
కోల్‌కతా : ఆన్‌లైన్‌లో శాంసంగ్ మొబైల్ ఫోన్ ఆర్డర్ చేస్తే రెండు రాళ్లను ప్యాక్ చేసి కస్టమర్‌కు పంపిన ఘటన వెలుగుచూసింది. పశ్చిమ బెంగాల్‌లోని మాల్దా ఎంపీకి ఈ చేదు అనుభవం ఎదురైంది. బీజేపీ ఎంపీ ఖగెన్ ముర్ము ఆన్‌లైన్‌లో వారం కిందట శాంసంగ్ మొబైల్ ఫోన్‌కు ఆర్డర్ చేశారు. తీరా తన ఇంటికి వచ్చిన పార్సిల్‌ను ఓపెన్ చేయగా శాంసంగ్‌కు బదులు రెడ్‌మి ఫోన్ బాక్స్ కనిపించింది. బాక్స్‌ను తెరిచిచూడగా రెండు మార్బుల్ రాళ్లు ఉండటంతో షాక్ అవడం ఎంపీ వంతయింది. ఈకామర్స్ సంస్థ చేసిన నిర్వాకంపై ఎంపీ స్ధానిక ఇంగ్లీష్‌బజార్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఎంపీ ఫిర్యాదుపై తక్షణమే చర్యలు చేపడతామని మాల్ధా పోలీస్ చీఫ్ అలోక్ రజోరియా తెలిపారు. మరోవైపు తనకు ఎదురైన అనుభవాన్ని వినియోగదారుల వ్యవహారాల మంత్రి దృష్టికి తీసుకువెళతానని ఎంపీ చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment