ప్రముఖ బీ2బీ ఈకామర్స్ కంపెనీ ఉడాన్‌లో కీలక పరిణామం చోటు చేసుకుంది. కొద్ది రోజుల క్రితం చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ ఆదిత్య పాండే ఆ సంస్థకు రాజీనామా చేశారు. తాజాగా పాండే ఏవియేషన్ సంస్థ ఇంటర్ గ్లోబ్ ఎంటర్‌ప్రైజెస్ గ్రూప్ సీఈఓ నియమితులయ్యారు. మార్చి 1, 2024 నుండి విధులు నిర్వహించనున్నారు.
గతంలో ఇండిగోలో పనిచేసిన అనుభవం కారణంగా ఇంటర్‌గ్లోబ్ యాజమాన్యం సీఈఓగా కీలక బాధ్యతలు అప్పగించింది. వ్యూహాత్మక వ్యాపారం, కార్పొరేట్ సిబ్బంది విధులను పర్యవేక్షించడం, బలోపేతం చేయడం వంటి బాధ్యతలు చూసుకోనున్నట్లు కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది.
25 ఏళ్లకు పైగా అనుభవం ఉన్న పాండే ప్రొడక్టివీటీ, ప్రాఫిట్ వంటి విభాగాల్లో దృష్టిసారిస్తూ వివిధ కంపెనీలలో వ్యాపార వ్యూహం, ఆర్ధిక కార్యకలాపాల్లో కీలక పాత్ర పోషించాడు. గతంలో పాండే దేశంలోని అతిపెద్ద విమానయాన సంస్థ ఇండిగో ఉడాన్‌లో చేరారు. తాజాగా ఉడాన్ నుంచి ఇంటర్ గ్లోబ్ ఎంటర్‌ప్రైజెస్ సీఈఓగా పదోన్నతి సాధించారు.
ఇక,ఉడాన్‌లో పాండే స్థానాన్ని ఎవరు భర్తీ చేయనున్నారనే విషయం వెలుగులోకి రావాల్సి ఉండగా.. బదులుగా ఇద్దరు సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లకు అదనపు ఫైనాన్స్ బాధ్యతలను అప్పగించినట్లు వెలుగులోకి వచ్చిన నివేదికలు చెబుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment