రతన్‌ టాటాను చంపాలనుకున్నారట! | who wants to murder ratan tata | Sakshi
Sakshi News home page

రతన్‌ టాటాను చంపాలనుకున్నారట!

Published Thu, Oct 10 2024 10:52 AM | Last Updated on Thu, Oct 10 2024 11:42 AM

who wants to murder ratan tata

మంచి నడవడిక, అంకిత భావం, పోటీతత్వం, ధైర్యం.. వంటి లక్షణాలు రతన్‌ టాటాలో పుష్కలంగా ఉన్నాయి. అందుకేనేమో రతన్‌ టాటా పుట్టుకతోనే నాయకుడిగా అభివర్ణిస్తుంటారు. అలాంటి వ్యాపార దిగ్గజాన్ని ఓ గ్యాంగ్‌ స్టర్‌ చంపేందుకు ప్రయత్నించాడు. ఇంతకీ ఆ గ్యాంగ్‌ స్టర్‌ ఎవరు? ఎందుకు చంపాలని అనుకున్నాడు?

టాటా గ్రూప్ గౌరవ ఛైర్మన్‌గా రతన్‌ టాటా ఎన్నో సేవలందించారు. గతంలో తాను సామాజిక మధ్యమంలో పంచుకున్న వివరాల ప్రకారం..కెరియర్‌ ప్రారంభంలో తనని ఓ ప్రమాదకరమైన గ్యాంగ్‌స్టర్‌ బెదిరించాడని, వేరే వాళ్లతో చేసుకున్న ఒప్పందంలో భాగంగా తనని చంపేందుకు కుట్ర​కు పాల్పడ్డారని అన్నారు. అప్పట్లో టెల్కోగా పిలవబడే టాటా మోటార్స్‌లో లేబర్ ఎన్నికలు జరిగాయి. అందులో టాటా గ్రూప్‌నకు వ్యతిరేకంగా, ఓ యూనియన్‌ను నియంత్రించేందుకు సదరు గ్యాంగ్‌ స్టర్‌ ప్రయత్నించాడు. అల్లరిమూకలతో టాటా మోట్సార్‌లో దాడులకు తెగపడ్డాడు. రతన్‌ టాటా అందుకు భిన్నంగా సదరు గ్యాంగ్‌ స్టర్‌ను బుజ్జగించి శాంతి యుతంగా చర్చలకు పిలవాలని కార్మికులను, తోటి సహచరులను కోరారు. కానీ గ్యాంగ్‌ స్టర్‌ మరోలా ఆలోచించాడు. టాటా మోటార్స్ ప్లాంట్‌లోని కార్మికుల్ని బెదిరించిన గ్యాంగ్‌స్టర్‌ ముఠా.. కత్తులతో దాడికి దిగింది. హెచ్చరికలు జారీ చేసేందుకు ప్లాంట్‌లోని అధికారులను కత్తులతో పొడిచి భయాందోళనకు గురి చేసింది.  

తలవంచని నైజం

లేబర్‌ ఎన్నికలు సజావుగా జరగకుండా ఉండేందుకు గ్యాంగ్‌స్టర్ నిరంతరం బెదిరింపులు పాల్పడ్డాడు. ఆ బెదిరింపులకు రతన్ టాటా ఎక్కడా తలవంచలేదు. గ్యాంగ్‌స్టర్ సమ్మెకు పిలుపునివ్వడంతో..దాడులకు బయపడి కార్మికులు పనిచేయడమే మానేశారు. దీంతో, కార్మికులను ఆదుకునేందుకు రతన్ టాటా రోజుల తరబడి ప్లాంట్‌లోనే మకాం వేసి రోజూవారి పనులు పూర్తి చేశారు. అలా చివరికి రతన్‌ టాటా పట్టుదల ముందు  గ్యాంగ్‌ స్టర్‌ ఓడిపోయాడు. పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకొని జైలుకు తరలించారు.

ఇదీ చదవండి: మంచితనంలో అపరకుబేరుడు

చంపేందుకు పోటీదారులతో ఒప్పందం

జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత గ్యాంగ్‌స్టర్ రతన్ టాటాను చంపేందుకు తన పోటీదారులతో ఒప్పందాన్ని కుదుర్చుకున్నాడు. అంతేకాదు, తాను చెప్పినట్లుగా చేయాల్సిందేనంటూ టాటా గ్రూప్‌ కార్మికులకు ఆదేశాలు జారీ చేశాడు. టాటా మాత్రం గ్యాంగ్‌ స్టర్‌ బెదిరింపులకు తలవంచకుండా ముందుకు సాగారు. నేడు రూ.లక్షల కోట్ల విలువైన సామ్రాజ్యాన్ని నిర్మించారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement