
త్వరలో ఫేస్‌బుక్‌లోనూ ఆన్‌లైన్ షాపింగ్!
శాన్‌ఫ్రాన్సిస్కో: ఇప్పటి వరకు చాటింగ్, ఉచిత కాల్స్‌కే పరిమితమైన ఫేస్‌బుక్..తర్వలోనే మరో కొత్త సేవను అందుబాటులో తేనుంది. ఆన్‌లైన్‌లో వస్తువులు కొనేలా ఒక కొత్త ఆప్షన్ ప్రవేశపెట్టనుంది. ఈ మేరకు ఫేస్‌బుక్ మెసేంజర్ ఉపాధ్యక్షుడు డేవిడ్ మార్కస్ గురువారం వెల్లడించారు.
ఈ సర్వీసుకు ‘ఎం’ అని నామకరణం చేశామని తెలిపారు. ‘ఫేస్‌బుక్ మేసేంజర్‌లో ‘ఎం’ సేవలు త్వరలోనే ప్రారంభిస్తున్నాం. మీ ప్రియమైన వారికి బహుమతులు కొనుగోలు చేయడానికి మా వంతు సాయం అందిస్తాం. రెస్టారెంట్స్‌లో టేబుల్ బుకింగ్, ప్రయాణాలకు ముందుగానే టికెట్స్ బుకింగ్ చేసుకోవచ్చు. ప్రస్తుతం ఎం ప్రాజెక్టు ప్రాథమిక దశలోనే ఉంది. త్వరలోనే పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసి అందుబాటులోకి తెస్తాం’ అని డేవిడ్ తెలిపారు. ఫేస్‌బుక్ మెసేంజర్‌ను ప్రపంచ వ్యాప్తంగా 70 కోట్ల మంది వినియోగిస్తున్నారు.