గూగుల్ షాపింగ్ ఫెస్టివల్‌లో టాటా ఫ్లాట్లు | Google and Tata Housing ink 'Great Online Shopping Festival' deal for online booking of flats | Sakshi
Sakshi News home page

గూగుల్ షాపింగ్ ఫెస్టివల్‌లో టాటా ఫ్లాట్లు

Published Wed, Dec 11 2013 4:51 AM | Last Updated on Sat, Sep 2 2017 1:27 AM

గూగుల్ షాపింగ్ ఫెస్టివల్‌లో టాటా ఫ్లాట్లు

గూగుల్ షాపింగ్ ఫెస్టివల్‌లో టాటా ఫ్లాట్లు

న్యూఢిల్లీ: టాటా హౌసింగ్ ఫ్లాట్‌లను ఆన్‌లైన్‌లో బుక్ చేసుకోవచ్చు. నేటి(బుధవారం) నుంచి మూడు రోజుల పాటు ఇంటర్నెట్ సెర్చింజన్, గూగుల్ ఆధ్వర్యంలో జరిగే గ్రేట్ ఆన్‌లై న్ షాపింగ్ ఫెస్టివల్‌లో భాగంగా తమ ఫ్లాట్‌లను ఆన్‌లైన్‌లో బుక్ చేసుకోవచ్చని టాటా గ్రూప్‌కు చెందిన టాటా హౌసింగ్ తెలిపింది. ఈ మేరకు గూగుల్‌తో తమ అనుబంధ సంస్థ టాటా వాల్యూ హోమ్స్(టీవీహెచ్‌ఎల్)ఒక ఒప్పందం కుదుర్చుకుందని టాటా హౌసింగ్ తెలిపింది.  పుణే, బెంగళూరు, అహ్మదాబాద్‌ల్లోని టీవీహెచ్‌ఎల్ ప్రాజెక్టుల్లోని గృహాలను రూ.20,000 చెల్లించి బుక్ చేసుకోవచ్చని వివరించింది. 45 రోజుల్లో 30% సొమ్మును, మిగిలిన 70 శాతం మొత్తాన్ని అపార్ట్‌మెంట్ అప్పగించేటప్పుడు చెల్లించాల్సి ఉంటుందని పేర్కొంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement