![Flipkart Announced Big Dussehra Sale in 2022 - Sakshi](/styles/webp/s3/article_images/2022/10/2/online%20sales.jpg.webp?itok=P0Yp-Fbt)
కొనుగోలు దారులకు ప్రముఖ దేశీయ ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్ కార్ట్ బంపరాఫర్ ప్రకటించింది. సెప్టెంబర్ 23 నుంచి 30వ తేదీ వరకు ఫ్లిప్ కార్ట్ బిగ్ సేవింగ్స్ డేస్ సేల్ ను నిర్వహించింది. తాజాగా దసరా సందర్భంగా ఈ నెల 5 నుంచి 8 వరకు బిగ్ దసరా సేల్ 2022ను నిర్వహించనున్నట్లు తెలిపింది.
నాలుగు రోజుల పాటు నిర్వహించే ఈ సేల్‌లో కొనుగోలు దారులకు భారీ డిస్కౌంట్‌లు అందిస్తున్నట్లు ప్లిప్‌కార్ట్ వెల్లడించింది. ఎలక్ట్రానిక్ వస్తువులపై 80 శాతం వరకు తగ్గింపులు, టీవీలపై 75 శాతం డిస్కౌంట్ సొంతం చేసుకోవచ్చని చెప్పింది. ఫ్యాషన్ వస్తువులపై 60 నుంచి 80 శాతం, ఏసీలు 55 శాతం తగ్గింపు ధరతో ప్రారంభమవుతాయని స్పష్టం చేసింది.
అంతేకాదు 4కే అల్ట్రా హెచ్‌డీ టీవీలు రూ.17,249 నుంచి ప్రారంభం కానుండగా..వాషింగ్ మిషన్లు రూ.6,990 నుంచి ప్రారంభమవుతాయని వెల్లడించింది. ఈ సేల్‌లో టీవీల ప్రారంభ ధర రూ.7199 కాగా, బ్యూటీ, ఫుడ్, టాయ్స్,హోం, కిచెన్ వస్తువుల ప్రారంభ ధరలు రూ.99గా ఉన్నాయని ఫ్లిప్ కార్ట్ పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment