టాటా గ్రూప్ క్విక్ కామర్స్ రంగంలో వేగంగా విస్తరిస్తోంది. ఫ్లిప్‌కార్ట్, రిలయన్స్ ఇండస్ట్రీస్ వంటి కంపెనీలకు ధీటుగా టాటా గ్రూప్ ‘న్యూఫ్లాష్’ పేరుతో ఈ సేవలు ప్రారంభించనుంది. ఈ సర్వీసును ముందుగా మెట్రో నగరాల్లో అందించనున్నట్లు ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న వ్యక్తులు తెలిపారు. ఇప్పటికే టాటా గ్రూప్ ఆధ్వర్యంలోని బిగ్‌బాస్కెట్ ద్వారా వినియోగదారులకు ఈ-కామర్స్ సేవలు అందిస్తోంది.
క్విక్ కామర్స్ బిజినెస్‌కు వినియోగదారుల నుంచి ఆదరణ పెరుగుతోంది. దాంతో ప్రముఖ కంపెనీలు ఈ రంగంలో సేవలందించేందుకు పూనుకుంటున్నాయి. ఇప్పటికే జొమాటో యాజమాన్యంలోని బ్లింకిట్, స్విగ్గీ ఇన్‌స్టామార్ట్, జెప్టో ఈ క్విక్ కామర్స్ సేవలందిస్తున్నాయి. మొత్తంగా ఈ కంపెనీలు 85% మార్కెట్ వాటా కలిగి ఉన్నాయి. ఫ్లిప్‌కార్ట్ మినిట్స్ పేరుతో ఈ సేవలందిస్తోంది. రిలయన్స్ జియోమార్ట్ ఎక్స్‌ప్రెస్ పేరుతో ముంబయిలో ఈ సర్వీసు అందుబాటులో ఉంచింది. ఇటీవల జరిగిన ఓ సర్వే ప్రకారం రిలయన్స్ రిటైల్, డీమార్ట్, స్పెన్సర్స్ వంటి రిటైల్ బిజినెస్ కంటే క్విక్ కామర్స్ కంపెనీలు వేగంగా వృద్ధి చెందుతున్నాయి. దాంతో ఇప్పటికే కొన్ని రిటైల్ సర్వీసులు అందించే కంపెనీలు ఈ బిజినెస్‌లోకి ప్రవేశిస్తున్నాయి. టాటా గ్రూప్ కూడా వినియోగదారులను పెంచుకుని ఈ విభాగంలో సేవలందించాలని భావిస్తోంది.
ఇదీ చదవండి: పన్ను ఎగవేతను పట్టించే చట్టాలివే..
టాటా గ్రూప్ బిగ్‌బాస్కెట్ ద్వారా ఈ-కామర్స్, క్రోమా ద్వారా ఎలక్ట్రానిక్స్, టాటా క్లిక్ ద్వారా ఆన్‌లైన్ షాపింగ్ సేవలు, టాటా 1ఎంజీ ద్వారా ఫార్మసీ సేవలు అందిస్తోంది. ఇప్పటికే ఈ వ్యాపారాల్లో సంస్థకు వినియోగదారులు ఉండడంతో కొత్తగా రాబోయే టాటా న్యూ ఫ్లాష్ బిజినెస్‌కు కూడా వీరి సహకారం ఉంటుందని కంపెనీ భావిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment