న్యూఢిల్లీ: టాటా గ్రూప్ తాజాగా లగ్జరీ ఫుడ్ స్టోర్‌వైపు అడుగులు వేస్తోంది. ఇందుకు గ్రోసరీ ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్ బిగ్‌బాస్కెట్‌తో ప్రీమియర్ లగ్జరీ లైఫ్‌స్టైల్ ప్లాట్‌ఫామ్ టాటా క్లిక్ లగ్జరీ చేతులు కలిపింది. తద్వారా తొలుత ముంబైలో కొత్త లగ్జరీ గోర్మెట్ స్టోర్‌ను ఏర్పాటు చేయనుంది. టాటా గ్రూప్‌లోని ఈకామర్స్ సంస్థలు టాటా క్లిక్ లగ్జరీ, బిగ్‌బాస్కెట్ సంయుక్తంగా ఈ వివరాలను వెల్లడించాయి.
టాటా క్లిక్ లగ్జరీ ప్లాట్‌ఫామ్ ద్వారా ఏర్పాటుకానున్న ఈ స్టోర్లను న్యూఢిల్లీ, బెంగళూరు తదితర మెట్రో నగరాలకు తదుపరి దశలో విస్తరించనున్నట్లు పేర్కొన్నాయి. దేశ, విదేశాలలో ప్రాచుర్యం పొందిన లగ్జరీ గోర్మెట్ బ్రాండ్లు, ఎంపిక చేసిన వివిధ ప్రొడక్టులు, ప్రత్యేక విభాగాలతో ఈ స్టోర్లను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపాయి. ప్రస్తుతం తృణధాన్యాలు, చాకొలెట్లు, బిస్కెట్లు, పానీయాలు, వంటనూనెలు, డ్రై ఫ్రూట్స్, సాస్‌లు, సూప్స్, నూడుల్స్ తదితర పలు ప్రొడక్టులతోపాటు.. ప్రీమియం, లగ్జరీ గోర్మెట్ బ్రాండ్లను ఆఫర్ చేయనున్నట్లు వివరించాయి. కాగా.. 2021 మే నెలలో బిగ్‌బాస్కెట్‌లో టాటా గ్రూప్ మెజారిటీ వాటాను సొంతం చేసుకోవడం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment