Meta Hires Former Tata CLiQ CEO Vikas Purohit In India - Sakshi
Sakshi News home page

మెటాలోకి మరో భారతీయుడు.. టాటాకు గుడ్‌బై చెప్పిన వికాస్‌

Published Mon, Jan 9 2023 3:40 PM | Last Updated on Mon, Jan 9 2023 5:07 PM

Meta Hires Former Tata Cliq Ceo Vikas Purohit In India - Sakshi

ప్రముఖ సోషల్‌ మీడియా దిగ్గజం మెటా ఇండియాలోని ఓ విభాగానికి హెడ్‌గా వికాస్‌ పురోహిత్‌ను నియమించింది. మెటా ఇండియా గ్లోబల్‌ బిజినెస్‌ గ్రూప్‌ డైరెక్టర్‌గా వికాస్‌ను ఎంపిక చేసినట్లు అధికారికంగా ప్రకటించింది. ఆయన స్ట్రాటజీ, డెలివరీ విభాగాలకు నాయకత్వం వహిస్తూ అడ్వటైజింగ్‌, ఏజెన్సీ పార్ట్‌నర్స్‌పై దృష్టిసారించనున్నారు. 

భారత్‌లోని దిగ్గజ కంపెనీల్లోని ఏజెన్సీ ఎకో సిస్టంపై వికాస్‌ పనిచేస్తారు. తద్వారా సంస్థ (మెటా) వ్యూహాల్ని అమలు చేస్తూ ఆయా కంపెనీల ఎదుగుదలకు దోహదపడుతూనే.. మెటాకు చెందిన అన్నీ చానల్స్‌ ద్వారా ఆదాయం పెంచనున్నారు. ఈ సందర్భంగా మెటా ప్రతినిధులు మాట్లాడుతూ.. వికాస్‌ మెటాలో జాయిన్‌ అవ్వడం సంతోషంగా ఉంది. మెటా ప్లాట్‌ ఫామ్‌ సాయంతో వ్యాపారాలు ప్రారంభించడం, ఇండియా ఎకానమీ వృద్ధికి పాటుపడతారనే అభిప్రాయం వ్యక్తం చేశారు. 

వికాస్‌ పురోహిత్‌ ఎవరు?
వికాస్‌ పురోహిత్‌ బెంగళూరు అలుమినస్‌లో ఐఐటీ పూర్తి చేశారు. టాటా క్లిక్‌, అమెజాన్‌, రిలయన్స్‌ బ్రాండ్స్‌, ఆధిత్య బిర్లా గ్రూప్‌, టమ్మీ హిల్‌ ఫైగర్‌ వంటి సంస్థల్లో 20ఏళ్లకు పైగా సీనియర్‌ బిజినెస్‌,సేల్స్‌ అండ్‌ మార్కెటింగ్‌ విభాగాల్లో కీలకంగా వ్యవహరించారు. 

మెటాలో చేరకముందు టాటా క్లిక్‌ సీఈవో వికాస్‌ సేవలందించారు. ఆధిత్య బిర్లా గ్రూప్‌తో తన కెరియర్‌ను ప్రారంభించి ఆ తర్వాత హిల్‌ ఫైగర్‌, రిలయన్స్‌ రీటైల్‌ విభాగంలో హెడ్‌గా, అమెజాన్‌ ఫ్యాషన్‌లో సైతం పనిచేశారు. తాజాగా టాటా క్లిక్‌ సీఈవో పదవికి రాజీనామా చేసి మెటాలో చేరారు. 

చదవండి👉 రతన్‌ టాటా, అదానీ, పతంజలికి ముఖేష్‌ అంబానీ సవాల్!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement