
ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్ టాటా మరణం పట్ల పలువురు ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు. టాటా అస్తమయం ఆత్మీయులకు తీరనిలోటు. టాటా కన్నుమూశారనే వార్త విని ఒకప్పటి సినీనటి సిమి గరేవాల్ తన ఎక్స్ ఖాతా ద్వారా నివాళులు అర్పించారు. గతంలో ఈమెతో రతన్‌టాటా ప్రేమలో ఉన్నట్లు వార్తలు వచ్చాయి. కానీ తర్వాత కాలంలో ఆమె వేరే వ్యక్తిని వివాహం చేసుకున్నారు.
సిమీ గరేవాల్ స్పందిస్తూ..‘మీరు వెళ్లిపోయారనే వార్త విన్నాను. మీ లేరని ఊహించుకోవడం చాలా చాలా కష్టం. వీడ్కోలు మిత్రమా’ అంటూ ఆమె తన ఎక్స్ ఖాతాలో చేసిన పోస్ట్ ద్వారా సంతాపం తెలిపారు. ఒక సమావేశంలో టాటా మాట్లాడుతూ తాను నాలుగు సార్లు ప్రేమలో పడ్డానని, పెళ్లికి దగ్గరగా వచ్చానని తెలిపారు. కానీ కొన్ని సంఘటనల వల్ల పెళ్లి చేసుకోలేదని చెప్పారు. ‘భార్య, కుటుంబం లేకపోవడంతో చాలాసార్లు ఒంటరిగా గడిపాను. కొన్నిసార్లు అందిరిలాగే భార్య, పిల్లలు, కుటుంబం ఉండాలని ఆశపడ్డాను. మరికొన్నిసార్లు వేరొకరిపై ఆధారపడడంతో వచ్చే ఆందోళనల గురించి చింతించకుండా స్వేచ్ఛగా ఉండాలని అనుకున్నాను’ అని చెప్పారు.

They say you have gone ..
It's too hard to bear your loss..too hard.. Farewell my friend..#RatanTata pic.twitter.com/FTC4wzkFoV— Simi_Garewal (@Simi_Garewal) October 9, 2024
రతన్ టాటా అమెరికాలో ఉన్నపుడు ఒక అమ్మాయితో ప్రేమలో పడ్డారు. అయితే చదువు పూర్తైన తరువాత టాటా అమెరికా నుంచి ఇండియాకు రావలసి వచ్చింది. ఆ అమ్మాయి కూడా ఇండియా రావడానికి సిధ్ధ పడింది. కానీ, అదే సమయంలో ఇండియా-చైనాకు యుద్ధం జరుగుతుండడంతో ఆమె భయపడి ఇండియా రాలేదని, అమెరికాలోనే వేరొకరిని పెళ్లి చేసుకుందని రతన్ టాటా ఒక టీవీ ఇంటర్వ్యూలో చెప్పారు. అప్పటి నుంచి తనను కలవలేదని పేర్కొన్నారు.
ఇదీ చదవండి: మంచితనంలో అపరకుబేరుడు
ప్రజల సందర్శన కోసం టాటా భౌతికకాయం
రతన్ టాటా భౌతికకాయానికి ప్రజలు నివాళులర్పించేందుకు గురువారం ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు దక్షిణ ముంబైలోని నారిమన్ పాయింట్‌లో ఉన్న నేషనల్ సెంటర్ ఫర్ పెర్ఫార్మింగ్ ఆర్ట్స్ (ఎన్‌సీపీఏ)లో ఉంచనున్నారు .
Comments
Please login to add a commentAdd a comment