‘టాటా కంపెనీ ..ఇలా చేస్తుందనుకోలేదు’.. తస్మాత్‌ జాగ్రత్త! | Tata Cliq Luxury Defrauding Customers | Sakshi
Sakshi News home page

‘టాటా కంపెనీ ..ఇలా చేస్తుందనుకోలేదు’.. తస్మాత్‌ జాగ్రత్త!

Published Sun, Mar 10 2024 7:43 AM | Last Updated on Sun, Mar 10 2024 11:12 AM

Tata Cliq Luxury Defrauding Customers - Sakshi

ఇటీవల కాలంలో ఆన్‌లైన్‌ షాపింగ్‌తో కొనుగోలు దారులు పడుతున్న ఇబ్బందులు అన్నీ ఇన్ని కావు. ల్యాప్‌ ట్యాప్‌ ఆర్డర్‌ పెడితే ఇటు రాయి పంపండం. ఖరీదైన షూ కొనుగోలు చేస్తే చెప్పులు డెలివరీ చేయడం లాంటి ఘటనలు నిత్యం ఎక్కడో ఒక​ చోట జరుగుతూనే ఉన్నాయి. దీంతో చేసేది లేక కస్టమర్లు సదరు ఈకామర్స్‌ కంపెనీని డబ్బుల్ని రిఫండ్‌ చేయమని కోరడం, లేదంటే ప్రొడక్ట్‌ ఎచ్ఛేంజ్‌ చేయమని కోరుతుంటుంటాం. 
 
ఓ యూజర్‌ టాటా క్లిక్‌ లగ్జరీ కంపెనీ నుంచి స్నీకర్లను ఆర్డర్‌ పెడితే.. చెప్పుల్ని అందుకున్నాడు. దీంతో తాను ఖరీదైన షూ ఆర్డర్‌ పెడితే చెప్పులు ఎలా పంపిస్తారు? అని ప్రశ్నించాడు. తాను చెల్లించిన డబ్బుల్ని రిఫండ్‌ చేయమని కోరాడు. అందుకు టాటాక్లిక్‌ లగ్జరీ ప్రతినిధులు చేసిన తప్పుకు చింతిస్తున్నాం. కానీ డబ్బుల్ని రిఫండ్‌ చేయమని స్పష్టం చేసింది. దీంతో చేసేది లేక బాధితుడు ఎక్స్‌. కామ్‌లో తనకు ఎదురైన చేదు అనుభవాన్ని షేర్‌ చేశారు. పైగా కంపెనీ గురించి సోషల్‌ మీడియాలో బహిరంగ వ్యాఖ్యలు చేయకూడదంటూ చేసిన ట్వీట్‌లు ఇప్పుడు వైరల్‌గా మారాయి.

  

ఖరీదైన షూ బదులు చెప్పులు
వినియోగదారుడు టాటా క్లిక్‌ లగ్జరీ నుంచి రూ.22,999 ఖరీదైన ‘న్యూ బ్యాలెన్స్ 9060 గ్రే & బ్లూ స్నీకర్స్’ను కొనుగోలు చేసినట్లు తెలిపారు. అయితే అతను మాత్రం ఊహించని విధంగా స్టైలిష్ షూస్‌ బదులు సాధారణ స్లిప్పర్‌లను అందుకున్నాడు.ఎక్ఛేంజ్‌ చేయమని ఫిర్యాదు చేసినప్పటికీ టాటా క్లిక్‌ లగ్జరీ రిఫండ్‌ చేసేందుకు ఒప్పుకోలేదని, టాటా కంపెనీ ఇలా చేస్తుందను కోలేదని వాపోయాడు.   

తస్మాత్‌ జాగ్రత్త
‘టాటా క్లిక్ లగ్జరీ కస్టమర్‌లను మోసం చేస్తోంది. నేను నా డబ్బును పోగొట్టుకున్నాను. దయచేసి మీరు ఇలాంటి స్కామ్‌ల బారిన పడకుండా మిమ్మల్ని మీరు రక్షించుకోండి. నేను కొత్త బ్యాలెన్స్ స్నీకర్లను ఆర్డర్ చేసాను. వారు ఒక జత చెప్పులు పంపారు. నాణ్యతలో రాజీపడమని, కావాలంటే తనిఖీ చేయమని చెప్పింది. డబ్బు రిఫండ్‌ చేసేందుకు నిరాకరించారు.’ అని వినియోగదారు మైక్రోబ్లాగింగ్ సైట్ ఎక్స్‌.కామ్‌లో పోస్ట్‌ చేశారు.   

దీంతో ‘మా ఉత్పత్తులు, సేవల పట్ల అసంతృప్తిగా ఉండడం మమ్మల్ని బాధిస్తుంది. మా వల్ల మీకు కలిగిన అసౌకర్యానికి క్షమాపణలు కోరుతున్నాం. ఆర్డర్‌ వివరాల్ని పంపినట్లైతే త్వరలోనే మీకు న్యాయం  చేస్తామనంటూ టాటా క్లిక్‌ లగర్జీ అధికారికంగా తెలిపింది.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement