online shopping website
-
కరోనాతో వీళ్లకు పండగే! ఆన్లైన్ సైట్స్‌లో బిజీగా జనం!!
భారత్‌లో ఆన్లైన్ వినియోగం విపరీతంగా పెరిగింది. ముఖ్యంగా కోవిడ్ కారణంగా ఆన్లైన్లో ఒక్క క్లిక్‌తో అన్నీ ఇంటికి తెచ్చేందుకు మొగ్గు చూపుతున్నారు. దీంతో ఈ కామర్స్ కంపెనీలకు వరంగా మారి.. భారత్ ప్రపంచంలోనే రెండో అతిపెద్ద గ్లోబల్ వెంచర్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ హబ్‌గా అవతరించింది. ఇటీవల లండన్ అండ్ పార్ట్నర్స్ అనాలసిస్ ఆఫ్ డీల్‌రూం.కో ఇన్వెస్ట్మెంట్ ఓ రిపోర్ట్‌ను విడుదల చేసింది. ఆ నివేదిక ప్రకారం.. దేశంలో ఆన్లైన్ షాపింగ్ 175శాతం పెరిగి 2020లో 8 బిలియన్ డాలర్లుగా ఉన్న మార్కెట్ 2021లో 22 బిలియన్ డాలర్లకు చేరినట్లు తెలిపింది. గతేడాది వరల్డ్ వైడ్‌గా డిజిటల్ షాపింగ్‌లో అమెరికా తర్వాత భారత్ గ్లోబల్ వెంచర్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ హబ్‌గా పేరు సంపాదించింది. 51 బిలియన్ డాలర్లతో అమెరికా అగ్రస్థానంలో ఉండగా, భారత్ 22 బిలియన్ డాలర్లు, చైనా 14 బిలియన్ డాలర్లు , బ్రిటన్ 7 బిలియన్ డాలర్లతో వరుస స్థానాల్ని దక్కించుకున్నాయి. ఇక దేశీయంగా 14 బిలియన్ డాలర్ల వెంచర్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ హబ్‌గా బెంగళూరు, 7వ స్థానంలో గురుగ్రామ్, 10వ స్థానంలో ముంబై నిలిచాయి. గురుగ్రామ్ 4 బిలియన్ డాలర్ల పెట్టుబడులను, ముంబై 3 బిలియన్ డాలర్ల పెట్టుబడులను పొందాయి. వరల్డ్ వైడ్‌గా టాప్-5లో బెంగళూరు తర్వాత న్యూయార్క్ సిటీ, శాన్ఫ్రాన్సిస్కో, లండన్, బెర్లిన్ నగరాలున్నాయి. చదవండి: ఫ్లిప్‌కార్ట్ బంపర్ ఆఫర్.. రూ.50 వేల యాపిల్ ఐఫోన్ రూ.10 వేలకే..! -
ఫోన్లో ఆడుతూ రూ.61,000 విలువ చేసే బొమ్మలను ఆర్డర్ చేసింది
చిన్నపిల్లలు చేసే కొన్ని పనులు ఎంత ఆహ్లాదభరితంగా ఉంటాయో అలాగే కొన్ని ఇబ్బందికరంగానూ, ప్రమాదకరంగానూ ఉంటాయి. ఈ మధ్య కాలంలో ఫోన్ ఆపరేట్ చేయడం రాని పిల్లలంటూ ఉండరంటే అతిశయోక్తి కాదేమో. అంతేకాదు ఈ కరోనా మహమ్మారి కారణంగా లాక్డౌన్లతో పిల్లలు ఇళ్లకే పరిమితమవ్వడంతో ఫోన్లు, ల్వాప్టాప్లతోనే ఆన్లైన్ చదువులకు అలవాటు పడ్డారు. (చదవండి: రబ్బరు ష్యూస్ వల్లే బ్రతికాను) దీంతో వాళ్లు ఫోన్లోనూ, ల్యాప్ట్యాప్ల్లోనూ రకరకాల ఆన్లైన్ గేమ్స్ ఆడి ఏవిధంగా ప్రాణాల మీదకు తెచ్చకుంటున్నారో కూడా చూస్తున్నాం. అంతెందుకు మరికొంత మంది ఏవో యాప్‌లు డౌన్లోడ్ చేయడంతో చాలా మంది తల్లిదండ్రుల ఫోన్లు హ్యకింగ్‌కి గురై బ్యాంక్ అకౌంట్ల నుంచి డబ్బుల పోగొట్టుకున్న ఉదంతాలను చూశాం. కానీ ఇక్కడ ఒక తల్లి ముందుగానే పసిగట్టడంతో ఆ సమస్య నుంచి ఆమె సులభంగా బయటపడింది. విషయంలోకివెళ్లితే.....ఎనిమిదేళ్ల పాప వాళ్ల తల్లి ఫోన్లో ఆడుతూ కామార్ట్ అనే ఆన్లైన్ వెబ్సైట్ నుంచి సెలవుల్లో తమ ఫ్యామిలీ టూర్లో ఉల్లాసంగా గడిపేందుకు కావల్సిన వస్తువులను ఆన్లైన్ షాపింగ్‌లో కొనుగోలు చేస్తుంది. ఇంతకీ ఆమె ఏం కొనుగోలు చేసిందంటే బెడ్ ఫ్లోక్డ్ ఎయిర్ మాట్రిసెస్, ఒక దిండు, దుప్పట్లు, వంటగదికి సంబంధించిన గిన్నెలు, ప్యాన్లు, కప్పులు, కత్తిపీటలతో సహ కొనుగోలు చేసింది. అంతేకాదు ఆ ట్రిప్‌లో వినోదం కోసం, హ్యారీ పోటర్ పుస్తకాల బాక్స్ సెట్‌ను, కొన్ని హ్యారీ పోటర్-నేపథ్య లెగో, మైక్రోస్కోప్‌ను ఆర్డర్ చేసేస్తోంది. అంతే కాసేపటి తల్లి తన ఫోన్ చూస్తే 'ఆఫ్టర్ పే' అనే నోటిఫికేషన్ వస్తుంది. ఆ తర్వాత ఏంటిది అని చూస్తే తన కూతుర కామర్ట్ ఆన్లైన్ నుంచి రూ.61 వేలు ఖరీదు చేస్తే వస్తువలను ఆర్డర్ చేసినట్టు గుర్తించి వెంటనే ఆ ఆర్డర్‌ని కేన్సిల్ చేసింది. ఈ మేరకు ఆ బాలిక తల్లి తన కూతురు ఏ విధంగా ఆన్లైన్లో కొనుగోలు చేసింది వంటి వాటి గురించి సోషల్ మీడియాలో పెట్టడంతో ఇది వైరల్ అవుతుంది. దీంతో నెటిజన్లు పిల్లలకు ఫోన్లు ఇవ్వకూడదంటూ విమర్శిస్తూ రకరకాలుగా ట్వీట్ చేశారు. (చదవండి: వివాహ వేడుకకు అతిధిలా వచ్చిన ఎలుగుబంటి) -
ఆన్లైన్ షాపింగ్: ఈ జాగ్రత్తలు తీసుకోండి
ప్రస్తుతం ఆన్లైన్ షాపింగ్ వినియోగం విపరీతంగా పెరిగింది. వాటి వ్యాపార వ్యవధి 2016తో పోల్చితే 81 శాతం అభివృద్ధి చెందింది. అందరూ ఇంటి నుంచి కాలు బయట పెట్టకుండానే వేల సంఖ్యలో ఉత్పత్తులు, రకరకాల డిజైలు అందుబాటులోకి తీసుకురాడంతో ఆన్లైన్ షాపింగ్ చేయడానికి ప్రతి ఒక్కరు ఆసక్తి చూపుతున్నారు. అంతేకాకుండా డిస్కౌంట్ ఆఫర్స్, రిటర్న్ పాలసీలు అంటూ వినియోగదారులను ఆకర్షిస్తున్నాయి. ఇకపోతే ఇంకొరెండు మూడు రోజుల్లో ఈ కామర్స్ సైట్స్ భారీ ఆఫర్స్‌తో బిగ్‌బిలియన్ డేస్ ఇలా ప్రత్యేకమైన ఆఫర్లను అందించనున్నాయి. అయితే షాపింగ్ చేసే వారు ఈ జాగ్రత్తలు పాటించండి. ఎల్లప్పుడూ ప్రొడక్ట్ వివరాలు పూర్తిగా పరిశీలించండి: మనలో చాలా మంది ఆన్లైన్ షాపింగ్ చేసేటప్పుడు కేవలం అక్కడ చూపించిన ఇమేజ్ ఆధారంగా దానిని కొనాలని నిర్ణయించుకుంటారు. అంతేకానీ వారికి ప్రొడక్ట్ గురించి కింద తెలిపిన వివరాలను చదివే ఓపిక ఉండదు. అలా కాకుండా షాపింగ్ చేసేటప్పుడు ఆ ఉత్పత్తి పూర్తి వివరాలు చదవాలి. అంతేకాకుండా ఆ ప్రొడక్ట్‌ను అంతకముందే కొన్ని వారి రివ్యూలను కూడా పరిగణలోకి తీసుకోవాలి. ఆ ఉత్పత్తి రేటింగ్ ఇలా అన్ని పరిశీలించిన తరువాతే దానిని ఆర్డర్ పెట్టుకోవాలి. షిప్పింగ్ కాస్ట్ చూడండి: చాలా కంపెనీలు షిప్పింగ్ కాస్ట్ వివరాలను ప్రొడక్ట్ దగ్గరే వివరిస్తాయి. ఎప్పుడు ఆర్డర్ మన వద్దకు చేరుతుంది అనే డిటైల్స్ అన్ని ఉంటాయి. అయితే రూల్స్ ప్రకారం ఆర్డర్ చేసిన 30 రోజుల్లోపు ఉత్పత్తిని వినియోగదారుడికి అందించాలి. కొన్ని ప్రొడక్ట్‌లపై ఫ్రీ డెలివరీ ఆఫర్లు ఉంటాయి. ఇంకొన్ని కంపెనీలు బల్క్‌లో కొంటేనే ఫ్రీ షిప్పింగ్‌ను అందిస్తాయి. కాబట్టి షాపింగ్ చేసేటప్పుడు ఆ వివరాలు అన్నింటిని పరిగణలోకి తీసుకోవాలి. మీరు కొనే ఉత్పత్తుల ధరలను వేరే చోట కూడా పరిశీలించుకోండి: డిస్కౌంట్ లభిస్తోంది అనగానే కేవలం ఆ సైట్లో మాత్రమే కాకుండా వేరే ఆన్లైన్ స్టోర్‌లో కూడా వాటి ధరలు, ప్రొడక్ట్ డిటైల్స్‌ను సరిపోల్చకోండి. ప్రస్తుతం ఆన్లైన్ రిటైల్స్టోర్లు అనేకం అందుబాటులోకి వచ్చాయి కాబట్టి మీరు తేలికగానే వాటి ధరలను, నాణ్యతను చెక్ చేసుకోవచ్చు. డిస్కౌంట్ ఇస్తున్నారు అంటే నాణ్యత లేని వస్తువులను అందించడం కాదు మన్నికైన వస్తువులనే వినియోగదారుడికి తక్కువ ధరకు అందుబాటులోకి తీసుకురావడం. మీ విలువైన డబ్బుతో నాణ్యత లేని వస్తువులను కొనుగోలు చేయకండి. [ చదవండి : మీ లవర్ మీ మొబైల్ వాట్సాప్ చెక్ చేస్తున్నారా? ఈ ట్రిక్ తో సేఫ్ గా ఉండండి ] రివ్యూలను చదవండి: మీరు కొనాలనుకున్న ప్రొడక్ట్ అంతకముందే కొన్నవారు దాని గురించి వారి అభిప్రాయాలను రివ్యూలలో తెలియజేస్తారు. వాటిలో కొన్ని రివ్యూలు నిజాయితీగా ఉండి మీరు ఆ వస్తువును కొనాలో వద్దో నిర్ణయించుకోవడానికి దోహదపడతాయి. కాబట్టి ఇక నుంచి ఏదైనా వస్తువును ఆన్లైన్లో కొనాలనుకున్నప్పుడు వాటి రివ్యూలను తప్పకుండా చదివిన తరువాతే మీ ఆర్డర్‌ను ప్లేస్ చేయండి. మీ హక్కులను తెలుసుకోండి: ఆన్లైన్ షాపింగ్ చేసేటప్పుడు చాలా ఉత్పత్తులపై రిటర్న్ పాలసీ ఉంటుంది. అయితే కొన్ని వస్తువులకు మాత్రమే ప్యాక్ ఓపెన్ చేస్తే రిటర్న్ ఉండదు అని ఉంటుంది. కాబట్టి వినియోగదారుడు వస్తువుకొనేటప్పుడే రిటర్న్ వివరాలను పరిశీలించి కొనండి. స్కామ్, ఫ్రాడ్ల నుంచి అప్రమత్తంగా ఉండండి: ప్రస్తుత కాలంలో సైబర్‌నేరాలకు అంతులేకుండా పోతుంది. నేరగాళ్లు వివిధ మార్గాలలో ఫ్రాడ్లకు పాల్పడుతున్నారు. అందుకే ఆన్లైన్లో షాపింగ్ చేసేటప్పుడు అది జెన్యూన్సైట్ అవునో కాదో ఒకటికి రెండు సార్లు పరిశీలించుకోవాలి. ఎక్కువ డిస్కౌంట్ ఇస్తున్నారు కదా అని ఆ సైట్ నమ్మదగినదో లేదో తెలుసుకోకుండా ఆర్డర్ పెట్టి మీ డబ్బును పోగొట్టుకోకండి. -
గర్ల్‌ఫ్రెండ్ బర్త్‌డే గిఫ్ట్ కోసం..
సాక్షి, న్యూఢిల్లీ: గర్ల్‌ఫ్రెండ్‌ను సర్ప్రైజ్ చేద్దామనుకున్న ఓ బీటెక్ యువకుడు జైలు పాలయ్యాడు. ఖరీదైన వాచ్‌ను ఆమెకు బహుమతిగా ఇద్దామని మోసానికి పాల్పడ్డాడు. ఆన్లైన్లో వాచ్‌ను ఆర్డర్ చేసి.. డెలివరీ బాయ్‌ని మోసం చేశాడు. పోలీసులు ఫోన్ నెంబర్‌ను ట్రేస్ చేయడంతో దొరికిపోయాడు. వివరాలు..ఢిల్లీ మోడల్ టౌన్లో నివాసముండే వైభవ్ ఖురాన (22) తన గర్ల్‌ఫ్రెండ్‌కు పుట్టిన రోజు కానుక ఇవ్వాలనుకున్నాడు. 90 వేల ఖరీదు గల రాడో చేతిగడియారాన్ని ఆన్లైన్లో జూలై 23న తప్పుడు అడ్రస్ పెట్టి ఆర్డర్ చేశాడు. వాచ్ పార్సిల్‌తో డెలివరీ బాయ్ (సాహు) రాగానే కాశ్మీరే గేట్ మెట్రో స్టేషన్ వద్ద కలుసుకున్నారు. సాహుని ఓ ఇంటికి తీసుకెళ్లి.. ‘నువ్ కాలింగ్ బెల్ కొట్టు. మా వాళ్లు డబ్బులు తెచ్చిస్తారు. నేను వెనకే వస్తున్నాన’ని చెప్పాడు. అప్పటికే ఆర్డర్ చేసిన వాచ్ ప్యాకెట్‌ను తీసుకున్న వైభవ్ అక్కడి నుంచి తన బైక్‌పై పరారయ్యాడని పోలీసులు తెలిపారు. డెలివరీ బాయ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టిన పోలీసులు కాల్‌డేటా ఆధారంగా నిందితున్ని పట్టుకున్నారు. నిందితుని వద్ద నుంచి వాచ్, బైక్‌ను స్వాధీనం చేసుకున్నారు. కాగా, రూ. 90 వేల విలువగల రాడో రిస్ట్‌వాచ్ ఆన్లైన్లో రూ. 67 వేలకే అందుబాటులో ఉండటం విశేషం. -
బొమ్మ కొంటే...కారు గిఫ్ట్
సాక్షి, సిటీబ్యూరో: ‘షాపింగ్‌ఫ్లెవర్.కామ్’ వెబ్సైట్లో ఆన్లైన్లో బొమ్మలు కొనుగోలు చేస్తే కారు బహుమతిగా ఇస్తామంటూ అమాయకులను మోసం చేస్తున్న ఇద్దరు ఢిల్లీవాసులను సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. క్రైమ్స్ డీసీపీ జానకీ షర్మిలా కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి..పాయ్‌పాల్ నుంచి యోగేశ్ అనే పేరుతో మాదాపూర్‌కు చెందిన బాధితురాలికి ఫోన్ చేసిన ఓ వ్యక్తి మీ బాబుకు డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.షాపింగ్‌ఫ్లెవర్.కామ్ వెబ్సైట్లో ఆన్లైన్లో బొమ్మలు కొనుగోలు చేస్తే కారు బహుమతిగా వస్తుందని నమ్మించాడు. ఆన్లైన్లో కొనుగోలు చేసిన అనంతరం మీ కుమారుడు కారు గెలుచుకున్నాడంటూ ఫోన్ చేసిన అతను రూ1.5లక్షలు స్కైలర్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుమీద ఐసీఐసీఐ బ్యాంక్ ఖాతాలో డిపాజిట్ చేయించుకున్నాడు. ఆ తర్వాత మీ కారును విడుదల చేయాలంటే ఇన్కమ్ ట్యాక్స్ చార్జీల కోసం మీ బ్యాంక్ ఖాతాలో రూ.5.5 లక్షలు బ్యాలెన్స్ ఉంచాలని సూచించడంతో ఆ మొత్తాన్ని జమ చేసింది. ఆ తర్వాత ఇంటర్నెట్ బ్యాంకింగ్ లాగిన్ పాస్వర్డ్లు తెలుసుకున్న అతను ఆ మొత్తాన్ని ఇతర బ్యాంక్ ఖాతాలోకి మళ్లించాడు. చివరకు మోసపోయినట్లు గుర్తించిన బాధితురాలు సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదుచేశారు. నిందితుడి బ్యాంక్ ఖాతా ఆధారంగా సోమవారం న్యూఢిల్లీలో నిందితులను పట్టుకొని ట్రాన్సింట్ వారంట్‌పై గురువారం నగరానికి తీసుకొచ్చారు. స్కైలర్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్లుగా చెప్పుకుంటున్న మృదుల్ కపూర్, సుమిత్ సింగ్ సొలంకి ఫ్లాస్‌వై4యూ, మైషాప్‌మైడీల్స్, షాపింగ్‌ఫ్లెవర్.కామ్‌లతో ఆన్లైన్ వెబ్సైట్లు ఓపెన్ చేసి అమాయకులను మోసం చేస్తున్నట్లు తెలిపారు. నిందితులను న్యాయస్థానంలో హాజరుపరచగా జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించారు. -
‘అమేజాన్’లో ఇంటి దొంగ!
హైదరాబాద్: తక్కువ ధరకు వస్తువులంటూ ఆన్లైన్లో ప్రకటనలు ఇవ్వడం, నమ్మి డబ్బు చెల్లించిన వారికి రాళ్ళు, సబ్బు బిళ్ళలు పార్శిల్లో పంపి మోసం చేయడం లాంటి కేసులు చాలానే చూశాం. అయితే ఇక్కడ సీన్ రివర్స్ అయింది. ఆన్లైన్లో వ్యాపారం చేసే ప్రముఖ సంస్థ ఆమేజాన్కే ఇద్దరు యువకులు టోకరా వేశారు. తనదైన పంథాలో దాదాపు రెండు నెలలుగా రూ.ఐదు లక్షలకు పైగా స్వాహా చేశారు. ఈ మోసగాళ్ల వ్యవహారంపై సమాచారం అందుకున్న సౌత్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. నిందితుల్లో ఒకరు ఆ సంస్థకు చెందిన ఉద్యోగే ఉన్నారని, వీరి నుంచి ఆరు ఖరీదైన యాపిల్ ఐ-ఫోన్లు స్వాధీనం చేసుకున్నామని అదనపు డీసీపీ ఎన్.కోటిరెడ్డి వెల్లడించారు. మాజీ సహోద్యోగితో జట్టు కట్టి... కాచిగూడ రైల్వే క్వార్టర్స్‌లో నివసించే అంకుష్ బిరాజ్దర్, పాతబస్తీలోని పురానీహవేలీ ప్రాంతానికి చెందిన మీర్ ఫెరోజ్ అలీ అలియాస్ హసన్ గతంలో అబిడ్స్‌లోని ప్లే మ్యాక్స్ గేమింగ్ సెంటర్లో పని చేస్తుండగా వారికి పరిచయం ఏర్పడింది. ప్రస్తుతం అంకుష్ ఆన్లైన్ షాపింగ్ సంస్థ అమేజాన్‌లో ఇన్వెస్టిగేటర్‌గా పని చేస్తున్నాడు. సంస్థ ఆపరేషన్స్‌లో ఉన్న లోపాలు, వీటి ఆధారంగా జరుగుతున్న మోసాలను గుర్తించి యాజమాన్యాన్ని అప్రమత్తం చేయాల్సిన బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు. ఈ నేపథ్యంలో తన దృష్టికి వచ్చిన ఓ లోపాన్ని వినియోగించుకుని పని చేస్తున్న సంస్థకే టోకరా వేయాలని పథకం వేసి హుస్సేన్‌తో కలిసి రంగంలోకి దిగాడు. ఆర్డర్ ఇవ్వడం... రిటర్న్ చేయడం... వీరిద్దరూ కలిసి వివిధ పేర్లతో బోగస్ కస్టమర్ ఐడీలుగా వినియోగించడానికి ఈ-మెయిల్ ఐడీలు క్రియేట్ చేసుకున్నారు. హెచ్డీఎఫ్సీ, కోటక్ మహేంద్ర బ్యాంకుల్లో హుస్సేన్ పేరుతో ఖాతాలు తెరిచి, అందులో అవసరమైన నగదును అంకుష్ డిపాజిట్ చేశాడు. ఒక్కోసారి ఒక్కో ఈ-మెయిల్ ఐడీ వినియోగించి అమేజాన్ నుంచి ఖరీదైన ఆరు యాపిల్ ఐ-ఫోన్లు బుక్ చేశారు. డెలివరీ కోసం వేర్వేరు ఫోన్ నెంబర్లు, చిరునామా ఇస్తూ వచ్చారు. పార్శిల్ తీసుకువచ్చిన సంస్థ డెలివరీ బాయ్స్ వీరిచ్చిన చిరునామాలు దొరక్కపోవడంతో ఫోన్లో సంప్రదించేవారు. దీంతో బాయ్స్ వద్దకే వెళ్ళి వస్తువులు తీసుకోవడం చేశారు. చైనా ఫోన్లతో రిటర్న్ చేస్తూ... ఆన్లైన్ ద్వారా విక్రయాలు జరిపే ఈ సంస్థ వినియోగదారులకు ఇబ్బందులు ఉండకూడదనే ఉద్దేశంతో కొన్ని సౌకర్యాలు కల్పిస్తోంది. ఓ వస్తువును ఖరీదు చేసి, రిసీవ్ చేసుకున్న తర్వాత వినియోగదారుడు సంతృప్తి చెందకపోతే ‘ఈజీ రిటర్న్’ పాలసీ అమలు చేస్తోంది. దీని ప్రకారం విషయాన్ని కంపెనీకి తెలిపి, డెలివరీ బాయ్స్‌కు వస్తువు అప్పగిస్తే... తక్షణం ఆన్లైన్లో చెల్లించిన మొత్తం కంపెనీ నుంచి వినియోగదారుడి బ్యాంకు ఖాతాలోకి జమ అవుతుంది. దీన్ని ‘క్యాష్’ చేసుకున్న ఈ ద్వయం అందుకున్న పార్శిల్లో ఉన్న ఐ-ఫోన్‌ను తీసేసి... దాన్నే పోలి ఉన్న చైనా ఫోన్ పెట్టేస్తోంది. ఆపై వివిధ కారణాలు చెప్పి రిటర్న్ చేస్తూ నగదును తమ ఖాతాలోకి జమ చేయించుకుంటోంది. పక్కా సమాచారంతో చిక్కారు... ఇలా చేతికందిన ఫోన్లను హసన్ తీసుకువెళ్లి అంకుష్‌కు అప్పగించేవాడు. వీటిని మార్కెట్లో అవసరమైన వారికి విక్రయించగా వచ్చిన మొత్తాన్ని ఇద్దరూ పంచుకునే వారు. రెండు నెలల కాలంలో దాదాపు రూ.5 లక్షల ఖరీదు చేసే ఆరు ఐ-ఫోన్లను ఈ ద్వయం అమేజాన్ నుంచి కాజేసింది. వీరి వ్యవహారాలపై సమాచారం అందుకున్న ఇన్స్పెక్టర్ ఎ.యాదగిరి నేతృత్వంలో ఎస్సైలు జి.మల్లేష్, బి.మధుసూదన్, ఎస్కే జకీర్ హుస్సేన్, ఎన్.శ్రీశైలంతో కూడిన బృందం బుధవారం పట్టుకుంది. తదుపరి చర్యల నిమిత్తం కేసును కాచిగూడ పోలీసులకు అప్పగించింది.