Tata Housing
-
టాటా హౌసింగ్ ఆన్లైన్ ఎగ్జిబిషన్
న్యూఢిల్లీ : రియల్టీ సంస్థ టాటా హౌసింగ్ ఆన్లైన్ ఎగ్జిబిషన్ నిర్వహిస్తోంది. ఇది జూలై 13-15 మద్య జరగనుంది. సంస్థ ఈ ఎగ్జిబిషన్ ద్వారా ఏడు పట్టణాల్లోని 11 ప్రాజెక్టులకు సంబంధించిన దాదాపు 200 ఫ్లాట్లను విక్రయించాలని భావిస్తోంది. వీటి ధరలు రూ.13-50 లక్షల శ్రేణిలో ఉన్నాయి. ఈ ఎగ్జిబిషన్లో పాల్గొనే ఇంటి కొనుగోలుదారులు ఎటువంటి అదనపు చెల్లింపులు లేకుండానే వారు కొనుగోలు చేసిన ఇంటితోపాటు మరో రూమ్‌ను అదనంగా పొందవచ్చు. గత ఏడాదిన్నర కాలంలో టాటా హౌసింగ్ ఆన్లైన్ ద్వారా దాదాపు 1,500 ఫ్లాట్లను విక్రయించింది. సంస్థ ఆన్లైన్ ఫ్లాట్ల విక్రయాలు 2013 డిసెంబర్లో ప్రారంభ మయ్యాయి. -
‘ప్రీ ఫ్యాబ్రికేటెడ్’తో రెండు పడక గదుల ఇళ్లు!
నిర్మాణ వ్యయం తగ్గింపుపై ప్రభుత్వం కసరత్తు తాజాగా ముందుకు వచ్చిన ముంబై కంపెనీ ఇప్పటికే టాటా హౌసింగ్ డెవలప్మెంట్ కంపెనీతో చర్చలు సాక్షి, హైదరాబాద్: రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణానికి అనుకున్నదానికంటే అధికంగా వ్యయం అయ్యే పరిస్థితులు ఉండడంతో రాష్ట్ర ప్రభుత్వం ఆ ఇళ్ల నిర్మాణ వ్యయాన్ని తగ్గించుకోవడానికి మార్గాలను అన్వేషిస్తోంది. ఎన్నికల సమయంలో టీఆర్ఎస్ దీనిపై హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. మొదట మూడున్నర లక్షలు అనుకున్న వ్యయం ఇప్పుడు రూ. 5 లక్షలకు మించుతుండడంతో వ్యయాన్ని తగ్గించునే క్రమంలో ప్రీఫ్యాబ్రికేటెడ్ పరిజ్ఞానాన్ని ఆశ్రయించాలని నిర్ణయానికి వచ్చింది. ఇందులో భాగంగా శనివారం ముంబైకి చెందిన ఓ సంస్థ ప్రతినిధులు గృహనిర్మాణశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డితో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మంత్రి రెండు రకాల విస్తీర్ణంలో కొలతలు చెప్పి ఆ మేరకు ఇళ్ల నిర్మాణానికి అయ్యే వ్యయాన్ని చెప్పాల్సిందిగా కోరగా, మరో నాలుగైదు రోజుల్లో వివరాలు అందజేస్తామని కంపెనీ ప్రతినిధులు చెప్పినట్లు తెలిసింది. ఇదిలా ఉండగా రెండు పడక గదుల ఇళ్లను రెండు రకాల విస్తీర్ణాల్లో నిర్మించాలని ప్రభుత్వం ప్రాథమికంగా నిర్ణయించింది. పట్టణ ప్రాంతాల్లో 515 చదరపు అడుగుల నుంచి 520 చదరపు అడుగుల మధ్య, గ్రామీణ ప్రాంతాల్లో 480 నుంచి 485 చదరపు అడుగుల మధ్య నిర్మించాలని భావిస్తోంది. దీనిపై శనివారం మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి గృహనిర్మాణ శాఖ ఉన్నతాధికారులతో సమీక్ష జరిపారు. ప్రీ ఫ్యాబ్రికేటెడ్ పరిజ్ఞానంతో ఈ పరిమాణంలో ఇళ్లను నిర్మిస్తే రూ.4 లక్షల నుంచి రూ.4.10 లక్షల ఖర్చవుతుందని అధికారులు భావిస్తున్నారు. అయితే ఇతరత్రా కొన్ని వ్యయాలను మాత్రం లబ్ధిదారులు భరించాల్సి ఉంటుందని సూచించినట్టు సమాచారం. ఇదిలా ఉండగా ఇటీవల ముంబై పర్యటనకు వెళ్లిన మంత్రి తారకరామారావు కూడా ప్రీ ఫ్యాబ్రికేటెడ్ పరిజ్ఞానంతో తక్కువ వ్యయంతో ఇళ్లు నిర్మించిన అనుభవం ఉన్న టాటా హౌసింగ్ డెవలప్మెంట్ కంపెనీ ప్రతినిధులతో చర్చించారు. వచ్చే ఐదేళ్లలో దాదాపు 10 లక్షల ఇళ్లను నిర్మించాల్సి ఉండడంతో ఆ సంస్థ కూడా ఉత్సాహం చూపుతోంది. త్వరలో ఈ సంస్థ ప్రతినిధులు ముఖ్యమంత్రితో భేటీ కానున్నట్టు సమాచారం. -
గూగుల్ షాపింగ్ ఫెస్టివల్లో టాటా ఫ్లాట్లు
న్యూఢిల్లీ: టాటా హౌసింగ్ ఫ్లాట్లను ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు. నేటి(బుధవారం) నుంచి మూడు రోజుల పాటు ఇంటర్నెట్ సెర్చింజన్, గూగుల్ ఆధ్వర్యంలో జరిగే గ్రేట్ ఆన్లై న్ షాపింగ్ ఫెస్టివల్లో భాగంగా తమ ఫ్లాట్లను ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చని టాటా గ్రూప్‌కు చెందిన టాటా హౌసింగ్ తెలిపింది. ఈ మేరకు గూగుల్‌తో తమ అనుబంధ సంస్థ టాటా వాల్యూ హోమ్స్(టీవీహెచ్‌ఎల్)ఒక ఒప్పందం కుదుర్చుకుందని టాటా హౌసింగ్ తెలిపింది. పుణే, బెంగళూరు, అహ్మదాబాద్‌ల్లోని టీవీహెచ్‌ఎల్ ప్రాజెక్టుల్లోని గృహాలను రూ.20,000 చెల్లించి బుక్ చేసుకోవచ్చని వివరించింది. 45 రోజుల్లో 30% సొమ్మును, మిగిలిన 70 శాతం మొత్తాన్ని అపార్ట్మెంట్ అప్పగించేటప్పుడు చెల్లించాల్సి ఉంటుందని పేర్కొంది.