పెద్ద నోట్ల రద్దుతో ప్రజలు నగదు కోసం ఇబ్బందులు పడుతుంటే అనంతపురంలో సైబర్ నేరం వెలుగులోకి వచ్చింది.
అనంతపురం : పెద్ద నోట్ల రద్దుతో ప్రజలు నగదు కోసం ఇబ్బందులు పడుతుంటే అనంతపురంలో సైబర్ నేరం వెలుగులోకి వచ్చింది.
వివరాల్లోకి వెళితే...పట్టణానికి చెందిన ఇషాక్ బాషా అనే వ్యక్తి ఆంధ్రాబ్యాంక్ ఏటీఎం కార్డు నుంచి అతనికి తెలియకుండా రూ.66 వేల ఆన్లైన్ షాపింగ్ జరిగింది. దీనిపై బ్యాంక్ అధికారులకు సమాచారం ఇచ్చినా పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ఆన్లైన్ మోసాలపై తమకు అవగాహన లేదన్నట్టుగా బ్యాంక్ మేనేజర్ వ్యవహరిస్తున్నారని బాధితుడు స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.