Tata CLiQ
-
క్విక్ కామర్స్‌లోకి టాటా గ్రూప్?
టాటా గ్రూప్ క్విక్ కామర్స్ రంగంలో వేగంగా విస్తరిస్తోంది. ఫ్లిప్‌కార్ట్, రిలయన్స్ ఇండస్ట్రీస్ వంటి కంపెనీలకు ధీటుగా టాటా గ్రూప్ ‘న్యూఫ్లాష్’ పేరుతో ఈ సేవలు ప్రారంభించనుంది. ఈ సర్వీసును ముందుగా మెట్రో నగరాల్లో అందించనున్నట్లు ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న వ్యక్తులు తెలిపారు. ఇప్పటికే టాటా గ్రూప్ ఆధ్వర్యంలోని బిగ్‌బాస్కెట్ ద్వారా వినియోగదారులకు ఈ-కామర్స్ సేవలు అందిస్తోంది.క్విక్ కామర్స్ బిజినెస్‌కు వినియోగదారుల నుంచి ఆదరణ పెరుగుతోంది. దాంతో ప్రముఖ కంపెనీలు ఈ రంగంలో సేవలందించేందుకు పూనుకుంటున్నాయి. ఇప్పటికే జొమాటో యాజమాన్యంలోని బ్లింకిట్, స్విగ్గీ ఇన్‌స్టామార్ట్, జెప్టో ఈ క్విక్ కామర్స్ సేవలందిస్తున్నాయి. మొత్తంగా ఈ కంపెనీలు 85% మార్కెట్ వాటా కలిగి ఉన్నాయి. ఫ్లిప్‌కార్ట్ మినిట్స్ పేరుతో ఈ సేవలందిస్తోంది. రిలయన్స్ జియోమార్ట్ ఎక్స్‌ప్రెస్ పేరుతో ముంబయిలో ఈ సర్వీసు అందుబాటులో ఉంచింది. ఇటీవల జరిగిన ఓ సర్వే ప్రకారం రిలయన్స్ రిటైల్, డీమార్ట్, స్పెన్సర్స్ వంటి రిటైల్ బిజినెస్ కంటే క్విక్ కామర్స్ కంపెనీలు వేగంగా వృద్ధి చెందుతున్నాయి. దాంతో ఇప్పటికే కొన్ని రిటైల్ సర్వీసులు అందించే కంపెనీలు ఈ బిజినెస్‌లోకి ప్రవేశిస్తున్నాయి. టాటా గ్రూప్ కూడా వినియోగదారులను పెంచుకుని ఈ విభాగంలో సేవలందించాలని భావిస్తోంది.ఇదీ చదవండి: పన్ను ఎగవేతను పట్టించే చట్టాలివే..టాటా గ్రూప్ బిగ్‌బాస్కెట్ ద్వారా ఈ-కామర్స్, క్రోమా ద్వారా ఎలక్ట్రానిక్స్, టాటా క్లిక్ ద్వారా ఆన్లైన్ షాపింగ్ సేవలు, టాటా 1ఎంజీ ద్వారా ఫార్మసీ సేవలు అందిస్తోంది. ఇప్పటికే ఈ వ్యాపారాల్లో సంస్థకు వినియోగదారులు ఉండడంతో కొత్తగా రాబోయే టాటా న్యూ ఫ్లాష్ బిజినెస్‌కు కూడా వీరి సహకారం ఉంటుందని కంపెనీ భావిస్తోంది. -
‘టాటా కంపెనీ ..ఇలా చేస్తుందనుకోలేదు’.. తస్మాత్ జాగ్రత్త!
ఇటీవల కాలంలో ఆన్లైన్ షాపింగ్‌తో కొనుగోలు దారులు పడుతున్న ఇబ్బందులు అన్నీ ఇన్ని కావు. ల్యాప్ ట్యాప్ ఆర్డర్ పెడితే ఇటు రాయి పంపండం. ఖరీదైన షూ కొనుగోలు చేస్తే చెప్పులు డెలివరీ చేయడం లాంటి ఘటనలు నిత్యం ఎక్కడో ఒక చోట జరుగుతూనే ఉన్నాయి. దీంతో చేసేది లేక కస్టమర్లు సదరు ఈకామర్స్ కంపెనీని డబ్బుల్ని రిఫండ్ చేయమని కోరడం, లేదంటే ప్రొడక్ట్ ఎచ్ఛేంజ్ చేయమని కోరుతుంటుంటాం. ఓ యూజర్ టాటా క్లిక్ లగ్జరీ కంపెనీ నుంచి స్నీకర్లను ఆర్డర్ పెడితే.. చెప్పుల్ని అందుకున్నాడు. దీంతో తాను ఖరీదైన షూ ఆర్డర్ పెడితే చెప్పులు ఎలా పంపిస్తారు? అని ప్రశ్నించాడు. తాను చెల్లించిన డబ్బుల్ని రిఫండ్ చేయమని కోరాడు. అందుకు టాటాక్లిక్ లగ్జరీ ప్రతినిధులు చేసిన తప్పుకు చింతిస్తున్నాం. కానీ డబ్బుల్ని రిఫండ్ చేయమని స్పష్టం చేసింది. దీంతో చేసేది లేక బాధితుడు ఎక్స్. కామ్‌లో తనకు ఎదురైన చేదు అనుభవాన్ని షేర్ చేశారు. పైగా కంపెనీ గురించి సోషల్ మీడియాలో బహిరంగ వ్యాఖ్యలు చేయకూడదంటూ చేసిన ట్వీట్లు ఇప్పుడు వైరల్‌గా మారాయి. Tata Cliq Luxury is out here defrauding customers of their hard-earned money. I've lost my money, but pls save yourselves from being scammed. I ordered New Balance sneakers, they sent a pair of slippers, now refusing to refund money saying quality check failed @TATACLiQLuxury pic.twitter.com/6ktajmB8r7 — Ripper (@Ace_Of_Pace) March 7, 2024 ఖరీదైన షూ బదులు చెప్పులు వినియోగదారుడు టాటా క్లిక్ లగ్జరీ నుంచి రూ.22,999 ఖరీదైన ‘న్యూ బ్యాలెన్స్ 9060 గ్రే & బ్లూ స్నీకర్స్’ను కొనుగోలు చేసినట్లు తెలిపారు. అయితే అతను మాత్రం ఊహించని విధంగా స్టైలిష్ షూస్ బదులు సాధారణ స్లిప్పర్లను అందుకున్నాడు.ఎక్ఛేంజ్ చేయమని ఫిర్యాదు చేసినప్పటికీ టాటా క్లిక్ లగ్జరీ రిఫండ్ చేసేందుకు ఒప్పుకోలేదని, టాటా కంపెనీ ఇలా చేస్తుందను కోలేదని వాపోయాడు. తస్మాత్ జాగ్రత్త ‘టాటా క్లిక్ లగ్జరీ కస్టమర్లను మోసం చేస్తోంది. నేను నా డబ్బును పోగొట్టుకున్నాను. దయచేసి మీరు ఇలాంటి స్కామ్‌ల బారిన పడకుండా మిమ్మల్ని మీరు రక్షించుకోండి. నేను కొత్త బ్యాలెన్స్ స్నీకర్లను ఆర్డర్ చేసాను. వారు ఒక జత చెప్పులు పంపారు. నాణ్యతలో రాజీపడమని, కావాలంటే తనిఖీ చేయమని చెప్పింది. డబ్బు రిఫండ్ చేసేందుకు నిరాకరించారు.’ అని వినియోగదారు మైక్రోబ్లాగింగ్ సైట్ ఎక్స్.కామ్‌లో పోస్ట్ చేశారు. Your disappointment with our products and services hurts us the most, and we deeply apologize for the hassle it has caused you. We request you to share the order details via the below DM link, so we can check and provide further assistance. ^AB (1/2) — TATA CLiQ Luxury (@TATACLiQLuxury) March 7, 2024 దీంతో ‘మా ఉత్పత్తులు, సేవల పట్ల అసంతృప్తిగా ఉండడం మమ్మల్ని బాధిస్తుంది. మా వల్ల మీకు కలిగిన అసౌకర్యానికి క్షమాపణలు కోరుతున్నాం. ఆర్డర్ వివరాల్ని పంపినట్లైతే త్వరలోనే మీకు న్యాయం చేస్తామనంటూ టాటా క్లిక్ లగర్జీ అధికారికంగా తెలిపింది. -
మెటాలోకి మరో భారతీయుడు.. టాటాకు గుడ్‌బై చెప్పిన వికాస్
ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం మెటా ఇండియాలోని ఓ విభాగానికి హెడ్‌గా వికాస్ పురోహిత్‌ను నియమించింది. మెటా ఇండియా గ్లోబల్ బిజినెస్ గ్రూప్ డైరెక్టర్‌గా వికాస్‌ను ఎంపిక చేసినట్లు అధికారికంగా ప్రకటించింది. ఆయన స్ట్రాటజీ, డెలివరీ విభాగాలకు నాయకత్వం వహిస్తూ అడ్వటైజింగ్, ఏజెన్సీ పార్ట్నర్స్పై దృష్టిసారించనున్నారు. భారత్‌లోని దిగ్గజ కంపెనీల్లోని ఏజెన్సీ ఎకో సిస్టంపై వికాస్ పనిచేస్తారు. తద్వారా సంస్థ (మెటా) వ్యూహాల్ని అమలు చేస్తూ ఆయా కంపెనీల ఎదుగుదలకు దోహదపడుతూనే.. మెటాకు చెందిన అన్నీ చానల్స్ ద్వారా ఆదాయం పెంచనున్నారు. ఈ సందర్భంగా మెటా ప్రతినిధులు మాట్లాడుతూ.. వికాస్ మెటాలో జాయిన్ అవ్వడం సంతోషంగా ఉంది. మెటా ప్లాట్ ఫామ్ సాయంతో వ్యాపారాలు ప్రారంభించడం, ఇండియా ఎకానమీ వృద్ధికి పాటుపడతారనే అభిప్రాయం వ్యక్తం చేశారు. వికాస్ పురోహిత్ ఎవరు? వికాస్ పురోహిత్ బెంగళూరు అలుమినస్లో ఐఐటీ పూర్తి చేశారు. టాటా క్లిక్, అమెజాన్, రిలయన్స్ బ్రాండ్స్, ఆధిత్య బిర్లా గ్రూప్, టమ్మీ హిల్ ఫైగర్ వంటి సంస్థల్లో 20ఏళ్లకు పైగా సీనియర్ బిజినెస్,సేల్స్ అండ్ మార్కెటింగ్ విభాగాల్లో కీలకంగా వ్యవహరించారు. మెటాలో చేరకముందు టాటా క్లిక్ సీఈవో వికాస్ సేవలందించారు. ఆధిత్య బిర్లా గ్రూప్‌తో తన కెరియర్ను ప్రారంభించి ఆ తర్వాత హిల్ ఫైగర్, రిలయన్స్ రీటైల్ విభాగంలో హెడ్‌గా, అమెజాన్ ఫ్యాషన్‌లో సైతం పనిచేశారు. తాజాగా టాటా క్లిక్ సీఈవో పదవికి రాజీనామా చేసి మెటాలో చేరారు. చదవండి👉 రతన్ టాటా, అదానీ, పతంజలికి ముఖేష్ అంబానీ సవాల్! -
లగ్జరీ ఫుడ్ స్టోర్ వ్యాపారంలో అడుగుపెట్టిన టాటా గ్రూప్..!
న్యూఢిల్లీ: టాటా గ్రూప్ తాజాగా లగ్జరీ ఫుడ్ స్టోర్వైపు అడుగులు వేస్తోంది. ఇందుకు గ్రోసరీ ఆన్లైన్ ప్లాట్‌ఫామ్ బిగ్‌బాస్కెట్‌తో ప్రీమియర్ లగ్జరీ లైఫ్‌స్టైల్ ప్లాట్‌ఫామ్ టాటా క్లిక్ లగ్జరీ చేతులు కలిపింది. తద్వారా తొలుత ముంబైలో కొత్త లగ్జరీ గోర్మెట్ స్టోర్‌ను ఏర్పాటు చేయనుంది. టాటా గ్రూప్‌లోని ఈకామర్స్ సంస్థలు టాటా క్లిక్ లగ్జరీ, బిగ్‌బాస్కెట్ సంయుక్తంగా ఈ వివరాలను వెల్లడించాయి. టాటా క్లిక్ లగ్జరీ ప్లాట్‌ఫామ్ ద్వారా ఏర్పాటుకానున్న ఈ స్టోర్లను న్యూఢిల్లీ, బెంగళూరు తదితర మెట్రో నగరాలకు తదుపరి దశలో విస్తరించనున్నట్లు పేర్కొన్నాయి. దేశ, విదేశాలలో ప్రాచుర్యం పొందిన లగ్జరీ గోర్మెట్ బ్రాండ్లు, ఎంపిక చేసిన వివిధ ప్రొడక్టులు, ప్రత్యేక విభాగాలతో ఈ స్టోర్లను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపాయి. ప్రస్తుతం తృణధాన్యాలు, చాకొలెట్లు, బిస్కెట్లు, పానీయాలు, వంటనూనెలు, డ్రై ఫ్రూట్స్, సాస్‌లు, సూప్స్, నూడుల్స్ తదితర పలు ప్రొడక్టులతోపాటు.. ప్రీమియం, లగ్జరీ గోర్మెట్ బ్రాండ్లను ఆఫర్ చేయనున్నట్లు వివరించాయి. కాగా.. 2021 మే నెలలో బిగ్‌బాస్కెట్‌లో టాటా గ్రూప్ మెజారిటీ వాటాను సొంతం చేసుకోవడం తెలిసిందే. (చదవండి: చైనా మరో కీలక ప్రయోగం.. భూమి అంతం కానుందా?)