చిన్నపిల్లలు చేసే కొన్ని పనులు ఎంత ఆహ్లాదభరితంగా ఉంటాయో అలాగే కొన్ని ఇబ్బందికరంగానూ, ప్రమాదకరంగానూ ఉంటాయి. ఈ మధ్య కాలంలో ఫోన్ ఆపరేట్ చేయడం రాని పిల్లలంటూ ఉండరంటే అతిశయోక్తి కాదేమో. అంతేకాదు ఈ కరోనా మహమ్మారి కారణంగా లాక్‌డౌన్‌లతో పిల్లలు ఇళ్లకే పరిమితమవ్వడంతో ఫోన్‌లు, ల్వాప్‌టాప్‌లతోనే ఆన్‌లైన్ చదువులకు అలవాటు పడ్డారు.
(చదవండి: రబ్బరు ష్యూస్ వల్లే బ్రతికాను)
దీంతో వాళ్లు ఫోన్‌లోనూ, ల్యాప్‌ట్యాప్‌ల్లోనూ రకరకాల ఆన్‌లైన్ గేమ్స్ ఆడి ఏవిధంగా ప్రాణాల మీదకు తెచ్చకుంటున్నారో కూడా చూస్తున్నాం. అంతెందుకు మరికొంత మంది ఏవో యాప్‌లు డౌన్‌లోడ్ చేయడంతో చాలా మంది తల్లిదండ్రుల ఫోన్‌లు హ్యకింగ్‌కి గురై బ్యాంక్ అకౌంట్ల నుంచి డబ్బుల పోగొట్టుకున్న ఉదంతాలను చూశాం. కానీ ఇక్కడ ఒక తల్లి ముందుగానే పసిగట్టడంతో ఆ సమస్య నుంచి ఆమె సులభంగా బయటపడింది.
విషయంలోకివెళ్లితే.....ఎనిమిదేళ్ల పాప వాళ్ల తల్లి ఫోన్‌లో ఆడుతూ కామార్ట్ అనే ఆన్‌లైన్ వెబ్‌సైట్ నుంచి సెలవుల్లో తమ ఫ్యామిలీ టూర్‌లో ఉల్లాసంగా గడిపేందుకు కావల్సిన వస్తువులను ఆన్‌లైన్ షాపింగ్‌లో కొనుగోలు చేస్తుంది. ఇంతకీ ఆమె ఏం కొనుగోలు చేసిందంటే బెడ్ ఫ్లోక్డ్ ఎయిర్ మాట్రిసెస్, ఒక దిండు, దుప్పట్లు, వంటగదికి సంబంధించిన గిన్నెలు, ప్యాన్‌లు, కప్పులు, కత్తిపీటలతో సహ కొనుగోలు చేసింది.
అంతేకాదు ఆ ట్రిప్‌లో వినోదం కోసం, హ్యారీ పోటర్ పుస్తకాల బాక్స్ సెట్‌ను, కొన్ని హ్యారీ పోటర్-నేపథ్య లెగో, మైక్రోస్కోప్‌ను ఆర్డర్ చేసేస్తోంది. అంతే కాసేపటి తల్లి తన ఫోన్ చూస్తే 'ఆఫ్టర్ పే' అనే నోటిఫికేషన్ వస్తుంది. ఆ తర్వాత ఏంటిది అని చూస్తే తన కూతుర కామర్ట్ ఆన్‌లైన్ నుంచి రూ.61 వేలు ఖరీదు చేస్తే వస్తువలను ఆర్డర్ చేసినట్టు గుర్తించి వెంటనే ఆ ఆర్డర్‌ని కేన్సిల్ చేసింది. ఈ మేరకు ఆ బాలిక తల్లి తన కూతురు ఏ విధంగా ఆన్‌లైన్‌లో కొనుగోలు చేసింది వంటి వాటి గురించి సోషల్ మీడియాలో పెట్టడంతో ఇది వైరల్ అవుతుంది. దీంతో నెటిజన్లు పిల్లలకు ఫోన్లు ఇవ్వకూడదంటూ విమర్శిస్తూ రకరకాలుగా ట్వీట్ చేశారు.
(చదవండి: వివాహ వేడుకకు అతిధిలా వచ్చిన ఎలుగుబంటి)
Comments
Please login to add a commentAdd a comment