గూగుల్ గ్రేట్ షాపింగ్ ఫెస్టివల్
న్యూఢిల్లీ: గూగుల్ ఇండియా నిర్వహించే గ్రేట్ ఆన్‌లైన్ షాపింగ్ ఫెస్టివల్(జీఓఎస్‌ఎఫ్) వచ్చే నెల 10-12 తేదీల్లో జరగనున్నది. ఈ ఆన్‌లైన్ షాపింగ్ పెస్టివల్‌కు ప్రాధాన్యత భాగస్వామిగా ఆదిత్య బిర్లా మనీ మైయూనివర్శ్ వ్యవహరిస్తుంది. విదేశాల్లో సైబర్ మండే పేరుతో ఆన్‌లైన్ షాపింగ్ ఫెస్టివల్ జరుగుతుందని, దీనికి భారత వెర్షన్‌గా జీఓఎస్‌ఎఫ్‌ను నిర్వహిస్తున్నామని గూగుల్ ఇండియా వైస్ ప్రెసిడెంట్, ఎండీ రాజన్ ఆనందన్ పేర్కొన్నారు.
ఈ 72 గంటల షాపింగ్ ఫెస్టివల్‌లో 450కు పైగా కంపెనీలు పాల్గొంటున్నాయని, భారీ డిస్కౌంట్లు ఉండనున్నాయని వివరించింది. రూ.299 స్పెషల్ సెక్షన్‌ను అందిస్తున్నామని, దీంట్లో భారీ డిస్కౌంట్లకు వస్తువులను అందిస్తామని, రవాణా చార్జీలు ఉచితమని, వస్తువు అందిన తర్వాతనే నగదు చెల్లించే ఫీచర్ ఉందని వివరించారు. ఈ నెల 25 నుంచి వచ్చే నెల 8 వరకూ ప్రత్యేకమైన పోటీని నిర్వహిస్తున్నామని, ఈ పోటీలో గెలుపొందిన వారు 14 నిమిషాల పాటు ఉచితంగా (రూ.2.5 లక్షల విలువైనవి) షాపింగ్ చేసుకోవచ్చని పేర్కొన్నారు.