
ఆన్‌లైన్ షాపింగ్ కోసం ఒక అడ్డా!
ఆన్‌లైన్ షాపింగ్‌కు అవకాశం ఇస్తున్న వెబ్‌సైట్‌లు ఎన్నో ఉంటాయి... వాటిలో పాపులర్ అయినవి కొన్ని పాపులర్ కాని, మనకు తెలియనివి కొన్ని.
కూల్ సైట్
ఆన్‌లైన్ షాపింగ్‌కు అవకాశం ఇస్తున్న వెబ్‌సైట్‌లు ఎన్నో ఉంటాయి... వాటిలో పాపులర్ అయినవి కొన్ని పాపులర్ కాని, మనకు తెలియనివి కొన్ని. మరి అన్నింటినీ తెలుసుకొని, గుర్తు పెట్టుకొని, ఆ సైట్లను క్లిక్ చేసి మనకు కావాల్సిన ప్రోడక్ట్‌ను వెదుక్కోవడం కొంచెం కష్టమైన పనే! ఈ కష్టాన్ని లేకుండా చేయడానికే ఉంది క్లిప్‌డాట్‌ఇన్ (klip.in). ఆన్‌లైన్‌షాపింగ్‌కు సంబంధించి అన్ని వెబ్‌సైట్‌లనూ ఒక చోటికి కూర్చిపెట్టింది ఈ సైట్. దాదాపు అన్ని ఇ-కామర్స్ వెబ్‌సైట్‌లను ఇది ఒకచోటికి చేర్చింది. వాటన్నింటినీ హోమ్‌పేజ్‌లో డిస్‌ప్లే చేసింది. ఎంచక్కా ఈ సైట్‌లోకి లాగిన్ అయితే చాలు... వాటన్నింటిపైనా ఒక లుక్ వేయవచ్చు.
ఆన్‌లైన్‌షాపింగ్ చేసేయవచ్చు. దీని వల్ల చాలా సౌకర్యం ఉంటుంది. ఒక వెబ్‌సైట్‌నుంచి టక్కున మరో వెబ్‌సైట్‌లోకి మారడానికి... పక్కపక్కవిండోల్లో ఒక్కోసైట్‌ను ఓపెన్ చేసుకొని పోల్చిచూసుకోవడానికి క్లిప్‌డాట్‌ఇన్ అవకాశం ఇస్తుంది. కావాల్సిన క్యాటగిరీ సైట్‌లను ఎంపిక చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. వస్త్రాలు, గృహవసరాలకు తగినట్టుగా సైట్‌లను ఎంచుకోవచ్చు. మరి ఆన్‌లైన్‌షాపింగ్‌లో కొత్త అనుభవాన్ని పొందాలంటే ఒకసారి క్లిప్‌డాట్‌ఇన్‌ను క్లిక్ చేసేయడమే!
ఫ్లికర్ నుంచి అఫీషియల్ ఐపాడ్ ఆప్
భలే ఆప్స్
నెటిజన్లు ముఖ్యంగా బ్లాగర్లు విస్తృతంగా ఉపయోగించే ఫ్లికర్ ఇమేజ్ హోస్టింగ్, వీడియో షేరింగ్ వెబ్‌సైట్ నుంచి ఎట్టకేలకు అధికారిక ఐపాడ్ అప్లికేషన్ కూడా విడుదలైంది. ఐవోఎస్, ఆండ్రాయిడ్, విండోస్ ఫోన్ మొబైల్ ఫోన్లకు అధికారిక ఆప్‌లను ఇదివరకే తీసుకొచ్చిన ఫ్లికర్ తాజాగా ఐపాడ్‌కూ ఆప్‌ను విడుదల చేసింది. సింపుల్ డిజైన్‌తో, ఎడమవైపు చక్కని ఐకాన్ బార్‌తో ఫోటోల బ్రౌజింగ్‌కు ఎక్కువ స్థలం ఉండేలా ఈ ఆప్ రూపొందింది. ఫ్లికర్ అకౌంట్ల నుంచి లేదా ఫ్లికర్ 1టీబీ స్టోరేజీ నుంచి సైతం ఏ ఫొటోనైనా నేరుగా బ్రౌజ్ చేసుకునేందుకు దీనితో వీలు కావడం విశేషం. ట్యాబ్లెట్ ఫొటోగ్రఫీ పెద్దగా ఆసక్తికరం కాకపోయినా.. నేరుగా ఫొటోలు క్లిక్ చేసి ఫ్లికర్ అకౌంట్‌లో సేవ్ చేసుకునేందుకు వీలయ్యేలా కెమెరా ఇంటర్‌ఫేస్ కూడా దీనిలో ఉంది.
తాజా ఖగోళ సమాచారానికి నాసా ఆప్
భలే ఆప్స్
అమెరికా అంతరిక్ష సంస్థ నాసా విడుదల చేసే తాజా చిత్రాలు, వీడియోలు, వార్తల గురించి తెలుసుకునేందుకు, అంతరిక్షానికి సంబంధించిన కొత్త సంగతులు, ఉపగ్రహాలు, అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎస్‌ఎస్) వివరాలు, పరిశోధనల గురించి తెలుసుకునేందుకు ఉపయోగపడే వినూత్న మొబైల్ అప్లికేషన్ ఇది. ఈ ఆప్‌తో ఇంకా... నాసా మిషన్ల తాజా సమాచారం, ప్రయోగాలు, నాసా టీవీ లైవ్, థర్డ్ రాక్ ఇంటర్‌నెట్ రేడియో వంటి ఎన్నో సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి. నాసా తాజా వార్తలు, ఫేస్‌బుక్ పోస్టులు, ట్వీట్లు కూడా ఈ ఆప్ ద్వారా అందుతాయి. ఆన్ డిమాండ్ పద్ధతిలో అవసరమైన వీడియోలనూ చూసేందుకు అవకాశం ఉంది. ఐవోఎస్, ఆండ్రాయిడ్ డివైస్‌లపై పనిచేసే ఈ ఆప్ పూర్తిగా ఉచితం.