది అనుమానాస్పద ఫోన్ నంబర్లు, ఈ మెయిల్స్ బ్లాక్ చేస్తున్నారు. 57 శాతం మంది అనుమానాస్పద సాఫ్ట్‌వేర్‌ను డౌన్లోడ్ చేసుకోవడంలేదు. 47 శాతం మంది తెలియని వారికి వస్తువుల కొనుగోలు ఇతరత్రా వ్యవహారాల పేరిట ఎట్టి పరిస్థితుల్లోనూ డబ్బు బదిలీ చేయడంలేదు. ఈ జాగ్రత్తలతో వారు సైబర్ నేరగాళ్ల వల నుంచి తప్పించుకుంటున్నట్లు సర్వే వెల్లడించింది. -
షాపింగ్ వైపే భారతీయుల చూపు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఆన్లైన్ మార్కెట్‌ప్లేస్ వేదికలు విస్తరించినప్పటికీ రిటైల్ స్టోర్లకు వెళ్లడం భారతీయులకు అత్యంత ప్రజాదరణ పొందిన షాపింగ్ విధానంగా నిలిచింది. ఇన్–స్టోర్ షాపింగ్ జనాదరణ పొందడానికి ప్రధాన కారణం ఉత్పత్తిని ముట్టుకోవడం, అనుభూతి చెందగల అవకాశం ఉండడమే. ఉత్పత్తుల ఖచ్చితమైన ప్రామాణికత, నాణ్యత కారణంగా ఆఫ్‌లైన్ షాపింగ్‌ను దాదాపు 54 శాతం మంది ఇష్టపడుతున్నారని డిజిటల్ రుణ సంస్థ నౌగ్రోత్ సర్వేలో వెల్లడించింది. దేశవ్యాప్తంగా 25కుపైగా నగరాల్లో సుమారు 3,000 మంది వర్తకులు, కొనుగోలుదార్లు ఈ సర్వేలో పాలుపంచుకున్నారు. కుటుంబంతో షాపింగ్.. హోమ్ డెలివరీని వినియోగదార్లు కోరుకుంటున్నారు. ఇంటికి సరుకులు పంపాల్సిందిగా కస్టమర్లు డిమాండ్ చేస్తున్నారని 60 శాతం విక్రేతలు తెలిపారు. దాదాపు సగం మంది తమ స్థానిక స్టోర్లకు విధేయులుగా ఉన్నారు. ఒక కుటుంబంలోని అనేక తరాలు తరచుగా ఒకే రిటైలర్ నుండి షాపింగ్ చేయడం వల్ల విశ్వాసం, పరిచయానికి దారి తీస్తోంది. చిన్న వ్యాపారాలను ప్రోత్సహించడానికి, మద్దతు ఇవ్వడానికి స్థానిక రిటైలర్ నుండి 35 శాతం మంది భారతీయులు షాపింగ్ చేస్తున్నారు. 70 శాతం కంటే ఎక్కువ మంది కస్టమర్లు రిటైల్ స్టోర్‌లో కుటుంబ షాపింగ్ అనుభవాన్ని విలువైనదిగా భావిస్తున్నారు. పండుగలు వంటి ప్రత్యేక సందర్భాల్లో స్టోర్లకు వినియోగదార్లు అధికంగా వస్తున్నారు. ఫ్లాష్ సేల్స్ సమయంలో.. భారతీయ కొనుగోలుదార్లలో కేవలం 10 శాతం మంది మాత్రమే ఆన్లైన్ విక్రయ ప్లాట్‌ఫామ్‌లలో ప్రత్యేకంగా షాపింగ్ చేస్తున్నారు. 26 ఏళ్లలోపు ఉన్న జెన్–జీ కస్టమర్లలో 14 శాతం మంది పూర్తిగా ఆన్‌లైన్‌ను ఎంచుకుంటున్నారు. 43–58 మధ్య వయసున్న జెన్–ఎక్స్ వినియోగదార్లలో కేవలం 5 శాతం, 27–42 మధ్య వయసున్న మిల్లేనియల్స్లో 11 శాతం మంది ఆన్లైన్ వేదికగా షాపింగ్ చేస్తున్నారు. ఫ్లాష్ సేల్స్, ఈ–కామర్స్ కంపెనీల ద్వారా అధిక తగ్గింపులను అందించే సమయాల్లో ఆన్లైన్లో ఎక్కువ విక్రయాలు నమోదవుతున్నాయి. ఫ్లాష్ సేల్స్ సమయంలో మాత్రమే ఆన్లైన్ షాపింగ్‌ను 35 శాతం మంది ఇష్టపడుతున్నారు. ఈ–కామర్స్‌తో ముప్పు లేదు.. తమ కార్యకలాపాలకు ఈ–కామర్స్‌తో ఎటువంటి ముప్పు లేదని 80 శాతంపైగా వర్తకులు ధీమా వ్యక్తం చేశారు. ఆన్లైన్ విక్రయ వేదికలు తమ అమ్మకాలపై ప్రభావం చూపాయని 18 శాతం మంది వెల్లడించారు. భారత్‌లో ఎఫ్ఎంసీజీ, రిటైల్ అమ్మకాల్లో ఆఫ్‌లైన్ వాటా ఏకంగా 97 శాతం ఉంది. ఫుడ్, బెవరేజ్ విభాగంలో 95 శాతం, కంజ్యూమర్ డ్యూరబుల్స్, ఎలక్ట్రానిక్స్ విక్రయాల్లో ఆఫ్‌లైన్ 93 శాతం కైవసం చేసుకుంది. దాదాపు 60 శాతం మంది రిటైలర్లు భవిష్యత్తులో డిజిటల్ టూల్స్ సహాయంతో రిటైల్ స్టోర్లపై దృష్టి పెట్టాలని కోరుకుంటున్నారు. 70 శాతం మంది రిటైలర్లు తమ ఉనికిని బలోపేతం చేసుకోవడానికి కొత్త ఔట్లెట్లను తెరవాలని యోచిస్తున్నారు. -
షాపింగ్ చేస్తున్నారా? బెస్ట్ క్యాష్ బ్యాక్ ఆఫర్లున్న క్రెడిట్‌కార్డులు ఇవే..
Best Credit Card Cashback Offers: దేశవ్యాప్తంగా ప్రస్తుతం పండుగ సీజన్ నడుస్తోంది. దసరా, దీపావళి పండుగల సందర్భంగా చాలా మంది షాపింగ్‌పై ఆసక్తి చూపిస్తున్నారు. ఈ క్రమంలో చాలా ఆఫ్‌లైన్, ఆన్లైన్ సంస్థలు పలు రకాల ఆఫర్లను ప్రకటించాయి. వీటితోపాటు వివిధ బ్యాంకులు తమ క్రెడిట్‌కార్డులతో షాపింగ్ చేస్తే క్యాష్ బ్యాక్ ఆఫర్లు అందిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఉత్తమ క్యాష్ బ్యాక్ ఆఫర్లు, ఇతర ప్రయోజనాలు అందిస్తున్న కొన్ని క్రెడిట్ కార్డుల గురించి ఇక్కడ తెలుసుకుందాం.. ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) తమ క్రెడిట్‌కార్డ్‌తో ఎటువంటి ఇబ్బందికరమైన వ్యాపారి పరిమితులు లేకుండా ఆన్లైన్ షాపింగ్‌పై 5 శాతం క్యాష్‌బ్యాక్ అందిస్తోంది. అదే ఆఫ్‌లైన్‌లో షాపింగ్ చేస్తే అదనంగా మరో 1 శాతం క్యాష్‌బ్యాక్ పొందవచ్చు. ఇక డిజిటల్ లావాదేవీలపై రివార్డ్ పాయింట్లు కూడా లభిస్తాయి. అయితే, క్యాష్‌బ్యాక్ నెలకు రూ. 5,000 మాత్రమే ఉంటుంది. యాక్సిస్ బ్యాంక్ ఏస్ క్రెడిట్ కార్డ్ యాక్సిస్ బ్యాంక్ ఏస్ క్రెడిట్ కార్డ్ యుటిలిటీ బిల్లుల చెల్లింపులకు అనువైనది. గూగుల్‌పే ద్వారా బిల్లు చెల్లింపులపై 5 శాతం క్యాష్‌బ్యాక్ అందిస్తుంది. అలాగే స్విగ్గీ, జొమాటో, ఓలా వంటి ప్రముఖ ప్లాట్‌ఫామ్‌లపై 4 శాతం క్యాష్‌బ్యాక్‌ను ఈ క్రెడిట్ కార్డుతో పొందవచ్చు. అయితే, ఈ క్యాష్‌బ్యాక్‌ల గరిష్ట మొత్తం నెలకు రూ. 500 మాత్రమే. అదనంగా ఈ కార్డ్ ఇతర అన్ని చెల్లింపులపైనా 2 శాతం అపరిమిత క్యాష్‌బ్యాక్‌ను అందిస్తుంది. ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్, యాక్సిస్ బ్యాంక్ సంయుక్తంగా ఈ క్రెడిట్ కార్డ్‌ను తీసుకొచ్చాయి. ఈ క్రెడిట్ కార్డ్ ఫ్లిప్‌కార్ట్ కొనుగోళ్లపై 5 శాతం క్యాష్‌బ్యాక్ అందిస్తుంది. దీంతోపాటు స్విగ్గీ, క్లయర్ట్రిప్, కల్ట్‌ఫిట్, పీవీఆర్, టాటా ప్లే, ఉబెర్ వంటి ఫ్లాట్‌ఫామ్స్‌లో చెల్లింపులపై 4 శాతం క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. ఫ్లిప్‌కార్ట్, మింత్రాలో విమాన, హోటల్ చెల్లింపులపై 1.5 శాతం క్యాష్‌బ్యాక్ వస్తుంది. ఈ క్రెడిట్ కార్డ్ క్యాష్‌బ్యాక్‌లను ఎలాంటి పరిమితి లేకుండా నెలంతా వినియోగించుకోవచ్చు. -
Save Money: పండగ ఆఫర్లు.. ఇవి పాటిస్తే డబ్బు ఆదా!
పండగల నేపథ్యంలో కస్టమర్లను ఆకర్షించేందుకు ఆఫ్‌లైన్, ఆన్లైన్ రిటైల్ షాపింగ్‌ల వద్ద రాయితీలు కనిపిస్తున్నాయి. మరోవైపు పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలతో సామాన్యులు సతమతమవుతున్నారు. దానికితోడు అధికమవుతున్న ద్రవ్యోల్బణమూ ఆందోళన కలిగిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా బ్యాంకులు, ఇతర నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ సంస్థలు వడ్డీ రేట్లు పెంచడంతో రుణాల భారం హెచ్చవుతుంది. ఈ తరుణంలో డబ్బును జాగ్రత్తగా ఖర్చు చేయాలి. రూపాయి ఖర్చు చేసేముందు బాగా ఆలోచించి నిర్ణయం తీసుకువాలి. తర్కంతో ఆలోచించి ఖర్చు తగ్గించుకుంటే పరోక్షంగా ఆ డబ్బును సంపాదించినట్లేనని నిపుణులు చెబుతున్నారు. వృథా ఖర్చులకు కళ్లెం వేయకపోతే.. భవిష్యత్ లక్ష్యాలు దెబ్బతింటాయి. ఈ నేపథ్యంలో వ్యయ నియంత్రణలో భాగంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలను ఆర్థికనిపుణులు సూచిస్తున్నారు. ఎమోషన్స్.. సమాజంలో లగ్జరీగా జీవిస్తున్నామని ఇతరులకు చెప్పుకోవడానికి చాలామంది అనవసర ఖర్చులు చేస్తారు. ఆర్భాటాలకు ప్రయత్నించి అప్పుల్లో కూరుకుంటారు. అనేక సందర్భాల్లో డబ్బు ఖర్చు చేయడం భావోద్వేగాలకు సంబంధించిన వ్యవహారంగా ఉంటుంది. స్తోమతకు మించి ఖర్చు చేయడం ఎప్పుడూ సరికాదు. కొత్త వస్తువును కొనాలి.. ఖరీదైన భోజనం, దుస్తులు.. ఇలా అతిగా ఖర్చు చేసే ప్రతి చోటా ఒకసారి ఆలోచించాలి. అతిగా ఖర్చు చేయాలనే కోరికను సాధ్యమైనంత మేరకు తగ్గించుకోవాలి. బడ్జెట్.. చేసే ప్రతిఖర్చుకూ లెక్క కచ్చితంగా ఉండాలి. మీ ఆదాయం, వ్యయాలను తెలుసుకునేందుకు బడ్జెట్ ఉపకరిస్తుంది. పండగల వేళ ఎంత ఖర్చు చేయాలన్నదీ బడ్జెట్ వేసుకోండి. బోనస్‌ల లాంటివి అందినా.. అందులో నుంచి ఎంత మొత్తం కొనుగోళ్లకు కేటాయించాలి అన్నది ముందే నిర్ణయించుకోవాలి. వచ్చిన బోనస్‌లో సగంకంటే ఎక్కువ పెట్టుబడికి మళ్లించాలి. నెలకు వచ్చిన ఆదాయంలోనూ 20-30 శాతం ముందుగా పొదుపు చేశాకే ఖర్చు చేయాలనే నిబంధన విధిగా పాటించాలి. 40 శాతానికి మించి నెలవారీ వాయిదాలు లేకుండా జాగ్రత్తపడాలి. ఖర్చుల కోసం ప్రత్యేక ఖాతాను కేటాయించాలి. క్రెడిట్ కార్డులు పండగల వేళ ఏదైనా వస్తువులు కొనేందుకు క్రెడిట్ కార్డులపై రాయితీలు ప్రకటిస్తారు. కంపెనీలు ఫెస్టివల్ సీజన్లో విక్రయాలు పెంచుకుని లాభాలు సాధించేందుకు ఇదొక విధానం. నిజంగా ఆ వస్తువులు అవసర నిమిత్తం తీసుకుంటున్నామా లేదా కేవలం ఆఫర్ ఉంది కాబట్టి కొనుగోలు చేస్తున్నామా అనేది నిర్ణయించుకోవాలి. కార్డులోని లిమిట్ మొత్తం వాడేస్తే తిరిగి చెల్లించడం కష్టం అవుతుంది. అవసరం అనుకున్నప్పుడే పండగల కొనుగోళ్లకు క్రెడిట్ కార్డును వాడాలి. వస్తువులు తీసుకుని తర్వాత బిల్లు చెల్లించకపోతే సమస్యలు వస్తాయి. అపరాధ రుసుములు, వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. ఆలస్యంగా చెల్లింపులు చేస్తే సిబిల్ స్కోరూ దెబ్బతింటుంది. క్రెడిట్ కార్డు పరిమితిలో 30-40 శాతానికి మించి వాడకుండా చూసుకోండి. ఇదీ చదవండి: ఆ ఫోన్ నంబర్లు మళ్లీ మూడు నెలలకే యాక్టివేట్ ఖర్చులు అన్నీ అయిపోయాక మిగిలిన డబ్బును పొదుపు చేద్దామని చాలా మంది అనుకుంటారు. కానీ అలాంటి భావన ఉన్న కొందరు వ్యక్తులవద్ద నెలాఖరుకు పొదుపు చేయడానికి డబ్బే ఉండదు. అదిపోగా చివరికి రోజువారి ఖర్చుల కోసం అప్పు చేయాల్సిన పరిస్థితి దాపురిస్తుంది. కాబట్టి ముందు పొదుపు.. తర్వాతే ఖర్చు. సమయం, సందర్భాన్ని బట్టి చేసే వ్యయాలు కొన్ని ఉంటాయి. వీటిని తప్పించుకోలేం. కానీ, చేతిలో డబ్బు ఉంది కదా అని ఖర్చు చేయడం పొరపాటు. దీర్ఘకాలిక ఆర్థిక లక్ష్యాలను ఏర్పరుచుకుని వాటిని సాధించే వరకూ డబ్బును కూడబెట్టాలి. అందుకు వీలుగా ఖర్చులు తగ్గించుకోవాలి. ఆర్థిక ప్రణాళిక నిర్ణయించుకోవడం ముఖ్యం. అయితే దాన్ని క్రమశిక్షణతో పాటించడం మరీముఖ్యం. ఖర్చులు, పొదుపు విషయంలో ఆలోచన సరళిమార్చుకుంటే తప్పకుండా ఆర్థిక విజయాన్ని సాధించవచ్చు. -
‘రహస్య అల్గారిథమ్’ ద్వారా రూ.100 కోట్లు మోసగించిన అమెజాన్.. ఎలాగంటే..
దిగ్గజ ఆన్లైన్ ఈకార్ట్ ప్లాట్‌ఫామ్ అమెజాన్ రిటైల్ పరిశ్రమలో లాభాలు పెంచుకోవడానికి రహస్య అల్గారిథమ్‌లు వినియోగించిందని యూఎస్ ఫెడరల్ ట్రేడ్ కమిషన్ గురువారం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. అలా రహస్య అల్గారిథమ్‌ల ద్వారా ఏకంగా రూ.100 కోట్లు సంపాదించినట్లు పేర్కొంది. ఫెడరల్ ట్రేడ్ కమిషన్..అమెజాన్ సంస్థకు సంబంధించిన కొన్ని అంశాలను పేర్కొంటూ సెప్టెంబర్‌లోనే కోర్టులో దావా వేసింది. కానీ గురువారం వరకు ఎలాంటి వివరాలు వెల్లడించలేదు. తాజాగా యూస్ డిస్ట్రిక్ట్ కోర్టులో పిటిషన్ దాఖలు చేయడంతో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. పిటిషన్‌లోని వివరాలు కింది విధంగా ఉన్నాయి. అమెజాన్ ఆన్లైన్ సూపర్స్టోర్ల్లో దాదాపు ఒక బిలియన్ వస్తువులు ఉన్నాయి. వినియోగదారుడికి తెలియకుండానే కొన్ని వస్తువుల ధరలు త్వరలో పెరుగనున్నట్లు ముందుగానే అంచనా వేసే అంతర్గత రహస్య అల్గారిథమ్(ప్రాజెక్ట్ నెస్సీ)ను సంస్థ ఉపయోగిస్తుంది. దాంతో సదరు వస్తువులను ఎక్కడ అధిక ధరలు వెచ్చించి కొనుగోలు చేయాల్సి వస్తుందేమోనని ముందుగానే కొనుగోలు చేస్తున్నారు. ఫలితంగా కస్టమర్లలో ఆందోళన సృష్టించి అమెజాన్ అమెరికాలో ఏకంగా రూ.100 కోట్లు సంపాదించింది. కొనుగోలు చేయాలనుకునే వస్తువు ధరను వినియోగదారులు బయటి రిటైలర్లతో పోల్చిచూస్తారు. ఆ వివరాలు నమోదు చేసుకుని తర్వాత అమెజాన్‌లో వాస్తవ ధరను మార్చి సదరు వినియోగదారుడికి విక్రయించినట్లు ఎఫ్‌టీసీ తెలిపింది. అమెజాన్ తన ప్రైమ్ డే సేల్స్ ఈవెంట్లు, హాలిడే షాపింగ్ సీజన్లో కస్టమర్లు ధరల విషయంలో మరింత అప్రమత్తంగా ఉంటారు. కాబట్టి ఆ సమయంలో నెస్సీ అల్గారిథమ్‌ను నిలిపివేస్తున్నారని వివరించింది. అమెజాన్ ఏప్రిల్ 2018లో కస్టమర్లు కొనుగోలు చేసిన 80 లక్షలకు పైగా వస్తువుల ధరలను నిర్ణయించడానికి నెస్సీను ఉపయోగించింది. ఈ వస్తువుల ధర ఏకంగా దాదాపు రూ.1600కోట్లు అని ఫిర్యాదులో పేర్కొంది. ఇదీ చదవండి: వచ్చే ఐదేళ్లలో భారత డిజిటల్ గేమింగ్ మార్కెట్ ఎంతంటే.. అమెజాన్ ప్రతినిధి టిమ్ డోయల్ మాట్లాడుతూ..ఫెడరల్ ట్రేడ్ కమిషన్ పిటిషన్లో తెలిపిన సమాచారం అవాస్తవం అన్నారు. నెస్సీ చేస్తున్న ధరల పోలికలు తప్పుగా వస్తుడడంతో చాలా ఏళ్ల క్రితం కంపెనీ ఆ అల్గారిథమ్‌ను వాడడం నిలిపివేసిందన్నారు. కేవలం వినియోగదారులు సదరు ప్రోడక్ట్ ధరను వేరే ఏదైనా ప్లాట్ఫామ్లో పోల్చి చూసారా లేదా అనే విషయాన్ని తెలుసుకునేందుకు మాత్రమే నెస్సీని 2010లో పరీక్షించినట్లు చెప్పారు. -
ఆన్లైన్ షాపింగ్‌లో డబ్బులు పోయాయా? ఇవి పాటిస్తే మేలు..
టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ ఆన్లైన్లో షాపింగ్ చేయడం కూడా క్రమంగా పెరుగుతూ వస్తుంది. ఆన్లైన్లోని వివిధ ప్లాట్ఫామ్ల్లో ధర బేరీజు వేసి ఎక్కడకొనాలో నిర్ణయం తీసుకుంటున్నారు. కావాల్సిన వస్తువును ఇంటికే తెచ్చి ఇస్తుండడంతో చాలా మంది ఆన్లైన్ షాపింగ్ సౌకర్యంగా భావిస్తున్నారు. రాయితీలు, ఇతర ప్రయోజనాలు కూడా కస్టమర్లను ఆకర్షిస్తున్నాయి. కొత్త యాప్‌లు అందుబాటులోకి రావడం కూడా అందుకు దోహదం చేస్తోంది. అయితే, సైబర్ నేరాలు కూడా అదే స్థాయిలో పెరుగుతున్నాయి. దాంతో చాలా మంది డబ్బులు నష్టపోతుంటారు. మరి వీటిని అరికట్టడానికి కొన్ని సులువైన మార్గాలను నిపుణులు సూచిస్తున్నారు. 1. బయోమెట్రిక్ ఉత్తమం.. పాస్‌వర్డ్‌లను గుర్తుంచుకోవడం కష్టం. పైగా వీటిని సులువుగా హ్యాక్ చేసే అవకాశం ఉంది. దీంతో తరచూ మార్చాలి. దీనికి బదులు బయోమెట్రిక్స్, ఇ-సిగ్నేచర్స్ వంటి ప్రత్యామ్నాయ మార్గాలను ఉపయోగించుకుంటే మేలు. 2. రెండంచెల ధ్రువీకరణ.. ఆన్లైన్లో షాపింగ్‌లో చెల్లింపులు చేసేటప్పుడు బహుళ అంచెల ధ్రువీకరణ విధానాన్ని పాటించాలి. కేవలం ఒక్క పాస్వర్డ్తోనే కాకుండా బయోమెట్రిక్, ఓటీపీ, మెయిల్, ఎస్ఎంఎస్, మొబైల్ వంటి ఇతర ప్రత్యామ్నాయాల ద్వారా వివరాల్ని రెండోసారి ధ్రువీకరించే పద్ధతిని అనుసరించాలి. 3. రిమోట్ యాక్సెస్‌తో నష్టం.. మన కంప్యూటర్ లేదా ఫోన్‌ను ఒక్కోసారి దూరంగా ఉన్న వ్యక్తికి రిమోట్ యాక్సెస్ ఇస్తుంటాం. కానీ, ఇది అంత శ్రేయస్కరం కాదు. దీనివల్ల మీ ఆన్లైన్ ఖాతాల సమాచారం మొత్తాన్ని ఇతరులు తెలుసుకునే అవకాశం ఉంది. మీ పాస్వర్డ్లు, ఇతర వివరాలన్నీ సులువుగా కనుగొంటారు. ఏదైనా సున్నితమైన సమాచారాన్ని బహిర్గతం చేస్తామని బ్లాక్ మెయిల్ చేసే అవకాశం ఉంది. 4. ఓటీపీని అసలు షేర్ చేయొద్దు.. ఆన్లైన్ లావాదేవీలు పెరుగుతున్న కొద్దీ సైబర్ మోసగాళ్లు కొత్త మార్గాలను అన్వేషిస్తున్నారు. కస్టమర్ దగ్గర నమ్మకాన్ని సంపాదించడం కూడా అందులో ఓ భాగం. మిమ్మల్ని మాటల్లో పెట్టి కీలక వివరాలన్నీ తెలుసుకుంటారు. అందువల్ల ఫోన్లోగానీ, ఆన్‌లైన్‌లోగానీ ఎవరైనా ఓటీపీ అడిగితే వెంటనే అనుమానించాలి. (లంచాలకు ఉద్యోగాలు.. టీసీఎస్ స్కాం!) 5. పబ్లిక్ వైఫైతో జాగ్రత్త.. ఆర్థిక లావాదేవీలు జరిపేటప్పుడు వీలైనంత వరకు పబ్లిక్/ ఓపెన్ వైఫైని వాడకపోవడమే మంచిది. పబ్లిక్ వైఫై ద్వారా మీరు చేస్తున్న లావాదేవీలను కొందరు ఇతర మార్గాల ద్వారా తెలుసుకునే అవకాశం ఉంది. వీలైనంత వరకు బ్యాంకు లావాదేవీల కోసం సొంత నెట్వర్క్, సొంత డివైజ్‌నే వాడాలి. ఆన్లైన్ షాపింగ్, లావాదేవీలకు సంబంధించిన అవగాహనను పెంపొందించుకోవాలి. ఎన్ని రకాలుగా సైబర్ మోసాలు జరుగుతున్నాయో తెలుసుకోవాలి. అపరిచిత వ్యక్తులు, సంస్థలతో మీ సమాచారాన్ని పంచుకోవద్దు. -
ఆ స్మార్ట్‌ఫోన్లంటే ప్రాణం!, నిమిషానికి ఎన్ని ఫోన్లు కొనుగోలు చేస్తున్నారంటే!
భారత్‌లో రెండు ఈ -కామర్స్ సంస్థలు నువ్వా..నేనా..సై..అంటూ భారీ డిస్కౌంట్లతో కాలుదువ్వుతున్నాయి. దీన్ని అదునుగా భావిస్తున్న కోట్లాది మంది కస్టమర్లు కూర్చున్న చోటుకే కావాల్సినవి వస్తుండటంతో సెకన్ల వ్యవధిలో తమకు కావాల్సిన వస్తువుల్ని ఆర్డర్లు పెడుతున్నారు. ఆర్డర్లు సంగతి సరే. ఇంతకీ అమెజాన్, ఫ్లిప్ కార్ట్ పోర్టల్‌లో ఏ వస్తువు ఎక్కువగా అమ్ముడవుతుంది? యూజర్లు ఏ బ్రాండ్ ఫోన్లు ఎక్కువగా కొంటున్నారు? దేశీయ ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్ కార్ట్ నిర్వహిస్తున్న ‘బిగ్ బిలియన్ డేస్’ సేల్స్, అమెజాన్ ‘గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్’ సేల్స్‌లో సరికొత్త రికార్డ్లను నమోదు అవుతున్నాయి. స్పెషల్ సేల్‌లో భారీ ఎత్తున డిస్కౌంట్స్ అందిస్తుండడంతో అమెజాన్, ఫ్లిప్ కార్ట్ సైట్లకు కస్టమర్లు పోటెత్తుతున్నారు. దీంతో ఆయా సెగ్మెంట్లలోని వస్తువులు నిమిషాల్లోనే హాట్ కేకుల్లా అమ్ముడు పోతున్నాయి. ఫ్లిప్‌కార్ట్‌లో రోజుకి 9.1 కోట్ల మంది కస్టమర్లు కొనుగోలు దారుల డిమాండ్ దృష్ట్యా ఫ్లిప్ కార్ట్ వెబ్‌సైట్‌ను రోజువారీ లావాదేవీలపై 9.1 కోట్ల మంది కస్టమర్లు సందర్శించారు. ఆర్డర్లు సైతం 7 రెట్లు పెరిగినట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. ఇక ఈ ప్రత్యేక సేల్‌లో కొనుగోలు దారులు మొబైల్, గృహోపకరణాలు (Appliance), లైఫ్‌స్టైల్, బ్యూటీ అండ్ జనరల్ మెర్చెండైజ్ ఉత్పత్తులు అంటే షూ’లు, దుస్తులు,ఫార్మాస్యూటికల్ ప్రొడక్ట్స్, జ్యువెలరీ, ఫుడ్ ఐటమ్స్, ఎలక్ట్రానిక్స్ వస్తువుల్ని ఎక్కువగా కొనుగోలు చేస్తున్నట్లు ఫ్లిప్‌కార్ట్ తెలిపింది. ►ఫ్లిప్ కార్ట్‌లో టైర్-2 ప్లస్ కస్టమర్లు రూ.20,000 ధర కంటే ఎక్కువగా ఉన్న ఫోన్లకు డిమాండ్ ఎక్కువగా ఉన్నట్లు అంచనా వేసింది. ►ఇక, అదే సైట్లో 1-2 అండ్ 3 టైర్ సిటీస్‌కు చెందిన కస్టమర్లు మొబైల్స్, అప్లయెన్సెస్, లైఫ్ స్టైల్, బ్యూటీ అండ్ జనరల్ మెర్చెండైజ్, ఎలక్ట్రానిక్స్ వస్తువులు 60 శాతం ఆర్డర్లు పెట్టారు. అమెజాన్‌లో 9. కోట్ల మంది మరోవైపు అమెజాన్ అక్టోబర్ 8 నుంచి అక్టోబర్ 15 వరకు కొనసాగుతున్న అమ్మకాలు సైతం భారీ ఎత్తున జరుగుతున్నట్లు వెలుగులోకి వచ్చిన నివేదికలు హైలెట్ చేస్తున్నాయి. అమెజాన్ గ్రేట్ ఇండియా ఫెస్టివల్ సేల్ మొదటి 48 గంటల్లో 9.5 కోట్ల మంది కస్టమర్లు అమెజాన్ సైట్‌ని వీక్షించారు. ఆఫోన్ అంటే మాకు ప్రాణం.. నిమిషానికి 100 ఆర్డర్లు అమెజాన్ పోర్టల్‌లో ఎక్కువగా కొనుగోలు చేసిన ప్రొడక్ట్‌లలో స్మార్ట్ ఫోన్లు అత్యధికంగా ఉన్నాయి. సాధారణ కస్టమర్ల కంటే ముందే ప్రైమ్ సబ్స్క్రైబర్లు అక్టోబర్ 7న కొనుగోలు చేసే అవకాశం ఉంది. అయితే, ఆ ఒక్కరోజే ప్రైమ్ మెంబర్లు సెకనుకు 75 కంటే ఎక్కువ స్మార్ట్ ఫోన్ల కొనుగోలుకు ఆర్డర్ పెట్టారు. ఆ ఫోన్లలో వన్‌ప్లస్, శామ్ సంగ్, యాపిల్ ఐఫోన్లు ఎక్కువగా ఉండగా.. తొలి 48 గంటల్లో ప్రతి నిమిషానికి 100 వన్ ప్లస్ ఫోన్‌ను కొనుగోలు చేశారు. ప్రీమియం స్మార్ట్ ఫోన్లలో శాంసంగ్ డిమాండ్ ఎక్కువగా ఉంది. 75 శాతం స్మార్ట్ఫోన్ల అమ్మకాలు 2-3 టైర్ (సిటీస్/టౌన్ల) ప్రాంతాల కస్టమర్ల ఆర్డర్లకు అనుగుణంగా 75 శాతం స్మార్ట్ఫోన్లు అమ్మినట్లు అమెజాన్ తెలిపింది. బడ్జెట్ ధర, నో కాస్ట్ ఈఎంఐ, ఎక్ఛేంజ్ ఆఫర్ సౌకర్యం ఉండడంతో గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది రూ.30,000 కంటే ఎక్కువ ధర ఉన్న ప్రీమియం స్మార్ట్ఫోన్ల సేల్స్ 3 శాతం వృద్ది సాధించినట్లు వెల్లడించింది. నిమిషానికో టీవీ తాము నిర్వహిస్తున్న అమ్మకాల తొలి రెండ్రోజుల్లో ప్రతి సెకనుకు 1.2లక్షల కస్టమర్లు గృహోపకరకాణాల్ని కొనుగోలు చేశారు. ఆ సెకనులోని సగం మంది కస్టమర్లు ధర ఎక్కువగా ఉన్న అప్లయెన్సెస్ కోసం ఆర్డర్ పెట్టారు. 2-3 టైర్ నగరాల ప్రజలు ప్రతి నిమిషానికి ఒక టీవిని కొనుగోలు చేశారు. అందం మీద ఆసక్తితో ఫ్లిప్ కార్ట్, అమెజాన్ స్పెషల్ సేల్‌పై ప్రముఖ రీసెర్చ్ సంస్థ రెడ్‌సీర్ ఓ ఆసక్తిరమైన రిపోర్ట్‌ను విడుదల చేసింది. బిగ్ బిలియన్ డే సేల్‌లో ఒకరోజు ముందే షాపింగ్ చేసుకునే అవకాశం ఉన్న ఫ్లిప్ కార్ట్ ఫ్లస్ సబ్స్క్రైబర్లు గ్రూమింగ్ సంబంధిత ప్రొడక్ట్‌లతో పాటు ఫుడ్ అండ్ న్యూట్రీషియన్, మేకప్, స్ప్రే బాటిల్స్‌ను ఎక్కువగా కొనుగోలు చేసినట్లు రెడ్రీస్ నివేదించింది గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాదిలో గత ఏడాదిలో అమెజాన్ నిర్వహించిన గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్‌తో పోలిస్తే ఈ ఏడాది అమ్మకాల్లో తొలి 48 గంటల్లో 35శాతం కంటే ఎక్కువగా ప్రీమియం స్మార్ట్ ఫోన్లను విక్రయించగా.. ప్రతి నిమిషానికి 10 ప్రీమియం నాయిస్ క్యాన్సిలింగ్ హెడ్ ఫోన్స్‌ను కొనుగోలు చేశారు. ఈ ప్రాంతాల నుంచే ఎక్కువ ఆర్డర్లు ఫ్లిప్‌కార్ట్‌లో బెంగళూరు,ఢిల్లీ, హైదరాబాద్ వంటి నగరాల నుంచి ఎక్కువ మంది ఆర్డర్లు పెట్టగా.. ఆ తర్వాతి స్థానాల్లో ముంబై,పూణే, అహ్మదాబాద్,కోల్‌కతా, చెన్నై, గూర్ గావ్ నుంచి ఉన్నారు. ఆసక్తికరంగా ఫెస్టివల్ సీజన్లో షాపింగ్ ఎక్కువ చేసిన ప్రధాన నగరాల జాబితాలో హిసార్,లక్నో, పాట్నాలు ఉన్నాయి. -
పండుగల్లో ఆన్లైన్ షాపింగ్.. 81 శాతం మంది
న్యూఢిల్లీ: రానున్న పండుగల సమయంలో ఆన్లైన్ షాపింగ్ చేసేందుకు తాము ఆసక్తిగా ఉన్నట్టు అధిక శాతం వినియోగదారులు వెల్లడించారు. గతేడాదితో పోలిస్తే మరింత ఖర్చు పెట్టేందుకు తాము సుముఖంగా ఉన్నట్టు చెప్పారు. అమెజాన్ ఇండియా తరఫున నీల్సన్ మీడియా నిర్వహించిన సర్వేలో ఈ విషయం తెలిసింది. మెట్రోలు, చిన్న పట్టణాలకు చెందిన 8,159 మంది వినియోగదారుల అభిప్రాయాలను ఈ సర్వేలో భాగంగా తెలుసుకున్నారు. సర్వేలోని అంశాలు.. ► మెట్రోల నుంచి 87 శాతం మంది, టైర్–2 పట్టణాల (10–40 లక్షల జనాభా ఉన్న) నుంచి 86 శాతం మంది ఈ ఏడాది పండుగల సీజన్లో ఆన్లైన్ షాపింగ్ చేయనున్నట్టు చెప్పారు. మొత్తం మీద 81 శాతం మంది ఆన్లైన్ షాపింగ్‌కు మొగ్గు చూపిస్తున్నారు. ►ప్రతి ఇద్దరు వినియోగదారుల్లో ఒకరు గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది షాపింగ్‌పై ఎక్కువ ఖర్చు చేస్తామని తెలిపారు. ►పెద్ద గృహోపకరణాల కొనుగోలుకు పండుగ షాపింగ్ కార్యక్రమాల వరకు వేచి చూస్తామని ప్రతి నలుగురిలో ముగ్గురు చెప్పారు. ఈ ఫెస్టివల్ సేల్ కార్యక్రమాలనేవి రిఫ్రిజిరేటర్లు, వాషింగ్ మెషిన్లు, గీజర్లు తదితర కొత్త ఉత్పత్తుల ఆవిష్కరణకు వీలు కల్పిస్తాయన్నది వారి అభిప్రాయంగా ఉంది. ►స్మార్ట్ ఫోన్ల కొనుగోలుకు పండుగల విక్రయ కార్యక్రమాల వరకు ఆగుతామని 76 శాతం మంది తెలిపారు. 60 శాతం మంది రూ.10,000–20,000 బడ్జెట్ ఫోన్లను కొనుగోలు చేసేందుకు ఆసక్తిగా ఉన్నారు. ప్రతి ముగ్గురిలో ఇద్దరు 5జీ ఫోన్ తీసుకుంటామని చెప్పారు. ►76 శాతం మంది లగ్జరీ, విశ్వసనీయమైన సౌందర్య ఉత్పత్తులను పండుగల సందర్భంగా ఆన్లైన్లో కొనుగోలు చేస్తామని తెలిపారు. ఆనందంగా ఉంది.. ‘‘ఈ ఏడాది వినియోగదారులు ఆన్లైన్లో మరింత షాపింగ్ చేసేందుకు సుముఖంగా ఉండడం మాకు ఎంతో ఉత్సాహాన్నిస్తోంది. దేశవ్యాప్తంగా వినియోగదారులు అమెజాన్ డాట్ ఇన్ను విశ్వసనీయమైన, ప్రాధాన్య, ఇష్టపడే షాపింగ్ వేదికగా ఉందని తెలుసుకునేందుకు ఆనందంగా ఉంది’’అని అమెజాన్ ఇండియా కంట్రీ మేనేజర్ మనీష్ తివారీ పేర్కొన్నారు. రెడ్‌సీర్ స్ట్రాటజీ కన్సల్టెంట్స్ ఈ ఏడాది మొదటి మూడు త్రైమాసికాల్లో ఆన్లైన్ అమ్మకాలు బలహీనంగా ఉంటే, చివరి మూడు నెలల్లో పండుగల వాతావరణంతో విక్రయాలు 15 శాతం వృద్ధి చెందుతాయని వర్తకులు అంచనా వేస్తున్నారు. లాభదాయక పండుగల సీజన్‌పై బుల్లిష్ సెంటిమెంట్ నెలకొన్నట్టు రెడ్‌సీర్ స్ట్రాటజీ కన్సల్టెంట్స్ తెలిపింది. 2023 పండుగల సీజన్ ముందు వందలాది విక్రేతల (ముఖ్యంగా చిన్న వర్తకులు) అభిప్రాయాలను రెడ్‌సీర్ తన అధ్యయనంలో భాగంగా తెలుసుకుంది. అన్ని విభాగాల్లో పండుగల విక్రయాలు అధిక స్థాయిలో ఉంటాయనే అభిప్రాయం వ్యక్తమైంది. ‘‘పండుగల సీజన్లో 15 శాతం అధిక అమ్మకాలు నమోదవుతాయనే అంచనాతో ఆన్లైన్ విక్రేతలు ఉన్నారు. ముఖ్యంగా ఇటీవలి కాలంలో ఈ కామర్స్ ప్లాట్‌ఫామ్‌లపై విక్రయాలు బలంగా ఉన్నా కానీ, ఇంతకంటే అధిక విక్రయాల కోసం విక్రేతులు చూస్తున్నారు’’ అని రెడ్‌సీర్ స్ట్రాటజీ పేర్కొంది. క్రితం ఏడాది పండుగల సీజన్లో అమ్మకాల్లో వృద్ధి 26 శాతంగా ఉన్న విషయాన్ని పేర్కొంది. విక్రేతల ఆశావహ ధోరణికి అనుగుణంగా తగిన పరిష్కారాలను ఈ కామర్స్ సంస్థలు రూపొందిస్తున్నట్టు వెల్లడించింది. ఈ కామర్స్ సంస్థల నుంచి డేటా అనలైటిక్స్, వినియోగ ధోరణలు ఎలా ఉన్నాయి తదితర రూపాల్లో తమకు బలమైన మద్దతు లభిస్తున్నట్టు విక్రేతలు చెప్పారు. విక్రేతల్లో బుల్లిష్ సెంటిమెంట్ నేపథ్యంలో ఆన్లైన్ ప్రకటనల వ్యయాన్ని పెంచుకునే అవకాశం ఉన్నట్టు రెడ్‌సీర్ పేర్కొంది. పండుగ సీజన్ విక్రయాల్లో 40 శాతం వృద్ధి: గోద్రెజ్ అప్లయెన్సెస్ ఈసారి పండుగ సీజన్లో అమ్మకాలు గతేడాదితో పోలిస్తే 30–40 శాతం మేర వృద్ధి చెందగలవని అంచనా వేస్తున్నట్లు గోద్రెజ్ అప్లయెన్సెస్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ కమల్ నంది తెలిపారు. ప్రస్తుతం తమ ఉత్పత్తుల్లో ప్రీమియం ప్రోడక్టుల వాటా 35 శాతంగా ఉందని, దీన్ని 40 శాతానికి పెంచుకుంటున్నట్లు ఆయన చెప్పారు. పండుగ సీజన్ సందర్భంగా పలు ప్రీమియం ఉత్పత్తులను ప్రవేశపెట్టినట్లు నంది తెలిపారు. 4 డోర్ల రిఫ్రిజిరేటర్లు, స్టీమ్ వాష్ సదుపాయం గల ఫ్రంట్ లోడ్ వాషింగ్ మెషిన్లు, టర్బో చిల్ సిరీస్ ఎయిర్ కండీషనర్లు మొదలైనవి వీటిలో ఉన్నాయి. వారంటీ పొడిగింపు, క్యాష్‌బ్యాక్, ఎక్సే్చంజ్ ఆఫర్లు, కొత్త ప్రీమియం ఉత్పత్తులు మొదలైన అంశాలు అమ్మకాల వృద్ధికి తోడ్పడగలవని ఆశిస్తున్నట్లు నంది వివరించారు. -
ఆన్లైన్ షాపింగ్ వైపు .. కొత్త తరం చూపు
కొత్త తరం కస్టమర్లు (11–26 ఏళ్ల వయస్సువారు– జెన్ జీ) కొనుగోళ్ల కోసం భారీగా ఆన్లైన్ షాపింగ్ వైపు మొగ్గు చూపుతున్నట్లు ఈ–కామర్స్ సంస్థ అమెజాన్ ఫ్యాషన్ ఇండియా వీపీ సౌరభ్ శ్రీవాస్తవ తెలిపారు. వివిధ సెగ్మెంట్లలో కస్టమర్లు ఎక్కువగా ప్రీమియం ఉత్పత్తులపై ఆసక్తిగా ఉంటున్నట్లు ఆయన వివరించారు. అక్టోబర్ 8 నుంచి అమెజాన్ గ్రేట్ ఇండియా ఫెస్టివల్ (ఏజీఐఎఫ్) ప్రారంభం కానున్న నేపథ్యంలో ఢిల్లీ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ కామర్స్‌లో ప్రివ్యూ నిర్వహించిన సందర్భంగా ఆయన ఈ విషయం వివరించారు. ఆన్లైన్ షాపింగ్‌కు సంబంధించి ఫ్యాషన్, బ్యూటీకి ఎక్కువగా డిమాండ్ కనిపిస్తుండగా మొబైల్ ఫోన్లు, ఎల్రక్టానిక్స్, గృహోపకరణాలు ఆల్‌టైమ్ ఫేవరెట్స్‌గా ఉంటున్నాయని శ్రీవాస్తవ చెప్పారు. ఈసారి ఏజీఐఎఫ్లో అమ్మకాలు కొత్త గరిష్ట స్థాయిని తాకగలవని అంచనా వేస్తున్నట్లు వివరించారు. రాబోయే పండుగ సీజన్లో ఆన్లైన్ అమ్మకాలు 20 శాతం వరకు వృద్ధి చెంది రూ. 90,000 కోట్లకు చేరే అవకాశం ఉందని పరిశ్రమవర్గాలు అంచనా వేస్తున్నాయి. -
ఆన్లైన్ షాపింగ్ చేసేవారికి గుడ్‌న్యూస్.. ఫ్లిప్‌కార్ట్‌లో సరికొత్త ఫీచర్!
Flipkart price lock Feature: పండుగల సమయంలో ఆన్లైన్ షాపింగ్ చేసేవారి కోసం ప్రముఖ ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ ఫ్లిప్‌కార్ట్ (Flipkart) సరికొత్త ఫీచర్‌ను తీసుకొస్తోంది. కస్టమర్లు తమకు కావాల్సిన వస్తువులు.. తాము కొనుగోలు చేసేంత వరకూ ధరలు పెరగకుండా లాక్ చేసుకునేలా 'ప్రైస్ లాక్' ఫీచర్ (price lock feature)ను ప్రవేశపెట్టనున్నట్లు కంపెనీ సీనియర్ ఎగ్జిక్యూటివ్ తాజాగా ప్రకటించారు. (ఇంత కంటే చీప్ ఇంకేమైనా ఉందా? రూ. 6.6 కోట్ల విలువైన ఫ్లాట్లు రూ.100కే..) "పండుగ సీజన్లలో తమకు కావాల్సిన ఉత్పత్తులు అమ్ముడైపోయాయని లేదా నిమిషాల్లోనే అందుబాటులో లేకుండా పోతున్నాయని కస్టమర్ల నుంచి ఫీడ్‌బ్యాక్ వచ్చింది. దీనికి పరిష్కారంగా ప్రైస్ లాక్ ఫీచర్‌తో కస్టమర్లు తమకు అవసరమైన ఇన్వెంటరీని లాక్ చేసుకోవచ్చు" అని ఫ్లిప్‌కార్ట్ చీఫ్ ప్రాడక్ట్ అండ టెక్నాలజీ ఆఫీసర్ (CPTO) జయందరన్ వేణుగోపాల్ ఫ్లిప్‌కార్ట్ మాతృ సంస్థ వాల్‌మార్ట్ నిర్వహించిన కన్వర్జ్ ఈవెంట్లో తెలిపారు. అయితే, ఈ ఫీచర్‌ను ఎప్పుడు అందుబాటులోకి తీసుకొస్తారనేది ఆయన చెప్పలేదు. 'ప్రైస్ లాక్' ఫీచర్ ఇలా.. ఫ్లిప్‌కార్ట్ తీసుకొస్తున్న 'ప్రైస్ లాక్' ఫీచర్ కింద కస్టమర్లు తమకు కావాల్సిన వస్తువులను లాక్ చేసుకునేందుకు కొంత మొత్తం ముందుగా చెల్లించాల్సి ఉంటుంది. ఆ తర్వాత పండుగ సమయాల్లో ఆయా వస్తువులకు డిమాండ్ పెరిగినప్పటికీ, లాక్ చేసుకున్న కస్టమర్లకు అవి అందుబాటులో ఉండేలా చేస్తారు. అలాగే ధరలు పెరిగినప్పటికీ లాక్ చేసుకున్న ధరకే ఆయా వస్తువులను కొనుక్కోవచ్చు. సాధారణంగా ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌ల అమ్మకాలలో 50 శాతం పండుగ సీజన్లలోనే జరుగుతాయి. -
ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నారా..! ఇక అంతే సంగతులు..!!
వరంగల్: ప్రస్తుత కాలంలో ఆన్లైన్ షాపింగ్‌పై అన్ని వర్గాల వారు ఆసక్తి కనబరుస్తున్నారు. షోరూంలలో కనిపించని వస్తువులు అనేకం ఆన్లైన్ షాపింగ్‌లో దర్శనమిస్తున్నాయి. అయితే నెట్లో కనిపించే ఆన్లైన్ షాపింగ్ ప్రకటనలన్నీ నమ్మితే మోసపోవడం ఖాయం. ప్రచారంలో చెప్పేదొకటి.. ఆర్డర్ ఇవ్వగానే డెలివరీ అయ్యేది మరోటి. పైగా ధరల్లో తేడాలు. దీని గురించి ఎవరిని సంప్రదించాలో తెలియని పరిస్థితి ఉంటుంది. ఆన్లైన్ షాపింగ్‌లో చాలా తక్కువ ధరలకే వివిధ రకాల ఉత్పత్తులను లభిస్తున్నాయి. ప్రత్యేకించి ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్ ఉత్పత్తులతో పాటు ఫర్నిచర్, రెడీమేడ్స్, లేడీస్ యాక్సెసరీస్, కాస్మోటిక్స్, స్మార్ట్ఫోన్లు ఇలా అనేక రకాల ఉత్పత్తులు ఉన్నాయి. ఆర్డర్ చేసిన కొద్దిరోజుల్లోనే ఆయా కంపెనీలు వాటిని ఇంటికే నేరుగా సరఫరా చేస్తాయి. ఇంట్లో కూర్చోనే కావాల్సిన వస్తువులను హాయిగా కొనుగోలు చేస్తున్నారు. అయితే చూడడానికి, వినడానికి ఇది ఎంతో బాగున్నా కొన్ని సందర్భాల్లో ఆన్లైన్ షాపింగ్ చేసేవారు తీవ్రంగా నష్టపోతున్నారు. ఆర్డర్ ఇచ్చిన వస్తువులు ఇంటికి రాగానే వాటిని చూసి అవాకై ్కపోతున్న వారు అధిక శాతం మంది ఉన్నారు. ఆకర్షణలకు లొంగొద్దు.. ఆకర్షణీయమైన ప్రకటనలు ఇచ్చే కంపెనీల్లో నమ్మకమైనవే కాకుండా కొన్ని బోగస్ కంపెనీలు కూడా ఉంటాయి. ఉదాహరణకు ఒక స్మార్ట్‌ఫోన్‌కు ధర చెల్లిస్తే ఉచితంగా ఇంటికి చేరుస్తామని చెప్పారు. తీరా ఆర్డర్ చేసిన తర్వాత ఇంటికి వచ్చిన ప్యాక్‌ను తెరిస్తే బొమ్మ ఫోన్ లేదా రాళ్లు నింపి పంపించిన ఘటనలు అనేకం ఉన్నాయి. అలాగే రెడీమేడ్ వస్తువులు ఆర్డర్ ఇస్తే నాసిరకం ఉత్పత్తులు పంపించిన సందర్భాలు ఉన్నాయి. తీరా వారిచ్చిన నంబర్‌కు ఫోన్ చేసినా ఫలితం ఉండదు. దీంతో తాము మోసపోయమని గ్రహించిన పట్టించుకునే వారు ఉండరు. అందుకే ఆన్లైన్ షాపింగ్ చేసే ముందు ఆయా కంపెనీల గురించి తెలుసుకుని ఉండడం మంచిది. ఆన్లైన్ షాపింగ్ చేసేటప్పుడు జాగ్రత్తలు.. ► సదరు కంపెనీ ఎలాంటి ఉత్పత్తులపై వ్యాపారం చేస్తుందో గమనించాలి. ► కంపెనీకి సంబంధించిన వివరాలు ముందే తెలుసుకోవాలి. ► ఆన్లైన్లో విక్రయించే వస్తువులు, షాపింగ్ మాల్స్‌లో లభించే వస్తువుల ధరల్లో ఏమైనా తేడాలు ఉన్నాయో లేదో గమనించాలి. ► ఆయా ఉత్పత్తులపై ఇచ్చే డిస్కౌంట్స్, వివిధ రకాల ఆఫర్ల గుర్తించి అవగాహన ఉండాలి. ► బోగస్ కంపెనీల గురించి తరచూ పత్రికల్లోకానీ, పోలీసులు చెబుతుంటారు. వాటిని పరిశీలిస్తూ ఉండాలి. ► ఆన్లైన్ మోసాలపై చర్యలు తీసుకునేందుకు పోలీసులు ప్రత్యేకంగా సైబర్ క్రైం విభాగాన్ని ఏర్పాటు చేశారు. ఈ విభాగం గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. ► ఎప్పుడైనా మోసపోయినట్లు తెలిస్తే వెంటనే సైబర్ క్రైం విభాగానికి ఫిర్యాదు చేయొచ్చు. ► ఆన్లైన్ కంపెనీలకు సంబంధించిన ఫోన్ నంబర్లను దగ్గర ఉంచుకోవాలి. వాటి అడ్రస్ గురించి తెలుసుకోవాలి. ఎప్పుడైనా మోసం జరుగుతుందని అనుమానం వస్తే సదరు నంబరుకు ఫోన్ చేయాలి. ► ఆన్లైన్లో విక్రయించే వస్తువుల ప్యాకింగ్‌పై కంపెనీల చిరునామా, ఎప్పుడు తయారయ్యాయే? గమనించడంవంటి కనీస జాగ్రత్తలు తీసుకోవాలి. ఆకర్షణీయ ప్రకటనలు, ఆఫర్లను నమ్మితే ఇక అంతే.. డిస్కౌంట్లు.. డిస్కౌంట్లు. అప్టు 50 పర్సంట్, 75 పర్సంట్ వరకు తగ్గింపు.. ఒక వస్తువు కొంటే మరోటి ఫ్రీ.. పైగా ఉచిత డోర్ డెలివరీ.. ఇలా ఒకటేమిటి ఆన్లైన్ షాపింగ్‌లో అన్నీ ఇలాంటి ఆఫర్లే దర్శనమిస్తాయి. బోగస్ ప్రకటనలెన్నో. ఇందులో కొన్ని నిజం కూడా కావొచ్చు.. అయితే ఉద్యోగాలు, ఇంటి పనులతో సమయం చిక్కని వారికి ఆన్లైన్ షాపింగ్ వరమే. కానీ ఆన్లైన్ షాపింగ్‌లో ఏ మాత్రం అజాగ్రత్తగా వ్యవహరించినా మొదటికే మోసం వచ్చే ప్రమాదం ఉంది. తగిన సూచనలు పాటిస్తూ, విచక్షణ ఉపయోగించి ఆన్లైన్ షాపింగ్ చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. కంపెనీల విశ్వసనీయతను పరిగణనలోకి తీసుకోవాలి ఆన్లైన్లో కనిపించే ప్రతి ప్రకటన నిజమేననే భ్రమ వీడాలి. ఆన్లైన్ షాపింగ్ చేసేటప్పుడు ఆయా కంపెనీలకు ఉన్న విశ్వసనీయతను పరిగణనలోకి తీసుకోవాలి. లేదంటే వినియోగదారుడు మోసపోయే అవకాశాలు మెండుగా ఉంటాయి. –సార్ల రాజు సీఐ, కాజీపేట