దేశంలో టాటా గ్రూప్ లెగసీ చాలా పెద్దది. రతన్‌టాటాకు పెళ్లి కాకపోవడంతో తన వ్యాపార సామ్రాజ్యానికి నాయకత్వం వహించేవారు లేకుండాపోయారు. దాంతో రతన్ టాటా తర్వాత దాదాపు రూ.30 లక్షల కోట్ల టాటా గ్రూప్ సంస్థలను ఎవరు ముందుకు తీసుకెళతారనే ప్రశ్నలు వస్తున్నాయి. ఆ సామర్థ్యం ఎవరికి ఉందనే చర్చ కొనసాగుతుంది.
అయితే తన ఫ్యామిలీకే చెందిన తన సోదరుడు నోయెల్‌టాటా కుమార్తెలు లేహ్, మాయా, కుమారుడు నెవిల్లీలకు రతన్ టాటా వ్యాపార మెలకువలు నేర్పినట్లు పలు సంస్థలు నివేదించాయి. టాటాగ్రూప్‌ను ముందుకు నడిపే సత్తా వారికి ఉందా అనే అనుమానాలు లేకపోలేదు. కానీ సంస్థతో వారికున్న అనుబంధం, వారి నైపుణ్యాలు, విద్యా ప్రమాణాలు తెలిస్తే టాటా నాయకత్వ వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లగలరని తెలుస్తోంది.
లేహ్ టాటా
నోయెల్ టాటా పెద్ద కుమార్తె.
మాడ్రిడ్‌లోని ఐఈ బిజినెస్ స్కూల్‌లో తన ఎడ్యుకేషన్ పూర్తి చేశారు.
తాజ్ హోటల్స్ రిసార్ట్స్ & ప్యాలెస్‌లలో అసిస్టెంట్ సేల్స్ మేనేజర్‌గా తన కెరియర్ ప్రారంభించారు.
సేల్స్ విభాగంలో కొంత అనుభవం సంపాదించిన తర్వాత టాటా గ్రూప్‌నకు చెందిన ఇండియన్ హోటల్ కంపెనీలో కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.
మాయా టాటా
లేహ్ టాటా సోదరి మాయా టాటా.
మాయా టాటా రతన్ టాటా మార్గదర్శకత్వంలో టాటా ఆపర్చునిటీస్ ఫండ్‌లో తన కెరియర్‌కు మొదలుపెట్టారు.
ఆమె పోర్ట్‌ఫోలియో మేనేజర్‌గా, ఇన్వెస్టర్ రిలేషన్స్ రిప్రజంటేటివ్‌గా పని చేశారు.
యూనివర్శిటీ ఆఫ్ వార్విక్, బేయెస్ బిజినెస్ స్కూల్‌లో చదువుకున్నారు.
టాటా క్యాపిటల్, ఎన్ చంద్రశేఖరన్ నేతృత్వంలో రూ.1,000 కోట్లు కేటాయించిన టాటా డిజిటల్ కంపెనీలో కీలకస్థానంలో పనిచేశారు.
టాటా మెడికల్ సెంటర్ ట్రస్ట్ ఆరుగురు బోర్డు సభ్యుల్లో ఒకరిగా మాయా ఉన్నారు.
ఇదీ చదవండి: మంచితనంలో అపరకుబేరుడు
నెవిల్లే టాటా
నోయెల్ టాటా చిన్న కుమారుడు.
నెవిల్లే టాటా కూడా బేయెస్ బిజినెస్ స్కూల్‌లో చదువుకున్నారు.
ట్రెంట్ హైపర్‌మార్కెట్ ప్రైవేట్ లిమిటెడ్‌కు సారథ్యం వహిస్తున్నారు. ఇది టాటా గ్రూప్ బ్రాండ్‌లైన వెస్ట్‌సైడ్ , స్టార్ బజార్‌లకు మాతృసంస్థగా ఉంది.
Comments
Please login to add a commentAdd a comment